17-03-2020, 05:22 PM
ఆధునిక విజ్ఞానం అవగాహన
ఈనాడు శాస్త్రీయ విజ్ఞానం దినదినాభివృద్ధి చెందటం లేదు; క్షణక్షణాభివృద్ధి పొందుతున్నది. వివిధ దేశాలలోని శాస్త్రజ్ఞులు ఏక కాలంలో ఎన్నెన్నో విషయాల పై పరిశోధనలు జరుపుతున్నారు; కొత్త విషయాలను కనిపెడుతున్నారు; నూతన పరికరాలను సృష్టిస్తున్నారు.
శాస్త్రజ్ఞులు సాధిస్తున్న ఈ వినూత్న విజయాలవల్ల ఆధునిక జీవితం నానాటికీ చాలా సౌకర్యవంతమవుతున్నది. టెలిఫోను, రేడియో, టెలివిజన్, చలన చిత్రాలు, విమానాలు, టర్బో జెట్ యింజన్లు, రాకెట్లు, పరమాణు రియాక్టర్లు మొదలైన వాటివల్ల సామాన్య ప్రజల జీవిత విధానాలలో సైతం మార్పులు వస్తున్నాయి.
ఈ అద్భుతమైన విజ్ఞాన విజయాలను శాస్త్రజ్ఞులు ఎలా సాధించారు? నేడు మనం వాడుతున్న యాంత్రిక పరికరాలను ఎలా కని పెట్టారు?' మనం నిత్యం వాడుకొనే విద్యుద్దీపం, రేడియో సెట్టు మొదలైనవి ఏ సూత్రాల పై పని చేస్తాయి? మనం ప్రయాణం చేసే కారూ, డీసిలు బస్సూ మొదలైనవి ఎలా నడుస్తాయి. ఇటువంటి ప్రశ్నలకు సరళమైన జవాబులు చెప్పే సులభ గ్రంథాలు మన భారతీయ భాషల్లో, అందులోనూ ఆంధ్రంలో అరుదనే చెప్పాలి.
ఆ దిశగా యోచించి రచించినదే ఈ పుస్తకం. ఆంగ్లంలో విలియం హెచ్. క్రౌజ్ వ్రాసిన 'Understanding Science'ని తెలుగులోకి అనువదించారు ఆరుద్రగారు.
>>> డౌన్లోడ్ <<<★★★
కాటమరాజు కథ
(స్టేజి నాటకం)
“కాటమరాజు కథ” అనే నాటకం ఆరుద్రగారి విశిష్ట రచన, ఒక అద్భుత సృష్టి. దీని రచన 1961లో జరిగిందనీ, శ్రీయుతులు జె.వి. రమణమూర్తి, పి.జె. రావు వంటి నటుల కోరికపై దీనిని వ్రాశారనీ, ఆ నటులు దీనిని పది పదిహేనుసార్ల కన్నా ఎక్కువగానే ప్రదర్శించారనీ శ్రీమతి రామలక్ష్మి ఆరుద్ర తెలియజేస్తున్నారు. ఈ నాటకం " ప్రగతి'' వారపత్రికలో 1-8-1969 నుండి 24-10-1969 వరకూ ధారావాహికంగా ముద్రింపబడింది.
ప్రాచీనమూ ప్రశస్తమూ అయిన చారిత్రక వీరగాథలలో పల్నాటి వీరకథల తరువాత ఎన్నదగినవి కాటమరాజు కథలు.
ఇవి ఒక సుదీర్ఘ కథాచక్రంగా ఏర్పడి ఉన్నాయి. కాని పల్నాటి వీరకథలను గురించి జరిగినంత పరిశోధన వీటిని గురించి జరగలేదు. అందుచేత ఈ వీరగాథావృత్తంలోని అనేక గాథలు సాహిత్యలోకానికి అపరిచితాలుగా ఉండిపోయాయి. తెలుగు వీరగాథలలో ఇంత పెద్ద వీరగాథావృత్తం మరొకటి లేదు. దీంట్లో మొత్తం 32 వీరగాథలు ఉన్నాయని కొందరి పరిశోధనల వల్ల తెలుస్తోంది.
>>> డౌన్లోడ్ <<<గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK