28-04-2020, 02:01 PM
(22-03-2020, 12:38 PM)kamal kishan Wrote: చాలా బాగుంది అప్డేట్.
ఒక కథ ఉంది.
ఒకాయన భార్య గయ్యాళి. ఆ గయ్యాళి భార్యకి భర్త ఒక గణేశ భక్తుడు. భార్య సహజంగానే ఒక్క రూపాయి కానీ కనీసం బెల్లం ముక్క కూడా ఇచ్చేది కాదు దేవుడికి పెడదామంటే....
అలాంటిది ఒకసారి బియ్యం పిండి ఇచ్చింది.
బియ్యం పిండితో ఆత్రంగా గణపతి విగ్రహాన్ని చేశాడట. ఆరాధనలు ఆవాహనాలు, మంత్రోచ్ఛారణలూ స్తోత్రపాఠాలూ అన్నీ నిర్వహించి మనసులోనే డీపం పెట్టి నైవేద్యం పెడదామని చూశాడట. కానీ ఏముంది నివేదనకు?! ఏమీ లేదు. దాంతో గణపతి బొజ్జకేసి చూశాడట బొజ్జ నిండుగా ఉంది వెంటనే అక్కడ కొంచెం చిదిమి బొడ్డు లోతుగా చేసి ఆ పిండిని తీసి బుజ్జి బుజ్జి ఉండ్రాళ్ళుగా చేసి నైవేద్యం పెట్టాడట. అలాగే
మంచి కూర తిన్నప్పుడు ఆ రుచిది ఉప్పుదా లేక అన్నీ కలిసి కూరదా...లేక గంటెదా అంటే....ఏమనాలి.
ఈ నైవేద్యాలు అన్నీ అయినా తరువాత గణపతి మాయమయిపోయ్యాడు అనుకోండి అది వేరే విషయం. ఆయన భయ్యం ఆయనది తినడానికి ఏమీ లేదు అంటూ గుటుక్కున మింగేస్తే....
బాగుంది ఈ ఎపిసోడ్.
థాంక్స్ గురూ