Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.55%
633 87.55%
Good
9.82%
71 9.82%
Bad
2.63%
19 2.63%
Total 723 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 162 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
సుందర్ ప్రేతాత్మ రేణుక కాలుని అలాగే పట్టుకుని ఆ బావి దగ్గర నుండి దూరంగా తీసుకెళ్ళి కింద పడేసింది.
కింద పడిన రాము లేచి సుందర్ ప్రేతాత్మ రేణుకను తీసుకెళ్ళిన వైపు పరిగెత్తాడు….కాని అక్కడంతా గదులు గదులుగా ఉండటంతో రేణుక ఎక్కడున్నదో రాము కనిపెట్టలేకపోతున్నాడు.
దాంతో రాము, “రేణుకా…..రే….ణూ,” అంటూ గట్టిగా అరుస్తూ ఆ గదుల్లో ఒక్కొక్కదానిని వెదుకుతున్నాడు.
ఆ గదుల గోడల మీద పైకప్పు లేకపోయే సరికి పైన వెన్నల బాగా ఉండటంతో లైట్ అవసరం లేకుండా రాము అంతా వెదుకుతున్నాడు.
కాని సుందర్ ప్రేతాత్మ మాత్రం రేణుకని అలాగే గాల్లోనే ఉంచి తీసుకెళ్తున్నాడు….రేణుక ఎంత గుంజుకున్నా ఫలితం ఉండటం లేదు.
చివరకు రేణుకని ఆ బావి నుండి చాలా దూరం తీసుకొచ్చి కింద పడేసి ఆమె మెళ్ళో ఉన్న లాకెట్ పట్టుకుని పైకి రేణుకని పైకి లేపి అక్కడ నుండి ఇంకొద్ది దూరం ఈడ్చుకెళ్తున్నాడు.
రేణుక తన మెళ్ళోని లాకెట్ ని పట్టుకున్న సుందర్ ప్రేతాత్మ చేతిని పట్టుకుని అతని పట్టు నుండి విడిపించుకోవాలని విపరీతంగా ట్రై చేస్తున్నది.
అలా సుందర్ ప్రేతాత్మ నుండి విడిపించుకోవాలని ట్రై చేస్తున్న రేణుకకి దర్గాలో సూఫీ బాబా ఇచ్చిన పవిత్ర జలం సీసా గుర్తుకొచ్చి వెంటనే తన చేతిని కోటు జేబులోకి పోనిచ్చి ఆ గాజు సీసాను తీసుకుని అందులో ఉన్న నీళ్ళను సుందర్ ప్రేతాత్మ మీద చల్లింది.
[Image: 47318045_895709080818782_150521866666744...e=5C722C62]
దాంతో సుందర్ ప్రేతాత్మ తన మీద రేణుక చల్లిన నీళ్ళు పడగానే ఆ బాధ భరించలేనట్టు గట్టిగా అరుస్తూ రేణుకని వదిలి ఎవరో బలంగా తోసినట్టు దూరంగా పోయి పడ్డాడు.
అది చూసి రేణుక అక్కడ నుండి లేచి ఆ గోడల మధ్యలో తనకు తోచిన వైపు పరిగెత్తుతూ ఉన్నది.
అలా పరిగెత్తి పరిగెత్తిన ఆమెకు దారి కనిపించక ఎటు చూసినా గోడలు కనిపించే సరికి ఒక చోట ఆగిపోయి అలుపు తీర్చుకుంటున్నది.
ఇక్కడ రాము కూడా రేణుక కనిపించకపోతే సరికి అతను కూడా ఆ గోడల మధ్యలో ఆమె కోసం వెదుకుతూ పిచ్చెక్కినట్టు పరిగెత్తుతున్నాడు.
అలా పరిగెత్తుతున్న రాముకి కూడా గోడలు కనిపించడంతో ఎటు వెళ్లాలో తెలియక….ఇంకో వైపు రేణుక ఎక్కడున్నదో కనిపించక పోవడంతో పిచ్చెక్కినట్టు అయిపోతున్నది.
ఇటు వైపు రేణుక కూడా అలుపు తీర్చుకుని గోడల మధ్యలో పరిగెత్తుతున్నది….ఆమె అలా గోడల మధ్యలో మలుపు తిరగగానే సుందర్ ప్రేతాత్మ అక్కడ తన రఘుతో ఒక గోడ కట్టేస్తున్నది.
అంతలో అలా ముందుకు పరిగెత్తిన రేణుకకి దారి కనిపించకపోవడంతో మళ్ళీ వెనక్కు వచ్చిన ఆమెకు అప్పుడే సుందర్ ప్రేతాత్మ కట్టిన గోడ కనిపించడంతో ఆమెకు ఏమీ అర్ధం కాక ఇంకో వైపుకు పరిగెత్తుతున్నది.
ఇటు వైపు రాము కూడా అలా గోడల మధ్యలో మలుపు తిరగగానే సుందర్ ప్రేతాత్మ వెంటనే అతని వెనకాల ఒక గోడ కట్టేసున్నది.
దాంతో వెనక్కు వచ్చిన రాము ఇంతకు ముందు లేని గోడ అక్కడ కనిపించడంతో రాము ఎటు వెళ్లాలో తెలియక నాలుగు వైపులా కనిపిస్తున్న గోడల వైపు చూస్తున్నాడు.
రేణుక కూడా అలా గోడల మధ్యలో పరిగెత్తుకుంటూ వచ్చి చుట్టూ గోడలు ఉండటంతో ఎటు వెళ్ళాలో తెలియక భయంతో, “రాము…రా….మూ….” అని కేకలు పెడుతున్నది.
అలా భయంతో కేకలు పెడుతున్న రేణుకకి ఒక్కసారిగా అంతా నిశబ్దంగా ఉన్నట్టు అనిపించి భయంతో చుట్టూ చూస్తున్నది.
ఆమె చెవులకు అక్కడ కీచురాళ్ళ శబ్దం, పక్కనే ఎవరో గాలి పీలుస్తున్న శబ్దం వినిపించడంతో రేణుక భయంతో తన చేతిలో నీళ్ళు సీసాని గట్టిగా పట్టుకుని చుట్టూ చూస్తున్నది.
[Image: 46946552_895711644151859_506827447831258...e=5CA17371]
అలా భయంతో వణికిపోతున్న రేణుకకు తన పక్కనే ఉన్న గోడలో నుండి రెండు చేతులు బయటకు వచ్చి తన వైపుకు వస్తున్నట్టు ఉండటంతో ఆమె భయంతో వణికిపోతూ ఆ గోడ దగ్గర నుండి ఇంకో గోడ వైపు వెళ్ళి ఆనుకోబోతుండగా ఆ గోడ లోనుండి కూడా రెండు చేతులు వచ్చి రేణుకని పట్టుకోబోయాయి.
కాని రేణుక ఆ చేతులకు దొరక్కుండా తప్పించుకుంటూ దూరంగా పరిగెత్తుతున్నది.
రేణుక అలా ఏ గోడ దగ్గరకు వెళ్ళినా రెండు చేతులు వస్తుండటంతో భయంతో అరుస్తూ ఒక గోడ నుండి ఇంకో గోడ వైపు పరిగెత్తుతూ పిచ్చిపట్టిన దానిలా అరుస్తున్నది.
రేణుక ఒక గోడ దగ్గర ఆగి నిల్చుని భయంగా చూస్తున్నది….అంతలో తన ఎదురూగా ఉన్న గోడ పగులుతున్నట్టు అందులోని ఇటుక రాళ్ళు ఎగిరెగిపడటం చూసి భయంతో ఏం చేయాలో తెలియక అలాగే చూస్తున్నది.
అలా భయంతో నిల్చున్న రేణుకకి సుందర్ ప్రేతాత్మ గట్టిగా అరవడం వినిపించింది.
కాని అంతలో తన ఎదురుగా ఉన్న గోడ పూర్తిగా పడిపోవడంతో అక్కడ సుందర్ ప్రేతాత్మ ఉన్నదనుకుని సీసాలో నీళ్ళు స్ప్రే చేస్తున్నది.
కాని అక్కడ సుందర్ ప్రేతాత్మ కనిపించకపోవడంతో రేణుకు భయపడుతూ చిన్నగా వెనక్కు అడుగులు వేస్తూ గోడకు ఆనుకుని కళ్ళు మూసుకున్నది.
అలా కళ్ళు మూసుకున్న రేణుక తల రెండు వైపులా గోడలో నుండి రెండు చేతులు బయటకు వచ్చి రేణుక గొంతుని పట్టుకున్నాయి.
దాంతో రేణుక తన చేతిలో ఉన్న నీళ్ళ సీసా వదిలేసి భయంతో పెద్దగా అరుస్తూ తన గొంతుని పట్టుకున్న చేతులను తన చేతులతో విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నది.
రేణుక భయంతో వేస్తున్న కేకలు అక్కడక్కడే తిరుగుతున్న రాముకి వినిపించాయి….కాని అక్కడ నుండి వెళ్లడానికి దారి లేకపోవడంతో, “రేణు…..” అని అరుస్తూ ఎలా వెళ్లాలా అని చుట్టూ చూస్తున్నాడు.
ఇక్కడ రేణుక తనను పట్టుకున్న చేతుల బారినుండి తప్పించుకోలేక భయంతో, బాధతో అరుస్తున్నది.
చుట్టూ చూస్తున్న రాముకి అక్కడ మూలగా పొడవాటి వెదురుబొంగులు కనిపించడంతో వాటిల్లో ఒకటి తీసుకుని ఒక చివర పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి వెదురుబొంగు రెండో చివరను గోడకు ఆనించి గాల్లో పైకి లేచి ఆ గోడ మీద నుండి ఇంకో వైపు పడ్డాడు….కాని అక్కడ కూడా రేణుక కనిపించకపోయే సరికి ఆమెను గట్టిగా పిలుస్తూ చుట్టూ చూస్తున్నాడు.
[+] 3 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 28-11-2018, 12:29 PM
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM



Users browsing this thread: MKrishna, XXXII, 48 Guest(s)