24-02-2019, 09:59 PM
(14-02-2019, 05:00 AM)stories1968 Wrote: రాత్రి పుష్పించి తెల్లవారు సమయానికి నేలంతా పరచుకుని భూదేవి వికసించిందా అన్నట్లు ఉంటాయి పారిజాతాలు..చూడాలి పారిజాత వృక్షాన్ని. మీరు చెప్పినంతవరకూ నాకు తెలియదు పై భాగం లోని ఏడూ భాగాలుగా ఆకులు ఉంటాయని.
ఎంతో సువాసన కూడిన ఈ పువ్వులు చూసేందుకు తెల్లని పూ రేకులతో ఎర్రటి కాడతో చూడముచ్చటగా ఉంటాయి.
పూలను సుగంధ తైలాన్ని తీసేందుకు ఉపయోగిస్తారు.
. . ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత చెట్టు దిగువ భాగంలో ఆకులు ఐదు చేతివేళ్ళను పోలి ఉంటాయి.
పై భాగంలోని ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి.
ఈ వృక్షం వయసు వెయ్యి నుంచి దాదాపు ఐదువేల సంవత్సరాలు పారిజాతం అంటే సౌరభం అని ఒక అర్థం ఉంది.
చాలా అందంగా సొగసుగా ఉంటాయి పారిజాత పువ్వులు.
ఆ కాండం రంగుని అంత accurate గా ఎవ్వరూ తయారు చెయ్యలేరు. తయారు చేసినా అంట అందంగా రాదు.
మళ్ళీ అంత చిన్న పువ్వులో ఎంత సువాసన దాగి ఉంటుందనీ....................అనూహ్యం. వెయ్య సంవత్సరాల వయసా? అంటే పది తరాలు; మాటకి 15 తరాలు.
ధన్యవాదాలు స్టోరీస్ గారూ మీ ఇన్ఫర్మేషన్ కి.