Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
637 87.50%
Good
9.89%
72 9.89%
Bad
2.61%
19 2.61%
Total 728 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 169 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
దాంతో కమీషనర్ కారు స్టార్ట్ చేసి పోనిస్తున్నాడు.

మిగతా ఆర్మీ వాళ్ళు, సెక్యూరిటీ ఆఫీసర్లు తమ కార్లలో మేజర్‍ని ఫాలో అవుతున్నారు.
రాము తన దగ్గర ఉన్న వాకీటాకీలో ట్రాఫిక్ సెక్యూరిటీ ఆఫీసర్లతో మాట్లాడుతూ ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా చూస్తున్నాడు.
అలా వాళ్ళు సిటీ అవుట్‍స్కర్ట్‍లో వచ్చారు.
కమీషనర్ : వెంకట్….ఇలా ఒక మేజర్ శరీరంలో ఉండి ఇలా చేయడం పధ్ధతి కాదు….
మేజర్ నాగేష్(వెంకట్) : తప్పేం లేదు కమీషనర్….మనుషులు ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటారు….కాని అది ఎవరి వల్లా కాదు….కాని నేను ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాను…నాకు చావు లేదు…నేను ఎన్నేళ్ళు బ్రతకాలనుకుంటే అన్నేళ్ళు బ్రతుకుతాను….
అలా వెళ్తున్న వాళ్లకు కారులో డీజిల్ అయిపోతున్నట్టు ఇండికేషన్ చూపిస్తున్నది.
కమీషనర్ : డీజిల్ అయిపోతున్నది….
మేజర్ నాగేష్ : అలాగే….
దాంతో కమీషనర్ కారుని అక్కడ హైవే మీద ఉన్న పెట్రోల్ బంక్‍లోకి పోనిచ్చి ఆపాడు.
రాముతో పాటు అందరూ కూడా తమ కార్లను పెట్రోల్ బంక్ ముందు ఆపి గన్స్ పట్టుకుని పొజిషన్స్‍లో నిల్చున్నారు.
తనతో పాటు వచ్చిన వాళ్లను అక్కడే నిలబడమని సైగ చేసి రాము గన్ పట్టుకుని మెల్లగా పెట్రోల్ బంక్‍లోకి వెళ్లాడు.
లోపలకు వెళ్ళిన రాముకి కారులో కమీషనర్‍ని షూట్ చేసి మేజర్ తప్పించుకుని పోయాడని అర్ధమయింది.
రాము వెంటనే అంబులెన్స్‍కి ఫోన్ చేసి కమీషనర్‍ని హాస్పిటల్‍కి పంపించాడు.
కాని మేజర్ ఎక్కడకు వెళ్లాడో అర్ధంకాక ఆలోచిస్తున్న రాముకి కారు వెనకాల డీజిల్ పైప్ పెట్టి ఉండటంతో ట్యాంక్ నిండిపోయి డీజిల్ బయటకు కారి పోవడం చూసాడు.
అలా డీజిల్ కారిపోతూ అక్కడ కొంచెం దూరంలో ఉన్న లైటర్ దగ్గరకు వెళ్ళడం చూసిన రాము వెంటనే రియాక్ట్ అయ్యి పెట్రోల్ బంక్ నుండి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు.
కాని అప్పటికే డీజిల్ లైటర్ దగ్గరకు రావడంతో పెట్రోల్ బంక్ పేలిపోవడంతో రాము ఎగిరిబయట ఉన్న తన కారుకి గుద్దుకుని కింద పడిపోయాడు.
దాంతో కొద్దిసేపటి వరకు రాముకి సృహ రాలేదు….అప్పటికే అంబులెన్స్‍లు వచ్చి అక్కడ గాయపడిన వాళ్ళందరినీ హాస్పిటల్‍లో చేర్చారు.
హాస్పిటల్‍లో చేర్చిన కొద్దిసేపటికి రాము సృహలోకి వచ్చాడు.
రాము వెంటనే తన టీంని పిలిచి మొత్తం జరిగింది తెలుసుకుని, “ఇప్పుడు మేజర్ నాగేష్(వెంకట్) ఎవరి కోసం వెళ్ళుంటాడు….” అని ఆలోచిస్తున్నాడు.
అలా ఆలొచిస్తున్న రాముకి ఇంతకు ముందు మనోజ్ చెప్పిన మాటలు, “వెంకట్….తన కోసం స్పెషల్‍గా ఒక ల్యాబ్ తయారు చేయించుకున్నాడు….” అన్న మాటలు గుర్తుకు రావడంతో అక్కడ ఉన్న SIతో, “తప్పకుండా సైంటిస్ట్ మనోజ్ కోసం వెళ్ళుంటాడు….ఆయన ఒక్కడే మనకు ఈ పరిశోధన విషయంలొ హెల్ప్ చేస్తున్నది…ఆయన ప్రాణానికి ప్రమాదం ఉన్నది….తొందరగా వెళ్దాం పదండి,” అంటూ అక్కడ నుండి బయటకు వచ్చి కారులో మనోజ్ ఇంటికి బయలుదేరాడు.
ఇక్కడ మనోజ్ తన ఇంట్లో ఫ్యామిలీతో కూర్చుని న్యూస్ అప్‍డేట్‍లో మేజర్ నాగేష్(వెంకట్)కి సెక్యూరిటీ ఆఫీసర్లకు జరిగిన చేజింగ్, పెట్రోల్ బంక్‍లో జరిగిన బ్లాస్టింగ్ చూస్తున్నారు.
అలా చూస్తున్న వాళ్ళకు అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టిన మేజర్ నాగేష్(వెంకట్) వాళ్ల వైపు చూసి నవ్వుతూ అక్కడకు వచ్చి వాళ్ళ ఎదురుగా ఉన్న చైర్‍లో కూర్చున్నాడు.
మేజర్ నాగేష్(వెంకట్)ని చూసిన వాళ్లకు ఏం చేయాలో తెలియక భయంతో లేచి నిల్చున్నారు.
మేజర్ నాగేష్(వెంకట్) : ఏంటి….కొత్త వ్యక్తిని చూసినట్టు అలా భయపడిపోతున్నారేంటి….కూర్చోండి….
మేజర్ అలా అనగానే మళ్ళి ఏం చేస్తాడో అన్న భయంతో అందరూ మళ్ళీ సోఫాలో కూర్చున్నారు.
మేజర్ నాగేష్ (వెంకట్) : ఎలా ఉన్నావు మనోజ్…..(అంటూ సిగార్ వెలిగించుకుంటున్నాడు.)
************
అప్పుడే రాము కారు మనోజ్ ఇంటి ముందు ఆగింది.
కారు ఆగిన వెంటనే రాము కిందకు దిగి గేటు తీసుకుని లోపలికి పరిగెత్తాడు.
కాని మనోజ్ ఇంటికి తాళం వేసి ఉండటంతో అక్కడ ఉన్న కిటికీ లోనుండి చూసిన రాముకి లోపల మనోజ్ పిల్లల్ని కట్టేసి…వాళ్ళు అరవకుండా నోటికి ప్లాస్టర్స్ వేసి ఉండటం చూసాడు.
రాము వెంటనే గన్ తీసుకుని ఇంటి తాళాన్ని షూట్ చేసి లోపలికి వెళ్ళగానే అతనితో పాటు వచ్చిన వాళ్ళు మనోజ్ భార్య, పిల్లల కట్లు విప్పేసారు.
అంతలో లోపల నుండి మనోజ్ కూతురు గన్‍తో బయటకు వచ్చి రాముకి aim చేసింది.
రాము వెంటనే పైకి లేచి నిల్చుని, “ఏయ్….ఏం చేస్తున్నావు,” అన్నాడు.
“నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తే….వాడు మా నాన్నని చంపేస్తాడు…” అంటూ కంగారు పడిపోతున్నది ఆ అమ్మాయి.
“తొందర పడకు…నీకు ఈ గన్ ఎవరు ఇచ్చారు…ఇంతకు మీ నాన్న, మేజర్ నాగేష్(వెంకట్) ఎక్కడ ఉన్నారు,” అనడిగాడు రాము.
కాని ఆ అమ్మాయి భయపడుతూ కంగారుగా తన చేతిలో ఉన్న గన్‍ని దించకుండా భయంగా చూస్తున్నది.
“చూడు….టెన్షన్ పడకుండా జరిగింది చెప్పు….నీ తమ్ముడికి ఆస్తమా ఉన్నది….స్నీజింగ్ వలన ఊపిరాడక ఇబ్బంది పడుతున్నాడు…ముందు ఇన్‍హేలర్ ఎక్కడ ఉన్నదో చెప్పు,” అంటూ రాము మెల్లగా ఆ అమ్మాయి దగ్గరకు రావడానికి ట్రై చేస్తున్నాడు.
పక్కనే ఉన్న కానిస్టేబుల్ ముందుకు వచ్చి, “అమ్మా….నా మాట విను,” అంటూ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళబోయాడు.
దాంతో ఆ అమ్మాయి కళ్ళు మూసుకుని గన్ షూట్ చేసేసరికి బుల్లెట్ కానిస్టేబుల్ భుజంలో తగిలింది.
కానిస్టేబుల్ అలాగే వెనక్కు సోఫాలో పడిపోయాడు.
రాము వెంటనే కానిస్టేబుల్ దగ్గరకు వెళ్ళి ఏమయిందో అని కంగారు పడుతున్నాడు.
అది చూసిన కానిస్టేబుల్, “సార్…నాకేమీ కాలేదు…ముందు ఆ అమ్మాయిని సేవ్ చేయండి,” అన్నాడు.
ఇంతలో ఆ అమ్మాయి తన ఫ్యాంట్ పాకెట్‍లో ఉన్న ఇన్‍హేలర్ తీసుకుని తన తమ్ముడికి ఇచ్చింది.
అతను వెంటనే ఇన్‍హేలర్ తీసుకుని దాన్ని నోట్లో పెట్టుకుని ప్రెస్ చేసాడు.
ఆ అమ్మాయి తన ఫోన్ తీసుకుని తన తండ్రికి ఫోన్ చేసింది.
మనోజ్ ఫోన్ కట్ చేయడంతో ఆ అమ్మాయి ఫోన్ పక్కన పెట్టేసి రాము వైపు గన్ చూపిస్తూ, “కదలొద్దు…. దగ్గరకు రావాలని ట్రై చేస్తే షూట్ చేస్తాను,” అంటున్నది.
ఇంతలో ఆ అమ్మాయి తమ్ముడు first aid box తీసుకొచ్చి కానిస్టేబుల్‍కి రక్తం ఎక్కువ పోకుండా కట్టు కట్టాడు.
ఇక ఆ అమ్మాయి ఏం చేయదని రాముకి నమ్మకం కుదిరాక చిన్నగా వెనక్కు తిరిగి అక్కడ నుండి బయటకు వచ్చాడు.
***********
అయితే ఇక్కడ న్యూరో ఇన్‍స్టిట్యూట్‍లో మేజర్ గన్ పట్టుకుని మనోజ్ ని బెదిరిస్తూ లోపలికి తీసుకెళ్ళాడు.
మనోజ్ ల్యాబ్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న సిస్టమ్స్ ని యాక్టివేట్ చేస్తున్నాడు.
ఇంతలో తన ఫోన్ మోగడంతో మనోజ్, మేజర్ నాగేష్ (వెంకట్) లు ఫోన్ లో అతని కూతురు నెంబర్ చూసి నాగేష్ తన చేతిలో ఉన్న గన్‍ని మనోజ్ తల మీద పెట్టి, “వాడు రాము మీ ఇంటికి వచ్చాడు….తొందరగా కానివ్వు,” అన్నాడు.
దాంతో మనోజ్ ఫోన్ కట్ చేసి అక్కడ ఉన్న మిషన్స్ కి యాక్సెస్ కోడ్‍లు ఎంటర్ చేసి వాటిని యాక్టివేట్ చేయడం మొదలుపెట్టాడు.
సిస్టమ్ యాక్సెస్ చేసిన తరువాత క్యూబాక్స్ పెట్టడానికి ఇంకో మిషన్ దగ్గరకు వెళ్ళి మనోజ్ తన బయోమెట్రిక్ యాక్సెస్ కోసం చేతిని యాక్సెస్ పాయింట్ మీద పెట్టాడు.
దాంతో మిషన్ మనోజ్ చేతిని స్కాన్ చేసి మ్యాచ్ అవడంతో క్యూబాక్స్ పెట్టడానికి డోర్ ఓపెన్ అయింది.
మేజర్ నాగేష్ తన చేతిలో ఉన్న క్యూబాక్స్ మనోజ్ చేతిలో పెట్టాడు.
మనోజ్ ఆ క్యూబాక్స్ ని సిస్టమ్ లోపల పెట్టగానే అది లోపలికి వెళ్ళిపోయి పని చేయడం మొదలుపెట్టింది.
క్యూబాక్స్ పని చేయడం మొదలవగానే మేజర్ నాగేష్ తన చేతిలో ఉన్న రివాల్వర్‍తో మనోజ్ తల మీద కొట్టడంతో అతను సృహతప్పి కింద పడిపోయాడు.
మేజర్ నాగేష్(వెంకట్) కింద పడిన మనోజ్ చేయి పట్టుకుని ఈడ్చుకుంటూ పక్కకు తోసి….అక్కడ ఉన్న కంప్యూటర్‍లో తనకు సంబందించిన మెమరీ ఫైల్స్ అప్‍డేట్ చేయడం మొదలుపెట్టాడు.
క్యూ బాక్స్ లో ఉన్న మెమరీని మొత్తం హార్డ్‍డిస్క్‍లో కాపీ చేస్తున్నాడు.
దాంతో క్యూ బాక్స్‍లో మెమరీ మొత్తం హార్డ్ డిస్క్ లో కాపీ అవుతున్నట్టు ప్రోగ్రెస్ బార్ సిస్టమ్‍లో కనిపిస్తున్నది.
అంతలో పక్కనే ఉన్న మానిటర్‍లో రాము ల్యాబ్‍ లోకి వచ్చినట్టు చూపించడంతో మేజర్ నాగేష్(వెంకట్)  చిన్నగా నవ్వుకుంటూ తన బ్రెయిన్ డేటాని కాపీ చేస్తున్నాడు.
[+] 10 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 03-02-2020, 05:48 PM



Users browsing this thread: 4 Guest(s)