26-11-2018, 01:32 PM
ల్యాబ్ లో అందరూ మల్హోత్రాని వింతగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మల్హోత్రా ఉత్సాహంగా, నీరసంగా పనిచేశాడు కానీ ఇప్పుడు టెన్షన్ తో పని చేస్తున్నాడు. అసిస్టెంట్ లతో చేయించే పనులు కూడా తనే చేసుకుంటున్నాడు.
4గంటలకి ల్యాబ్ నుంచి బయటకు వచ్చాడు. తనకు కావలిసిన వివరాలు ఉన్న పెన్ డ్రైవ్ ఒకటి అక్కడి నుంచి మెల్లిగా తీసుకొచ్చేసాడు.
4.20 నుంచి పార్క్ లో ఠాగూర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఠాగూర్ ఠంచనుగా 4.30 కి అక్కడ ఉన్నాడు.
"హ్మ్మ్.. ఇప్పుడు చెప్పండి మల్హోత్రా. ఏం మాట్లాడాలి నాతో?" అన్నాడు సాలోచనగా.
"ఇక్కడ వద్దు సర్. జాగ్ చేస్తూ మాట్లాడుకుందాం రండి" అంటూ లేచి జాగింగ్ మొదలెట్టాడు మల్హోత్రా.
ఠాగూర్ అతణ్ణి వెంబడించసాగాడు.
"మీకొక విషయం చెప్పాలి ఠాగూర్. కానీ అది బయటకి తెలిస్తే నా ప్రాణమే పోతుంది. కానీ ఇప్పుడు తప్పట్లేదు. దానికి మీరు మాత్రమే అర్హులు అందుకే చెప్తున్నాను" అంటూ మొదలుపెట్టాడు మల్హోత్రా.
"ఇంతకూ మీరు చెప్పేది దేని గురించి?" అర్ధం కాక అడిగాడు సౌరవ్.
"రిచర్డ్స్ నా చేత ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ చెయ్యిస్తున్నాడు." అంటూ మొత్తం కథ చెప్పేసాడు మల్హోత్రా.
"వ్వాట్? టైం మెషిన్ ఆహ్? నాన్సెన్స్. ఇది చెప్పడానికి నేనే దొరికాన?" అంటూ మల్హోత్రా చెప్పింది వినగానే ఎర్రి పూకుని చెయ్యడానికి ఇంకెవరూ దొరకలేదా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఒకటి పెట్టాడు సౌరవ్.
"నేను చెప్పేది నిజం సర్" ఎలా నమ్మించాలో అర్ధం కాక అయోమయంగా ఉంది మల్హోత్రాకి.
"ప్లీజ్ సర్. నాన్సెన్స్ మాట్లాడకండి. మీ నోటి నుంచి ఈ మాటలు వినడానికి చాలా ఫన్నీగా ఉంది. నేనింకా రిచర్డ్స్ బిజినెస్ సీక్రెట్ ఏమైనా చెప్తారేమో అని ఆశగా వచ్చాను" అన్నాడు ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నట్టు సౌరవ్.
"మీరు నమ్మరని నాకు తెలుసు mr. సౌరవ్. ఈ పెన్ డ్రైవ్ చెక్ చేసి డీల్ ఆర్ నో డీల్ అనేది రేపు సేమ్ టైం కి చెప్పండి" అని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు మల్హోత్రా..
ఆ రాత్రి మల్హోత్రాకి నిద్ర పట్టలేదు. సౌరవ్ ఏం చెప్తాడో అని భయంగా ఉంది. ఇక్కడ సౌరవ్ కూడా అలాగే ఉన్నాడు. పెన్ డ్రైవ్ ఓపెన్ చేసాక అతనిలో ఏవేవో ఆలోచనలు పురుడు పోసుకున్నాయ్. కళ్ళు మూసినా తెరిచినా అందులో అతనికి ఆ టైం మెషీన్ బ్లూ ప్రింట్ మాత్రమే కనిపిస్తుంది. అంతలా అతని ఆలోచనల్లో జీర్ణం అయిపోయింది ఆ విషయం.
మర్రోజు సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా అని చూడసాగాయి ఆ రెండు ప్రాణాలు. ప్రేమికుల కన్నా దారుణంగా కలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు. సాయంత్రం నాలుగు కొట్టింది గడియారం అంతే ఇద్దరూ పార్కులో ప్రత్యక్షం అయ్యారు.
ఇద్దరూ ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నారు.
సౌరవ్ డీల్ అన్నట్టు తన బొటన వేలితో పైకి చూపించాడు. వెంటనే మల్హోత్రా పెదవుల మీద ఒక చిరునవ్వు మెరిసింది. ఇద్దరూ కలుసుకోగానే " ఐయాం విత్ యూ మల్హోత్రా. ఏం చేద్దాం" అన్నాడు సౌరవ్.
"నన్ను ఇక్కడి నుంచి బయట పడేయ్యండి. అది మీకు నేను ఫ్రీ అఫ్ కాస్ట్ చేసి పెడతాను" అన్నాడు మల్హోత్రా బతికితే చాలు అనే ఉద్దేశంతో.
"ఓకే థెన్ మీరు ఇండియాకి వెళ్ళిపోండి. అక్కడ నేను మీకు కావలిసిన టోటల్ ఎరేంజ్ మెంట్స్ చేసి ఉంచుతాను"
"కానీ రిచర్డ్స్ కి నేను ఏం చెప్పాలి?"
"దట్స్ నన్ అఫ్ మై బిజినెస్ mr. మల్హోత్రా. బయటకి వస్తే డీల్"
"ఓకే బట్ నేను ఇప్పుడు ఏదొకటి మేనేజ్ చేస్తాను. కానీ తర్వాత నా సెక్యూరిటీ మీ భాధ్యత"
"i'm in" అన్నాడు సౌరవ్ నడుస్తూ.
మల్హోత్రా ఆ రాత్రి నిద్రపోలేదు. ఆలోచిస్తున్నాడు.. ఆలోచిస్తున్నాడు. బుర్ర పగిలిపోతుంది. ఇండియాకి ఎలా వెళ్ళాలి.
అప్పటికే పెట్టె ఖాళీ చేసాడు. ఇంకో సిగరెట్ కాల్చాలి అంటే నోరు సహకరించలేదు. అందులోనూ బుర్ర బద్దలుకొట్టే తలనొప్పి ఒకటి. ఐస్ ప్యాక్ తీసి నుదురుకి ఆన్చాడు.
బుర్రలో ఎక్కడో మూల చిన్నగా స్ట్రైక్ అవుతుంది కానీ పూర్తి స్థాయిలో మ్యాప్ రెడీ అవ్వట్లేదు. దానినే డెవలప్ చేసుకుంటూ ఆ రాత్రి నిద్రపోయాడు.
పొద్దున్న లేస్తూనే రెడీ అయ్యి రిచర్డ్స్ రాక కోసం ఎదురుచూస్తున్నాడు.
రిచర్డ్స్ రావడంతోనే అతని ఛాంబర్ లో దూరేసాడు.
ఇదమిద్దంగా ఇది అని చెప్పలేని పరిస్థితిలో అసహనంగా నిలబడ్డ మల్హోత్రాని గమనిస్తూ "చెప్పండి" అన్నాడు రిచర్డ్స్.
"సర్ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ పూర్తయ్యే అవకాశాలు లేవు సర్" ప్రాణభయం తెచ్చిన ధైర్యంతో ధృఢంగానే చెప్పాడు మల్హోత్రా.
"వాట్ యూ మీన్?"
"ఐ మీన్ ఇక్కడ ఇది నా ఒక్కడి వల్ల పూర్తయ్యే విషయం కాదు సర్."
"అయితే మీకు కావలిసిన వాళ్ళని వాళ్ళకు కావలిసినంత ఇస్తాను రమ్మనండి" విషపు సర్పంలా నవ్వాడు రిచర్డ్స్. దాని వెనకున్న క్రూరత్వానికి మల్హోత్రా ఒళ్ళు జలదరించింది.
"ఇండియాలో ఇలా టైం ట్రావెలింగ్ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు కొంత మంది నాకు తెలుసు. వాళ్ళ ప్రాజెక్ట్ రిఫరెన్సులు తీసుకుంటే చాలా హెల్ప్‌ఫుల్ గా ఉంటుంది." చిటికెలో అల్లుతున్నాడు అబద్ధాలు మల్హోత్రా.
"అయితే ఆ అడ్రెస్ లు ఇలా ఇవ్వు. ఆ పేపర్స్ అన్నీ నేను రప్పిస్తాను"
"లేదు సర్. నాకు ఇక్కడ ఒకే చోట పని చేసి చేసి విసుగు పుడుతుంది. ఇలా అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తి అవ్వదు. అందుకే నేనే స్వయంగా వెళ్ళి అందరినీ కలిసి నా సందేహాలు కూడా తీర్చుకుని వస్తాను" స్థిరంగానే చెప్పాడు మల్హోత్రా.
"మీరే వెళ్ళాలి అని ఎందుకు పట్టు పడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు మల్హోత్రా. వాళ్ళు తీసుకొస్తే పని ఇంకా తొందరగా పూర్తి అవుతుంది కదా? వాళ్ళు వెళ్ళడానికి మీరు వెళ్ళడానికి తేడా ఏంటి?"
"చెఫ్ వండటానికి, యూట్యూబ్ లో చూసి వంట చెయ్యడానికి ఉన్నంత తేడా ఉంది. అయినా లేట్ చేసే కొద్దీ నాకే నష్టం. మీరు ఇచ్చే డబ్బు ఖర్చు చేసే సమయం తరిగిపోతుంది. అందుకే నా పనిని పూర్తి చేయాలని కంగారు పడుతున్నాను"
ఈ ఒక్క విషయం సరిపోయింది రిచర్డ్స్ కన్విన్స్ కావడానికి. డబ్బు మీద మల్హోత్రా కోరిక తెలిసిన వాడు కనుక ఒప్పుకున్నాడు.
"సరే ఎప్పుడు వెళ్తావ్ మల్హోత్రా?" అని అడిగాడు.
ఆ ఒక్క మాటతో మల్హోత్రా మనసు గాల్లో తేలిపోయింది. "ఇప్పుడే వెళ్తాను సర్" మాటలు తడబడుతున్నాయి మల్హోత్రాకి.
"ఓవ్.. ఓవ్.. అంత కంగారు పడకు మల్హోత్రా. థింగ్స్ ప్యాక్ చేసుకో. ఈవెనింగ్ ఫ్లైట్ కి వెళ్దువు గానీ" అన్న రిచర్డ్స్ మాటలతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మల్హోత్రా.
బట్టలు అన్నీ ప్యాక్ చేసాడు కానీ టైం మెషిన్ కి "కీ" టూల్ అయిన ఆ ట్రిగ్గర్ మాత్రం ల్యాబ్ లో ఉండిపోయింది.
అది లేకుండా ప్రాజెక్ట్ పూర్తీ అవ్వదు. అందుకే ఎలా అయినా దాన్ని తీసుకురావాలి అని ల్యాబ్ కి తిరిగి వచ్చాడు.
రిచర్డ్స్ అక్కడే కూర్చుని సిగార్ కాలుస్తున్నాడు.
"వాట్ మల్హోత్రా? ప్యాకింగ్ అయిపోయిందా?" కూల్ గా అడిగాడు రిచర్డ్స్.
"అ.. ఆ.. అవును సర్. చిన్న రిఫరెన్స్ కోసం కొన్ని ఐటమ్స్ తీసుకువెళ్దాం అని వచ్చాను." అన్నాడు నుదురుకు పట్టిన చెమట తుడుచుకుంటూ.
"go ahead" అన్నాడు రిచర్డ్స్ చైర్ లో వెనక్కు వాలి.
తన పని ఇంత సులువుగా అవుతుందని అనుకోలేదు మల్హోత్రా.
వెళ్ళి అది ఒక్కటే తీసుకుంటే అనుమానం కలుగుతోంది అనిపించి.
ప్రాజెక్ట్ బ్లూప్రింట్, ట్రిగ్గర్, ట్రిగ్గర్ నమూనా, ఇంకా కొన్ని వస్తువులు తీసుకుని బయల్దేరాడు. గుమ్మం దాటుతుండగా "ఆగు.." అన్న రిచర్డ్స్ పిలుపుకు ఠక్కున ఆగిపోయాడు.
"వాటిని ఇలా తీసుకురా" అన్నాడు రిచర్డ్స్.
భయంగానే ఆ బ్యాగ్ ని రిచర్డ్స్ ముందు పెట్టి ఒక్కొక్క వస్తువుని బయటకు తీస్తున్నాడు మల్హోత్రా.
వాటిలో ఒక వస్తువు మాత్రం రిచర్డ్స్ కళ్ళని ఆకర్షించింది.
"అదేంటి?" అన్నాడు రిచర్డ్స్.
"సార్ ఇది ట్రిగ్గర్" భయంగానే చెప్పాడు మల్హోత్రా.
దీని గురించి అబద్ధం చెప్పొచ్చు అది ఎంత ప్రమాదకరమో మల్హోత్రాకి ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు. అందుకే తెగించి నిజం చెప్పేశాడు.
"ఓహ్.. ట్రిగ్గర్ అంటే ఇదేనా? దీని వల్ల అనుకుంట కదా పని మొత్తం ఆగిపోయింది అని చెప్పావ్?" అన్నాడు రిచర్డ్స్ దాన్ని పరీక్షగా చూస్తూ..
"హా అవును సర్.. అందుకే అక్కడ దీన్ని పరీక్షిద్దాం అని తీసుకు వెళ్తున్నాను సర్" ఒక అబద్దాన్ని నమ్మకంగా చెప్పడానికి ప్రయత్నించాడు.
"నో నో నో.. ఇంత ఇంపార్టెంట్ వస్తువు అక్కడికి ఎందుకు? రీసెర్చ్ అయ్యాక ఇక్కడే ఏమైనా ఉంటే చేద్దువుగాని. లీవ్ ఇట్ హియర్." అంటూ ట్రిగ్గర్ తీసేసుకున్నాడు రిచర్డ్స్.
మల్హోత్రా గుండెల్లో బాంబులు పేలాయి. అది లేకుండా తన జర్నీ అసాధ్యం. గుండె చిక్కబెట్టుకొని "అక్కడికి తీసుకెళ్తే ఏమైనా పని చేసేది లేనిది తెలుస్తుంది కదా అని" అంటూ మంద్ర స్వరంతో నసిగాడు మల్హోత్రా.
"వాట్ మల్హోత్రా? మెషిన్ లేనప్పుడు ఇక పని చేసేది లేనిది నీకెలా తెలుస్తుంది? అక్కడ నిర్మిస్తావా మెషిన్?" రిచర్డ్స్ నవ్వుతూ అడిగినా అందులో నిగూఢ అర్ధం మల్హోత్రా గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.
"అది కాదు సర్.." అంటూ మల్హోత్రా ఏదో చెప్పబోయేంతలో "మల్హోత్రా.. జస్ట్ షటప్ అండ్ లీవ్ విత్ దోస్ థింగ్స్." అనేసి సిగార్ ఒక్క దమ్ము లాగి కళ్ళు మూసుకున్నాడు.
ఇక రిచర్డ్స్ కి చెప్పడం తన వల్ల కాదని స్పష్టం అవుతోంది. అందుకే నిరాశగా బయటకి నడుస్తున్నాడు నిస్సత్తువగా ఒక్కో అడుగు వేస్తూ.
"మల్హోత్రా.. జస్ట్ ఏ మినిట్" అన్న రిచర్డ్స్ మాటకు మల్హోత్రా ఏంటి అన్నట్టు వెనక్కు తిరిగి చూసాడు.
"వెళ్ళే ముందు ఒక్కసారి మెషిన్ ని టెస్ట్ చేసి వెళ్ళండి." అంటూ ట్రిగ్గర్ కాళ్ళ ముందు ఉన్న టీపాయ్ మీద పెట్టి మల్హోత్రా వంక చూసాడు.
మల్హోత్రా నడుస్తూ వస్తున్నాడు కానీ గుండెల్లో దడా వణుకు వడా పునుకు మొదలైపోయింది.
ఆ ట్రిగ్గర్ తీసుకుని మెషిన్ ఛాంబర్ లోనికి వెళ్ళిపోయాడు.
మల్హోత్రా లోపల విపరీతమైన భయంతో నిలబడి ఉన్నాడు.
ఇంతలో రిచర్డ్స్ గొంతు "రెడీ మల్హోత్రా.. 3.. 2.. 1.. స్టార్ట్" అని కర్కశంగా వినిపించింది.
మల్హోత్రాకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అన్యమనస్కంగానే "yeah.. రెడీ సర్" అన్నాడు.