21-02-2019, 10:42 AM
(21-02-2019, 06:56 AM)ఐశ్వర్య Wrote:మీ సమాధానం తో మారోసారి ఆకట్టుకున్నారు ఐశ్వర్య గారు..!!!
తప్పుగా ఏమీ మాట్లాడలేదండి మీరు.సరిగ్గా అన్నారు..
తన మనసుని జయించిన మగాడిని మగువ ఎన్నడూ మోసం చేయదు,అతడే సర్వస్వం అని జీవిస్తుంది అలాగే మగాడు కూడా అంతే...అందరికీ ఈ అవకాశం రాదు..అలా ఒకరినొకరు ప్రేమగా ఉండటం అరుదు..అలా ఉండేవాళ్ళకి ఒకరితోనే జీవితం అంకితం అయిపోతుంది...
ప్రేమ దొరకకనో లేకా కోరికలు ఎక్కువ ఉండటం వల్లో కొందరు మనుషుల జీవితాల్లో ఒకరి కన్నా ఎక్కువ మంది ఉంటారు..అది పూర్తిగా వాళ్ళ ఇష్టంతోనే జరుగుతుంది అని చెప్పలేము..అది వారి మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది...సరైన తోడు జీవితాంతం ఉంటే నిఖార్సయిన ఆడది ఎన్నడూ దారి తప్పదు,అలా తప్పింది అంటే అది నాకు తెలిసి విచ్చలవిడి తనమే..అది పూర్తిగా వాళ్ళ ఇష్టం,మనం ఏమీ అనలేము మహా అయితే దిగజారింది అని తప్ప..
నా జీవితంలో ఇలా జరగడానికి గల కారణం నా పరిస్థితులు అనే చెప్పొచ్చు.. అలాగని ఇలా చేయాలా అంటే నా దగ్గర ఉన్న సమాధానం ఒక్కటే సరైన తోడు లేకపోవడం అని..సత్యా అన్నయ్య నా నుండి దూరం అయ్యాక చాలా గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి నా జీవితంలో, పెళ్లయ్యాక ఎప్పుడూ ఒక సాంత్వన కలిగించే భర్తలా ఎన్నడూ మా ఆయన కనిపించలేదు,ఆయన లోకం ఆయనది..ఆయన ఇష్టాలు నాకెప్పుడూ ప్రేమని పంచలేదు..
సరైన తోడు ప్రేమ కోసమో,నా కోరికల్ని తీర్చుకోవడం కోసమో తెలీదు కానీ నా మనసు ఎప్పుడూ సత్యా అన్నయ్య లాంటి స్వచ్ఛమైన తోడు కోసం పరితపించేది..అలా జరగడం వల్లే నా జీవితంలో కొందరు వ్యక్తులు వచ్చారు,అది కూడా పూర్తిగా నా ఇష్టంతోనే..ఇది ఏ కోవకి వస్తుందో నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను సరైన తోడు కోసం ఎప్పుడూ పరితపించాను అని...ఇలా చెప్తూ నేను చేసిన పనుల్ని సమర్ధించుకుంటున్నాను అని మాత్రం అనుకోకండి..ఎందుకంటే మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు మనల్ని అలా ప్రభావితం చేసాయి అని మాత్రం అనుకోవచ్చు...చెప్పాలంటే చాలానే ఉన్నాయి..
నా జీవితంలో అలా జరగడానికి గల కారణాలు విపులంగా వివరిస్తాను,అప్పుడు మీరే చెప్పండి ఎందుకు అలా చేశానో అని.
ధన్యవాదాలు.
నేను ఎప్పుడు ఒక విషయం నమ్ముతాను, ఆడది తప్పు చేసింది అంటే అది మగాడి చేతకాని తనం వల్ల అని. కొంతమంది ఆడది తప్పు చెయ్యకుండా వుండడటానికి కుటంబ విలువలు, భర్త, సమాజం వల్ల అనీమణిగి వుంటారు. అది కూడా కొంతలో కొంత మోరల్ సపోర్ట్ ఉంటేనే. ఆడది ఆశించిన దానిలో ముఖ్యమైనవి కొంతలో కొంత అయినా భర్త ఇవ్వగలిగితే చాలు, మిగిలినవి లేకపోయినా సర్దుకోగలదు. ఆశించినవి ఎటువంటివి లేని సమయం లో పరాయి వ్యక్తి పరిచయం నుండి అలాంటివి లభించినప్పుడే వాళ్ళ బంధం నెక్స్ట్ లెవెల్ కి దారి తీస్తుంది. మీ అప్డేట్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
మీ
=>విక్కీ<=