Thread Rating:
  • 13 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance "అతి"మధురం
#13
4.ఫ్లాష్ బ్యాక్ లో...?
"మన విషయమేంటి....?అభి....?నాకేమి అర్థం కాలేదు....."టెన్షన్ పడుతూ అడిగింది రియా

"ఏం లేదులే ఇల్లు వచ్చింది దిగు....."అనేసరికి దిగేసి వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది రియా

ఆ మరుసటి రోజు పేపర్ లో మెయింస్ కీ పడటంతో తన దగ్గరున్న అభి క్వశ్చిన్ పేపర్ లోని ఆంసర్స్ పేపర్ లో పడిన వాటితో పోల్చి చూసింది......300 మార్క్స్ వస్తున్నాయి 360 కి.......ఆ మార్కులు చూసిన రియా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.......

అభి కి పక్కాగా ఐ ఐ టి లో సీట్ వస్తుంది అంటే తను ఏ డిల్లీ కో ముంబయ్ కో వెళ్ళిపోతాడు....యాహూ అని ఆనందపడిపోయింది......

రియా వాళ్ళమ్మమ్మ హాలిడేస్ కి రమ్మని ఒత్తిడి చేయడం తో అభి నుంచి అభి టార్చర్ నుంచి దూరంగా వుండొచ్చు అని అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడి అభి కి మాత్రం తెలియకూడదని తెలిస్తే తను ఎక్కడ వచ్చేస్తాడో అని ఉదయం 4:00 గంటల కే బస్ ఎక్కుదామని నిర్ణయించుకుంది.....

"ఇంత పొద్దున్నే ఎందుకే...?"అంది వాళ్లమ్మ

"లేదమ్మా వెళ్లాలి..........అమ్మమ్మ ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా వుంది..."అని చెప్పింది రియా

"ఏంటో నే నువ్వు ఒక్కోసారి ఒక్కోలా వుంటావ్...!సరే పద బయటకి "అని ఇద్దరూ బయటకి నడిచారు.....

వాళ్లిద్దరు బయటకి వచ్చేసరికి అభి గుమ్మం లో బైక్ తో సిద్ధంగా వున్నాడు......షాక్ అయ్యి అలానే చూస్తుండిపోయింది రియా

"మీ నాన్న కి చెబితె ఇంత పొద్దున్నే నా వల్ల కాదన్నారు...అందుకే అభి ని పంపించింది మీ ఉష ఆంటి...."అని చెప్పింది వాళ్లమ్మ

"ఐతే సరే నన్ను బస్టాండ్ లో దింపమను అభి ని...."అభి వైపు చూడకుండా వాళ్ళమ్మ తో చెప్పింది రియా

"అమ్మొ ఇంకేమైనా వుందా పేపర్లో చదవట్లేదా ఏంటి...ఎందుకు తల్లీ రోజులస్సలే బాలేవు......అయినా 2 గంటల ప్రయాణం ఏ కదా...?ఇద్దరూ వెళ్ళి వచ్చేయండి..."అంది వాళ్ళమ్మ

"వెళ్ళి వచ్చేయాలా...అంటే ఏంటి అభి కూడా నాతో పాటు అక్కడ వుంటాడా...?"అనుమానంగా అడిగింది రియా

"హా అవును....అభి కి కూడా రిఫ్రెష్ అయినట్టు వుంటుంది అసలే ఎగ్జాం బాగా రాయలేదని బాధ లో వున్నాడు తను....."అంది సర్ది చెబుతూ వాళ్ళమ్మ

"అలా ఐతే నేనక్కడికీ వెళ్లను...."అని విసురుగా లోపలికి వెళ్ళి తన గది లోకి అడుగుపెట్టి తలుపేసుకుంది రియా

2 రోజుల తర్వాత.....

ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తా అని చెప్పిన రియా అటు నించి అటు వాళ్ళమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళి అక్కడ నుంచి ఫోన్ చేసి చెప్పించింది.........రియా ఎందుకిలా ప్రవర్తిస్తుందో వాళ్ళమ్మ కి అర్థం కాలేదు.....

కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి ఫోన్ రావడం తో తప్పక ఇంటికి బయల్దేరింది రియా.......

ఇంటికి వెళ్ళడం తోనే ఉష అత్త మళ్ళీ వాళ్ళింటి లోకి లాకెళ్లింది రియా ని.......

"బాబోయ్ మళ్ళీ ఏం చేశాడో..."అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది రియా

"ఏమయ్యింది ఆంటి....?"టెంషన్ తట్టుకోలేక అడేగేసింది ఆకరికి

"ఇవాళ మెయింస్ రిసల్ట్స్ వచ్చాయి.....అభి క్వాలిఫై కాలేదు......అది తెల్సి రూం కెళ్ళి తలుపేసుకున్నవాడు 5 గంటలవుతున్నా బయటకి రాలేదు......పిల్చినా పలకట్లేదు....మీ ఇంట్లో నుంచి వాడి రూం లోకి చూస్తే ఏడుస్తూ కనిపించాడు ఏం చెయ్యాలో అర్థం కాక నిన్ను రమ్మాన్నాము....నువ్వంటే వాడికి చాలా ఇష్టం కదా కనీసం అలా అయినా బయటకి వస్తాడేమొ అని......"గుక్క తిప్పుకోకుండా చెప్పింది ఆవిడ

తను వింటుంది నిజమేనా అనిపించింది రియా కి 300 మార్క్స్ వచ్చే తను క్వాలిఫై కాకపోవడం ఏంటి...?ఎక్కడో ఏదో అయ్యింది......అని అనుకుంటూ తలూపి......అభి రూం కి వెళ్ళి తలుపు తట్టి....."అభి..."అని పిలవడం ఆలశ్యం రూం తలుపు తెరుచుకుంది.........
లోపల వున్న అభి...ఎవరూ రావొద్దు...రియా తప్ప అనేసరికి ఎవ్వరూ లోపలికి వెళ్ళె సాహసం చేయలేదు......

లోపలికి వెళ్ళిన రియా కి అభి కనిపించలేదు.....ఎక్కడున్నాడా అని వెతుకుతుండగా...వెనకి నుంచి రెండు చేతులు రియా ని చుట్టెశాయి ....ఒక్క నిమిషం ఊపిరి ఆగినంత పనయ్యింది రియా కి

విసురుగా అభి నుంచి దూరం జరిగింది.......

"అభి....ఏం చేస్తున్నావ్...?"అంది కోపంగా........

అభి రియా కి దగ్గరగా రా సాగాడు...రియా వెనక్కి అడుగులు వేయసాగింది.......అభి ముందుకి రియా వెనక్కి జరుగుతూ చివరికి రియా వెనక్కి వెళ్ళే ఆస్కారం లేకుండా గోడ అడ్డం వచ్చేసరికి ఆగిపోయింది......తనకి దగ్గరగా జరిగిన అభి.......తన జుట్టు ని సరి చేయసాగాడు......తన బుగ్గ ని తన చేత్తో తాకుతూ......."ఐ మిస్ యూ......"అని చెప్పి దూరం జరిగాడు......

అప్పటి దాకా భారంగా తీసుకున్న శ్వాస తేలికపడటం తో ధైర్యం తెచ్చుకుని....."నువ్వెందుకు క్వాలిఫై అవ్వలేదు.....?"అడిగింది రియా

"బాగా రాయలేదు సొ అవ్వలేదు..."లైట్ గా చెప్పాడు అభి

"అబద్ధం చెప్పకు అభి.....నువ్వు బాగా రాశావ్ నీకు 300 మార్క్స్ వస్తాయ్...నీ పేపర్ నా దగ్గర వుంది....నేను కాలిక్యులేట్ కూడా చేశాను..."అంది రియా

"ఆ కీ తప్పేమొ....!"అన్నాడు అభి...

"నిజం చెప్పు...అభి..."అడిగింది రియా

"హిం.....బాగా రాద్దాము అనే నేనూ అనుకున్నాను...కానీ ఎగ్జాం రాసేటప్పుడు నాకోటి అనిపించింది...అందుకే ఆంసర్స్ వచ్చినా తప్పు గా పెట్టాను..."అన్నాడు బెడ్ మీద కూర్చుంటూ అభి

"ఏమి అనిపించింది.......?"అర్థం కాక అడిగింది రియా

"ఒకవేళ నేను క్వాలిఫై అయితే అడ్వాంస్ లో క్వాలీఫై కాకపోయినా నాకు నిట్ లో సీట్ వస్తుంది.......ఇక్కడెక్కడా ఐఐటి కానీ నిట్ కానీ లేవు......నీకు దూరం గా వుండాలి......సో ఇవన్నీ ఆలోచించి......ఐఐటి లైట్ తీసుకున్నా.."అన్నాడు అభి

"నీకేమైనా పిచ్చా....ఐఐటి లైట్ తీసుకోవడం ఏంటి.......?ఐ డోంట్ ఎక్స్ పెక్ట్ దిస్ ఫ్రం యూ అభి..."అని విసురుగా బయటకి వచ్చేసింది రియా

రియా బయటకి రావడం తోనే....

"ఏమ్మా ఎలా వున్నాడు వాడు..."అడిగింది వాళ్ళమ్మ టెంషన్ గా

"బానే వున్నాడు....ఎంసెట్ వుంది కదా,....లైట్ తీసుకుంటాడు లే ఆంటి.....మీరు వర్రీ అవ్వకండి...."అని చెప్పి ఇంటికి కదిలింది రియా

అనుకున్నట్టు గానే ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది అభి కి......"హమ్మయ్య "అనుకుంది రియా

కానీ అభి కి వచ్చిన కాలేజ్ చూసి నీరస పడిపోయింది......అభి కి మంచి కాలేజ్ ఏ వచ్చింది కానీ ఆ కాలేజ్ వాళ్ళ వూరికి చాలా దగ్గరలో వుంది......అభి హాస్టల్ లో వుండి చదువుకుంటాడు అని ఆశలు పెట్టుకున్న రియా కి నిరాసే మిగిలింది.......

ఇక ఇలా కాదని తనే దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది.........

అనుకున్నట్టుగానే చాలా కష్టపడి చదివింది.....కాదు కాదు అభి చదివించాడు.........తనకి కూడా ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది.....అభి వాళ్ల కాలేజ్ తప్ప అన్నీ కాలేజ్ లూ ఆప్షంస్ పెట్టుకుంది...కానీ తనకి చిత్రంగా అభి వాళ్ల కాలేజ్ లో సీట్ వచ్చింది........

తనకి సేం కాలేజ్ లో సీట్ రావడం తో ఇద్దరి పేరేంట్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి........

కానీ రియా కి మాత్రం చాలా కోపం వచ్చింది.....ఆవేశం తో వూగిపోతూ తాడో పేడొ తేల్చుకుందాం అని అభి వాళ్ళింటికి వెళ్ళి...అతని రూం లోకి అడుగుపెట్టింది..........

రూం లో ఎవరూ లేరు..........

రూం అంతా కలియ తిరుగుతూ వుండగా....????
[+] 2 users Like అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: "అతి"మధురం - by coolsatti - 07-11-2018, 09:52 PM
RE: "అతి"మధురం - by raaki86 - 07-11-2018, 09:58 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 07-11-2018, 10:46 PM
RE: "అతి"మధురం - by Mohana69 - 07-11-2018, 11:09 PM
RE: "అతి"మధురం - by vickymaster - 07-11-2018, 11:59 PM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 11:05 AM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 11:26 AM
RE: "అతి"మధురం - by అన్నెపు - 08-11-2018, 01:24 PM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 01:54 PM
RE: "అతి"మధురం - by vickymaster - 08-11-2018, 03:24 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 08-11-2018, 04:07 PM
RE: "అతి"మధురం - by prasad_rao16 - 08-11-2018, 08:02 PM
RE: "అతి"మధురం - by raaki86 - 09-11-2018, 06:31 AM
RE: "అతి"మధురం - by tvskumar99 - 09-11-2018, 12:43 PM
RE: "అతి"మధురం - by vickymaster - 09-11-2018, 03:20 PM
RE: "అతి"మధురం - by vickymaster - 09-11-2018, 08:22 PM
RE: "అతి"మధురం - by raaki86 - 09-11-2018, 10:27 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 09-11-2018, 10:53 PM
RE: "అతి"మధురం - by vickymaster - 10-11-2018, 03:33 PM
RE: "అతి"మధురం - by utkrusta - 10-11-2018, 04:21 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 10-11-2018, 05:04 PM
RE: "అతి"మధురం - by Thiru8855 - 10-11-2018, 08:26 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 11-11-2018, 10:47 AM
RE: "అతి"మధురం - by mahesh477 - 12-11-2018, 11:11 AM
RE: "అతి"మధురం - by tvskumar99 - 12-11-2018, 11:28 AM
RE: "అతి"మధురం - by vickymaster - 12-11-2018, 11:39 AM
RE: "అతి"మధురం - by saleem8026 - 12-11-2018, 11:40 AM
RE: "అతి"మధురం - by Nikhil noel - 12-11-2018, 01:58 PM
RE: "అతి"మధురం - by utkrusta - 12-11-2018, 02:30 PM
RE: "అతి"మధురం - by Nikhil noel - 12-11-2018, 10:44 PM
RE: "అతి"మధురం - by vickymaster - 12-11-2018, 11:32 PM
RE: "అతి"మధురం - by raaki86 - 12-11-2018, 11:44 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 13-11-2018, 08:14 AM
RE: "అతి"మధురం - by saleem8026 - 13-11-2018, 01:30 PM
RE: "అతి"మధురం - by saleem8026 - 23-11-2018, 04:21 PM
RE: "అతి"మధురం - by SanthuKumar - 24-11-2018, 10:47 AM
RE: "అతి"మధురం - by SanthuKumar - 24-11-2018, 12:04 PM
RE: "అతి"మధురం - by Dpdpxx77 - 24-11-2018, 06:18 PM
RE: "అతి"మధురం - by Chandra228 - 24-11-2018, 09:41 PM
RE: "అతి"మధురం - by krish - 25-11-2018, 11:03 AM
RE: "అతి"మధురం - by SanthuKumar - 01-12-2018, 07:30 PM
RE: "అతి"మధురం - by Uma_80 - 10-12-2018, 03:06 PM
RE: "అతి"మధురం - by Kd2016 - 25-12-2018, 04:57 PM
RE: "అతి"మధురం - by SHREDDER - 26-12-2018, 07:03 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 02-01-2019, 01:49 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 02-01-2019, 01:52 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 08-01-2019, 11:17 PM
RE: "అతి"మధురం - by sri7869 - 08-03-2024, 09:57 AM



Users browsing this thread: 6 Guest(s)