Thread Rating:
  • 16 Vote(s) - 3.13 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ఖర్కోటఖుడు by Naresh2706
#22
"ఇక్కడ అందరికన్నా పెద్ద బిసినెస్ మాన్. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ టోటల్ మాఫియా మొత్తాన్ని సింగిల్ హాండ్ తో డీల్ చేస్తూ ఉంటాడు. అతని చేతిలో మాఫియా, పొలిటీషన్స్, బిసినెస్ పీపుల్ చాలా మంది ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఇక్కడ అమెరికాలో కిరీటం పెట్టుకోడు. సింహాసనం మీద కూర్చోడు అంతే. మిగిలింది అంతా యధావిధిగా నడిపిస్తాడు."

అతని గురించి వినగానే హార్ధిక్ బుర్ర గిర్రున తిరిగింది.
"ఏంటి భయపడుతున్నవా?" మళ్ళీ సౌరవ్ అడిగాడు.
" అంటే అంత పెద్ద వ్యక్తి మన పనికి ఎందుకు అడ్డు వచ్చాడు?"
సౌరవ్ ఒక 10నిమిషాలు ఆపకుండా నవ్వుతూనే ఉన్నాడు.
"వాడు మనకి అడ్డు పడలేదు. మనమే వాడి ప్రాజెక్ట్ దోచుకున్నాం. అసలు ఏ ఆశా లేని పరిస్థితిలో పని మొదలెట్టి ప్రయోగాలు చేయించి ఇప్పుడు పూర్తి అయ్యే సమయంలో మొత్తం మన చేతిలోకి తీసుకున్నాం"
హార్ధిక్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.
"డా.....డ్?" అన్నాడు కళ్ళల్లో ఆశ్చర్యం నింపుకుని.
"ఎందుకు భయపడుతున్నావ్? వాడికి మన గురించి మొత్తం తెలిసిపోయింది. వాడు ఇక్కడ నా బిసినెస్ మొత్తం సర్వనాశనం చేసాడు. నేను ఒకచోట క్షేమంగానే ఉన్నాను."
"డాడ్ ఇప్పుడు ఎలా?" భాద ధ్వనించే గొంతుతో అన్నాడు హార్ధిక్.
"షటప్ హార్ధిక్. ఇలాగే బ్రతుకుతావా? నేను చూసింది అనుభవించింది చాలు. రొటీన్ అయ్యి బోర్ కొడుతుంది. బ్రతికితే అందరినీ శాసిస్తూ వణికిస్తూ బ్రతుకుతాను. లేకపోతే ఈ చెత్త బ్రతుకు టెన్షన్స్ తో చచ్చిపోయినా నష్టం లేదు. ఐ వాంట్ టూ వర్క్ ఆన్ మై డ్రీమ్స్. నీకు భయం అయితే చెప్పు. నీకు కావలిసినంత డబ్బు నీకు ఇచ్చేస్తాను. నీకు సేఫ్ ప్లేస్ నేను చూపిస్తాను. వెళ్లిపో"
"అది కాదు డాడ్ మీకు ఏమైనా అయితే. ఇక్కడే టెక్నిక్ ఉంది మై సన్. ఒక్కసారి ఈ టైం మెషీన్ రెడి అయితే నన్ను చచ్చిపోయినా బ్రతికించుకోవచ్చు. ఇక ఆస్తి అంటావా? ఇది వస్తే అది కుప్పలు తెప్పలుగా వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనకి బోర్ కొట్టి చచ్చే వరకు మనమే దేవుళ్ళం"
"యెస్ డాడ్ కానీ మనం రిచర్డ్స్ ని ఎదిరించి ప్రాజెక్ట్ పూర్తి చేయగలమా?"
"ఏనుగు ఎంత పెద్దదైనా నీటిలో మొసలితో పెట్టుకుంటే పులిహోర అయిపోద్ది. రిచర్డ్స్ బలం తగ్గి మనం బలం పుంజుకునేది ఇండియాలో మాత్రమే. అక్కడ సరిగ్గా బుర్ర పెడితే వాడికన్నా నువ్వే బలవంతుడివి."
"ఓకే డాడ్. మీరు జాగ్రత్త"
"అలాగే కానీ నీకన్నా ముందు మల్హోత్రా జాగ్రత్త. అతను లేకపోతే మనం చేసేది మొత్తం వృధా.
వీలైనంత తొందరగా పని ప్రారంభించు. అవసరం అయితే తప్ప నీ ఆచూకీ ఎవరికీ తెలియనివ్వకు. బై" హార్ధిక్ కి ఇంక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేసాడు సౌరవ్.
 
ఫోన్ పెట్టేసి హార్ధిక్ ఆలోచనలో పడ్డాడు. జరిగింది ఎలాగూ మార్చలేడు. ఇప్పుడు యుద్ధం చేయడం తప్ప వేరే మార్గం లేదు.
 
ఛటర్జీతో దాడి చేయించాడు అంటే తన ఆనవాలు దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు. అలాగే తమకు శత్రువులు అయిన వాళ్ళని కలుపుకుంటున్నాడు. ఇక్కడ తనకి బలగం తమ శత్రువులు. ముందు ఎలాగైనా మల్హోత్రాని తెచ్చుకోవాలి.
 
ఆలోచిస్తూ దమ్ము మీద దమ్ము లాగుతున్నాడు. నచ్చిన దాని కౌగిలిలో కాలిపోవడం తెలుసు కానీ ఇలా ఆలోచోనల వేడిలో కాలిపోవడం ఇదే మొదటిసారి.
ఇంతలో SI వచ్చి సెల్యూట్ చేసి నిలబడ్డాడు.
"చెప్పు" అన్నాడు హార్ధిక్.
"అదే సర్.. రమ్మన్నారు కదా" అంటూ నసిగాడు.
"అవును.. కూర్చో. ఏం జరిగింది అక్కడ?" అంటూ కుర్చీ చూపించి సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు.
"ఎవరో ఇద్దరు అమ్మాయిల్ని హత్య చేసి వెళ్లిపోయారు సర్"
"హ్మ్.. ఇంకా"
"వాళ్ళు చైనా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే గాంధీ మెడికల్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్నారు సర్"
"సాక్ష్యాలు ఏమైనా దొరికాయా?"
"కొన్ని అనుమానాస్పద వస్తువులు స్వాధీనం చేసుకున్నాం సర్.. బయట వాచ్మాన్ అయితే ఎవరూ రాలేదు అంటున్నాడు. అతని మాటలు కొంచెం అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని కస్టడీలోకి తీసుకున్నాం. ఒకటి రెండు రోజుల్లో దీని మీద ఒక స్పష్టత రావచ్చు సర్"
"ఏం దొరికాయి?"
" వాళ్ళ సెల్ ఫోన్, వాళ్ళ నెంబర్ రాసి ఉన్న ప్లకార్డు, ఇంకా వాళ్ళ బ్యాంక్ కార్డులు దొరికాయి. అక్కడ ఏమైనా వేలిముద్రలు దొరుకుతాయేమో అని మా క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం, డాగ్ స్క్వాడ్ అక్కడే సెర్చ్ చేస్తున్నారు"
" ఓకే.. నాకు మీరు చిన్న హెల్ప్ చెయ్యాలి. "
"చెప్పండి సర్"
"ఏం లేదు. అందులో లాస్ట్ కాల్ రికార్డ్ నాదే. వాళ్ళని రేపటికి బుక్ చేసుకున్నాను. కలవడానికి గేట్ వరకు వెళ్ళాను కానీ వాళ్ళు కిందకి రాలేదు. వాచ్మాన్ కి డబ్బులు ఇచ్చి వచ్చాను. కాబట్టి అందులో నా నంబర్ డిలీట్ చేసేయ్యండి. అలాగే ఆ వాచ్మాన్ ని వదిలెయ్యండి. ఆ ప్లకార్డు గురించి కూడా రిపోర్టులో మెన్షన్ చెయ్యొద్దు. సరేనా?"
"సర్ అది.. అది." అంటూ నసుగుతున్నాడు.
"సరిపోతుందా" అన్న హార్ధిక్ మాటలకు తలెత్తి చూసిన SI కళ్ళ ముందు డబ్బు గుట్టగా పడి ఉంది.
"సర్" అని సెల్యూట్ చేసి ఆ డబ్బు బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళిపోయాడు.
బాగా పొద్దుపోవడంతో రేపు మల్హోత్రా సంగతి చూడాలి అనుకుంటూ మంచం మీద పడి అలాగే నిద్రపోయాడు హార్ధిక్.
హార్ధిక్ లేచేసరికి 10 అవుతుంది.
బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకున్నాడు హార్ధిక్.
లాన్ లో చైర్ లో కూర్చుని సిగరెట్ తాగుతూ గాలిలో చూస్తున్నాడు. ఎందుకో టీ తాగాలి అనిపించింది.
నౌకారుని పిలిచి టీ తీసుకురమ్మన్నాడు.
రాత్రి తండ్రి చెప్పిన మాటలే మెదడులో తిరుగుతున్నాయి.
హాథీకి ఫోన్ చేసి రమ్మన్నాడు.
ఈ లోపు ఫ్రెష్ అయ్యి వచ్చాడు.
టిఫిన్ చేస్తుంటే హాథీ వచ్చాడు.
"ఛటర్జీ గురించి ఏమైనా తెలిసిందా?"
"వాడు వాడి ఫార్మ్ హౌస్ లో ఉన్నాడు."
"నేను కలవాలి"
"ఎవరినీ కలవడం లేదు"
"కలవాలి అని చెప్పా కదా. మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే కలుస్తాను"
"ఓకే సర్ నేను ఎరేంజ్ చేస్తాను" అని చెప్పి హాథీ అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు.
హార్ధిక్ తన కార్ లో బయటకు వెళ్ళిపోయాడు.
కార్ హౌరా బ్రిడ్జి సమీపంలో ఉన్న ఒక మురికివాడలోకి వెళ్తుంది.
ఎటు చూసినా దుర్గంధం. అక్కడి మనుషులు చాలా క్రూరంగా ఉన్నారు.
కొంత ముందుకు వెళ్ళాక దారి ఆగిపోయింది.
అక్కడ ఒక కిళ్ళీ కొట్టు దగ్గరకి వెళ్ళి "గంగా దాస్ ఎక్కడ ఉంటాడు?" అని అడిగాడు.
ఎవరూ తమకి తెలియదని తల అడ్డంగా ఊపారు.
జేబులోంచి నోట్ల కట్ట ఒకటి బయటకి తీసి విసిరాడు.
కొట్టు యజమాని పక్కనే ఉన్న ఒక పిల్లవాడికి దారి చూపించమని పంపించాడు.
ఆ పిల్లవాడు అక్కడ ఉన్న చిన్న చిన్న సందుల్లో ఒక 10 మెలికలు తిప్పి తీసుకువెళ్ళాడు.
ఆ ఏరియాలో గంగా దాస్ మర్డర్ చెయ్యడానికి ఫేమస్.
ఇలాంటి ఏరియాలో ఉండటం వల్ల సెక్యూరిటీ ఆఫీసర్లు రావడానికి తాను పారిపోవడానికి దాదాపు అరగంట వ్యత్యాసం ఉంటుంది.
 
గంగాదాస్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కరుడుగట్టిన నేరస్తులు.
వాళ్ళకి జీవితం అంటే ఏంటో కూడా తెలీదు.
పీకల వరకు మందు
కడుపునిండా భోజనం
అమ్మాయితో పడక
 
ఇవి రోజూ అందించే గంగాదాస్ వాళ్లకు దేవుడు. అతను ఏం చేయమంటే అది చేసి వచ్చేయడం, దొరికితే నిజం చెప్పకపోవడం, చచ్చిపోతున్నా అది గంగాదాస్ కోసం చావడం వాళ్ళ అలవాటు.
అందుకే గంగాదాస్ అక్కడ లీడింగ్ క్రిమినల్ అయ్యాడు.
చిన్నప్పుడే అనాధ పిల్లల్ని కొనుక్కుంటాడు.
అబ్బాయిలకు దొంగతనాలు, అడుక్కోవడం, కొట్లాటలు, రాజకీయ పార్టీల సభల్లో అల్లకల్లోలం సృష్టించడం, కత్తి వాడకంలో శిక్షణ ఇచ్చి రాటు తెలుస్తాడు.
ఆపైన వారిని మద్యం, గంజాయి, అమ్మాయిలు మొదలైన వాటికి బానిసలుగా చేసి తన ఆధీనంలో పెట్టుకుంటాడు.
 
అమ్మాయిలైతే రకరకాల పనులకు వినియోగిస్తాడు. వంటలు, పాచిపని, ఒళ్ళు నొక్కడం, లేబర్ పనులకు వాడుతాడు.
పెద్దమనిషి అయ్యాక రుచి చూసి తన జనానికి విందుగా వదిలేస్తాడు.
 
ఆ ప్రాంతంలో గంగాదాస్ కి 3 వేశ్యావాటికలు ఉన్నాయి.
 
హార్ధిక్ ఆ ప్రాంతం మొత్తం నడుస్తూ వెళ్తున్నాడు. అక్కడ ఉన్న వేశ్యలు హార్ధిక్ ని రమ్మని పిలుస్తున్నారు. అలా వెళ్తూ ఆ సందు దాటగానే ఒక పెద్ద ఖాళీ స్థలం కనిపించింది. దాని చుట్టూ రేకు షెడ్లు వేసిన ఇళ్ళు ఉన్నాయి.
అక్కడ రకరకాల మనుషులు ఉన్నారు.
కొంతమంది ఆయుధాల ఖార్ఖానాలో పని చేస్తున్నారు. తాగే వాళ్ళు తాగుతున్నారు. కొంతమంది కసరత్తు చేస్తున్నారు. కొంతమంది భాతాఖాని వేసుకుంటున్నారు.
అక్కడి వరకు హార్ధిక్ ని తీసుకొచ్చిన పిల్లాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
"ఎవరు కావాలి?" వెనకనుంచి ఉరిమింది ఒక కంఠం.
"గంగాదాస్ ని కలవాలి" చెప్పాడు హార్ధిక్.
హార్ధిక్ ఆహార్యం, చేతిలో బ్రీఫ్ కేస్, గౌరవం లేకుండా హార్ధిక్ అడిగిన తీరు చూసి ఎవడో బలిసినోడు అనుకుని "రండి సాబ్ ఇలా కూర్చోండి. దాదాని పిలుచుకొస్తాను" అని అక్కడ్నుంచి లోపలికి వెళ్ళిపోయాడు.
 horseride  Cheeta    
[+] 5 users Like sarit11's post
Like Reply


Messages In This Thread
RE: ఖర్కోటఖుడు by Naresh2706 - by sarit11 - 26-11-2018, 01:46 PM



Users browsing this thread: 14 Guest(s)