26-11-2018, 01:26 PM
"హా అవును సర్.. నేను బయట కార్ లో ఉన్నాను" అన్నాడు హర్ధిక్.
5 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాడు మల్హోత్రా. హర్ధిక్ ఎదురుగా నిలబడి ఉన్నాడు.
ఇంతకు ముందే అతని ఫోటో చూసి ఉండటం వల్ల నేరుగా హర్ధిక్ దగ్గరికి వచ్చి పలకరించాడు.
"హాయ్.. ఆర్ యూ హర్ధిక్?"
"అవును. మీరు మల్హోత్రా నా?"
"మీ ఫాదర్ మీకు చెప్పారా?"
"హ్మ్మ్.. ఏదో ఇస్తారు అన్నారు. అంతే"
"హా అవును. హియర్ ఇట్ ఈజ్" అంటూనే ఒక బ్రీఫ్ కేస్ అతని చేతికి ఇచ్చాడు.
"అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ ఫాదర్ దీని గురించి మీకు అన్ని విషయాలూ చెప్తారు. మీకు ఇక్కడ అన్నీ చెప్పలేను. ఒక్కసారి మీ మెయిల్ చెక్ చేసుకోండి. బాక్స్ లో ఉన్న ట్రిగ్గర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అది నా సంవత్సరాల కష్టం" అని నిట్టూరుస్తూ వెళ్లిపోయాడు.
"ఆగండి సర్.. మీరు చెప్పింది నాకు అర్ధం కాలేదు. సరే ఇప్పుడు రెస్ట్ తీసుకుని రేపొద్దున్నే వెళ్ళండి" అంటూ మల్హోత్రా వెనకాల పడ్డాడు హర్ధిక్.
"లేదు నేను వెళ్ళాలి హర్ధిక్. వీలు చూసుకుని నిన్ను మళ్ళీ కలుస్తాను. నీ నెంబర్ నా దగ్గర ఉంది. నేను కాల్ చేస్తాను" అంటూ అక్కడి నుండి వేగంగా వెళ్లిపోయాడు మల్హోత్రా. మరి హర్ధిక్ కూడా అతన్ని వారించే ప్రయత్నం చేయలేదు. మనిషిని చూస్తే చాలా కంగారుగా ఉన్నాడు.
అదేంటో తెలుసుకోవాలని పెట్టె ఓపెన్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఇక్కడ కాదని దానిని కారులో పెట్టుకుని రూం కి బయలుదేరాడు.
మల్హోత్రా ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్ ఎక్కాడు. ఫ్లైట్ టేక్ ఆఫ్ కి సిద్ధంగా ఉంది. తన సీట్ లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.
అతని కళ్ళ ముందు జరిగిన సంఘటనలు గిర్రున తిరిగాయి.
అసలేం జరిగింది. మల్హోత్రా ఏంటి? ఎందుకు ఇలా ఇక్కడ ఉన్నాడు?
అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు.
మల్హోత్రాకి, హర్ధిక్ తండ్రికి సంభందం ఏంటి?
హర్ధిక్ కి ఇచ్చిన బాక్స్ లో ఏమున్నాయి?
అసలు తర్వాత ఏం జరగబోతుంది?
ఇంత జరుగుతున్నా రిచర్డ్స్ ఎందుకు మౌనంగా ఉన్నాడు?
హర్ధిక్ హోటల్ కి చేరుకున్నాడు. రూమ్ కి వెళ్ళగానే రిసెప్షన్ కి కాల్ చేసి మందు, ఫుడ్ ఆర్డర్ చేసాడు. సోఫాలో కూర్చుని బాక్స్ ఓపెన్ చేసాడు.
అందులో ఒక ఎలెక్ట్రానిక్ డివైస్ ఉంది. అది చూడటానికి కత్తి పిడిలా ఉంది. అది కాకుండా ఒక పెన్ డ్రైవ్ ఇంకా ఒక ఫైల్ ఉంది.
ఫైల్ ఓపెన్ చేసాడు. ఇంతలో డోర్ బెల్ మోగింది. ఫైల్ పక్కన పెట్టేసి ఓపెన్ చేసాడు. బాయ్ వచ్చి అతని ఆర్డర్ లోపల పెట్టేసి వెళ్లిపోయాడు.
బాటిల్ లో మందు గ్లాసులో ఒంపుకుని సిగరెట్ తాగుతూ ఫైల్ చదవసాగాడు. అది ఓపెన్ చెయ్యగానే "TIME TRAVELLING" అని టైటిల్ కనిపించింది. అందులో రకరకాల డిజైన్స్ ఉన్నాయి. అవన్నీ మెషీన్ తయారు చేసే విధానం గురించి వివరిస్తున్నాయి.
ఫైల్ మూసేసి మందు తాగుతూ లాప్టాప్ కి పెన్ డ్రైవ్ పెడదాం అని ఓపెన్ చేసాడు.
స్క్రీన్ మీద మెయిల్ రిసీవ్ అయినట్టు నోటిఫికేషన్ వచ్చింది. అది మల్హోత్రా మెయిల్. అందులో ఒక వీడియో ఉంది.
దానిని ప్లే చేసాడు. అదలా ఉండగా ఇక్కడ మల్హోత్రా బుర్రలో జ్ఞాపకాలు గిర్రున తిరుగుతున్నాయి.
నిన్న ఏం జరిగిందో గుర్తు చేసుకుంటే గుండె ఆగినట్టు ఉంది మల్హోత్రాకి.
ఒక్క రోజు వెనక్కి...
మల్హోత్రా ల్యాబ్ లో పని చేసుకుంటున్నాడు. ఇంతలో మెయిన్ సర్వర్ స్ట్రక్ అయ్యింది. 5 నిముషాలు పని చెయ్యలేదు. అది మళ్ళీ మాములుగా పనిచెయ్యడం మొదలుపెట్టగానే ట్రిగ్గర్ లోపల కనెక్షన్ ఒకటి శాచురేట్ అయిపోయింది. కానీ అప్పటి వరకు ట్రిగ్గర్ తయారీకి ఏదో తెలియని అడ్డంకి తొలగిపోయింది. అవును ట్రిగ్గర్ పనిచేయడం మొదలుపెట్టింది.
మల్హోత్రా ఆనందానికి అవధులు లేవు.
వెంటనే ఈ విషయం చెప్పడానికి ఫోన్ అందుకున్నాడు. కానీ దీని పనితీరు పరిశీలించడానికి నిర్ణయం తీసుకున్నాడు.
ట్రిగ్గర్ తీసుకుని సీక్రెట్ డోర్ దగ్గరికి వచ్చాడు. స్కానర్ మీద చెయ్యి పెట్టగానే అడుగు మందం ఉన్న ఉక్కు తలుపు చప్పుడు లేకుండా తెరుచుకుంది.
లోపల లైట్లు వెలిగి రూమ్ మొత్తం వెలుగు పరుచుకుంది.
కానీ అది రూమ్ కాదు.
*****TIME MACHINE*****