Thread Rating:
  • 10 Vote(s) - 3.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అనిరుద్ర H/o అనిమిష
#10
అనిరుద్ర H/o అనిమిష - 4వ భాగం

“నేనివ్వనంతే... మరీ ఇంత ఘోరమా... నలభైకి మించదు... వంద ఎలా అవుతుంది?” ఓ వ్యక్తి ఆటో డ్రైవర్తో గొడవపడ్తున్నాడు.

“ఇదిగోండి సార్ మీటర్ చూడండి... ఫ్రీగా ఇస్తున్నట్టు మాట్లాడతారేంటి?” ఆటోడ్రైవర్ గొంతు పెంచాడు. ఇద్దరి వాదనలు ఎక్కువయ్యాయి. ఆ వ్యక్తి కూడా వున్న అతని భార్యో, గర్ల్ఫ్రెండో...

“అయ్యో ఇచ్చేయండి గొండవెందుకు? అసహ్యంగా...” అంటోంది. ఆ వ్యక్తి విసుక్కుంటూ జేబులోంచి వంద రూపాయలు తీసి ఇవ్వబోయాడు.

అనిరుద్ర వెంటనే ఆ వ్యక్తితో “ఆగండి మాస్టారూ...” అని ఆటోడ్రైవర్ వైపు తిరిగి, “ఎందుకొచ్చిన గొడవ... ఓ యాభై తీసుకొని వెళ్లు... నీకు ఓ పది లాభం” అన్నాడు.

“ఏంటి... సెటైర్లు వేస్తున్నావా? నాకు పది లాభం ఏంటి? యాభై బొక్కవుద్ది. మీటర్ చూసి డబ్బు ఇవ్వండి. నేనేం చందాలు అడగడం లేదు” అన్నాడు ఆటోడ్రైవర్ “ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో. స్టేషన్ నుంచి ఇక్కడికి నలభైకి మించి అవ్వదు యాభై తీసుకొని వెళ్లు”

“అదేం కుదర్దు... మీటర్ చూసి డబ్బులివ్వండి” “నలభైకి మించి అవ్వదని చెప్తున్నాగా”

“ఎలా చెబుతారండీ... మీటర్ కన్నా మీకు ఎక్కువ తెలుసా?”

“సరే నలభైకి మించి అవ్వదని నిరూపిస్తే” “నిరూపించండి చూద్దాం”

“సరే ఓ పని చేద్దాం... నేను మరో ఆటోని పిలుస్తాను. నా వెనకే వచ్చేయ్. ఆ ఆటో బిల్లు ఎంతయితే అంతే నీకు ఇస్తాను. కానీ నా ఆటో బిల్లు నువ్వు పే చేయాలి” అన్నాడు అనిరుద్ర.

“ఏ ఆటో బిల్లు అయినా ఒకటే అవుతుంది” ఆటోడ్రైవర్ అన్నాడు.

“అవుతుంది... ట్యాంపరింగ్ చేస్తే అనిరుద్ర చెప్పాడు. అప్పటివరకూ వాదిస్తున్న ఆటోడ్రైవర్ మొహంలో రంగులు మారాయి.

“మీటర్ వినియోగించే ప్రధాన గేర్ వీల్ కు అరవై నాలుగు పళ్లుంటాయి. ఇది ఒక చుట్టు తిరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాన్ని తొలగించాలి. యాభై ఆరు పళ్లు వుండే గేర్ వీల్ ని ఏర్పాటుచేస్తే గేర్ వీల్ కు ఎన్ని తక్కువ పళ్లుంటే మీటర్ వేగం అంత ఎక్కువ చూపిస్తుంది.

పాయింట్ నంబర్ టూ... ఆటో మీటర్ దగ్గర వుండే వర్క్ గేర్ కి ఇరవై పళ్లుంటాయి. పదహారు పళ్లు వుండే వర్క్ గేర్ ని ఏర్పాటుచేస్తే త్వరగా తిరిగి బిల్ ఎక్కువ వస్తుంది” అనిరుద్ర చెప్పడం ఆపి ఆటోడ్రైవర్ వంక చూసి, కొద్దిగా ఆగాడు.

“నీ ఆటో నంబర్ ఎంతో చెప్పు... తూనికలు, కొలతల శాఖ లేదా సెక్యూరిటీ ఆఫీసర్లకు ఏ ఒక్కరికి ఫోన్ చేసినా వాళ్లే చూసుకుంటారు”

ఆటోడ్రైవర్ ఏమనుకున్నాడో వెంటనే, “పొద్దున్నే గొడవ ఎందుకు సార్... ఆ యాభై "ఇచ్చేయండి” అన్నాడు.

“కాదు నలభయ్యే... నాతో పదినిమిషాలు వాగించినందుకు టైం కిల్ అమౌంట్” అంటూ ఆటోలో వున్న వ్యక్తి వైపు చూశాడు. ఆ వ్యక్తి నలభై రూపాయలు ఆటోడ్రైవర్ కు ఇచ్చాడు. ఆటోవాలా గొణుక్కుంటూ వెళ్లిపోయాడు.

“అవునవును...” అంటూ తన పక్కనే వున్న అతణ్ణి మోచేత్తో పొడిచింది. "

ఆ వ్యక్తి అరవై రూపాయలు అనిరుద్ర చేతిలో పెట్టాడు. అనిరుద్ర అందులో నుండి మూడు పది రూపాయల కాగితాలు తీసుకొని, మిగతా మూడు పది కాగితాలు ఆ వ్యక్తికి ఇచ్చాడు.

“థాంక్స్” చెప్పాడా వ్యక్తి. కు

“ఇందాకోటి చెప్పానుగా... సరే... సగం లాభం ఇచ్చారు కాబట్టి మీకు ఎప్పుడూ పనికి వచ్చే రెండు, మూడు టిప్స్ చెబుతాను వినండి. ఎప్పుడైనా ఆటోలోకి ఎక్కగానే మీటర్ ఫ్లాగ్ ని పూర్తిగా డ్రైవర్ కిందకి తిప్పాడో లేదో గమనించాలి. సగమే తిప్పితే మొత్తం కిందకి తిప్పమని చెప్పండి. ఆటోను వెయిటింగ్లో పెట్టాల్సి వస్తే, దిగే ముందు మీటర్ రీడింగ్ గమనించి, ఆ తర్వాత ఆటో ముందుకు కదలగానే రీడింగ్ ను పరిశీలించండి” అని చెప్పాడు అనిరుద్ర. "

ఆ వ్యక్తి సరే అన్నట్టు తలూపి ముందుకు కదిలాడు.

***

“ఒరే అనూ... నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ వుందిరా...” అన్నాడు కార్తీక్.

“మూడ్రూపాయలు పెట్టి పేపర్ కొన్నప్పుడు కనీసం ముప్ఫై రూపాయలకు సరిపడా ఇన్ఫర్మేషన్ తీసుకోకపోతే ఎలా... ఎప్పుడూ పత్రికలు కొని చదవడానికి కక్కుర్తి పడుకు” అని చెప్పి అయ్యర్ హోటల్ లోకి దారితీశాడు అనిరుద్ర. వేడి వేడి ఇడ్లీలు రెడీ అవుతున్నాయి అయ్యర్ హోటల్లో,

***

బాత్రూంలోని షవర్ కు చెమట పట్టింది. అద్దానికి ఉద్వేగపు కౌంట్ డౌన్ మొదలైంది. మూలన పడి వున్న బట్టలు వేసే స్టాండ్ కళ్లు విప్పార్చి చూస్తోంది. మొత్తం మీద ఆ స్నానాల గది ఆపసోపాలు పడుతోంది. కారణం మరి కాసేపట్లో అనిమిష ఆ గదిలోకి అడుగుపెట్టబోతోంది.

* * *

“ఏయ్ అనిమిషా... ఆగు... దిష్టి తీయనీ... నీ అందం చూస్తోంటే నాకే ఇంత టెంప్టింగ్గా ఉంది. ఆ బాత్రూంకెంత టెంప్టింగ్ గా ఉంటుందో! అసలింతకూ బాత్రూం మేల్ జెండరా... ఫిమేల్ జండరా?” అని అడిగింది ద్విముఖ అనిమిషను.

రెండు చేతులూ నడుం మీద పెట్టుకొని టవల్ ని భుజమ్మీద వేసుకొని ద్విముఖ వెన చూస్తూ, “ఇవ్వాళ నన్నసలు స్నానం చేయనిస్తావా? లేదా? అవతల మా బాసాసురుడు కుబుసం వీడిన పాములా ఎదురుచూస్తూ ఉంటాడు” అంది అనిమిష

“అబ్బా... ఇంతందంగా ఎలా పుట్టావే?” అంది అనిమిష నడుము వంక చూస్తూ..

“ఏయ్... నీకు అల్లరెక్కువవుతోంది” తర్జనీ చూపిస్తూ అంది అనిమిష.

“అల్లరి అంటే గుర్తొచ్చింది. ఇవ్వాళ ఆఫీసు నుండి ఎన్ని గంటలకు వస్తావ్?” అడిగింది ద్విముఖ.

“ఆరు గంటలకు... ఏం నాతో ఏమైనా పనా?”

“నాకు రూమ్మేట్.... డైనింగ్ మేట్.... బెడ్ మేట్.... టీవీ మేట్ వి నువ్వే కదా... ఇవ్వాళ ఆరు గంటలకు స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది”

“స్పెషల్ ప్రోగ్రామా... కొంపదీసి ప్రీమారిటల్ సెక్స్ గురించి కాదు కదా... మన రూమ్ ముందు గొడవైతే నేనూరుకోను” అంది అనిమిష

“అనుకుంటాంగానీ... నీలో సెటైర్ బాగానే ఉంది. మొన్న బీచ్లో షూట్ చేసిన ప్రోగ్రాం ఇవ్వాళ టీవీలో వస్తోంది”

“రోజూ నీ ప్రోగ్రామ్ ఏదో ఒకటి వస్తుందిగా... అందులో న్యూసేముంది?”

"నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు... ఇవ్వాళి ప్రోగ్రామ్లో ఓ వివివిఐపి ఉంటాడు”

“మూడు 'వి'లున్నాయా మీ వివివిఐపిలో?” అడిగింది అనిమిష

“అవును.. అతగాడికి భర్త పోస్ట్ కావాలిట”

“వ్వాట్.. అదిరిపడి అడిగింది అనిమిష

“అందుకేగా... ఆ ఇంటర్వ్యూ మిస్సవ్వద్దు అంటున్నాను. భలే ప్రిన్సిపల్ మేన్.. హీమేన్ కూడా.... సాయంత్రం త్వరగా రావే... వచ్చేటప్పుడు స్నాక్స్ ఏమైనా పట్టుకురా... తింటూ చూడొచ్చు”

“ముందు స్నానం చేయనీ... మా బాస్ గురించి తెలియదు. రాజ్... శోభరాజ్... అంటూ అతడిని యిమిటేట్ చేస్తూ బాత్రూమ్లోకి వెళ్లింది అనిమిష

***

శోభరాజ్ సర్వీసెస్

సరిగ్గా ఆరేళ్ల క్రితం ఓ చిన్న గదిలో ప్రారంభమైన సంస్థ శోభరాజ్ సర్వీసెస్. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, సలహాలు, పబ్లిసిటీ... ఇలా ఎవరికి, ఎలాంటి అవసరం వచ్చినా ముందుగా సంప్రదించేది శోభరాజ్ సర్వీసెస్ నే. శోభరాజ్ కు వచ్చిన ఐడియా ఫలితం ఇది.

ఆరేళ్లలో శోభరాజ్ సర్వీసెస్ కు మంచి పేరు వచ్చింది. శోభరాజ్ వృత్తిపరమైన సమర్ధత ఒక కారణమైతే, అతను తన స్టాఫ్ ను ఎంపిక చేసుకునే పద్దతి... వాళ్లకు అన్ని ఫెసిలిటీస్ కల్పించడం మరో కారణం."

అను శోభరాజ్ది డిఫరెంట్ క్యారెక్టర్. కొన్ని విషయాల్లో ఫ్రాంక్ గా ఉంటాడు. ఏ విషయాన్ని అయినా మొహమ్మీదే చెప్పేస్తాడు. విలక్షణమైన రీతిలో అతని స్వభావం ఉంటుంది. చాలా విషయాల్లో ప్రాక్టికల్. .

విశాలమైన ఆ హాలులో మూడు వరుసల్లో ఒకేలాంటి కుర్చీలు ఉన్నాయి. ఆ కుర్చీల్లో స్టాఫ్ కూర్చున్నారు. స్టాఫ్లో డిజిగ్నేషన్స్ ఏవైనా, అసెంబ్లీ టైంలో అంతా ఒక్కటేననే ఉద్దేశం శోభరాజ్ది. తొమ్మిది నలభై అయిదుకల్లా ముప్పాతిక స్టాఫ్ వచ్చేశారు. పది గంటలకు రిజిష్టర్ లో సంతకం చేయాలి. అరగంట గ్రేస్ టైం. పదిన్నర తర్వాత వచ్చిన వాళ్లు సంతకం చేసి 'ఆలస్యానికి కారణం' లేట్ అన్న కాలమ్లో రాయాలి. అలా నెలలో మూడుసార్లకు మించి వుంటే శోభరాజ్ ఆ ఉద్యోగిని తన ఛాంబర్లోకి పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.

ఆఫీస్ టైంలో ఎవ్వరూ మాట్లాడుకోకూడదు. లంచ్ టైంలో ఎవరి స్వేచ్ఛ వారిది. విజిటర్స్ రూమ్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. అతని సంస్థలో పనిచేసే వాళ్లెవరూ బ్యాంకుల్లో లోన్లు తీసుకోకూడదు. తన ఉద్యోగులు ఎక్కడో అప్పు చేయడం ఇష్టం ఉండదు. తనే బ్యాంకు వడ్డీ కన్నా కనీసం ఆరు శాతం తగ్గించి ఇస్తాడు.

ఆ కారణాల వల్ల ఉద్యోగుల్లో 'డ్యూటీ కాన్షియస్ నెస్' పెరుగుతుందన్న నమ్మకం శోభరాజ్ది. ముపై నాలుగేళ్ల శోభరాజ్ అవివాహితుడు. తనకు నచ్చిన అమ్మాయి దొరకనందువల్లే పెళ్లి చేసుకోలేదని 'పెళ్లేందుకు చేసుకోలేదని అడిగిన వాళ్లకు కారణం చెబుతాడు.

మూడు వరుసల్లో వున్న కుర్చీల్లో రెండు కుర్చీలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అందులో ఒక కుర్చీ అకౌంట్స్ సెక్షన్ లో పనిచేసే నిఖితది కాగా మరో కుర్చీ అనిమిషది.

తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు. శోభరాజ్ అసెంబ్లీ హాలులో డయాస్ మీద నిలబడ్డాడు. స్టాఫ్ అటెండెన్స్ రిజిష్టర్లో సంతకాలు చేసి తమ తమ సీట్లలో కూర్చున్నారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా శోభరాజ్ టేబుల్ మీద వున్న టేప్ రికార్డర్ లో ప్లే బటన్ నొక్కాడు. అయిదు నిమిషాల ప్రసంగం అందులో ఉంటుంది. టేప్లో నుండి శోభరాజ్ ప్రసంగం వస్తుంటే.. దానికి అనుగుణంగా శోభరాజ్ పెదవులు కదిలిస్తూ హావభావాలు ప్రదర్శిస్తుంటాడు.
“మై డియర్ స్టాఫ్... అయామ్ శోభరాజ్... అలా అని చార్లెస్ శోభరాజ్ ని కాను... పన మాస్టర్ క్రిమినల్... నేను మాస్టర్ బిజినెస్ మాన్ ని... ప్రకాష్ రాజ్ ని కాను అతనో వర్సెటైల్ ఆర్టిస్ట్... నేను మాస్టర్ బిజినెస్ క్రియేటర్స్... నేను ఏది చేసినా ఫేస్ టు ఫేస్... బ్యాక్ టు ఫేస్ నా డిక్షనరీలో లేదు. నేను టైంని దైవంగా భావిస్తాను. ఎందుకంటే... టైం కనిపిస్తుంది. దాన్ని వినియోగం చేసుకుంటే ఎన్నో ఉన్నత శిఖరాలను ఎక్కేలా చేస్తుంది. నేను టైంని మనీగా భావిస్తాను. ఎందుకంటే టైం సద్వినియోగం చేసుకుంటే బిల్గేట్స్ అవ్వొచ్చు. టాటా బిర్లా అవ్వొచు అమితాబ్ కె.బి.సి.లో తన టైం స్పెండ్ చేసి కోట్లు సంపాదించాడు. నేను టైంని లైఫ్గా భావిస్తాను ఈ టైంలో నేను బ్రతికే ఉన్నాను. బ్రతికి వున్న టైంని నేను సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిరోజు మీకు ఈ క్యాసెట్ ఎందుకు వినిపిస్తున్నాననంటే... కనీసం రోజులో అయిదు నిమిషాలైనా నా మాటలు మీకు ఆలోచన కలిగిస్తాయని... థాంక్యూ... నా మాటలు శ్రద్ధగా విన్నందుకు మీకు కాంప్లిమెంట్గా కాఫీ...”

టేప్ ఆఫ్ అయ్యింది. అటెండర్ ఆర్ముగం అందరికీ కాఫీలు సర్వ్ చేశాడు. శోభరాజ్ ఖాళీగా వున్న రెండు కుర్చీల వైపు చూశాడు. ముఖ్యంగా అనిమిష వున్న కుర్చీ వైపు.

***
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: అనిరుద్ర H/o అనిమిష - by అన్నెపు - 09-11-2018, 06:24 AM



Users browsing this thread: 1 Guest(s)