13-03-2019, 03:24 PM
(This post was last modified: 14-03-2020, 08:27 PM by Vikatakavi02. Edited 2 times in total. Edited 2 times in total.)
మహా ప్రస్థానం
''మీ కోసం కలం పట్టి ఆకాశపు దారులంట
అడావుడిగ వెళ్ళిపోయే
అరచుకుంటు వెళ్ళిపోయే
జగన్నాధుని రథచక్రాల్,
భూ మార్గం పట్టిస్తాను,
భూకంపం పుట్టిస్తాను ....''
అని ప్రకటించినవాడు శ్రీశ్రీ.
"ఓ వ్యధావశిస్టులారా !
ఏడవకండి, ఏడవకండి, వస్తున్నాయొస్తున్నాయి,
జగన్నాధుని రథచక్రాల్
వస్తున్నాయ్" అని
ఆశ్వాసమందించినవాడు శ్రీశ్రీ.
40 కవితలతో వెలువడిన 'మహాప్రస్థానం' తెలుగు సాహిత్యంలో ఓ మైలు రాయి. ఓ మలుపు. ఓ డైనమేటు.
మహాప్రస్థానంలోని 'జయభేరీ' నుంచి కొంచెం...
నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వవ్రుష్టికి
అశ్రు వొక్కటి ధారపోశాను!
నేను సైతం
భువన ఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!
నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్లరేకై పల్లవిస్తాను!
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్చనలు పోతాను!
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను!
>>> Mahaa Prasthanam <<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK