Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
దయచేసి అందరూ ఈ థ్రెడ్( ఆమని గారి కోసం) చూడగలరు అని మనవి
#75
Wink 
సాటి రచయితగా... (అలా అని నేను అనుకోవచ్చా? Shy

ఒక్క మాట చెప్తాను. కమెంట్ పెట్టేవాళ్ళలో అభిమానులూ ఉంటారు, అసూయపరులూ ఉంటారు, విమర్శకులు ఉంటారు ఇంకా అతిగాళ్ళు కూడా ఉంటారు. మనకు సపోర్ట్ చేసేవాళ్ళందరూ మంచివాళ్ళు కారు, విమర్శించినవాళ్ళు అందరూ శత్రువులూ కారు.
సహజంగా మనుషులకి మంచి కన్నా చెడు తొందరగా బుర్రకి ఎక్కేస్తుంది. అందుకే 'బాగుంది' అని వందమంది అన్నా 'బాలేదు' అన్న ఒకే ఒక్క వ్యక్తి మాటకి మనం త్వరగా స్పందిస్తాం. కథలను అక్కున చేర్చుకున్న అభిమానులను మరిచి ఆ ఒక్కరి కోసం వ్రాతని ఆపేస్తాం అని బెదిరిస్తాం, అలుగుతాం.
నిజంగా చెప్తున్నా... మీ కథలని ఎవరినో ఉద్ధరించడానికి వ్రాస్తున్నాం అనే ఆలోచనలతో ఎవ్వరూ దయచేసి వ్రాయకండి. కథ మీద ఇష్టంతో వ్రాయండి. లేకపోతే మానేయండి.

ఒకవేళ ఎవడైనా... సారీ... ఎవరైనా... కథను గురించిగానీ, లేదా రైటర్ ని ఉద్ధేశించి పర్శనల్ గా అవమానిస్తూ మెసేజ్ ఇస్తే
అక్కడే చెడామడా దులిపేయండి. ఆతర్వాత వాళ్ళను వాళ్ళ ఖర్మాన వదిలెయ్యండి. వాళ్లు మరీ యెగస్ట్రాలు చేస్తే అడ్మిన్ కి రిపోర్ట్ చెయ్యండి. అంతేగానీ, మీరు చిన్నపిల్లల మాదిరి ప్రవర్తించకండి. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి... అలాగని మన ప్రయాణం మధ్యలో ఆపకూడదు
మార్టిన్ లూథర్ కింగ్ ఓ మాటన్నారు...
నువ్వు ఎగరలేకపోతే పరుగెత్తు. అది చేతకాకపోతే నడు. అదీ కుదరకపోతే కనీసం పాక్కుంటూనైనా నీ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించు. అంతేగానీ చలనం లేకుండా ఒక్క చోట ఉండిపోకు అని...
కనుక, మన దృష్టి ఎదురయిన కష్టం మీద కాదు, చేరుకోవాల్సిన గమ్యం మీద ఉండాలి. దారిలో తగిలే రాళ్ళని, ముళ్ళకంపల్నీ తొలగించుకుని, తప్పించుకుని వెళ్ళిపోవాలి గానీ అక్కడే ఆగిపోకూడదు.

అంతే!
(ఏ ఒక్కరినో ఉద్దేశించి నేను చెప్పడం లేదు. కతలు వ్రాస్తూ వెతలు పడే ప్రతీ మనిషికీ  ఇదే నా సందేశం)

ఇట్లు
వికటకవి౦౨

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
RE: దయచేసి అందరూ ఈ థ్రెడ్( ఆమని గారి కోసం) చూడగలరు అని మనవి - by Vikatakavi02 - 26-08-2020, 07:37 PM



Users browsing this thread: 5 Guest(s)