Thread Rating:
  • 30 Vote(s) - 3.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
#21
ఎపిసోడ్ 5 - సీసీటీవీ

"సర్ టెర్మినేషన్ ఏంటి ??"

"ఎం తెలియనట్లు ఎందుకలా మాట్లాడుతున్నావ్ ??"

నాకేమి అర్ధంకాలేదు.

నాకు ఒక పేపర్ తీసి చూపించాడు. నేను ఆ పేపర్ తీసుకున్నాను. చూసి షాక్ అయ్యాను. నేను ఒక ఇమెయిల్ వైస్ ప్రెసిడెంట్ కి రాసినట్లు ఉంది. ఇమెయిల్ లో తనని నేను ఒక హోటల్ రూమ్ లో రాత్రికి కలుస్తానని ఉంది.

"సర్......ఇది.......అసలు......"

"నిన్న నువ్వు పంపిన ఇమెయిల్........"

"నేనెప్పుడూ పంపించాను సర్ ?? ఇది ఎవరో కావాలని...."

"నటించొద్దు ఏమి తెలియనట్లు....."

"సర్ నిజంగా మీరు ఎం మాట్లాడుతున్నారో...."

"నీకు తెలియదంటావ్ అంతేనా ??"

"అవును సర్......"

"నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే.......ఇప్పుడే నీ మీద అతని మీద ఒక పెద్ద కేసు వేస్తాను......మర్యాదగా చెప్పు......ఎప్పటినుంచి జరుగుతుంది ఈ వ్యవహారం ??"

నాకసలు మైండ్ ఏమి పనిచేయలేదు. నేనేంటి అలంటి ఇమెయిల్ పంపించటం ఏంటి అని.........నేనొక సారి నిన్న ఎం జరిగింది అని గుర్తు తెచ్చుకున్నాను. బహుశా ప్రియ నా కేబిన్ దగ్గర ఉంది నిన్నంతా. నాకు తెలిసి నా సిస్టం నుంచి ఆ ఇమెయిల్ పంపి ఉండుంటాది.

"సర్.....ఈ ఇమెయిల్ ఎవరు పంపారో నాకు తెలుసు సర్"

"ఎవరు ??"

"ప్రియ......"

"అసలు ప్రియ ఎందుకు ఇమెయిల్ పంపుతుంది ?? వచ్చింది నీ ఇమెయిల్ ID నుంచి అయితే ??"

"సర్ నిన్న ప్రియ నా సిస్టం దగ్గరే ఉంది........"

"అయితే ?? నీ సిస్టం దగ్గర ఉంటె నువ్వేంచేస్తున్నావ్ ??"

"సర్ నిన్న మీరు అర్జెంటు అని పిలిస్తే వచ్చాను రిపోర్ట్ గురించి....... అప్పుడు నా సిస్టం వాడి తను ఇమెయిల్ పంపించింది"

"నేహా.......తనకి ప్రమోషన్ వచ్చి నీకు రాలేదని నువ్వు తన పై అబాండాలను వేస్తున్నావ్......."

"సర్.....నిజం సర్......నన్ను ఎవరో దీంట్లో ఇరికిస్తున్నారు....."

"నేహా ఇక చాలు...... నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను........"

"జాబ్ కి మర్యాదగా resign చేసేయి......లేదంటే ఈ టెర్మినేషన్ లెటర్ నీకు పోస్ట్ చేస్తాను అప్పుడు నీ కెరీర్ అవుట్......మొత్తం పోతుంది....."

"ఓ నాకంత ఇప్పుడు అర్ధమయిపోయింది.......నువ్వు, ప్రియ కలసి నన్ను, వైస్ ప్రెసిడెంట్ ని ఇరికిస్తున్నారు.......మీ ఇద్దరి విషయం మేము బయటకు తెస్తే మీ ఇద్దరి ఉద్యోగాలు పోతాయని.......ఆ నింద మా ఇద్దరి మీద వేసి మమ్మల్నిద్దరిని ఉద్యోగాల నుంచి పంపించేస్తున్నారు......అంతే కదా ??"

"నేహా.....పద్ధతి లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ఏంటామాటలు ??..resign చేస్తావా......లేక పోస్ట్ చేయనా.......ఆఫీస్ మొత్తం తెలిసిపోతుంది.......నీ నిజ స్వరూపం......ఏంటో అందరికి.......అసలు నీలాంటి వాళ్ళని ఉద్యోగంలో తీసుకున్నందుకు నన్ను నేను తిట్టుకోవాలి"

నాకు తిక్క రేగి అశ్విన్ పైన బాగా పెద్దగా అరిచి బయటకు వచ్చేసాను.

అందరూ నన్నే చూస్తున్నారు. నాకు కళ్ళలో నీళ్లు వస్తుంటే కష్టపడి ఆపుకున్నాను . అక్కడ ఉండలేక, నా కేబిన్ దగ్గరకు వెళ్లి నా వస్తువులు కొన్ని ఉంటె అవి తీసుకొని బయటకు వచ్చేసాను. నా గుండె బాగా రగిలిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్లి నా రూంలోకి వెళ్లి బాగా ఏడ్చాను. కాళ్లంత వాచిపోయాయి. మొహం అంత పాడైపోయింది. అలానే ఏడుస్తూ  బాగా అలసిపోయి నిద్రపోయాను.

నిద్ర లేసేసరికి టైం 3 అయ్యింది. బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాను. నిద్ర లేసి మొహం కడుక్కొని కొంచెం రెడీ అయ్యి సోఫా లో కూర్చున్నాను. మొత్తం విషయం తలచుకుంటేనే బాగా ఏడుపొచ్చేస్తుంది. కొంచెం సేపు ఆలోచించాను నేను ఈ ప్రాబ్లెమ్ నుంచి ఎలా బయటకు రాగాలానా అని. నాకు ఒక ఐడియా వచ్చింది.

సుధీర్ కి ఫోన్ చేశాను

"సుధీర్ ??"

"నేహా చెప్పు ఏమైంది ?? పొద్దున్న ఆలా అరిచి ఆఫీస్ నుంచి వెళ్లిపోయావ్ ??"

"సుధీర్ ఇది చాల ఇంపార్టెంట్. కొంచెం పక్కకొచ్చి మాట్లాడు చల్ అర్జెంటు మేటర్ "

"నేహా అసలేం జరిగింది ??"

"సుధీర్ ప్లీజ్ నాకు టైంలేదిప్పుడు. నీకు అంత మల్ల చెప్తాను"

"సరే ఒక్క నిమిషం ఆగు నేను బయటకు వచ్చి కాల్ చేస్తాను"

"ఒకే"

ఫోన్ కట్ అయ్యింది.

తన ఫోన్ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నాను.  నా ఫోన్ వైపే దీనంగా చూస్తూ ఉన్నాను. మనసులో అంకెలు లెక్కపెట్టడం స్టార్ట్ చేశాను.

ఈ లోపల బెల్ మోగింది. ఫుడ్ వచ్చినట్లుంది. వెంటనే డోర్ ఓపెన్ చేసి ఫుడ్ తీసుకుని డోర్ క్లోజ్ చేసి వచ్చి కూచున్నాను. సుధీర్ ఫోన్ చేసాడు.

"హలో సుధీర్..."

"హాల్ చెప్పు నేహా ఏంటి ??"

"నీకు సెక్యూరిటీ వాడు తెలుసు కదా ??"

"హా....."

"నాకు నిన్నటి CCTV రికార్డింగ్ కావాలి"

"నిన్నటిదా దేనికి ??"

"సుధీర్ ప్లీజ్ నీకు మళ్ళా చెప్తాను. ఇది బాగా అర్జెంట్. నిన్న నా కేబిన్ దగ్గర ఉన్న కెమెరాకు సంబందించినది ఫుటేజ్ కావలి"

"ఏమైనా టైం చెప్పగలవా ??"

నేను చెప్పాను.

"సరే....ఏంటి విషయం ??"

"సుధీర్ ప్లీజ్ నీకు చెప్తాను.....అర్జెంటు గా అది సంపాదించు నువ్వు.....ఒక కాపీ కావలి నాకు"

"కార్చవ్వుద్ది మరి......"

"పర్లేదు నేను ఇస్తాను నీకు ఎంత కావాలో"

"సరే.......నేను ఒకసారి వెల్లో అక్కడికి నీకు కాల్ చేస్తాను ఓకేనా ??"

"థాంక్స్ సుదీర్స్....... చాల చాల థాంక్స్....."

ఫోన్ కట్ అయ్యింది. ఇప్పుడే ఎం తినాలనిపించలేదు. సుధీర్ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అటు ఇటు  ఫోన్ చేతిలో పట్టుకొని అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో ఫుటేజ్ దొరికిందంటే నేను ఈ ప్రాబ్లెమ్ నుంచి బయటపడినట్లే. నేను అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను.

ఈ లోపల మళ్ళా ఆలోచించటం స్టార్ట్ చేశాను. ఈ ప్రియా అశ్విన్ కలసి ఇంత కుట్ర చేస్తారనుకో లేదు. అసలు వైస్ ప్రెసిడెంట్ గడు దీనంతటికి కారణం. వాడు అసలు ప్రియతో అందుకు మాట్లాడాలి. వాడు దాంతో మాట్లాడినందువల్లే కదా ఇదంతా. నేను కూడా ఆయనకు విషయం చెప్పకుండా పెద్ద తప్పు చేసాను. కనీసం ఆయనను ఎలాగైనా కాంటాక్ట్ చేయాలనుకున్నాను. అయన నెంబర్ ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించాను. వైస్ ప్రెసిడెంట్ నాకు కనీసం నిన్న ఫోన్ చేసి చెప్పాలి కదా ఇలా జరిగిందని. resign చేసి అలా వెళ్ళిపోవటం ఏంటి ??


ఈ లోపల ఫుడ్ చల్లారుతుందని పార్సెల్ ఓపెన్ చేసి ఫుడ్ తినటం స్టార్ట్ చేసాను. ఈ లోపల సుధీర్ ఫోన్ వచ్చింది. వెంటనే ఫోన్ ఎత్తాను:

"హలో సుధీర్"

"సారి నేహా...."

"ఏమైంది ??"

"ఎవరో ఇందాకే వచ్చి ఆ రికార్డింగ్స్ డిలీట్ చేసేసారట....."

"డిలీట్ చేసేసార?? అదేంటి ?? ఎవరు ??"

"వాళ్ళు చెప్పరంట......."

"సరే సుధీర్ నీకు మళ్ళా కాల్ చేస్తాను...... బాయ్" అని ఫోన్ పెట్టేసాను. నాకసలు ఎం చేయాలో అర్ధంకాలేదు. మళ్ళా భయం స్టార్ట్ అయ్యింది. నాకేమి తినాలనిపించలేదు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నేనింత కష్టపడి చివరికి ఇలాంటి సిట్యుయేషన్ లో ఉండటం ఏంటి అని అర్ధంకాలేదు.

నేను ఫుల్ stressed గా ఫీల్ అవ్వటంతో తల నొప్పి స్టార్ట్ అయ్యింది. బాగా ఎపుడొచ్చేసింది విషయం తలచుకుంటేనే. నాకు ఎం చేయాలో అర్ధం కాక సోఫా మీదే పడుకొని ఆలోచించాను. ఇప్పటికి ప్రియకు వచ్చిన ప్రమోషన్ తట్టుకోలేకపోతున్నాను. నిన్న వాచ్మెన్ గడు గేట్ దెగ్గర నాకిచ్చిన లుక్ ఇప్పటికి మరిచిపోలేను. కచ్చితంగా క్లీనర్ గాడు అందరికి నా విషయం చెప్పేసుంటాడు. ఇప్పుడు అపార్ట్మెంట్ అంత నా గురించి ఏవేవో అనుకుంటారు. అశ్విన్ ప్రియ కలసి ఆఫీస్ లో నన్ను, వైస్ ప్రెసిడెంట్ ని ఇరికించారు. వైస్ ప్రెసిడెంటే లొంగిపోయి resign చేసాడంటే ఇక నేనెంత ?? ఇదంతా తలచుకొని ఒక్కసారిగా నా ప్రపంచం కూలిపోయినట్లనిపించింది .

నాకు ఇంకా దిక్కు తోచక ఓకే పేపర్ తీసుకున్నాను. రాయటం స్టార్ట్ చేసాను. ఒక లెటర్ రాసి. కిచెన్ నుంచి కత్తి తెచ్చుకున్నాను. ఆ లెటర్ టేబుల్ పైన పెట్టి, బాత్రూం లోకి వెళ్లి నిల్చున్నాను. ఫోన్లో టైం చూసాను 4:17 అయ్యింది. కత్తిని నెమ్మదిగా నా చేయి దగ్గరకి తీసుకొని వచ్చాను.

టు బి  కంటిన్యూడ్  ............
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ - by pastispresent - 07-11-2018, 10:34 PM



Users browsing this thread: 9 Guest(s)