17-03-2020, 01:30 PM
(This post was last modified: 17-03-2020, 04:51 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
ఆరుద్ర రచన కవితలు
(విపుల సంకలనం)
ఉత్తేజంలో ఆ'రుద్రుడు' తన కలం ద్వారా సృష్టించిన అద్భుతం ఈ విపుల కవితా సంకలనం.అందులోని ఒక చెణుకు—
విజయ విహారం
ఎండిన దేహాల
మండిన హృదయాలకు
చెయ్యండ్రా రక్త ప్రదానం
పొయ్యండ్రా వీరామృతం
ప్రపంచమంతటా
ప్రజలను లేప
చీల్చండ్రా శత్రు సమూహం
పీల్చండ్రా వారి జీవం
భూగోళపు
టంచులమీద
తియ్యండ్రా రక్త చందనం
పుయ్యండ్రా వీరుల మెడలకు—
>>> డౌన్లోడ్ <<<
★★★
మన వేమన
శ్రీ తల్లం పుల్లన్నగుప్త గారు కడపజిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో 29-5-1917న జన్మించారు. తండ్రి వీరయ్య శ్రేణి గారు, తల్లి సుబ్బమ్మ గారు తల్లిదండ్రులు దాన తత్పరులు ఆ గుణం పుత్రులయిన శ్రీ పుల్లన్న గుప్త గారిలో నిండుగా కన్పిస్తుంది. శ్రీ పుల్లన్నగుప్త గారు మూడు దశాబ్దాలుగా వ్యాపార నిమిత్తం మద్రాసులో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు అనేక సంస్థలకు, ఆస్పత్రులకు, దేవాలయాలకు భూరి విరాళాలను ఇచ్చినారు శ్రీ కన్యకాపరమేశ్వరి ధర్మ సంస్థలో సభ్యులుగా, ఆ సంస్థ నిర్వహించే విద్యాలయాలకు ప్రధాన కార్య నిర్వహకులుగా శ్రీ పుల్లన్నగుప్త గారు చేస్తున్న సేవ గణనీయమైంది
1981లో ఆరుద్రగారి చేత వేమనగారిపై రెండు ఉపన్యాసాలు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇప్పించారు. ఆ సందర్భంలోనే వేమన గారికి పై మరికొన్ని వ్యాసాలుకూడా ప్రచురించవలసినవి ఉన్నాయని ఆరుద్ర గారు చెప్పగా అన్నిటినీ కలిపి ఒకే గ్రంధంగా ప్రచురించే ప్రయత్నానికి శ్రీ గుప్తగారు తోడ్పడుతా మన్నారు. అది ఈ పుస్తకం ద్వారా సాకారమైంది.
— ధర్మనిధి సంస్థాపకులు
>>> డౌన్లోడ్ <<<
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK