Thread Rating:
  • 16 Vote(s) - 3.13 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ఖర్కోటఖుడు by Naresh2706
#34
 

వచ్చిన సిబ్బంది మొత్తానికి రూంలు ఏర్పాటు చేసి హార్ధిక్ గదిలోకి వచ్చాడు హాథీ.
హార్ధిక్ అప్పుడే బీన్ బ్యాగ్ మీద పడుకుని రిలాక్స్ అవుతూ మందు కొడుతున్నాడు.
మర్యాదగా డోర్ కొట్టాడు హాథీ.
తాగుతున్న హార్ధిక్ డోర్ వంక చూస్తూ "హా హాథీ.. లోపలికి రా" అన్నాడు. హాథీ లోపలికి వచ్చాక "చెప్పు" అన్నాడు.
 
"అదే సర్ ఆ కాల్ గర్ల్ ని మన వాళ్ళతో ఎందుకు కిడ్నాప్ చేయించారు?"
"ఓహ్ అదా? ఇంతకీ ఆ విషయమే మర్చిపోయాను. వెళ్ళి మల్హోత్రాని, ఆ అమ్మాయిని తీసుకురా పో.. " అంటూ హాథీని పంపేసి మళ్ళీ మత్తులో జోగడం మొదలెట్టాడు హార్ధిక్.
హాథీ వెంటనే వాళ్ళ గదిలోకి పరుగులు పెట్టాడు. నెక్స్ట్ హార్ధిక్ ఏం చేస్తాడని తనకి అస్సలు అర్థం కావడం లేదు. నవ్వుతూ నరకానికి పంపించేస్తున్నాడు. ఒకప్పుడు మన్మధుడు అనుకునేలా ఉండే హార్ధిక్ ఇప్పుడు రుద్రతాండవం చేస్తున్న వీరభద్రుడిలా కనిపిస్తున్నాడు.
గంగాదాస్ మనుషుల్ని పూజని తీసుకురమ్మని చెప్పి, పరుగుపరుగున మల్హోత్రా రూమ్ డోర్ కొట్టాడు హాథీ.
 
డోర్ తీసి ఏమిటన్నట్టు చూసాడు మల్హోత్రా హాథీ వంక.
"సర్ రమ్మంటున్నారు" అన్నాడు హాథీ పరుగు వల్ల వచ్చిన ఆయాసంతో రొప్పుతూ.
"సరే వస్తున్నా పద" అంటూ డోర్ లాక్ చేసి హాథీని వెంబడించాడు మల్హోత్రా.
హాథీ, మల్హోత్రా అక్కడికి చేరుకునేసరికి పూజా గదిలో నిలబడి ఉంది.
)))))****** \/@®$# ♂♀ ******(((((
 
జమైకన్ సిగార్ కాలుస్తున్న రిచర్డ్స్ ఫోన్ రింగవుతుంది. కళ్ళు తెరిచి స్క్రీన్ వంక చూసేసరికి అమెరికన్ నావల్ చీఫ్ టిమ్ కాల్ చేస్తున్నాడు.
"హెలో టిమ్.."
"గుడ్ మార్నింగ్ సర్." విష్ చేసాడు టిమ్.
"నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పడానికి నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నాను."
"ఓకే.. కాల్ చెయ్యమన్నారు అంట?"
"హా.. నాకు నేవీ సీల్స్, డెల్టా ఫోర్స్ నుంచి ఒక పదిమంది షార్ప్ అండ్ ఎక్సపెరియన్స్డ్ కమాండోస్ కావాలి. ఎరేంజ్ చెయ్. వాళ్లకు కావలిసిన వెపన్స్ కూడా. ఎక్కడికి, ఎలా అనేది నీకు మళ్ళీ కాల్ చేస్తా" అంటూ కాల్ కట్ చేసాడు రిచర్డ్స్.
 
రిచర్డ్స్ మనసులో ఏవేవో ఆలోచిస్తున్నాడు. తన ఇన్ని సంవత్సరాల కష్టాన్ని ఎలాగైనా ఫలంగా మార్చుకోవాలి.
తను ఎంతో మందితో తలపడ్డాడు. అందరినీ తొక్కేసాడు. ఎప్పుడూ ఇంతలా ఆలోచించలేదు. కారణం..
అవి వచ్చినా పోయినా పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇది మాత్రం పోతే దక్కదు. అందుకే సర్వశక్తులు ఒడ్డి అయినా గెలవాలి.
ఇలా ఆలోచిస్తూ ఉండగానే అక్కడి లోకల్ ఎంపీ రమానాథ్ బయట వెయిట్ చేస్తున్నాడని చెప్పాడు తన పీఏ.
అతన్ని లోపలికి తన ఛాంబర్ కి తీసుకురమ్మని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు రిచర్డ్స్.
పీఏ అతన్ని ఛాంబర్ లోకి తీసుకువచ్చి కూర్చోమన్నాడు.
రిచర్డ్స్ ని చూస్తూ "నమస్తే సార్" అంటూ దణ్ణం పెట్టి అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రమానాథ్.
 
"చెప్పండి సర్. నన్ను కలవాలని అన్నారట" అంటూ డైరెక్ట్ పాయింట్ కి వచ్చేసాడు.
 
"నా పేరు రిచర్డ్స్. అమెరికాలో ఒక వ్యాపారవేత్తని. మీ పేరు?" అన్నాడు చేతిలో ఉన్న సిగార్ ని యాష్ ట్రేలో పెట్టి గ్లాసులోకి విస్కీ ఒంపుకుంటూ.
"రమానాథ్ సర్."
"హ్మ్.. చూడండి మిస్టర్ రమానాథ్. నేను ఇక్కడికి ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. నాకు ఛటర్జీ సాయం చేస్తున్నాడు. అతనే మీరు నాకు అండగా ఉంటారని చెప్పాడు" అన్నాడు బాటిల్ పక్కకి పెట్టి గ్లాసు చేతిలోకి తీసుకుంటూ.
"అది సరే. కానీ ఇంతకీ పనేంటి చెప్పలేదు?"
"ఏముంది. నా దగ్గర పని చేసే వ్యక్తి ఒకరు నా ఆఫీస్ రహస్యాలన్నీ తీసుకుని ఇండియా వచ్చేసాడు. అతనికి ఇక్కడ ఆ ఠాగూర్స్ కంపెనీ సౌరవ్, హార్ధిక్ ఆశ్రయం ఇస్తున్నారు. వాడి దగ్గర నుంచి నా రహస్యాలు ఎలాగైనా చేజిక్కించుకోవాలి. అందుకు మీ సాయం నాకు కావాలి" అన్నాడు విస్కీ గ్లాసు ఆఫర్ చేస్తూ.
 
"సారీ రిచర్డ్స్ గారూ.. వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు. మీకు నేను సాయం చేస్తున్నానని తెలిస్తే ఉన్నపళంగా రోడ్డు మీదకి తీసుకొచ్చే శక్తి వాళ్ళకుంది. ఈ విషయంలో నేను వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్లలేను. క్షమించండి. అయినా ఛటర్జీ నాకు ఆప్తుడు కాదు బంధువు కాదు.. కేవలం పరిచయస్తుడు అంతే" అంటూ అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళబోయాడు.
"కూల్.. కూర్చోండి రమానాథ్ గారూ. ఒకవేళ రోడ్డు మీద పడతానేమో అని మీ భయం. అంతే కదా?"
"అవును"
"ఈ పదవిలో ఉంటే మీకేం వస్తుంది?"
"అధికారం, డబ్బు, హోదా, గౌరవం"
"అవన్నీ వేరు వేరు కాదు రమానాథ్. చమురులో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వాసెలిన్.. ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో డబ్బు అనే చమురులో ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి."
 
"అవును. అయితే మాత్రం? రోడ్డు మీద పడితే డబ్బు ఎక్కడినుంచి వస్తుంది?"
"నేనిస్తాను"
"ఎంత? 5కోట్లా? 10కోట్లా? మీరు ఎంత ఇచ్చిన అవి నా సంపాదన ముందు పనికిరావు"
"మీ వయసు ఎంత?"
"58"
"మహా అయితే ఎన్నాళ్ళు పదవిలో ఉంటారు?"
 
"ఇంకొక 15 సంవత్సరాలు"
"ఎంత సంపాదించగలవ్?"
"కొన్ని వందల కోట్లు"
"ఎన్ని వందలు? పోనీ వందల్లో 999 చివరిది కాబట్టి అదే అనుకుందాం. నేను నీకు 10000 కోట్లు ఇస్తాను నా పని జరిపిస్తే"
ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పనయ్యింది రమానాథ్ కి. "ఏంటి మీరు అంటున్నది?" అన్నాడు తడబడుతూ.
"నిజం. ఇక్కడ అంత డబ్బు మీకు ఇబ్బంది అనుకుంటే మీ స్విస్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తా. ఒకవేళ లేకపోయినా ఇబ్బంది లేదు. అకౌంట్ క్రియేట్ చేసి మరీ అందులో డబ్బు వేస్తాను"
 
రమానాథ్ కి తల తిరుగుతుంది. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే కష్టమని తెచ్చుకోలేదు.
 
వినయంగా " సార్.. ఆ ఫైల్స్ అంత విలువ చేస్తాయా?" అన్నాడు.
"అవును రమానాథ్. బయటకి చెప్పుకోవడం వల్ల బిల్ గేట్స్, వారెన్ బఫెట్ అంటున్నారు కానీ నాకు కనిపించని నల్లధనం చాలా ఉంది" అన్నాడు.
"అలా అయితే డీల్ సర్. నా పరపతి మొత్తం మీకోసం ఉపయోగిస్తాను. చీర్స్ ఫర్ న్యూ ఫ్రెండ్షిప్" అంటూ రిచర్డ్స్ తనకి ఆఫర్ చేసిన గ్లాసు ఎత్తి ఒక్క గుక్కలో తాగేసి టేబుల్ మీద పెట్టేసాడు.
 
)))))****** \/@®$# ♂♀ ******(((((
 
నెక్స్ట్ ఏంటి?
"ఓకే మిస్టర్ రమానాథ్. మీరు వెళ్ళండి. నేను అవసరం అయినప్పుడు చెప్తాను." అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు రిచర్డ్స్.
 
)))))****** \/@®$# ♂♀ ******(((((
 
గదిలో పూజా, మల్హోత్రా, హాథీ, హార్ధిక్ కూర్చుని ఉన్నారు.
"మల్హోత్రా.. ఇదిగో మీరు అడిగిన గిఫ్ట్. ఇప్పుడు మీరు హ్యాపీ కదా?" అన్నాడు హార్ధిక్ నవ్వుతూ.
"ఏంటి నన్ను మల్హోత్రా కోసం తీసుకొచ్చారా?" ఆశ్చర్యంతో అడిగింది పూజా.
"అవును" అన్నాడు హార్ధిక్.
"సర్ కావాలంటే బుక్ చేసుకునేవాళ్ళం కదా?" అన్నాడు హాథీ హార్ధిక్ కి పిచ్చి పట్టిందా అన్నట్టు చూస్తూ.
"చేసుకోవచ్చు. కానీ పూజా మల్హోత్రాకి జీవితాంతం కావాలి" అన్నాడు హార్ధిక్.
 
"అలా అయినా వాడికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి తెచుకునేవాళ్ళం కదా? మనకి డబ్బుకు కొదవ లేదు కదా? దానికోసం ఇలా కిడ్నాప్ ఎందుకు?" అర్ధం కానట్టు అడిగాడు హాథీ.
"వాడు పూజకి చేసిన అన్యాయానికి వాడు లాభపడటం మన మల్హోత్రాకి ఇష్టం లేదు. అందుకే" అని అసలు విషయం చెప్పాడు హార్ధిక్.
పూజా మొహంలో రకరకాల భావాలు రంగులు మారుతున్నాయి.
"సారీ పూజా. నీకు నాతో ఉండటం ఇష్టం అనుకుని ఈ పని చేసాను. నాకు మాత్రం నీతో ఉంటే నా జీవితం మళ్ళీ ప్రారంభం అయ్యింది. నువ్వు వెళ్లిపోతాను అంటే ఇప్పుడే మా వాళ్ళని దింపేయ్యమని చెప్తాను" అన్నాడు.
 
అప్పటికే పూజ తల దించుకుని ఉంది. మల్హోత్రా చివరి మాటలు చెప్పగానే సడన్ గా తల పైకెత్తింది. అప్పటికే ఆమె కళ్ళలో నుండి నీళ్ళు బుగ్గల మీదుగా కిందకు జారుతున్నాయి. పరుగున వచ్చి మల్హోత్రాని కౌగలించుకుని అతని గుండెల మీద తల పెట్టుకుని ఏడుస్తుంది.
మల్హోత్రా ఆమె తలని ప్రేమగా నిమిరి "ఏయ్ పిచ్చిపిల్లా.. ఏంటిది?" అన్నాడు గోముగా.
"నాకంటూ ఇక ఈ లోకంలో ఉన్నది మీరే.. చచ్చేదాక మీతోనే " అంటూ కౌగిలి మరింత బిగించింది.
కాసేపు వారి మధ్యలో మౌనం రాజ్యమేలింది. అది చూస్తున్న హార్ధిక్ గుండె లోపల ఒక తెలియని ఉద్వేగం చోటు చేసుకుంది.
వాళ్లిద్దరూ చేతులు పట్టుకుని నిలబడి నవ్వుతుంటే హార్ధిక్ సహా అక్కడున్న వాళ్ళందరూ మల్హోత్రా భుజం తట్టి బయటకు నడిచారు.
హార్ధిక్ వెళ్తూ వెళ్తూ ఆగి "మల్హోత్రా.. మీ ఇద్దరికీ మన సమక్షంలో రేపు పెళ్ళి జరగబోతుంది. వెళ్ళి ఆన్లైన్ లో నచ్చిన షాపింగ్ చేసుకోండి" అంటూ వెళ్ళిపోయాడు అక్కడినుంచి.
 
"ఏంటి సర్? ఇక్కడకు మనం వచ్చిన పని ఏంటి? మీరు చేస్తున్నదేంటి? ఇవన్నీ మనకు అవసరమా?" అన్నాడు హాథీ హార్ధిక్ పక్కన నడుస్తూ.
 
"వాళ్ళు మనకు అవసరం. మల్హోత్రా బ్రతకడానికి తనకంటూ ఒక ఆశ కల్పించాలి. మనిషికి ఎన్ని బంధాలు ఉంటే అంత బలహీనపడతాడు. బలహీనత ఉన్న మనిషిని లొంగదీసుకోవడం మనకు సులభం" అన్నాడు హార్ధిక్ నవ్వుతూ.
హాథీ ఆగిపోయి నోరెళ్ళబెట్టి హార్ధిక్ వెళ్తున్నవైపు చూస్తూ ఉండిపోయాడు.
 
)))))****** \/@®$# ♂♀ ******(((((
 
రిచర్డ్స్ సెక్యూరిటీ ఆఫీసర్ జాన్ రిచర్డ్స్ గది తలుపు కొట్టాడు.
"యెస్.. కమిన్" అన్నాడు లోపలినుంచి రిచర్డ్స్.
తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు జాన్. అక్కడ రిచర్డ్స్ తన గదిలో టేబుల్ మీద స్కాచ్ గ్లాసు, చేతిలో సిగార్ పట్టుకుని తన కుర్చీలో రిలాక్స్డ్ గా కూర్చున్నాడు.
"సర్ టిమ్ కాల్ చేసాడు"
"ఏంటంట?"
"మీరు చెప్పిన పని మొత్తం పూర్తి అయ్యిందట"
 
"సరే నేను చెప్తాను. వెయిట్ చెయ్యమను"
"ఓకే సర్. సర్ చిన్న డౌట్"
"ఏంటి?"
"అదే ఆ హార్ధిక్ కోసం ఎందుకు ఇంత ప్లాన్ చేస్తున్నారు? వాడు మీ ముందు బచ్చా సర్"
"అందుకే ప్లాన్ చేస్తున్నా"
"అర్థం కాలేదు"
 
"వాడు బలవంతుడా? నేను బలవంతుడినా?"
"మీరే సర్"
"అందుకే జాగ్రత్తగా ఉండాలి"
"అర్థం కావడం లేదు సర్"
 
"ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? మన మీద బలవంతుడు ఎప్పుడూ మనల్ని అంత సీరియస్ గా తీసుకోడు. వాడి గురించి భయపడక్కర్లేదు. ఎందుకంటే వాడి అంచనా కంటే ఇంకొంచెం బలం పెంచుకుంటే సరిపోతుంది. కానీ బలహీనుడు అలా కాదు. మనలో చిన్న లోపాన్ని కనిపెట్టి దాని మీద దాడి చేస్తాడు. దానిని మనం కూడా గుర్తించలేం. ఈ లోపు అంతా అయిపోతుంది. అందుకే బలవంతుడ్ని కొట్టడం కన్నా బలహీనుడ్ని కొట్టడమే కష్టం. అందుకే నా బలమం...తా..హ్" అంటూ నడుము బిగపెట్టి కుర్చీలోంచి పైకి లేపి పది క్షణాల్లో కుర్చీలో నీరసంగా కులబడిపోయి "వాడి మీదనే ప్రయోగిస్తున్నాను" అన్నాడు అలసటగా.
 
"సర్.. ఏమైంది?" అంటూ రిచర్డ్స్ కుర్చీ దగ్గరికి వచ్చిన జాన్ కి టేబుల్ కింద రిచర్డ్స్ పెర్సొనల్ సెక్రటరీ లీసా రిచర్డ్స్ మొడ్డ చేత్తో పట్టుకుని మూతి తుడుచుకుంటూ కనపడింది.
 horseride  Cheeta    
[+] 6 users Like sarit11's post
Like Reply


Messages In This Thread
RE: ఖర్కోటఖుడు by Naresh2706 - by sarit11 - 26-11-2018, 06:53 PM



Users browsing this thread: 10 Guest(s)