Thread Rating:
  • 13 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance "అతి"మధురం
#24
11.ప్రేమ చిగురించెనా....?

ఆటో డ్రైవర్ నవ్వు చూసిన రియా పై ప్రాణాలు పైనే పోయాయి....

ఇక లాభం లేదని...అటో కదులుతుండగానే అటో లో నుంచి దూకేసింది.......వెంటనే ఆటో కొంచెం దూరం లో వెళ్ళి ఆగింది....వెను వెంటనే ఆటో డ్రైవర్ ఆటో లో నుంచి దూకి వడి వడి గా రియా వైపు రాసాగాడు.....

కిందపడిన రియా ....లేచి పరుగు అందుకుంది.....ముందు రియా వెనక అతను....అలా పరిగెడుతూ పరిగెడుతూ ఎదురుగా అడ్డొచ్చిన వ్యక్తి ని గుద్దేసి....అలా కిందపడిందో లేదో అక్కడికి వచ్చేశాడు ఆటో అతను.......

రియా దగ్గరికి వస్తూ..."మా అమ్మాయే సార్....."అని రియా ని పైకి లేపబోతుండగా అతని చేతిని పట్టుకున్నాడు ఎదురుగా వున్న వ్యక్తి.....అర్థం కానట్తు ఆశ్చర్యపోయి చూశాడు ఆటో డ్రైవర్...

ఆ వ్యక్తి ఆటో డ్రైవర్ ని చితక బాది...చివరగా రియా కి తన చేతిని అందించాడు........అతని చెయ్యి అందుకుని పైకి లేచిన రియా చంద్రుని వెలుగులో అతని ముఖం చూసి......ఏడుస్తూ అభి ని చుట్టేసింది...అభి కూడా అంతే గట్టిగా తనని అల్లుకుపోయాడు.......

ఒక పది నిమిషాల వరకు ఒకర్ని విడవాలని మరొకరికి ఆలోచనే రాలేదు........

"ఐ యాం సారి రియా.....నువ్వు వైజాగ్ వెళ్ళిన రోజు నేను కూడా నీ వెనకాలే వైజాగ్ వద్దామనుకున్నాను కానీ అప్పుడే నువ్వు ఒక అబ్బాయి కలిసి వున్న పిక్స్ నా ఫ్రెండ్ నాకు వాట్స్ అప్ చేశాడు....అందులో అతను నీ చెయ్యి పట్టుకుని ఏదో అభ్యర్థిస్తున్నట్టు వుంది.....నేనూ ఆ పిక్స్ నమ్మకూడదు అనే అనుకున్నాను కానీ అంతకు ముందు నిన్ను తనతో చూడడం నువ్వు నన్ను ఎవౌడ్ చేయడంతో ఏదో ఫ్రస్టెషన్ లో నిజమని నమ్మేసి....ఫ్రెండ్స్ తో ట్రిప్ కెళ్ళాను అలా అయినా నా నుంచి నీ ఆలోచనలోంచి దూరంగా వుండొచ్చు అని...కానీ 2 రోజులు కూడా వుండలేక తిరిగి వచ్చేశాను...ఈ మధ్య లోనే తెల్సింది ఆ అబ్బాయి నీ ఫ్రెండ్ రాజీ లవర్ అని.....వాళ్లిద్దరికి ఏదో ప్రాబలం వస్తే నిన్ను సహాయం అడిగాడు అని.......అది తెల్సి నా మీద నాకే చాలా కోపం వచ్చింది.......నిన్ను క్షమించమని అడగడానికి కూడ ముఖం చెల్లలేదు.....అందుకే నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నా లో లోపల బాధపడ్డానే కానీ నీ ముందుకొచ్చే ధైర్యం చేయలేదు....ప్లీస్ నన్ను క్షమించు....."అని చెప్పాడు అభి.

"అభి....ఐ యాం సారీ నేను కూడా నీతో చాలా రాష్ గా వున్నాను...."అని చెప్పింది రియా

అలా వాళ్లిద్దరూ మళ్లీ కలిసిపోయారు........అంటే మామూలుగా మాట్లాడుకోవడం వరకే....రియా కి ఎప్పుడూ అభి పై ఎలాంటి ఫీలింగ్ కలగలేదు.......అలా ఇంకో సంవత్సన్నర గడిచింది.....రియా ఇప్పుడు 3 ఇయర్...అభి ఫైనల్ ఇయర్ చదువుతున్నారు......

ఒకరోజు.......తలుపు బళ్ళున తెరుచుకోవడం తో తల ఎత్తి చూశాడు అభి....ఎదురుగా రియా.....కోపంతో ఊగిపోతుంది....

"హే రియా....ఏమయ్యింది?అలా వున్నావ్?"అడిగాడు అభి

"నువ్వు అమెరికా కి ఎందుకు వెళ్ళట్లేదు....?"అడిగింది రియా

"నాకు ఇంట్రెస్ట్ లేదు....."జవాబిచ్చాడు అభి

"ఇంట్రెస్ట్ లేదా....అబద్ధం చెప్పకు అభి...నువ్వెందుకు వెళ్లనంటున్నావో నాకు రీసన్ తెల్సు.....స్టాప్ బిహేవింగ్ లైక్ ఏ చైల్డ్.....!సరేనా నాకు తెల్సు నీకు ఎం.ఎస్ చెయ్యడం అంటే చాలా ఇష్టం అని.....సో నువ్వు అమెరికా కి వెళ్తున్నావ్ ఎండ్ దట్స్ ఫైనల్..."చెప్పింది రియా

"నీకు రీసన్ తెల్సున్నావ్ కాబట్టి చెబుతున్నా రియా....నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్లను...యండ్ దిస్ ఈస్ ఫైనల్..."చెప్పాడు అభి......

అభి చెయ్యి లాక్కొని.....తన తల మీద ఒట్టు వెయ్యించుకుంటూ..."నువ్వెళ్లకపోతే నా మీద ఒట్టె ఇంకేమి మాట్లాడకు......"అని అంది రియా

"సరే.....నా కండీషన్ కి నువ్వు ఒప్పుకుంటానంటే...నేను వెళ్తాను....సరేనా...?"అన్నాడు అభి

"హా సరే ఒప్పుకుంటున్నా......."అంది రియా

సరే రా...అని తన చెయ్యి పట్టుకుని హాల్లో కి తీసుకెళ్తుండగా....."ఇంతకీ కండీషన్ ఏంటి...?"అంది రియా.....హల్లొకి రాగానే....రియా వాళ్ల అమ్మా నాన్నలని కూడా పిలిపించి......అందర్నీ కూర్చోబెట్టి......

"నేను-రియా పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం.........నేను ముందు ఎగేజ్మెంట్ చేసుకొని అమెరికా వెళ్తాను.....తిరిగి వచ్చాక మా పెళ్ళి చెయ్యండి......."అని చెప్పి వాళ్ళ అంగీకారం కోసం ఆగాడు అభి.......

అందరూ హ్యాపీ గా ఫీలయ్యారు ఒక్క రియా తప్ప........కండీషన్ అంటే ఏంటొ అనుకుంది కానీ ఇలా లాక్ చేస్తాడనుకోలేదు..........

ఆ రోజు నుంచి మళ్లీ రియా అభి తో ముందులా వుండలేకపోయింది.........

అలా రెండేళ్ళు గడిచాయి......అభి అమెరికా నుంచి తిరిగి వస్తుండడం తో రియా ఇలా మధ్యలోనే పారిపోయి వచ్చేసింది........

******

"అది అండి విజయ్ గారు.,....నా అతి ప్రేమ స్టోరి........"అని చెప్పడం ముగించి మంచినీళ్ళు గటగటా తాగింది రియా

"వావ్ గ్రేట్ లవ్ స్టోరి "అన్నాడు విజయ్

"ఓహో అవునా...సర్లేండి..."అంది రియా

"అవునూ మీకు అభి అంటే ఎందుకు ఇష్టం లేదండి........?"అడిగాడు విజయ్

"ఇష్టమే ప్రేమ లేదంతే..."అంది రియా

"అదే ఎందుకు........?"అన్నాడు విజయ్

టైం........4:30 అవుతుండగా....రియా ఏదో చెప్పే లోపల.......అభి(టార్చర్) నుంచి కాల్ వచ్చింది.........ఈ సారి రియా కట్ చెయ్యలేదు......ఒక్క రింగ్ కే ఫోన్ ఎత్తింది.......

"నేనంటే ప్రేమ అనుకున్నాను రియా కానీ అది లేదని ఈ రోజే తెల్సింది......నీ మనసులో నా పై నింపుకున్న ద్వేషాన్ని చూస్తుంటే...నా పై నాకే జాలి వేస్తుంది.......కాదు కాదు కోపం వస్తుంది......నీ వల్లే నన్ను నేను ప్రేమించాను రియా కానీ నీ వల్లే ఈ రోజు నన్ను నేను అస్యహించుకుంటున్నా....నా ప్రేమకు బానే వెలకట్టావ్ రియా......థ్యాంక్యూ సో మచ్......థ్యాంక్యూ సో మచ్ ఫర్ యువర్ కన్ సర్న్..........ఐ హేట్ యూ రియా.......బట్ ఐ లవ్ యూ.......!"అని ఫోన్ కట్ చేశాడు అభి.......

"ఏంటి...ఏం చేశావ్ రియా అభి అలా మాట్లాడుతున్నాడు...?"అడిగాడు విజయ్.......

"బహుశా తనకి నా డైరి దొరికి వుండొచ్చు........."అంది రియా

"సరే రియా తనంతలా ప్రేమిస్తుంటే ఒక్కసారి కూడా నీకు ప్రేమించాలనిపించలేదా...?"అడిగాడు విజయ్

"లేదు....అని చెప్పను కానీ కరెక్ట్ గా అనిపించేసరికి నా సోల్ మేట్ నాకు ఎదురయ్యాడు"అంది రియా

"వాట్ ?"షాక్ లో వుండిపోయాడు విజయ్

"హా చూస్తావా నా సోల్ మేట్ ని.........?"అని సెల్ ఓపెన్ చేసింది......తన గ్యాలరీ లో వున్న పిక్ ని చూపించింది........!!!!!!!
[+] 2 users Like అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: "అతి"మధురం - by coolsatti - 07-11-2018, 09:52 PM
RE: "అతి"మధురం - by raaki86 - 07-11-2018, 09:58 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 07-11-2018, 10:46 PM
RE: "అతి"మధురం - by Mohana69 - 07-11-2018, 11:09 PM
RE: "అతి"మధురం - by vickymaster - 07-11-2018, 11:59 PM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 11:05 AM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 11:26 AM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 01:54 PM
RE: "అతి"మధురం - by vickymaster - 08-11-2018, 03:24 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 08-11-2018, 04:07 PM
RE: "అతి"మధురం - by prasad_rao16 - 08-11-2018, 08:02 PM
RE: "అతి"మధురం - by raaki86 - 09-11-2018, 06:31 AM
RE: "అతి"మధురం - by అన్నెపు - 09-11-2018, 10:26 AM
RE: "అతి"మధురం - by tvskumar99 - 09-11-2018, 12:43 PM
RE: "అతి"మధురం - by vickymaster - 09-11-2018, 03:20 PM
RE: "అతి"మధురం - by vickymaster - 09-11-2018, 08:22 PM
RE: "అతి"మధురం - by raaki86 - 09-11-2018, 10:27 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 09-11-2018, 10:53 PM
RE: "అతి"మధురం - by vickymaster - 10-11-2018, 03:33 PM
RE: "అతి"మధురం - by utkrusta - 10-11-2018, 04:21 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 10-11-2018, 05:04 PM
RE: "అతి"మధురం - by Thiru8855 - 10-11-2018, 08:26 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 11-11-2018, 10:47 AM
RE: "అతి"మధురం - by mahesh477 - 12-11-2018, 11:11 AM
RE: "అతి"మధురం - by tvskumar99 - 12-11-2018, 11:28 AM
RE: "అతి"మధురం - by vickymaster - 12-11-2018, 11:39 AM
RE: "అతి"మధురం - by saleem8026 - 12-11-2018, 11:40 AM
RE: "అతి"మధురం - by Nikhil noel - 12-11-2018, 01:58 PM
RE: "అతి"మధురం - by utkrusta - 12-11-2018, 02:30 PM
RE: "అతి"మధురం - by Nikhil noel - 12-11-2018, 10:44 PM
RE: "అతి"మధురం - by vickymaster - 12-11-2018, 11:32 PM
RE: "అతి"మధురం - by raaki86 - 12-11-2018, 11:44 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 13-11-2018, 08:14 AM
RE: "అతి"మధురం - by saleem8026 - 13-11-2018, 01:30 PM
RE: "అతి"మధురం - by saleem8026 - 23-11-2018, 04:21 PM
RE: "అతి"మధురం - by SanthuKumar - 24-11-2018, 10:47 AM
RE: "అతి"మధురం - by SanthuKumar - 24-11-2018, 12:04 PM
RE: "అతి"మధురం - by Dpdpxx77 - 24-11-2018, 06:18 PM
RE: "అతి"మధురం - by Chandra228 - 24-11-2018, 09:41 PM
RE: "అతి"మధురం - by krish - 25-11-2018, 11:03 AM
RE: "అతి"మధురం - by SanthuKumar - 01-12-2018, 07:30 PM
RE: "అతి"మధురం - by Uma_80 - 10-12-2018, 03:06 PM
RE: "అతి"మధురం - by Kd2016 - 25-12-2018, 04:57 PM
RE: "అతి"మధురం - by SHREDDER - 26-12-2018, 07:03 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 02-01-2019, 01:49 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 02-01-2019, 01:52 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 08-01-2019, 11:17 PM
RE: "అతి"మధురం - by sri7869 - 08-03-2024, 09:57 AM



Users browsing this thread: 1 Guest(s)