Thread Rating:
  • 4 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మిక చింతన
#40
ముక్తి ఎలా లభిస్తుంది???

సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటారు. అందుకే అంటారు.. పూజలు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది.. వాడు పిల్లికి బిచ్చం పెట్టడు, ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు, వాడికి పూజా లేదు పునస్కారం లేదు. ఇంక వాడేం మోక్షాన్ని పొందుతాడు.. అని.

అంటే మోక్షాన్ని గనక పొందాలంటే పూజా పునస్కారాలు చెయ్యాలని, భక్తితో భగవంతుని కొలవాలని, జపతపాలు చేయాలని, దానధర్మాలు చేయాలని.. ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు.. సామాన్యంగా.

మరి ఇక్కడ శంకరాచార్యుల వారు స్పష్టంగా చెబుతున్నారు.

 శాస్త్రాలను గురించి బాగా ఉపన్యాసలిచ్చినా, 

యజ్ఞాలు చేసి దేవతలను ఆహ్వానించి తృప్తి పరచినా,

 సత్కర్మలు, పుణ్య కార్యాలు ఎన్ని చేసినా, 

దేవతలను ఎంతగా పూజించినా ముక్తి లేదు. 

వంద మంది బ్రహ్మలకాలం అంటే కోటానుకోట్ల జన్మలు ఇలా చేసినప్పటికీ ముక్తి రాదు.. అని.

" ఆత్మైక్య బోధేన" ... నేను ఆత్మను అని అనుభవరీత్యా గ్రహిస్తే తప్ప ముక్తిలేదు. 

పైన చెప్పిన కార్యాలన్నీ సత్కార్యాలే, 

వాటిని సక్రమంగా చేసినట్లైతే స్వర్గ లోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించటం కూడా నిజమే. 

అయితే పుణ్యఫలం ఖర్చై పోగానే తిరిగి ఈ లోకంలోకి రావాలాల్సిందే. మళ్ళీ చరిత్ర ప్రారంభించ వలసిందే.

అయితే ముక్తి పొందాలనుకున్నవారు మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చెయ్యాల్సిన పనిలేదా.. చేయకూడదా.. అంటే చేయాల్సిందే. ...

అయితే ఎలా చేయాలి.. ఎందుకు చేయాలి.. 

మన మనోబుద్ధుల యొక్క అలజడులు తగ్గించి శాంత పరచుకోవటానికి నిష్కామంగా ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చేయాలి. అంతవరకే వీటి ప్రయోజనం.

వేదాంతాన్ని అభ్యసించటానికి ఒక సద్గురువును సమీపించేటప్పటికే శిష్యుడు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఈ సంసార సాగరాన్ని తరించే ఉపాయాన్ని బోధించమని గురువును ప్రార్థించినప్పుడు, గురువు చెప్పే సునిశిత విషయాలను గ్రహించే మానసిక స్థిరత్వం, ఏకాగ్రత, బుద్ధి సూక్ష్మత శిష్యునికి ఉండాలి.

 అలా ఉండాలంటే అప్పటికే అతడు ధార్మిక జీవనానికి అలవాటు పడి, నిష్కామ కర్మలు, జపతపాలు ఇష్ట దేవతారాధన మొదలైన వాటిని సక్రమంగా ఆచరించే ఉండాలి.

అయితే ఆ కర్మకాండను విడిచిపెట్ట లేకుండా దానికే అతుక్కుపోయి ఉండకూడదు. తాను చెప్పే నూతన విషయాలను, సూక్ష్మ బుద్ధికి తప్ప అంతుబట్టని వేదాంత విషయాలను అతడు చక్కగా అర్థం చేసుకొని వదలవలసిన వాటిని వదిలి, పట్టుకోవలసిన వాటిని పట్టుకోవాలి.

 తీవ్రమైన మోక్షాపేక్షతో తన దగ్గరకు వచ్చిన శిష్యుడు దృఢ నిశ్చయంతో మోక్షమార్గంలో ప్రయాణించాలంటే తాను కొన్ని కఠోరమైన సత్యాలను చెప్పక తప్పదు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 19-05-2020, 08:50 PM



Users browsing this thread: 5 Guest(s)