Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మూల కణాలు (Stem Cells)... అంతా తావీజు మహిమ!
#1
మూల కణాలు (Stem Cells)... 
అంతా తావీజు మహిమ!
[Image: IMG-20200918-212603.jpg]
బొడ్డు తాడును పిల్లలకు వెండి మొలతాడులో కట్టి భద్రపరిచే హిందూ సాంప్రదాయం అనే సైన్సును క్రమంగా తాయత్తు మహిమగా (తావిజు మహిమ) మార్చి తర్వాత మూఢనమ్మకంగా ప్రచారమై మన సాంప్రదాయం మనమే వదులుకొనేలా చేసి వేలకోట్లు వ్యాపారం చేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. 
తాయత్తు అని మనం చాలా అవహేళన చేసి వెక్కిరించే ఆ తాయత్తులలోనే గతంలో పుట్టిన ప్రతి బిడ్డ నుంచి వేరు చేసిన బొడ్డుతాడును (Umbilical Cord) పెట్టి మొలతాడుకు కట్టేవారు. దానికే మరొక పేరు బొడ్డు తాయత్తు. మందులు లేని వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అరగతీసి నాకిస్తే తగ్గేవి..
 ఎవరి బొడ్డు వారికే పనికొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచటంకోసం చాలా తేలికైన ఖర్చులేని పని ఒక తాయత్తు చేసి దానిలో పెట్టి ఎవరి బొడ్డుని వారి మొలకే కట్టేవారు. స్థోమత ఉన్నవారు, వెండి తాయత్తులు చేయించుకునేవారు. 
లేనివారు ఏ రాగివో వాడుకునేవారు. ఏ మందుకు తగ్గని వ్యాధి ఎలా తగ్గిందంటే తాయత్తు మహిమ అనేవారు. ఈ తాయత్తు మహిమ అనే పదానికి అసలైన అర్థమిదే. ఈ బొడ్డుతాడును పరీక్షించి వ్యక్తికి భవిష్యత్తులో రాబోయే వ్యాధులను గుర్తించవచ్చట. 
కొన్ని రకాలా క్యాన్సర్లకు మూలకణాల చికిత్స చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తోబుట్టువుల మూలకణాలు అవసరమవుతాయి. అన్ని సందర్భాల్లో తోబుట్టువులు అందుబాటులో ఉంటారని అనుకోలేము. ఎవరి జీవితం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేరు. అందుకే బొడ్డుతాడుని దాస్తే అది ఆ వ్యక్తికి భవిష్యత్తులో అవసరమవుతుంది. 
అది కూడా ఆ వ్యక్తి దగ్గరే ఉంటే ఆపత్సమయంలో వెతికే అవసరముండదు. త్వరగా దొరుకుతుంది. మారిపోయే అవకాశం ఉండదు. అదేకాక వెండిలో చుట్టించి కట్టడం వెనుక ఆయుర్వేదం కూడా దాగి ఉంది. ఆధునిక సైన్సు కూడా దీనినే నిరూపించి ఈ Stem Cells క్యాన్సర్, జుట్టు ఊడిపోవటం, కిడ్నీ, రక్త సంబంధ వ్యాధులు, ఎముకల సమస్యలకి ఇలా ఎన్నో అంతుబట్టని, ఒక పట్టాన తగ్గని రోగాలకు కూడా ఇది పని చేస్తుందని ప్రచారం చేసుకుంటూ వాటిని భద్రపరచటానికి బ్యాంకులు తెరిచి కోట్ల వ్యాపారం చేస్తున్నారు. 
ఇవాళ ఒక బొడ్డుని భద్రపరచటానికి ఒక బ్యాంకు లాకర్ అద్దే సుమారు 20,000 రూపాయలుంది. ఆ అవసరం లేకుండా తాయత్తులో పెట్టుకుని మొలకు చుట్టుకుంటే అనాగరికమై, అవహేళన చేయబడి వెక్కిరించబడేది.
అవునులే బట్ట కట్టుకోవటమే అనాగరికమన్నప్పుడు మొలతాడు దానికొక తాయత్తు మరింత అనాగరికమే అవుతుంది. అంత ఉపయోగమున్న బొడ్డుతాడుని ఒకరిదొకరికి మారటానికి ఆస్కారం లేకుండా తాయత్తులో పెట్టి ఖర్చులేకుండా మొలకు కట్టుకోవటం అజ్ఞానం.
 ఒకరిది మరొకరికి మారే అవకాశమున్న లాకర్లో వేలు ఖర్చుపెట్టి దాచిపెట్టటం విజ్ఞానం. గర్భంలో ఉన్న శిశువు బొడ్డుతాడు ద్వారానే తల్లి నుంచి పోషకాలను తీసుకుంటుంది.
బొడ్డుతాడులో మూలకణాలు (Stem Cells) ఉంటాయని దాన్ని భద్రపరచాలని ఇప్పుడు అనేక ప్రకటనలు చేస్తూ Stem Cells బ్యాంకుల పేరుతో కొత్త కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి ఈ బొడ్డుతాడును దాచాలన్న ఆలోచన సనాతన హిందూ ధర్మానిది. సనాతనధర్మం ప్రకారం ప్రతి వ్యక్తికి జీవితంలో 16 సంస్కారాలు నిర్వహించాలి. 
ఇవి పుట్టుకముందు నుంచి మరణం తర్వాతి వరకు ఉంటాయి. వీటిలో ఒకటి జాతకర్మ. ఇది బిడ్డ పుట్టిన తర్వాత 11 రోజులకు చేసే సంస్కారం. పూర్వం ఈ సమయంలోనే (పుట్టినప్పుడు దాచిన) బొడ్డుతాడును తెచ్చి మంత్రించి రాగి  తాయత్తులో చుట్టి భద్రపరిచేవారు. దానికి ప్రత్యేకమైన పద్ధతి ఉండి ఉండవచ్చు. జీహాదీలు, ఆంగ్లేయుల దండయాత్రల్లో భారతదేశం చాలా విజ్ఞానాన్ని కోల్పోయింది.  
1740 లో డా. థామస్ క్రూసో అనే ఆంగ్లేయుడు (ఈస్ట్ ఇండియా కంపెనీ సర్జన్) బెంగాలులో పర్యటించాడు. అతని పర్యటనలో ఒక ఆశ్చర్యకమైన విషయం వెలుగు చూసింది. భారతదేశంలో అమ్మవారుతో (చికెన్ ఫాక్స్) చనిపోయే వారి సంఖ్య చాలా తక్కువగా దాదాపు లేని విధంగా కనిపించిది. ఈ విషయమై తన పరిశోధన మొదలెట్టాడు. 
బెంగాలులో ఒక సాధారణ మంగలి వైద్యుడు ఒక చిన్న సీసాలోని ద్రవ పదార్థాన్ని సూది ద్వారా శరీరంలోకి ఎక్కించడం చూశాడు. అతను ఇంటింటికీ తిరిగి ఇలా చేస్తూ ఉండడం థామస్ క్రూసోకు ఆశ్చర్యం కలిగించింది. 
అతనిని పిలిచి వివరం అడిగాడు. ఆ వైద్యుడు ఇచ్చిన సమాచారాన్ని హౌస్ ఆఫ్ కామన్సులో ప్రవేశపెట్టాడు. భారత దేశంలో చికెన్ ఫాక్సు, స్మాల్ ఫాక్సుతో మరణాలు లేవు. భారతీయ వైద్యులు దీనికి విరుగుడు కనుగొన్నారు. వారు చికెన్ ఫాక్స్ వచ్చినవారి పుండ్లనుండి రసిని తీసి నిలవచేసేవారు. తరువాత కొద్దిమొత్తంలో ఈ రసిని బాగున్న వారి శరీరాలలోకి ఎక్కిస్తున్నారు. దానితో శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పాడు. 
దీని వల్ల మనకు విశదమయ్యే విషయాలు మూడు. రోగనిరోధక శక్తి మనశరీరానికి ఉంది అనేది భారతీయులకు తెలుసు. తగిన మోతాదులో రోగ క్రిములను శరీరానికి ఇస్తే ఇక జన్మలో ఆ రోగం బారిన పడకుండా ఉంటారని తెలుసు. వాక్సినుకు మూలసిద్దాంతం ఇది. వైట్ బ్లడ్ సెల్స్ గురించి మన భారతీయులకు అవగాహన ఉంది. కానీ రోగనిరోదక శక్తి వాక్సినులు యూరోపియన్లు కనుక్కున్నారు అని మరియు భారతదేశం పైకి విదేశీయులు దండత్తకపోతే మనం అభివృద్ధి చెందేవారం కాదు అనటం కన్నా విడ్డూరం ఇంకొకటి ఉందా.!
హౌస్ ఆఫ్ కామన్స్ వివరాలు తిరగవేయండి మనకింకా ఇలాంటి చాలా విషయాలు బోధపడతాయి. అప్పట్లో మనం బొడ్డుతాడును వెండి మొలతాడులో చుట్టించి మొలకు కట్టడం వెనుక ఉన్న విజ్ఞానాన్ని అనాగరికమని ప్రచారం చేశారు. కానీ అసలు విషయం పరిశోధిస్తే — 
లోహాలకు శరీరంపై ప్రభావం చూపే శక్తి ఉందని గుర్తించారు మన పురాతన హిందువులు. ఈ సంస్కృతి ప్రతి చిన్న విషయం మీదా చాలా లోతైన పరిశోధన చేసింది. వెండిని శరీరంపై ధరించినప్పుడు అది చలువ (Cooling) చేసే గుణం కలిగి ఉంటుంది. అదే బంగారమైతే ఉష్ణగుణం (Heating) కలిగి ఉంటుంది. ఎక్కడెక్కడ ఉష్ణగుణం అవసరమో, ఎక్కడ శీతలగుణం అవసరమో మన పూర్వీకులకు బాగా తెలుసు. 
విషయంలోకి వస్తే స్త్రీ పురుష శరీర నిర్మాణం చూసినప్పుడు పురుషులకు వృషణాలు శరీరం బయట ఉంటాయి.  వాటి ఉష్ణోగ్రత సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే 2° తక్కువగా ఉంటుంది. అవి పురుషుల్లో వీర్యోత్పత్తి చేస్తాయి. 
ఈ వృషణాలు ఎప్పుడూ కూడా అధిక ఉష్ణోగ్రతకు లోనవ్వకూడదు. అలా అయితే వీర్య ఉత్పత్తి మీద వీర్యకణాల మీదా ప్రభావం చూపిస్తుంది. ఇవి అధిక ఉష్ణోగ్రతకు లోనవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే మొలకు వెండి మొలతాడు కట్టుకుంటామో అప్పుడు ఆ లోహప్రభావం వలన ఆ శరీర ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత సాధారణస్థాయికి రావడం కానీ అదుపులో ఉండటం కానీ జరుగుతుంది. 
అయితే వెండి మొలతాడు కొనే స్థోమత లేకపోవడం చేతనో లేక అది అనాగరికమని భావించటం చేతనో ఇప్పుడు కేవలం వెండి తాయత్తులో బొడ్డుతాడు ఉంచి మొలతాడుకు కడుతున్నారు. అలా వెండి తాయత్తు కట్టడం వెండిమొలతాడు కట్టడం అనాగరికమేమి కాదు. 
బంగారు మొలతాడు కట్టకపోవడానికి కారణం మీకు ఇప్పటికే అర్దమై ఉంటుంది. బొడ్డుతాడులో ఉన్న మూలకణాలను అనేక రోగాల నివారణకు, చికిత్సకు వాడతారు. అయితే కేవలం రాగి తాయత్తులో కట్టినంత మాత్రం చేతనే ఆ కణాలను భద్రపరచలేము. నైట్రస్ ఆక్సైడ్ వాంటి వాయువులను ఉపయోగించి అతిశీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరచడం చేత వాటిని పరిరక్షించవచ్చు. 
కానీ ఇది ఇప్పుడు పెద్ద వ్యాపారమైంది. రోగం వస్తుందో రాదో తెలియదు కానీ, రోగం వస్తుందని ముందే భయపెట్టి అధికమొత్తంలో సొమ్ము చేసుకోవడం కోసం Stem Cells Banks తెరవడం నిజంగా బాధాకరం.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
మూల కణాలు (Stem Cells)... అంతా తావీజు మహిమ! - by Vikatakavi02 - 18-09-2020, 09:28 PM



Users browsing this thread: 1 Guest(s)