Thread Rating:
  • 13 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance "అతి"మధురం
#22
9.ఊపిరాపకే....

షాక్ లో వుండిపోయిన అభి.....ముందు చిటెకేస్తూ...."ఓయ్...ఏమైందండి అభిమన్యు గారు...ఊహల్లో కి వెళ్ళారు...?"అడిగింది రియా

తనది ఊహ అని తెలిసిన మరుక్షణమే....ఒకింత నిరుత్సాహానికి గురయ్యాడు అభి.....

సరే పద....అని తను లేవడానికి సహాయం చేసి...తనని పట్టుకుని తనతో పాటు నడవసాగాడు....అలా తనతో పాటు అడుగులేస్తూ మనసులో మాత్రం ఈ అడుగులు తనతో పాటు జీవితాంతం కలసి నడవాలి అని ఆ దేవుడ్ని కోరుకున్నాడు.....

"ఏంటండి మళ్ళీ మీ ఆలోచనలు మన ఊరి దాటి పక్క ఊరి వెళ్ళినట్టున్నాయి ఏం థింక్ చేస్తున్నారేంటి.....?"అని రియా అడగడం తో.....ఏం లేదు అన్నట్టు తలూపాడు అభి.......

కొంచెం దూరం నడిచాక....."అభిమన్యు గారు......మిమ్మల్నొకటి అడగొచ్చా....?"అంది రియా

"దేవుడా.......రియా నన్ను అభి అని పిలిచేలా చెయ్యి..."అని మనసులో అనుకోసాగాడు అభి....

"అలానే పిలుస్తాను లేండి...ప్రస్తుతానికి నేనడిగిన దానికి సమాధానం ఐతే చెప్పండి...."అంది రియా

"ఏం పిలవడం...?"అర్థం కానట్టు ముఖం పెట్టి అడిగాడు అభి....

"మీరు చెప్పకపోయినా మీ ముఖం చూస్తే నే అర్థం అవుతుంది...మీరు నేను అభిమన్యు అన్నప్పుడల్లా ఎంత ఇబ్బంది గా ఫీల్ అవుతున్నారో....."అంది రియా

"హా మరి అర్థమయినప్పుడు.......పిలవకుండా వుండొచ్చు కదా....రియా....ఇంతకు ముందులా వుండొచ్చు కదా రియా...?"అడిగాడు అభి

"అది మాత్రం అడగకండి...."అంది రియా ముందుకు చూస్తూ ....

"అది స్సరే గానీ...ఏదొ అడగాలన్నావ్...?అడుగు...."అన్నాడు అభి......

"ఇప్పుడు కాదు లే రాత్రికి వస్తావ్ గా అప్పుడు అడుగుతాను..."ఆంది రియా

"రాత్రికా...నేనొస్తానా...ఎక్కడికి...?"అర్థమయ్యినా అర్థం కానట్టు అడిగాడు అభి....

"ఆహా....నీకేమి అర్థం కాలేదా....?నిజం చెప్పు...?"అడిగింది రియా

"లేదు...నిజంగా..."తన పిలుపు మీరు నుంచి నువ్వు కి మారింది అన్న ఆనందం లో ఉషారుగా చెప్పాడు అభి....

"సరే సరే.....నువ్వు వస్తే నీకుంటది అప్పుడు చెబుతా నీ పని..."వెక్కిరిస్తూ అంది రియా

"ఓహ్....అర్థమయ్యింది...నిన్ను చూడ్డానికి వస్తాను అనే గా నువ్వు అంది....?సారీ నేను నిజంగా మర్చిపోయాను....ఇప్పుడు గుర్తొచ్చింది..."అన్నాడు అభి

"చా....నువ్వు నీ కవరింగ్ లూ...చాలు చాల్లే నువ్వేమి రానక్కర్లేదు........పొద్దున్నే నిన్ను నేను లేపనక్కర్లేదు.....ఎక్స్ ట్రా గా నీకు నేను హగ్ లూ ఇవ్వనక్కర్లేదు...."అంది రియా

"అవును అడగడమే మర్చిపోయాను....ఆ రోజు నువ్వు నాకు హగ్ ఎందుకిచ్చావ్...?"దొరికిందే ఛాంస్ అన్నట్టు అడిగాడు అభి......

"అది....అది...హా....నీ బైక్ వచ్చేసింది...పద..."అని టాపిక్ డైవర్ట్ చేసింది రియా.....

ఆ రోజు రాత్రి.......ఎప్పటి లాగా అభి రియా కోసం వచ్చాడు.......ఎప్పుడు నిద్రపోయే రియా ఈ సారి మేల్కొని అభి కోసం వెయిట్ చేయసాగింది.......

"ఏంటి రియా....సాయంత్రం ఏదో అడుగుతానన్నావు....అడుగు..."అడిగాడు అభి

జండు బాం చూపిస్తూ......నా కాలు బాలేదు కదా...ఇది రాస్తేవేమో అడుగుదామని పిలిచా లే...అంది రియా

"ఇటివ్వు..."అని తన చేతిలోని బాం తీసుకోబోతుంటె....చెయ్యి వెనక్కి లాగేస్తూ.."ఏయ్ మెంటల్...నీకేమైనా పిచ్చా...నిజంగానే రాస్తావా...?ఏం అక్కర్లేదు.......నీకో విషయం చెబుదామని పిలిచాను అంతే...."అంది రియా

ఏంటన్నట్టు చూసాడు....అభి...

"సారీ ఫర్ బీయింగ్ రాష్ విత్ యూ నాకు ఇష్టం లేకుండా నువ్వా కాలేజ్ పెట్టెసరికి చాలా కోపం వచ్చేసింది...అందుకే తిట్టెసాను.....ఇంక థ్యాంక్యూ సో మచ్ నన్ను దగ్గరుండి చదివిచ్చినందుకు......నువ్వు లేపొతే....ఇట్ వుడ్ హావ్ బీన్ ఏ డిఫెరెంట్ స్టోరి......ఐ యాం సారి వంస్ ఎగైన్.....సరే ఇక నువ్వెళ్లు...నాకన్నా నువ్వెక్కువ అలసి పోయుంటావ్ కదా...?"అంది రియా

తనకి వెళ్ళాలని లేకున్నా రియా చెప్పడంతో ఇక తప్పక లేచి బయటకి నడస్తున్న అభి ని వెనక నుంచి గట్టిగా చుట్టెసింది రియా....ఒక్క నిమిషం అభి కి ఏమీ అర్థం కాలేదు......ఇంతలో రియా కన్నీళ్లు అతని షర్ట్ నీ తాకడంతో.....మరుక్షణం వెనక్కి తిరిగి వున్న అభి కాస్తా ముందుకి తిరిగి.....తన చేతులతో రియా ముఖాన్ని పట్టుకున్నాడు.....

"ఏయ్ రియా....ఏమైంది నీకు...ఎందుకేడుస్తున్నావ్....?"అడిగాడు అభి కంగారుగా
ఆ మాట తో ఇంకా తన ఏడుపు ఎక్కువయ్యింది.....ఇక వెంటనే అభి రియా తన గుండెలకి హత్తుకుని...తన తల మీద చెయ్యి వేసి "రియా...ఏడ్వకు....ఐ యాం దేర్ ఫర్ యూ......"అని తన తల ప్రేమగా నిమిరాడు.....ఆ మాటతో రియా ఇంకా గట్టిగా అభి ని చుట్టెసింది...ఇక లాభం లేదని....రియా కి కొంచెం దూరం జరగబోయాడు...కానీ రియా వినే పరిస్థితి లో లేదు...అంతకంతకూ తన దుఖం పరిగిపోతూనే వుంది.....

తన నడుము చుట్టూ చేతులు వేస్తూ...."రియా ఏమైందో చెబితేనే కదా నాక్కూడా తెలిసేది.....చెప్ప్...ప్లీస్"అన్నాడు అభి అభ్యర్థనగా.....

అంత ఏడుపు ఆపేసిన రియా తల ఎత్తి అభి కళ్లలోకి చూస్తూ అతని పెదవులపై తన పెదాలతో యుద్ధం మొదలెట్టింది......

ఏం చేస్తుందో అర్థం చేస్కునే సరికి అభి కి ఊపిరి ఆడట్లేదు......అప్పటికే తను ముద్దు మొదలుపెట్టి 2 నిమిషాలు కావొస్తుంది.......

ఇంతలో చిన్న బ్రేక్ లాంటిది ఇచ్చిన రియా....మళ్ళీ అభి ని ముద్దుపెట్టుకోవడం స్టార్ట్ చేసింది....తన బాధనంతా ఒక్క ముద్దు లో చెప్పేసి........ఒ 5 నిమిషాల తర్వాత...అభి ని వదిలేసింది........

తన వైపే చూస్తున్న అభి ని చూసి..."ఐ యాం సారి..."అని ఇంకో మాటకి తావివ్వకుండా వెళ్ళి పడుకుంది రియా.....రూం బయటకి నడుస్తూ.....జరిగింది నిజమా ...కలా....అర్థం చేస్కోలేక........ఒక ట్రాంస్ లో ఇంటికి చేరి నిద్రపోయాడు అభి...

ఆ మరుసటి రోజు నుంచి......కధ మళ్ళి మొదటికి వచ్చింది...కాదు కాదు....చాలా భయంకరంగా తయారయ్యింది....అభి కి కంటి మీద కునుకు లేకుండా చేసింది........!!!!
[+] 2 users Like అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: "అతి"మధురం - by coolsatti - 07-11-2018, 09:52 PM
RE: "అతి"మధురం - by raaki86 - 07-11-2018, 09:58 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 07-11-2018, 10:46 PM
RE: "అతి"మధురం - by Mohana69 - 07-11-2018, 11:09 PM
RE: "అతి"మధురం - by vickymaster - 07-11-2018, 11:59 PM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 11:05 AM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 11:26 AM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 01:54 PM
RE: "అతి"మధురం - by vickymaster - 08-11-2018, 03:24 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 08-11-2018, 04:07 PM
RE: "అతి"మధురం - by prasad_rao16 - 08-11-2018, 08:02 PM
RE: "అతి"మధురం - by raaki86 - 09-11-2018, 06:31 AM
RE: "అతి"మధురం - by అన్నెపు - 09-11-2018, 10:15 AM
RE: "అతి"మధురం - by tvskumar99 - 09-11-2018, 12:43 PM
RE: "అతి"మధురం - by vickymaster - 09-11-2018, 03:20 PM
RE: "అతి"మధురం - by vickymaster - 09-11-2018, 08:22 PM
RE: "అతి"మధురం - by raaki86 - 09-11-2018, 10:27 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 09-11-2018, 10:53 PM
RE: "అతి"మధురం - by vickymaster - 10-11-2018, 03:33 PM
RE: "అతి"మధురం - by utkrusta - 10-11-2018, 04:21 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 10-11-2018, 05:04 PM
RE: "అతి"మధురం - by Thiru8855 - 10-11-2018, 08:26 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 11-11-2018, 10:47 AM
RE: "అతి"మధురం - by mahesh477 - 12-11-2018, 11:11 AM
RE: "అతి"మధురం - by tvskumar99 - 12-11-2018, 11:28 AM
RE: "అతి"మధురం - by vickymaster - 12-11-2018, 11:39 AM
RE: "అతి"మధురం - by saleem8026 - 12-11-2018, 11:40 AM
RE: "అతి"మధురం - by Nikhil noel - 12-11-2018, 01:58 PM
RE: "అతి"మధురం - by utkrusta - 12-11-2018, 02:30 PM
RE: "అతి"మధురం - by Nikhil noel - 12-11-2018, 10:44 PM
RE: "అతి"మధురం - by vickymaster - 12-11-2018, 11:32 PM
RE: "అతి"మధురం - by raaki86 - 12-11-2018, 11:44 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 13-11-2018, 08:14 AM
RE: "అతి"మధురం - by saleem8026 - 13-11-2018, 01:30 PM
RE: "అతి"మధురం - by saleem8026 - 23-11-2018, 04:21 PM
RE: "అతి"మధురం - by SanthuKumar - 24-11-2018, 10:47 AM
RE: "అతి"మధురం - by SanthuKumar - 24-11-2018, 12:04 PM
RE: "అతి"మధురం - by Dpdpxx77 - 24-11-2018, 06:18 PM
RE: "అతి"మధురం - by Chandra228 - 24-11-2018, 09:41 PM
RE: "అతి"మధురం - by krish - 25-11-2018, 11:03 AM
RE: "అతి"మధురం - by SanthuKumar - 01-12-2018, 07:30 PM
RE: "అతి"మధురం - by Uma_80 - 10-12-2018, 03:06 PM
RE: "అతి"మధురం - by Kd2016 - 25-12-2018, 04:57 PM
RE: "అతి"మధురం - by SHREDDER - 26-12-2018, 07:03 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 02-01-2019, 01:49 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 02-01-2019, 01:52 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 08-01-2019, 11:17 PM
RE: "అతి"మధురం - by sri7869 - 08-03-2024, 09:57 AM



Users browsing this thread: 10 Guest(s)