Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము
#47
 అరసున్న [ఁ], 

 బండి 'ఱ' లు ఎందుకు? 

 అరసున్న, బండి ‘ఱ‘ లు 
 నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు. 
 ఐతే ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. 
 ద్రావిడ భాషా లక్షణాన్ని నిరూపించేవి. 

 అంతేకాదు కావ్యభాషలోను, లక్షణశాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. వాడకపోతే పరవాలేదు కానీ, వీటిగురించి తెలుగువాడు తెలుసుకోవాలిగదా! 

 మన భాషాసంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా! 
 
అరసున్న, ఱ ల వల్ల అర్థభేదం ఏర్పడుతోంది. పదసంపదకి ఇవి తోడ్పడతాయి. 

 ఎలాగో చూడండి: 

 ఉదా :-
 అరుఁగు  = వీధి అరుగు 
 అరుగు = వెళ్ళు, పోవు 
అఱుగు  = జీర్ణించు 

 ఏఁడు   = సంవత్సరం 
 ఏడు  = బాధ~7 సంఖ్య 

 కరి  = ఏనుగు 
 కఱి  = నల్లని 

 కాఁపు  = కులము 
కాపు  = కావలి 

 కాఁచు   = వెచ్చచేయు 

 కాచు   = రక్షించు 

 కారు   = ఋతువుకాలము 
 కాఱు  = కారుట (స్రవించు) 
(కారు=వాహనం ఆంగ్ల పదము)

 చీఁకు  = చప్పరించు 
 చీకు  = నిస్సారము, గ్రుడ్డి 

 తఱుఁగు  = తగ్గుట 
తఱుగు  = తరగటం(ఖండించటం) 

 తీరు  = పద్ధతి 
 తీఱు  = నశించు  

 దాఁక  = వరకు 

 దాక  = కుండ, పాత్ర 

 నాఁడు  = కాలము 
 నాడు  = దేశము, ప్రాంతము 

 నెరి  = వక్రత 
 నెఱి  = అందమైన 

 నీరు  = పానీయం 
 నీఱు  = బూడిద 

 పేఁట  = నగరములో భాగము 
 పేట  = హారంలో వరుస 

 పోఁగు  = దారము పోఁగు 
 పోగు  = కుప్ప 

 బోటి  = స్త్రీ 
 బోఁటి  = వంటి [నీబోఁటి] 

 వాఁడి  = వాఁడిగాగల 
వాడి = ఉపయోగించి 
 
వేరు = చెట్టు వేరు 
 వేఱు  = మరొకవిధము 

 మన తల్లిదండ్రులు 
 మన మాతృభాష 
 ఎంతో విలువైనవి 
 గుర్తుంచుకుందాం 
 గౌరవించుకుందాం 

 ఇవి మన సంపద 
 తెలుసుకుని సంతోషపడదాం
 
Namaskar తెలుగువారందరికీ

తెలుగుభాష దినోత్సవ శుభాకాంక్షలు Namaskar

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము - by Vikatakavi02 - 29-08-2020, 07:56 PM
చెప్పండి - by Mohana69 - 29-08-2020, 10:42 AM



Users browsing this thread: 1 Guest(s)