Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
వెంకట్(సతీష్) : నాకు ఎందుకు తెలియదు….పాలిగ్రాఫ్….నిజం తెలుసుకోవడానికి ఇంతకు ముందు మత్తు మందు ఇచ్చారు….ఇప్పుడు ఇది…..

మానస రూమ్‍లో ఉన్న లైట్లు అన్నీ ఆఫ్ చేసి ప్రొజక్టర్ ఆన్ చేసి అందులో ఉన్న ఫోటోలను వెంకట్(సతీష్)కి చూపిస్తున్నది.
వెంకట్(సతీష్)కి ఆ ఫోటోలు చూపిస్తూ తన ఎదురుగా ఉన్న మానిటర్‍లో అతని హార్ట్‍కి సంబంధిమ్చిన సిగ్నల్స్‍ని చూస్తున్నది.
మొత్తం చూపించిన తరువాత మానస లైట్లు ఆన్ చేసి బయటకు వచ్చింది.
బయటకు వచ్చిన ఆమెకు రాము వాళ్ళతో పాటు కమీషనర్ కూడా ఉండటంతో ఆయనకు విష్ చేసింది.
కమీషనర్ : ఏమైనా తెలిసిందా…..
మానస : పల్స్ రేటింగ్ టెస్ట్‍లో మొదటినుండి సతీష్(వెంకట్) హార్ట్ బీట్ మామూలుగానే ఉన్నది….కాని obnormal గా ఏమీ అనిపించలేదు…
రాము : సార్….సతీష్ (వెంకట్)కి పాలిగ్రాఫ్ టెస్ట్ ఒక వంక మాత్రమే….దాని వెనక ఇంకో ఆలోచన ఉన్నది…ఫేస్ రీడింగ్ ….దాని వలన ఒకరి మొహంలో కలిగే మార్పులను బట్టి వారి మానసిక పరిస్థితిని కనిపెట్టి టెస్ట్…దాంతో సతీష్(వెంకట్) కి తెలియకుండా పాలిగ్రాఫ్ టెస్ట్ అని చెప్పి face expression test తీసుకున్నాము….
కమీషనర్ : అలా ఎందుకు…..
రాము : face expression test అని చెబితే సతీష్(వెంకట్) జాగ్రత్త పడే అవకాశం ఉన్నది….అందుకే పాలిగ్రాఫ్ టెస్ట్ అని చెప్పాల్సి వచ్చింది….ఈ టెస్ట్ జరుగుతున్నంతసేపు సతీష్(ప్రమో) ఫేస్ expressions అన్నిటినీ కెమేరాలో రికార్డ్ చేసాము….(అంటూ కెమేరాని కంప్యూటర్‍కి కనెక్ట్ చేసాడు.)
దాంతో అందరూ ఆ వీడియోని చాలా పరీక్షగా చూస్తున్నారు.
అప్పుడు అక్కడే ఉన్న face read expert మొత్తం వీడియో చూసిన తరువాత, “ఈ వీడియోలో 3.05 లో ఒకసారి వచ్చింది రాము గారి ఫోటో….తరువాత 3.22లో ఇంకోసారి వెంకట్ ఒక ఆర్మీ ఆఫీసర్‍కి షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు… ఈ రెండు సార్లు సతీష్(వెంకట్) పేనిక్ అయినట్టు తెలుస్తున్నది,” అన్నాడు.
రాము వెంటనే తన టేబుల్ మీద ఇంతకు ముందు వెంకట్ ఇంటి నుండి తెచ్చిన ఇన్విటేషన్స్ మొత్తం తీసుకుని ఒక్కోటి చూస్తూ అందులో ఒకదాన్ని కమీషనర్‍కి చూపిస్తూ, “సార్….ఈ ఫోటోలో వెంకట్ షేక్‍హ్యాండ్ ఇస్తున్నది ఆర్మీ మేజర్ నాగేష్ సార్….ఇంతకు ముందు ఎంక్వైరీ చేస్తే ఆ ఆర్మీ మేజర్ నాగేష్, వెంకట్ ఇద్దరూ కాలేజీ డేస్ నుండి మంచి ఫ్రండ్స్ అని తెలిసింది….రేపు మార్నింగ్ మేజర్ నాగేష్ సిటీలొ ల్యాండ్ అవుతున్నారు…ఆయన దిగిన వెంటనే Airport లోనే కలిసి జరిగింది అంతా వివరంగా చెప్పాలి సార్…..” అన్నాడు.
రాము చెప్పింది మొత్తం విన్న కమీషనర్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు.
రాము : సార్….నా నమ్మకం కరెక్ట్ అయితే తరువాత వెంకట్ యాక్టివేట్ అయ్యేది మేజర్ నాగేష్ లోనే సార్…..
కమీషనర్ : నమ్మకం ఉంటే సరిపోదు రామూ…పక్కా ప్రూఫ్‍లు కావాలి….మనం డౌట్ పడేది ఆర్మీ మేన్ మీద….ఆయన ఒప్పుకోకుండా ఆయన్ని కలవడం కూడా చాలా రిస్క్….అలాంటప్పుడు ఈ డౌట్ మీద ఆయన్ను కలవడం కూడా చాలా కష్టం….పైగా చాలా ప్రాబ్లం అవుతుంది….లీగల్‍గా ప్రొసీడ్ అవడానికి మన దగ్గర ఎవిడెన్స్ లేకపోయినా….మనకైనా క్లారిటీ ఉండాలి కదా….
ప్రసాద్ : సార్….లేకపోతే ఒక పని చెద్దాం….
కమీషనర్ : ఏంటది….
ప్రసాద్ : మనం సతీష్ దగ్గరకు వెళ్ళి….నీ next target ఎవరో తెలిసిపోయింది…నువ్వు తరువాత సెలక్ట్ చేసుకున్నది ఆర్మీ మేజర్ నాగేష్నే కదా మాకు తెలిసింది అని చెబుదాం….అప్పుడు వాడు టెన్షన్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేస్తే మనకు అప్పుడు కన్ఫర్మ్ అయినట్టే కదా…..
రాము : చాలా రిస్క్ ప్రసాద్….మెదలకుండా ఉండు….
కమీషనర్ : సరె…ఆ పనే చేద్దాం….
రాము : సార్….మీరు సీరియస్‍గానే చెబుతున్నారా….
కమీషనర్ : అవును రామూ….వేరే దారి లేదు…ప్రసాద్ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది….
ప్రసాద్ : అయితే మీరు నిజంగానే ఒప్పుకున్నట్టా సార్….
కమీషనర్ : అవును….(అంటూ రాము, ప్రసాద్ వైపు చూస్తూ) మీ ఇద్దరూ లోపలికి వెళ్ళీ ఈ ట్రిక్ ప్లే చేయండి….ఏం జరుగుద్దో చూద్దాం…..
దాంతో రాము, ప్రసాద్ అక్కడ నుండి ఇంటరాగేషన్ రూమ్ లోకి వెళ్ళారు.
లోపలికి వెళ్ళిన తరువాత రాము మెల్లగా వెంకట్(సతీష్) పక్కనే కూర్చుంటే ప్రసాద్ అక్కడ గోడకు ఆనుకుని వెంకట్ (సతీష్) మొహం వైపు చూస్తున్నాడు.
రాము : ఏంటి వెంకట్(సతీష్)….ఏం చేస్తున్నావో తెలుస్తుందా….అయినా ఆ మేజర్ ఏం చేసాడు…ఆయన్ని అలా ఇరికించారు….
ఆ మాట వినగానే సతీష్(వెంకట్) తల తిప్పి రాము వైపు చూసి నిర్లక్ష్యంగా నవ్వాడు.
దాంతో రాము ప్రసాద్ వైపు చూసి సైగ చేసాడు.
ప్రసాద్ : సతీష్(వెంకట్) నీకు చేసిన పాలిగ్రాఫిక్ test ఒక వంక మాత్రమే…(అంటూ మేజర్ నాగేష్కి షేక్ హ్యాండ్ ఇస్తూ దిగిన ఫోటో సతీష్(వెంకట్)కి చూపిస్తూ ఫేస్ రీడింగ్ ద్వారా నీ తరువాత టార్గెట్ ఎవరో కనిపెట్టేసాం…ఆర్మీ మేజర్ నాగేష్నే కదా….ఒక్క ఆటోగ్రాఫ్ పెడతారా….
సతీష్(వెంకట్) ఆ ఫోటో చూడగానే అతని మొహంలో కోపం చిన్నగా పెరిగిపోతున్నది.
రాము : వదిలెయ్ ప్రసాద్….మనం మేజర్ చేత పెట్టించుకుందాం….
ప్రసాద్ : అదేం లేదు సార్….మేజర్ దాకా ఎందుకు….వెంకట్ సార్‍నే బ్రతిమలాడితే పెట్టేస్తారు….ప్లీజ్ సార్…ప్లీజ్….
రాము : ఉపయోగం లేదు ప్రసాద్….వెంకట్ సార్ చాలా కోపంగా ఉన్నారు….(అంటూ అతని భుజం మీద చెయ్యి వేసి) సరె వెంకట్(సతీష్) బయలుదేరుతాం….(అంటూ అక్కడ నుండి వెళ్ళడానికి డోర్ దగ్గరకు వెళ్ళారు.)
కాని ఊహించని విధంగా సతీష్(వెంకట్) పైకి లేచి రాముని వెనక నుండి గట్టిగా కాలితో కొట్టాడు.
దాంతో రాము అప్పుడే ఇంటరాగేషన్ రూమ్ డోర్ తీయడంతో బయటకు వచ్చి కింద పడిపోయాడు.
సతీష్(వెంకట్) వెంటనే తన చేతికి ఉన్న హ్యాండ్ కఫ్స్‍ని ప్రసాద్ మెడకు చుట్టి గట్టిగా బిగించి పట్టుకుని కాలితో ఇంటరాగేషన్ రూమ్ డోర్ తన్నాడు.
డోర్ లాక్ అయిపోవడంతో సతీష్(వెంకట్) తన హ్యాండ్ కఫ్స్‍ని ప్రసాద్ మెడకు బిగించేస్తున్నాడు.
ప్రసాద్‍ని గోడకు ఆనించి పెట్టి అతని మెడకు ఇంకా గట్టిగా హ్యాండ్ కఫ్స్‍ని బింగించి చంపడానికి సతీష్(వెంకట్) ట్రై చేస్తున్నాడు.
సతీష్ అలా రియాక్ట్ అవుతాడని రాము అసలు ఊహించి ఉండకపోవడంతో రాము వెంటనే పైకి లేచి డోర్ మీద కొడుతూ దాన్ని తెరవడానికి ట్రై చేస్తున్నాడు.
ప్రసాద్‍కి గొంతు చుట్టూ హ్యాండ్ కఫ్స్ బిగుసుకుపోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిపోతుండటంతో అతని పట్టు నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు.
కాని సతీష్ గట్టిగా పట్టుకోవడంతో ప్రసాద్ ఇక వేరే దారి లేక తన నడుముకి ఉన్న పౌచ్‍లో నుండి రివాల్వర్ తీసి సతీష్ ని కాల్చేసాడు.
దాంతో సతీష్ వెనక్కు పడిపోయాడు….అతనితో పాటు ప్రసాద్ కూడా వెనక్కు పడిపోయాడు.
మెడ చుట్టూ ఉన్న పట్టు విడిపోవడంతో ప్రసాద్ చిన్నగా దగ్గుతూ పైకి లేచి డోర్ లాక్ తీసాడు.
రాము వెంటనే లోపలికి వచ్చి ప్రసాద్‍ని పట్టుకుని కంగారుగా, “ప్రసాద్….నీకు ఏం కాలేదు కదా,” అన్నాడు.
“అంతా బాగానే ఉన్నది,” అన్నట్టు ప్రసాద్ తల ఊపుతూ సైగ చేసాడు.
కింద పడిన సతీష్ నవ్వుతూ రాము, ప్రసాద్‍ల వైపు చూసి నవ్వుతూ తన చేతికి ఉన్న వాచీలో బటన్ ప్రెస్ చేసి చనిపోయాడు.
దాంతో అది యాక్టివేట్ అయినట్టు గ్రీన్ లైట్ వెలిగింది.
అది చూసి రాము తన మనసులో, “ఆర్మీ మేజర్ నాగేష్ లో యాక్టివేట్ అయ్యాడు,” అనుకుంటూ ఏం చెయ్యాలో తోచక అలాగే చూస్తుండిపోయాడు.
తరువాత రోజు రాము, ప్రసాద్ airport కి వెళ్లారు.
ప్రసాద్ : సార్….మేజర్‍కి ఈ విషయం చెబితే నమ్ముతారా సార్….
రాము : అదే నాకూ అర్ధం కావడం లేదు ప్రసాద్…తరువాత వెంకట్ యాక్టివేట్ అయ్యేది మేజర్ నాగేష్ బాడీలో అన్నది మనకు కన్ఫర్మ్ అయినా ఆయనకు చెప్పలేని పరిస్థితి…అందుకని ముందుగా మనం ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం….అప్పుడు ఆయన ప్రవర్తనని బట్టి మనం ఒక నిర్ణయానికి రావడానికి వీలుంటుంది…..
ప్రసాద్ : అంతకు మించి వేరే దారి లేదా సార్….
[+] 11 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 27-01-2020, 02:29 PM



Users browsing this thread: Vrfriends47, 3 Guest(s)