19-02-2020, 10:06 PM
మేము స్టోర్ మేనేజర్ ఇల్లు ఉన్న వీధిలోకి వెళ్ళే సరికి అక్కడ చాల మంది జనాలు గుమి కుడి ఉన్నారు. బైక్ ముందుకు వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది గుంపు
"ఏమైంది " అంటూ నేను బైక్ నుంచి దిగి ఆ గుంపు లోకి వెళ్లాను , అక్కడ ఓ వ్యక్తీ రక్తపు మడుగులో పడి ఉన్నాడు , అప్పుడే లారీ వచ్చి గుద్ది వెళ్ళింది అని చెప్తున్నారు అక్కడ జనాలు, కొద్ది దూరం లో ఆగిన లారీ ఉంది , కానీ డ్రైవర్ అక్కడ నుంచి పారి పోయాడు అని చెప్పారు. నా వెనుక బైక్ ను పార్క్ చేసి వచ్చిన డాక్టర్ అక్కడ ఆక్సిడెంట్ అయిన వ్యక్తిని చూసి షాక్ తిన్నాడు.
"శివా , మనం ఎవరి కోసం వచ్చామో , ఆ స్టోర్ మేనేజర్ వీడే రా , కావాలనే ఎవరో వీడిని చంపేశారు" అంటూ అతని దగ్గరి కి వెళ్లి నాడిని పట్టుకొని చూసి, "లాభం లేదురా పోయి ఓ 5 నిమిషాలు అవుతూ ఉన్నట్లు ఉంది " అన్నాడు.
వెంటనే మల్లి కార్డునకు ఫోన్ చేసి విషయం చెప్పాను , ఆ లోకల్ స్టేషన్ కి కాల్ చేసి force పంపుతున్నా మీరు అక్కడే ఉండండి అని చెప్పి కాల్ కట్ చేసాడు.
ఓ 10 నిమిషాలకు అంబులెన్సు తో పాటు సెక్యూరిటీ అధికారి లు వచ్చి అక్కడున్న బాడీ ని క్లియర్ చేసారు.
"ఇదేంటి రా , ఎదో ఒక దారి దొరికింది అనుకుంటే దాన్ని కూడా మూసేశారు , ఇప్పుడు ఎలా మూవ్ కావాలి "
"చూద్దాం ఎదో ఒక లింక్ దొరకక పోదు , ఇంతకూ మీకు ఈ మెడిసిన్స్ ఎక్కడ నుంచి వస్తాయో ఆ రికార్డ్స్ ఉంటాయి గా. అవి తెలిస్తే బాగుండు"
"ఆఫీస్ లో కంప్యూటర్ లో ఉంటాయి ఆ డీటెయిల్స్ , కానీ అవన్నీ originals, ఈ ఫేక్ రీప్లేస్ చేసేది స్టోర్స్ వాళ్ళే తెలిస్తే అక్కడే తెలియాలి "
"సరే , రేపు ఓ సారి ఆఫీస్ కి వెళ్దాం , అక్కడ మరో మారు అడుగుదాం ,ఏమైనా తెలుస్తుంది ఏమో "
ఇద్దరం డాక్టర్ ఇంటికి వచ్చాము , రేపు వాళ్ళ హాస్పిటల్ లో 10 గంటలకు కలుద్దాం అని చెప్పి నేను ఇంటికి బయలు దేరాను.
సింపుల్ గా అయిపోతుంది అను కొన్నది complicated గా మారుతుంది , లెట్ చేస్తే వాడికి జైలు తప్పదు , దీని వెనుక పెద్ద గ్యాంగ్ ఉన్నట్లు ఉంది , దొరికిన ఒక్క ఆధారాన్ని చంపేశారు , అంటే చనిపోయిన వాడికి వాళ్ళ గురించి అన్నీ తెలిసే ఉంటాయి. అందుకే వాడు ఎప్పటికైనా problem కలిగిస్తాడు అని చంపారు.
ఆలోచిస్తూ ఇంటికి చేసుకున్నాను. అక్కడే తిని రావడం వళ్ళ డైరెక్ట్ గా బెడ్ రూమ్ కి వెళ్లి డ్రెస్ మార్చు కొని బెడ్ ఎక్కాను. కేసు గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను.