26-11-2018, 06:59 PM
రిచర్డ్స్ బుర్ర అప్పటికే సేచురేషన్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది.
హార్ధిక్ తన చెంప మీద వేసిన చిటెక్కి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు.
హార్ధిక్ తన కాలు రిచర్డ్స్ మొహానికి తగిలేలా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు.
అది చూసి తట్టుకోలేకపోతున్నాడు జాన్. జేబులోంచి గన్ తీసి హార్ధిక్ వైపు గురిపెట్టాడు. మరుక్షణంలో జాన్ నొసటి మీద అమ్మవారి కుంకుమ బొట్టంత బొక్క పడింది.
జాన్ అలా నిర్జీవంగా వాలిపోతుంటే "జా.......న్" అన్నాడు రిచర్డ్స్ బాధతో మూలుగుతూ. అన్నిటినీ చాలా తెలివిగా అమలుపరిచే తన కుడిభుజం కూలిపోవడంతో. చదరంగంలో రాజుకు మంత్రి కరువైనట్టు అయిపోయింది.
హార్ధిక్ లేచి జాన్ శవం దగ్గరకు వెళ్ళి "ఓహ్.. జాన్ అంటే ఇతనేనా? నైస్ టు మీట్ యూ జాన్. మనం ఇప్పటి వరకు ఫోన్లో మాట్లాడుకోవడమే కానీ డైరెక్ట్ గా కలవడం ఇదే మొదటిసారి. రెస్ట్ ఇన్ పీస్ జాన్" అన్నాడు జాన్ కళ్ళు మూస్తూ.
ఆ మాటలకు మరింత రక్తం మరిగిపోయింది రిచర్డ్స్ కి. ఇక ఆగలేక జేబులోని బటన్ నైఫ్ తీసుకుని హార్ధిక్ ని పొడవబోయాడు. ఇంతలో టూటూ చేతిలోని ఆయుధం రిచర్డ్స్ చేతిలోని కత్తిని, ఆ కత్తిని పట్టుకున్న చేతి గుత్తిని చేతి నుంచి వేరు చేసేసింది.
"ఆ...........హ్...హ్.....హ్...హ్......." అంటూ రిచర్డ్స్ పెట్టిన గావుకేక ఆ ప్రదేశం మొత్తం బిగ్గరగా ప్రతిధ్వనించింది.
ముంజేతి నుంచి రక్తం ధారగా కారడం మొదలయ్యింది. టూటూ తన చేతిలోని కొడవలి వంటి పదునైన ఆయుధంతో రిచర్డ్స్ తలని మొండెం నుంచి వేరు చెయ్యడానికి సిద్ధపడుతుండగా...
"టూటూ.." అన్నాడు హార్ధిక్ చెయ్యెత్తి వారిస్తున్నట్టు.
రిచర్డ్స్ కి ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టింది.
"తలొద్దు.. కాళ్ళు తీసేయ్.." అన్న హార్ధిక్ మాట పూర్తి కాకుండానే ఆశ్చర్యంతో చూస్తున్న రిచర్డ్స్ కాళ్ళని కర్కశంగా నరికి అవతల పడేసాడు టూటూ.
అక్కడ జరుగుతున్న మారణహోమానికి భయంతో పరుగులు తీశారు రిచర్డ్స్ మనుషులు.
"ఇప్పుడు చెప్పు రిచర్డ్స్.. నువ్వు నేను నాకు నీకు అంటూ ఏవేవో పదాలు వాడావ్? నాకు సరిగా గుర్తు లేదు. ఇంకొకసారి చెప్పగలవా?" అంటూ ప్రశ్నించాడు హార్ధిక్ సూటిగా రిచర్డ్స్ కళ్ళలోకి చూస్తూ.
"రేయ్.. మదగజం లాంటి నన్ను ఇక్కడకి తీసుకొచ్చావ్ కదూ.. నిన్ను అతి కిరాతకంగా చంపకపోతే ఇన్నాళ్లూ నేను బ్రతికిన బ్రతుకంతా అనవసరం." అంత భాదలోనూ కళ్ళల్లో నిప్పులు కురిపించాడు రిచర్డ్స్.
"రిచర్డ్స్... నువ్వు ఎంత పెద్ద ఏనుగువైనా కానివ్వు. వన్స్ నాదీ.... అనే సరస్సులో అడుగుపెడితే మాత్రం. నీకు గజేంద్రమోక్షమే." స్థిరంగా పలికాడు హార్ధిక్.
"ఏం చెయ్యగలవ్ నన్ను? చంపుతావా? చంపేయ్" అన్నాడు రిచర్డ్స్.
"నన్ను ముట్టుకున్నా.. నాతో పెట్టుకున్నా నీ డెత్తుకి డేటు ఫిక్స్ అయిపోయినట్టే. ఆల్రెడీ పెట్టేసుకున్నావ్. టూటూ.." అని అరిచాడు హార్ధిక్.
ఒక్క చెయ్యి మినహా ఊపిరిలో నాగార్జునలా మిగిలిన రిచర్డ్స్ వైపు తన ఆయుధం పట్టుకుని కదిలాడు టూటూ...
రిచర్డ్స్ తన గదిలో అద్దం ముందు కూర్చుని ఉన్నాడు. కాళ్ళూ చేతులు లేకుండా తన దీన స్థితికి తనకే జాలి వేసింది.
వొళ్ళంతా గాయాలకు కట్లతో నిద్ర లేచిన తనకు అప్పుడే మత్తు తగ్గడంతో వొళ్ళంతా పచ్చి పుండులా ఉంది.
పక్కనున్న వ్యక్తిని అడిగితే అద్దం ముందుకు తీసుకువచ్చాడు.
కొన్ని గంటల వ్యవధిలో తన అవయవాలు ఛిద్రం కావడం జీర్ణించుకోలేకపోతున్నాడు.
ఒక గండం నుండి తాను ఎలా బయట పడ్డాడో తలుచుకుంటూ కొన్ని గంటలు వెనక్కి వెళ్ళాడు తన జ్ఞాపకల్లో.....
తల వెనక్కి విరిచి గొంతు మీద కత్తి పెట్టాడు కోడిని కోసినట్టు కొయ్యడానికి..
"నీ జీవితం అయిపోయింది రిచర్డ్స్. చావడానికి సప్త సముద్రాలు దాటి వచ్చావ్. ఏమైనా కోరికలు ఉన్నాయా? లైక్ నీ శవాన్ని నువ్వు చెప్పిన చోట పాతిపెట్టడం, చివరిసారిగా మంచి తిండి, అమ్మాయి, మందు.. ఇలా. నాకు ఇంతకు మించి తోచడం లేదు. ఏమైనా కావాలంటే అడుగు" అన్నాడు హార్ధిక్ రిచర్డ్స్ ముందుకు వచ్చి నిలబడి.
రిచర్డ్స్ ఆ మాటలకు పగలబడి నవ్వసాగాడు. రక్తం కారుతున్న చేతిని ఇంకొక చేత్తో గుండెలకేసి అదిమిపెట్టి నవ్వుతున్నాడు.
హార్ధిక్ అది చూసి తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు. కానీ అంతకంతకూ రిచర్డ్స్ నవ్వు పెరుగుతుంటే చిన్న అసహనం కప్పేసింది హార్ధిక్ ని.
"ఏయ్ ఆపు" అంటూ అరిచాడు చిరాగ్గా.
రిచర్డ్స్ తన నవ్వును పెదవులతో ఆనకట్ట కట్టినా అక్కడక్కడా నవ్వుల లీకేజీ వస్తుంది.
"ఎందుకు అంత నవ్వు వస్తుంది?" కుర్చీలో సిగరెట్ వెలిగించుకుంటూ అడిగాడు హార్ధిక్.
"నన్ను నువ్వు చివరి కోరిక అడుగుతున్నావ్. అవతల నీ బాబుని ఎవరు అడుగుతారా అని తలుచుకుంటుంటే నవ్వు వచ్చింది. అదే మొహంతో చెప్పాడు రిచర్డ్స్.
తన తండ్రి గుర్తుకు రాగానే హార్ధిక్ మొహంలో రంగులు మారాయి. ఈ విషయంలో పడి తను తన తండ్రినే పట్టించుకోలేదు.
"ఏంటి సర్? భయం వేస్తోందా? నేను ఎక్కడికి వచ్చినా పూర్తిగా ప్రిపేర్ అవ్వకుండా రాను. ఇప్పుడు మాట్లాడరా కుర్ర నా కొడకా" కళ్ళ మాటున కోపాన్ని, పళ్ళ మాటున పగని వెదజల్లుతూ అడిగాడు రిచర్డ్స్.
తన తండ్రి రిచర్డ్స్ చేతిలో ఉన్నాడని తెలియగానే హార్ధిక్ బుర్ర కాసేపు పనిచెయ్యడం మానేసింది. తెలివి తెచ్చుకుని టూటూని ఆపమన్నట్టు సైగ చేసాడు.
టూటూ రిచర్డ్స్ గొంతు మీది కత్తిని అలాగే ఉంచాడు.
"ఏంటి మా నాన్న నీ దగ్గర ఉన్నాడా?" అడిగాడు హార్ధిక్.
"అవున్రా.. నా మనుషులు ఎవరో వేశ్యను ఫాలో అయి వెళ్తే పక్క ఇంట్లో కనిపించడంతో తీసుకొచ్చేశారు. అసలు వాడ్ని నిన్నే చంపెయ్యాలి. కానీ నీ చావు చూపించి చంపేద్దాం అని ఆగాను." అంటూ మాట్లాడటం ఆపి కోటు జేబులో నుంచి సిగార్ తీసి వెలిగించుకున్నాడు. అప్పటికే అక్కడ రక్తం ధారగా కారడం వల్ల ఆ ప్రదేశం మొత్తం రక్తసిక్తంగా ఉంది. రెండు దమ్ములు లాగాక రిచర్డ్స్ బుర్ర గిర్రున తిరిగి ఆగింది.
బయటకు పోతున్న రక్తం అతనిలో చిన్నపాటి మైకాన్ని తీసుకొస్తుంది. ఆ మైకాన్ని అణుచుకుంటూ "నేను జీవితంలో ఎక్కడైనా తప్పు చేశానంటే అది నీ దగ్గరే హార్ధిక్. నిన్ను చాలా తక్కువగా అంచనా వేసాను. నీ బాబుని చంపకపోవడం కలిసొచ్చింది. చెప్పు నీ తండ్రి ప్రాణాలు కావాలో వద్దో?" మొహంలోని నవ్వుకు ఒక రకమైన గర్వాన్ని పులుముకుంటూ అడిగాడు రిచర్డ్స్.
"నా తండ్రిని నాకు అప్పగించు. లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాను రిచర్డ్స్" భయపడేలా బెదిరించాలి అనుకున్న హార్ధిక్ భయంతో బెదిరించాడు.
"నీ మాటల్లో భయం కనిపిస్తుంది హార్ధిక్. ఇప్పుడు నీ దగ్గర రెండే ఆప్షన్స్. ఒకటి నేను చెప్పినట్టు విని నీ తండ్రిని కాపాడుకోవడం. రెండు నీ తండ్రి అంత్యక్రియలకు హాజరు కావడం. ఇక నీ చేతుల్లోనే ఉంది హార్ధిక్." చెప్పాల్సింది సూటిగా చెప్పేసాడు రిచర్డ్స్.
"నీకు ఏం కావాలి" గొంతు గద్గదమవుతుంటే ప్రశ్నించాడు హార్ధిక్.
"దట్స్ గుడ్. ఇప్పుడు నా దారిలోకి వచ్చావ్. మల్హోత్రా, నువ్వు నాతో బయల్దేరి రావాలి. అక్కడ నిన్ను నీ బాబుని వదిలేసి నా దారిన నేను వెళ్లిపోతాను. "
"అది జరగని పని. నా తండ్రి ఇక్కడికి వచ్చాక నిన్ను వదిలేస్తాను. మీ మనుషులకు చెప్పి రప్పించు" స్థిరంగా చెప్పాడు హార్ధిక్.
" ఇప్పుడు డీల్ మాట్లాడటానికి నీకు అర్హత లేదు హార్ధిక్. నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి అంతే. కాదూ కూడదు అంటే అక్కడ నీ తండ్రి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి." కరుకుగా అన్నాడు రిచర్డ్స్.
హార్ధిక్ పెదవులపై చిన్న చిరునవ్వు పూసింది."ఆవేశంగా మాట్లాడకు రిచర్డ్స్. బీపీ పెరిగితే రక్తం వేగంగా బయటకు పోతుంది. నా తండ్రి ప్రాణాలు నాకు ఎంత అవసరమో నీ ప్రాణాలు నీకు అంతకన్నా ఎక్కువ అవసరం. ఈ విషయం నేను చెప్తే కానీ తెలుసుకోలేని అమాయకుడివి కాదనే నా అభిప్రాయం" హుందాగా చెప్పాడు హార్ధిక్.
రిచర్డ్స్ గతుక్కుమన్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక నేల చూపులు చూస్తున్నాడు.
"నాకు నువ్వు చెప్పిన విషయం వినగానే కాసేపు ఆలోచనా జ్ఞానం పోయింది అంతే. ఆ మాత్రానికి నువ్వు గెలిచినట్టు ఊహించుకోకు రిచర్డ్స్." ఒక్కొక్క మాటకు రిచర్డ్స్ ముఖంలో మారుతున్న ఫీలింగ్స్ ని గమనిస్తూ చెప్తున్నాడు హార్ధిక్.
"నీకు నీ తండ్రిని లేకుండా చేస్తాను రా. ఆ భాద అనుభవిస్తే కానీ నీకు తెలియదు." పళ్ళు పటపటలాడించాడు రిచర్డ్స్.
"ఓహ్ పూర్ రిచర్డ్స్. నువ్వు చెప్పింది చేస్తే నాకే అడ్వాంటేజ్. టైం మెషీన్ పూర్తి చేసి నా తండ్రిని తెచ్చేసుకుంటాను. అయినా అంత దూరం కూడా అవసరం లేదనుకుంటా? నువ్వు వాగిన చెత్త వాగుడు బట్టి చూస్తే మా నాన్నని నా చావు కబురు చెప్పాక చంపడానికి ఉంచావ్. అంటే మా నాన్నను ఏం చేయాలో నీ మనుషులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. అంటే నిన్ను ఇప్పుడు టార్చర్ చేస్తే మా నాన్న వచ్చేస్తాడు. ఒకవేళ నువ్వు పోతే ఇప్పుడు పారిపోయిన నీ చెంచాగాళ్లని పట్టుకుంటే పని జరిగిపోతుంది. ఇప్పుడు చెప్పు రిచర్డ్స్.. నీకు నీ ప్రాణాలు కావాలా? వద్దా?" నిష్కర్షగా అడిగాడు హార్ధిక్.
"అవును నువ్వు చెప్పింది నిజమే.. కానీ ఒకవేళ టైం మెషీన్ పని చెయ్యకపోతే నీ పరిస్థితి ఏంటి?" చివరి అస్త్రం ప్రయోగించాడు రిచర్డ్స్.
" అందుకే నీకు ప్రాణ భిక్ష పెట్టడానికి సిద్ధపడ్డాను. ఒకవేళ ఇక్కడి నుంచి ఒకరు పారిపోయినా నీ మనుషులకు విషయం తెలుస్తుంది. నిజంగా టైం మెషీన్ వర్కౌట్ కాకపోతే నా తండ్రిని కోల్పోతాను. కానీ ఒకటి ఆలోచించు.. నిన్ను ఇలాంటి పరిస్థితికి తీసుకువచ్చిన నన్ను కానీ, నా వాళ్ళను కానీ నీకు లొంగిపోతే ప్రాణాలతో వదులుతావా? నీ చేతుల్లో అందర్నీ కోల్పోవడం కన్నా నా తండ్రిని కోల్పోవడం నాకు పెద్ద భాద కాదు" హార్ధిక్ అంటున్న ఒక్కొక్క మాట వింటుంటే రిచర్డ్స్ కి చదరంగం రెండువైపులా ఒక్కడే ఆడుతున్నట్టు అనిపించింది. శత్రువైనా హార్ధిక్ ని మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.
హార్ధిక్ రిచర్డ్స్ మనసును చదివినట్టు "ప్రాణాలు చివరి దశకు వచ్చేసాక ఇంత దీర్ఘాలోచన పనికిరాదు రిచర్డ్స్.. డీల్ ఆర్ నో డీల్. తొందరగా చెప్పు" అన్నాడు.
"హ్మ్మ్.. ఓకే. నాకు ఒక ఫోన్ కావాలి" అన్నాడు రిచర్డ్స్ సంధికి సిద్ధపడ్డట్టు.
హార్ధిక్ చిటికె వెయ్యగానే హార్ధిక్ మనిషి ఒకడు రిచర్డ్స్ చేతికి ఫోన్ అందించాడు. రిచర్డ్స్ చకచకా నెంబర్ డయల్ చేసి తన మనిషికి ఏం చేయాలో చెప్పాడు.
"వస్తున్నారు" అన్నాడు ఫోన్ హార్ధిక్ మనిషికి అందించి తలెత్తి చూస్తూ.
హార్ధిక్ సూట్ బటన్స్ సరిచేసుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు. పక్కన టూటూ హార్ధిక్ కి గొడుగు పట్టాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.
రిచర్డ్స్ కొంచెం కొంచెం రక్తం కోల్పోతూ ఆ ఎండ వేడికి అప్పుడో ఇప్పుడో అన్నట్టు ఉన్నాడు అలాగే నేల మీద.
రిచర్డ్స్ అరగంట నరకం అనుభవించాక ఒక తెల్లటి వాన్, అందులోనుంచి నలుగురు రిచర్డ్స్ మనుషులు చేతులు కట్టేసిన సౌరవ్ ఠాగూర్ ని తీసుకుని దిగారు.
హార్ధిక్ ఎప్పుడూ తన తండ్రిని అంత దైన్యంగా చూడలేదు. ముందు రిచర్డ్స్ మీద కోపం వచ్చినా తను చేసినదాంతో పోలిస్తే ఇది అసలు లెక్కే కాదని తమాయించుకున్నాడు.
రిచర్డ్స్ మనుషులు సౌరవ్ ని అప్పగించి తన దగ్గరకు వస్తుంటే వాళ్లనే చూస్తున్నాడు. వాళ్ళ కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అంతకు మించి తల ఎత్తడం తన వల్ల కావట్లేదు. వాళ్ళు చేరువగా వస్తున్న కొద్దీ కళ్ళు బరువుగా మూతలు పడుతున్నాయి. చివరిగా ఒక నలుపురంగు బూటుని చూస్తూ స్పృహ కోల్పోయాడు.
మూడు రోజుల తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఇదిగో ఇలా ఉన్నాడు.
పగ, ప్రతీకారం, అవమానం, భాధ, ఆవేశం ఇలాంటి రకరకాల భావాలతో రిచర్డ్స్ వొళ్ళు దహించుకుపోతుంది.
మెల్లిగా అతనికి తెలియకుండానే అతని కట్లన్నీ రక్తసిక్తంగా మారిపోయాయి. అది గమనించిన రిచర్డ్స్ అసిస్టెంట్ భయంతో "డాక్టా...ర్" అంటూ అంటూ గావుకేక పెట్టాడు.
హుటాహుటిన గదిలోకి వచ్చేసారు నలుగురు స్పెషలిస్ట్ డాక్టర్లు, పదిమంది నర్సులు, ఎంపీ రమానాథ్, రిచర్డ్స్ ముఖ్య అనుచరులు.
రిచర్డ్స్ ని వెంటనే బెడ్ మీద పడుకోబెట్టి స్ట్రెస్ రిలీజ్ చెయ్యడానికి ఇంజక్షన్ ఇచ్చారు. కొద్దిగా తగ్గింది రిచర్డ్స్ కి.