Thread Rating:
  • 13 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance "అతి"మధురం
#14
5.అలక
స్నానం చేసి టవల్ తో బయటకి వచ్చాడు అభి...అతన్ని అలా చూడగానే బయటకి పరిగెత్తబోయిన రియా చెయ్యి పట్టుకుని తన వైపు కి లాక్కున్నాడు......రియా వెళ్ళి అభి ని గుద్దింది....తన రెండు చేతులతో తనని బంధి చేస్తూ.....ఏంటోయ్ పారిపోతున్నావ్...ఏదో తెల్చుకుందామని వచ్చినట్టున్నావ్...తేల్చుకుని పో......అన్నాడు.....

"నేను ఏమీ తేల్చుకోడానికి రాలేదు....నన్నొదిలేస్తే నేనెళ్ళిపోతాను........."అంది రియా

"అవునా సరే వెళ్ళిపో..."అని వెంటనే వదిలేసాడు అభి......అతను అలా వదిలేస్తాడని ఊహించని రియా అలానే అతన్ని చూస్తూ నిల్చుండిపోయింది...

"ఓయ్ మొద్దు వదిలేసాను....ఇక పో..."అన్నాడు అభి

ఈ లోకం లోకి వచ్చిన రియ వెంటనే బయటకి పరిగెత్తింది.........

"దేవుడా ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది......."అనుకుంటూ ఇంట్లోకి నడిచింది...కానీ అభి మీద కోపం మాత్రం పోలేదు.......

సమయం దొరికినప్పుడు అడగాలి అనుకుని సమయం కోసం ఎదురు చూడసాగింది........అనుకున్నట్టు గానే సమయం రానే వచ్చింది.......

ఒకరోజు రియా అభి రూం లోకి వెళ్ళగానే ఏదో రాస్కుంటూ కనిపించాడు అభి....

ఇదే కరెక్ట్ టైం అని భావించిన రియా లోపలికి అడుగుపెడుతూనే......లోపలికి వస్తున్న రియా ని చూసిన అభి బుక్ మూసేశాడు....

రియా కి అనుమానం వచ్చినా తను వచ్చిన మ్యాటర్ అది కాదని గ్రహించి........

"అభి నీతో కొంచెం మాట్లాడాలి..."అంది

"హా చెప్పు రియా...."అన్నాడు అభి తన వైపు చూస్తూ

"అది...నేను మీ కాలేజ్ అస్సలు పెట్టుకోలేదు......కానీ నాకు మీ కాలేజ్ ఏ వచ్చింది......దీనికి కారణం నువ్వని నాకు తెల్సు కానీ........ఎందుకిలా చేశావ్ అభి......?నువ్విలా చేయడం నాకస్సలు నచ్చలేదు....నాకంటూ సొంతం గా ఇష్టాలు ఆలోచనలు వుండవా...?అసలు నువ్వు అవి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావ్......ఎందుకిలా టార్చార్ చేస్తున్నావ్.....అసలు ఏమనుకుంటున్నావ్.....?నువ్వు మీ కాలేజ్ పెట్టడం వల్ల నాకేదొ ఉపకారం చేస్తున్నావనుకుంటున్నావేమో....అస్సలు కాదు....ఇప్పుడు చెబుతున్నా విను నాకస్సలు చదువు అంటే ఇష్టం లేదూ...కానీ చదివాను ఎందుకో తెల్సా కేవలం కేవలం నీకు దూరంగా వుండాలి అనే...నా కష్టానికి ప్రతిఫలం దక్కకుండా చేసావ్...నీ ఉపకారం ఎప్పటికి మర్చిపోను......ఇప్పటి నుంచు నువ్వు నాకు అభి వి కాదు అభిమన్యు వి.......నీకు నాకు ఎలాంటి పరిచయం లేదు........కాలేజ్ లో ఇలానే వుండాలి....నీతో బైక్ పై కాలేజ్ కి వెళ్లమంటారు అమ్మ వాళ్ళు....నువ్వు నన్ను బైక్ పై తీసుకెళ్ళి బస్టాండ్ లో దింపాలి..మళ్ళీ బస్టాండ్ లో ఎక్కించుకుని తీసుకురావాలి....నాతో కాలేజ్ లో అస్సలు మాట్లాడానికి ట్రై చేయకూడదు......నా క్లాస్ ల బయట తిరిగకూడదు......ఇవన్నీ నువ్వు చేస్తేనే నేను నీతో ఒకటి అరా అయినా మాట్లాడతా లేకపొతే అది కూడా మాట్లాడను ఇక నీ ఇష్టం..."అని లేచి వెళ్ళిపోయింది రియా

తను చెప్పింది విన్న అబీ మనసు విరిగిపోయింది

కాలేజ్ మొదటి రోజు....

చెప్పినట్టుగానే బస్టాండ్ లో రియా ని దించేసి అభి వెళ్ళిపోయాడు కాలేజ్ కి.....ఒక అరగంట గడిచాక రియా కూడా కాలేజ్ చేరింది.......ఫస్ట్ డే కావడం తో సీనియర్స్ అంతా జూనియర్స్ కోసం వెయిట్ చేస్తూ వున్నారు.......

రియా కాలేజ్ లోకి అడుగుపెట్టడం తోనే అభి వాళ్ల బ్యాచ్ లో వాళ్ళు రియా ని పిల్చారు......

రియా వినిపించుకోకుండా వెళుతుండగా....ఈ లోపు అభి మాటలు వినిపించాయి తనకి

"రేయ్...తనని పిలవొద్దు.....పిలిస్తే బాగోదు చెబుతున్నా తనని అలా వెళ్ళనివ్వండి..."అని అభి అంటున్నాడు....ఆ మాటలు వినడం తోనే రియా ముందుకు వెళ్ళేది కాస్త వాళ్ళ దగ్గరికి వచ్చింది....

వాళ్లలొ ఒకడు..."నిన్ను కాదులే చెల్లమ్మా నువ్వెళ్ళు..."అని అన్నాడు....

"ఎందుకు సార్ మీరు నన్ను ర్యాగింగ్ చేయరా...?"అడిగింది రియా

అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు..."ఏంటీ అమ్మాయి...ర్యాగింగ్ చేయరా అని అడుగుతుందేంటి...?"అని ఆశ్చర్యం లో వుండగా

ఒకడు తేరుకుని..."లేదు నువ్వెళ్ళమ్మా.."అన్నాడు
"పర్లేదు సార్ చెయ్యండి"అంది రియా......ఒక వైపు అభి ముఖం లో మారుతున్న రంగులు చూస్తూ

ఇంకో అతను చేతులు జోడిస్తూ..."తల్లీ నీ వరస చూస్తుంటే నువ్వే ర్యాగింగ్ చేయించుకోని వెళ్ళి మా మీద కంప్లెయింట్ ఇచ్చేటట్టున్నావ్....మాకంత బంపర్ ఆఫర్ వద్దులేమ్మా...నీకు దండం పెడతాం వెళ్ళమ్మా..."అని వేడుకునేసరికి...."మీ బ్యాడ్ లక్..."అని ముందుకు కదిలిందో లేదో......

ఒక అబ్బాయి వచ్చి రియా ఎదురుగా మోకాలి మీద కూర్చుని.......చేతిలోని గులాబి రియా కి అందిస్తూ

"నిన్ను చూసిన క్షణం .....నా మనసు నన్నొ మాట అడిగింది....ఇన్నాళ్ళు నువ్వు లేని నేను ఎలా బతికి వున్నాను అని....అప్పుడు నేను చెప్పాను దానికి... ఇన్నాళ్ళ నా వెతుకులాటకి ,వేదనకి దొరికిన ప్రతిఫలం నీవు....ఇప్పటి దాకా ఎలా బతికానో తెలియని నేను....ఇక మీదట నువ్వు లేక ఎలా బతుకుతానో తెలియట్లేదు...చిత్రంగా వున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా...నువ్వు లేపోతే బతకను అని నేను చెప్పను...కానీ ఆ బతుకు లో ఆనందం వుండదు....బాధ తప్ప.....

ప్రేమ వుండదు వేదన తప్ప.......ఐ లవ్ యూ....."

అతని మాటలు వింటున్న రియా అలానే చూస్తుండిపోయింది........!!!!!

అదే మాటలు విన్న అభి.....అతని వైపు కోపంగా వస్తున్నాడు...అతన్ని చూసిన రియా......ఎదురుగా వున్న అబ్బాయి చేతిలోని రోజా పువ్వు తన చేతిలోకి తీస్కుని అతని కళ్ళ లోకి చూస్తూ నవ్వింది.........ఆ నవ్వు చూసిన అభి....నిల్చున్న చోటే స్థానువై పోయాడు.........

అక్కడి నుంచి విసురుగా వచ్చేసి తన క్లాస్ వైపు నడిచాడు........కంట్లోంచి నీళ్ళు వస్తుండగా ఎదురుగా వున్న దారి మసక బారింది...........

అలానే ఏడుస్తూ తన ప్లేస్ కి వెళ్ళి కూర్చున్నాడు అభి.....

చెప్పలేనంత బాధ తీరని మనోవేధన మనసును తొలుస్తుండగా .....జరిగిన క్లాస్లేవీ బుర్ర లోకి ఎక్కట్లేదు.......మనసులో ఒక్కటే ఆలోచన......"రియా..."

అలా ఉదయం కాస్తా మధ్యాహ్నం అయ్యింది..........బెంచ్ పై తల వాల్చి పడుకొని వున్నాడు అభి....అప్పుడు తన దగ్గరికి వచ్చింది షాలిని.........అభి వాళ్ళ క్లాస్ మేట్

"ఏంటి...అభి....ఎమైంది ఎందుకలా వున్నావ్...?"అన్న మాట కి లేచి....షాలిని వైపు చూసిన అభి....ఏం లేదు అని క్లాస్ బయటకి వచ్చేశాడు.......ఏం చెయ్యాలి...?ఎక్కడికి వెళ్ళాలో తెలియక కారిడార్ లో తిరుగుతూ రియా వాళ్ల క్లాస్ వైపు గా వెళ్ళాడు అన్యమనస్కంగా.......

వాళ్ల క్లాస్ లోంచి నవ్వులు వినిపిస్తున్నాయి.........ఆ నవ్వు ఎవరిదా అని చూసిన అభి మనసు వికలమైపోయింది...

ఉదయం రియా కి ప్రపోస్ చేసిన అబ్బాయి తో రియా మాట్లాడుతూ నవ్వుతోంది......

అలా రియా ని చూసిన అభి కి అక్కడ ఒక్క నిమిషం కూడా వుండాలనిపించక వచ్చేశాడు.........

ఆ సాయంత్రం.....రియా ని బస్టాప్లో ఎక్కించుకోవడానికి వెళ్తున్నాడు అభి.......బస్టాప్ లో ఒంటరిగా వెయిట్ చేస్తుంది రియా......ఎందుకో రియా ముఖం చూడగానే అప్పటిదాకా మనసులో వున్న బాధ,వేదన ఒక్కసారిగా పోయాయి........వెంటనే తన వైపు వెళ్ళడానికి స్పీడ్ పెంచిన అభి.....రియా వద్దకి ఆ అబ్బాయి రావడం తో........అదే స్పీడ్ తో రియా చూస్తుండగానే ముందుకు వెళ్ళిపోయాడు......

ఇంటికి చేరిన అభి....బాధలో....తన రూం కెళ్ళి నిద్రపోయాడు.......టైం 7 అవుతుండగా....ఎవరో తన తలుపు తడుతున్నారు.........ఆ శబ్దం వినపడినా వినిపించనట్టు దిండు అడ్డం పెట్టుకుని నిద్రపోసాగాడు.......అయినా తలుపు తడుతున్నవారు తడుతూనే వుండటంతో........ఇక తప్పక......వెళ్ళి తలుపు తీశాడు...ఎదురుగా వాళ్ళమ్మ తో పాటు రియా వాళ్లమ్మ....కూడా కనిపించింది......

"ఏమైంది.....?"కళ్ళు నులుముకుంటూ ప్రశ్నించాడు అభి.....

"రియా ఏది........?"అడిగింది వాళ్ళమ్మ.......

అంతే...రియా రాలేదు అని అర్థమయి పోయిన అభి...బైక్ కీస్ తీసుకుని మారు మాట్లాడకుండా బయటకి పరుగు తీసి బైక్ స్టార్ట్ చేసి 10 నిమిషాల్లో బస్టాప్ కి పోనిచ్చాడు.......ఒంటరిగా కూర్చోని కనిపించింది రియా.......

అభి ని చూడడం తోనే తన ముఖం లో రిలీఫ్ వచ్చిన మరుక్షణం కోపం కూడా రీప్లేస్ అయ్యింది.........
"రియా...రా వెళ్దాం..."అని అభి అనేసరికి........లేచి వచ్చి బైక్ పై కూర్చుంది.....ఇద్దరి మధ్యా మౌనం.....రియా ఏమైనా అడిగితే సమాధానం చెపుదామని అభి...

అభి ఏమైనా మాట్లాడితే తిట్టెయాలి అని రియా ఎవరికి వాళ్ళు మౌనంగా ప్రయాణం ముగించారు.......

అలా వారం రోజులు గడిచాయి......ఇద్దరి మధ్య మాటలు లేవు........ఈ మౌనం అభి ని కుంగదీస్తుంది.....

వారం కాస్తా 4 వారాలు అయిపోయాయి.......ఎగ్జాంస్ మొదలయ్యాయి.......ఇంతకు ముందు లా అభి దగ్గరకి వచ్చి చదువుకొవట్లేదు రియా.....

అభి-రియా ఒకే హాల్లో పడ్డారు......రియా ఏమి రాయకపోవడం అభి గమనించాడు...2 పరీక్షలకి అదే తంతు....రియా హాల్లో కి కి రావడం...పేపర్ తీసుకోవడం బెంచ్ పై పడుకుని నిద్రపోవడం........

తన వైఖరి చూసి విసుగెత్తిపోయిన అభి......ఆ రోజు సాయంత్రం రియా వాళ్లింటి కి వెళ్ళాడు......

అభి ని చూసిన రియా కూడా పెద్ద ఆశ్చర్యపోలేదు.........

అభి ఇంపార్టెంట్ క్వశ్చింస్ చెప్పి...చదవమని తన ల్యాప్ టాప్ లో ఏదో చూస్కోసాగాడు........మధ్య మధ్యలో నవ్వుతున్నాడు.....అదంతా రియా ఒక కంట గమనిస్తూనే వుంది.......సరిగ్గా అభి ఏమైనా తినటానికి తీసుకువద్దామని కిందకి వెళ్ళేసరికి చిక్కిందే సంధు అని భావించిన రియా అభి ల్యాప్ టాప్ లోకి చూసి,...........షాక్ అయ్యింది!!!!!!!!
[+] 2 users Like అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: "అతి"మధురం - by coolsatti - 07-11-2018, 09:52 PM
RE: "అతి"మధురం - by raaki86 - 07-11-2018, 09:58 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 07-11-2018, 10:46 PM
RE: "అతి"మధురం - by Mohana69 - 07-11-2018, 11:09 PM
RE: "అతి"మధురం - by vickymaster - 07-11-2018, 11:59 PM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 11:05 AM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 11:26 AM
RE: "అతి"మధురం - by అన్నెపు - 08-11-2018, 01:29 PM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 01:54 PM
RE: "అతి"మధురం - by vickymaster - 08-11-2018, 03:24 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 08-11-2018, 04:07 PM
RE: "అతి"మధురం - by prasad_rao16 - 08-11-2018, 08:02 PM
RE: "అతి"మధురం - by raaki86 - 09-11-2018, 06:31 AM
RE: "అతి"మధురం - by tvskumar99 - 09-11-2018, 12:43 PM
RE: "అతి"మధురం - by vickymaster - 09-11-2018, 03:20 PM
RE: "అతి"మధురం - by vickymaster - 09-11-2018, 08:22 PM
RE: "అతి"మధురం - by raaki86 - 09-11-2018, 10:27 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 09-11-2018, 10:53 PM
RE: "అతి"మధురం - by vickymaster - 10-11-2018, 03:33 PM
RE: "అతి"మధురం - by utkrusta - 10-11-2018, 04:21 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 10-11-2018, 05:04 PM
RE: "అతి"మధురం - by Thiru8855 - 10-11-2018, 08:26 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 11-11-2018, 10:47 AM
RE: "అతి"మధురం - by mahesh477 - 12-11-2018, 11:11 AM
RE: "అతి"మధురం - by tvskumar99 - 12-11-2018, 11:28 AM
RE: "అతి"మధురం - by vickymaster - 12-11-2018, 11:39 AM
RE: "అతి"మధురం - by saleem8026 - 12-11-2018, 11:40 AM
RE: "అతి"మధురం - by Nikhil noel - 12-11-2018, 01:58 PM
RE: "అతి"మధురం - by utkrusta - 12-11-2018, 02:30 PM
RE: "అతి"మధురం - by Nikhil noel - 12-11-2018, 10:44 PM
RE: "అతి"మధురం - by vickymaster - 12-11-2018, 11:32 PM
RE: "అతి"మధురం - by raaki86 - 12-11-2018, 11:44 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 13-11-2018, 08:14 AM
RE: "అతి"మధురం - by saleem8026 - 13-11-2018, 01:30 PM
RE: "అతి"మధురం - by saleem8026 - 23-11-2018, 04:21 PM
RE: "అతి"మధురం - by SanthuKumar - 24-11-2018, 10:47 AM
RE: "అతి"మధురం - by SanthuKumar - 24-11-2018, 12:04 PM
RE: "అతి"మధురం - by Dpdpxx77 - 24-11-2018, 06:18 PM
RE: "అతి"మధురం - by Chandra228 - 24-11-2018, 09:41 PM
RE: "అతి"మధురం - by krish - 25-11-2018, 11:03 AM
RE: "అతి"మధురం - by SanthuKumar - 01-12-2018, 07:30 PM
RE: "అతి"మధురం - by Uma_80 - 10-12-2018, 03:06 PM
RE: "అతి"మధురం - by Kd2016 - 25-12-2018, 04:57 PM
RE: "అతి"మధురం - by SHREDDER - 26-12-2018, 07:03 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 02-01-2019, 01:49 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 02-01-2019, 01:52 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 08-01-2019, 11:17 PM
RE: "అతి"మధురం - by sri7869 - 08-03-2024, 09:57 AM



Users browsing this thread: 5 Guest(s)