03-04-2020, 12:14 PM
(03-04-2020, 11:23 AM)Siva Narayana Vedantha Wrote: 1. Money Heist
నేను నా మొట్టమొదటి సమీక్ష " మనీ హెయిస్ట్/Money heist " అనే స్పానిష్ భాష లోని ఒక టీవీ సిరీస్ మీద రాస్తున్నాను. ఈ సిరీస్ మొదట స్పానిష్ దేశంలో వాళ్ళ బాష లో వచ్చింది. తర్వాత దీనిని Netflix వాడు చూసి ప్రాజెక్ట్ మొత్తాన్ని టేకోవర్ చేసాడు. ఇది అంతర్జాతీయంగా Netflix లో ఎక్కువ జనాలు వీక్షించిన ఆంగ్లేతర భాషా టీవీ సిరీస్ గా రెకార్డులాక్కెకింది.
ఇది ఇప్పటి దాకా 3 భాగాలుగా వచ్చింది. మొదటి రెండు భాగాలలో ఒక కథ. మూడు , నాలుగు భాగాలలో ఇంకో కథ అదే పాత్రలతో జరుగుతుంది. నాలుగవ భాగం 3వ ఏప్రిల్ netflix లో విడుదల అవుతుంది.
దీని కథ ఏమిటంటే ఒక దొంగల మూట వాళ్ళ నాయకుడు అంటే పప్పుచారు/professor కలిసి డబ్బులు దొంగతనం చేద్దాం అనుకుంటారు. మాములుగా డబ్బులు దొంగతనం కోసం ఎవరైనా బ్యాంకులు ఎంచుకుంటారు. కానీ వీళ్ళ పప్పుచారు మహా తెలివైనవాడు కాబట్టి ఏకంగా డబ్బులు ముద్రించే మింట్ పైనే పడతారు. మన దగ్గర అలాంటిది నాసిక్ లో ఉంది. అక్కడ దొంగతనం ఎలా చేశారు ? అందులో వాళ్ళకి ఎదురైనా సవాళ్లు ఏంటి ? వాటిని ఎదుర్కొని విజయవంతంగా దొంగతనం చేశారా అనేది మొదటి రెండు భాగాల కథ.
నేను మొదట చెప్పేది ఏంటంటే ఇది మీరు స్పానిష్ లో చూస్తేనే ఎక్కువ గా కనెక్ట్ అవుతారు. ఆంగ్ల ఉపశీర్షికలతో చూడొచ్చు. ఆంగ్ల అనువాదం కూడా ఉంది గాని అంత బాగుండదు. దీంట్లో ముఖ్యంగా మీరు బెర్లిన్ అనే పాత్రని బాగా ఇష్టపడతారు. ఇతను కొన్ని సార్లు శాడిస్ట్ గ, సైకో గా ప్రవర్తించిన గాని జనాలకి నచ్చుతాడు . అలాగే ఈ సిరీస్ అయిపోయే లోపల మీకు కచ్చితంగా కొన్ని స్పానిష్ పదాలు నేర్చుకుంటారు. ప్రతి ఎపిసోడ్ అయితే`ఉత్కంఠ ని పెంచుతూనే ఉంటాయి. మీకు ఎక్కడబోరు కొట్టదు.
ఇంటెన్సిటీ కోసం అయితే స్పానిష్ భాష లో ఆంగ్ల ఉప శీర్షికలతో చూడండి. ఇది netlfix లో దొరుకుంతుంది. నన్ను మటుకు నెట్ఫ్లిక్ పాస్వర్డ్ అకౌంట్ అడగొద్ద.
టొరెంట్ మరియు స్ట్రీమింగ్ లింక్స్ మొదటి మూడు బాగాలకి ఇక్కడ పోస్ట్ చేస్తాను. నాలగవ భాగం మాత్రం వచ్చిన తర్వాత పోస్ట్ చేస్తాను.
భాగం-1
https://cmovies.tv/film/money-heist/watching.html?ep=1
భాగం-2
https://cmovies.tv/film/money-heist-seas....html?ep=1
భాగం-3 (కొత్త కథ)
https://cmovies.tv/film/money-heist-seas....html?ep=1
శివ నారాయణ వేదాంత