Thread Rating:
  • 13 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance "అతి"మధురం
#2
1.పరిచయం
ట్రైన్ నెంబర్ 2456 తిరుపతి నుంచి విజయవాడ వెళ్ళు ఎక్స్ ప్రెస్ ఒకటవ నెంబర్ ప్లాట్ ఫారం పై ఆగి వున్నది....అని రైల్వేస్టేషన్ లో అనౌంస్ మెంట్ అలా వినిపించి ట్రైన్ ఇలా వచ్చి ఆగిందో లేదో....ఇలా ట్రైన్ దిగింది రియా....తన బుజాలకి వున్న బ్యాగ్ ని సరి చేసుకుని కళ్ళకి వున్న కళ్ళద్దాలు కూడా సరి చేస్కుని ముందుకు నడిచింది .....

ట్రైన్ కదలడానికి సిద్ధం గా వుందని ఈ సారి ఇంకొ ఎనౌంస్ మెంట్ వచ్చేసరికి రియా ఎంట్రంస్ దగ్గరవుంది.....

అన్నట్టు గానే ట్రైన్ కదిలింది

రియా వెనుదిరిగి మళ్ళీ చూసింది ట్రైన్ వంక...... కంట్లోంచి కన్నీరు జాలు వారి చెక్కిలి పై పడింది......

అదేమీ పట్టించుకోని రియా ముందుకు కదిలి రైల్వేస్టేషన్ బయటకి వచ్చి అటూ ఇటూ చూసింది ....ఆ తర్వాత వాచ్ చూసింది టైం ఒంటి గంట దాటి పది నిమిషాలయ్యింది.....

బయటకి నడిచి ఆటో స్టాండ్ ని సమీపించింది.....

"మ్యాడం ఆటో కావాలా...?"అడిగాడు ఆటో అతను....

"ఆటొ వద్దు లిఫ్ట్ కావాలి..."అంది రియా

"మీకు కావాలన్నా నేను అమ్మను లేండి....అయినా దాన్ని లిఫ్ట్ అనరు మ్యాడం.....సరే గానీ మీరు ఎక్కడికి పోవాల్న....?"అడిగాడతను

"బస్ లన్నీ ఆగుతాయి సూడు అక్కడ..."అంది రియా

"ఒ బస్టాండ్ ఆ...పోదాం పోదాం 30 రూపాయాలు అవుతుంది పర్లేదా...?"అడిగాడతను

"వాయమ్మొ 30 రూపాయలే......20 రూపాయలు చేస్కో...."అని ఆటో ఎక్కేసింది రియా

ఆటో అతని ముఖం లో వే వేల కాంతులు 10 రూపాయల కిరాయికి 20 రూపాయలు వస్తున్నాయి మరి.....అద్దం లో అతని ముఖం చూసిన రియా ఛా....10 రూపాయలు కి అడిగి వుండాల్సింది అని చింతించ సాగింది.......ఆ బాధ ని రెట్టింపు చేస్తూ తన ఫోన్ రింగ్ అయ్యింది....

స్క్రీన్ పై.....టార్చర్ అని స్క్రోల్ అయ్యింది.....

ఆ పేరు చూడడం తోనే తల పట్టుకుంది రియా.....

"ఏమైంది మ్యాడం తల నొప్పా....మెడికల్ షాప్ దగ్గర ఆపమంటారా...?"అడిగాడు అతను

"అబ్బా..బ్బా..నువ్వు ముందు బస్టాండ్ కి పోనివ్వవయ్యా..."అంది చిరకుగా రియా

ఆగకుండా ఫోన్ మోగుతూనే వుంది......ఏం చేయాలో రియా కి పాలు పోవట్లేదు......ఇంతలో బస్టాండ్ రానే వచ్చింది......ఆటొ అతనికి డబ్బులిచ్చేసి బస్టాండ్ లోపలికి అలా అడుగుపెట్టిందో లేదో తను ఎక్కాల్సిన బస్ అలా ముందుకు కదిలింది......

"ఆపండి........అపండి......."అంటూ బస్ వెంట పి.టి.ఉష లా పరుగు తీసి అలసి సొలిసి ఇక తన వల్ల కాక ఆగిపోయిన 2 సెకన్ల కి అల్లంత దూరం లో బస్ ఆగింది.......

"దేవుడా యూ ఆర్ దేర్....నువ్వున్నావ్....."అని కాలు కాలు కొట్టుకుని అక్కడికి నెమ్మదిగా వెళ్లసాగింది..... తను బస్ కి దగ్గరయ్యే కొద్ది ...."ఏమ్మా.....ఎంతసేపు..? నీ వల్ల బస్ ఆపాము...త్వరగా రా...."అని ఊరంతా వినపడేలా అరుస్తున్నాడు కండెక్టర్......కం డ్రైవర్.......

అతని వైపు ఒక క్రూరమైన లుక్ ఇచ్చి బస్ ఎక్కిన రియా కి ఏ.సి గాలి చల్లగా తాకింది.....ప్రాణం లేచొచ్చినట్టు అనిపించి....తన టికెట్ తీసి తన సీట్ నెంభర్ చూడ సాగింది.......
"అక్కడ ఉంది ఒక్క సీటే....వెళ్ళక్కడ అగోరించు...."అని కండెక్టర్ అనడం తో ఆయన వైపు కోపంగా చూసింది....తన సీట్ పక్కన ఒక అబ్బాయి కిటికి వైపు తిరిగి కూర్చుని వున్నాడు....చెవుల్లో ఇయర్ ఫోంస్ పెట్టుకుని ప్రపంచాన్ని మర్చిపోయాడు....

"కలికాలం...."అని మనసులొ అనుకోబోయి బయటకే అనేసింది రియా.....

"ఇది చలికాలం అండి"అన్నాడాబ్బాయి......

"వామ్మొ....వీడి సెకలూ..."అని మనసులో అనుకుంది రియా

అలానే బొమ్మలా నిల్చున్న ఆమె ని చూసిన ఆ అబ్బాయి...."ఏంటండి కూర్చోకుండా తెగ ఆలోచిస్తున్నారు...?"అడిగాడు

"మీరు చెప్పలేదని..."వెటకారంగా అని కూర్చుంది రియా....

"మీరు పెళ్ళి నుంచి పారిపోయారా...?"కంగారుగా అడిగాడాబ్బాయి....

"వీడికెలా తెల్సిపోయిందబ్బా..."అని కంగారు పడి....ఆ కంగారు బయట పెట్టకుండా..."లేదే....అలా అడిగారేంటి....?"అనుమానంగా అడిగింది రియా

"మీ బుగ్గ పై బుగ్గ చుక్క చేతికి ఇన్ని గాజులు.....చూసి"అనుకున్నాలేండి అన్నాడు ఆ అబ్బాయి......

"ఏమో నేను డ్రామా ఆర్టిస్ట్ ని అయ్యుండొచ్చు కదా?"అంది రియా

"వామ్మొ నేనలా అలోచించనేలేదండి....మీ పేరు ...?"అని అడిగి....మళ్ళీ తను ఏమి అనుకుంటుందో అని సందేహం వచ్చి...."మీకు ఇబ్బంది ఏమీ లేకుంటేనే చెప్పండి "అన్నాడాబ్బాయి.....

"అయ్యొ రామా...పేరు చెబితే ఆస్తులేమైనా కరుగుతాయా ఏంటి...అదేం లేదు మై నేం ఈస్ రియా ....మేరా నాం రియా....నా పేరు రియా....ఎన్ పేర్ రియా....గుక్కుతిప్పుకోకుండా చెప్పింది రియా

నా పేరు విజయ్....వెరీ నైస్ టూ మీట్ యూ అని చెయ్యి ముందుకు చాపాడు విజయ్....షేక్ హ్యాండ్ ఇచ్చింది రియా

"ఇంతకీ.....మీరు నిజం గా డ్రామా బ్యాచ్ ఏ నా...?"అడిగాడు విజయ్ కుతూహలంగా

"ఇప్పుడు ఇతనికి చెప్పాలా వద్దా...?అయినా ఇతను మనకేమి తర్వాత తారాసపడడు గా చెబుదాం లే అసలే ఎన్నో ఏళ్ళుగా తీరని వ్యధలా ఈ బాధని మోస్తున్నాను.......ఇక నా వల్ల కాదు చెప్పేద్దాం...."అనుకుని సిద్ధపడిపోయింది రియా

రియా అంత సేపు ఆలోచిస్తుండడం తో విజయ్ కలగ చేసుకుని..."మీకు ఇబ్బంది ఐతే చెప్పొద్దు లేండి...."అని అన్నాడు

"అయ్య బాబోయ్ మీరు మరీ మొహమాటొస్తుల్లా వున్నారే.....చెబుతాను గానీ దాని కన్నా ముందు ఈ బుగ్గ చుక్క పోవడానికి నాకు సహాయం చేయండి...."అడిగింది రియా

"సహాయమా...?ఎలా?"అడిగాడు విజయ్

"మీకే తెలుస్తుంది లే...."అని బ్యాగ్ వెతకసాగింది...తనకేమి కనిపించక పోవడం తో ఒక్కొక్కటిగా బ్యాగ్ లో వున్న వస్తువలన్నీ తీసి విజయ్ చేతికి అందిస్తుంది...విజయ్ అన్నీ పట్టుకోలేక కుస్తీ లు పడుతున్నాడు......అయినా కూడా రియా కి తనకి కావాల్సిన వస్తువు దొరకలేదు....

"ఏమి చూస్తున్నారండీ..."ఆతృతగా అడిగాడు విజయ్

"అద్దం...అద్దం....మిర్రర్..."అంది రియా తన బ్యాగ్ లో తల పెడుతూ

"అయ్యొ రామా...అద్దం ఎందుకండి...?"అయొమయంగా అడిగాడు విజయ్

"చూడండి విజయ్ గారు బుగ్గ చుక్క ని తుడవాలంటే బుగ్గ చుక్క లొకేషన్ తెలియాలి కదా....?"అందుకే అద్దం కావాలా వద్దా...?"అడిగింది రియా

"వామ్మొ లొకేషన్ ఆ అదేమన్నా సెక్యూరిటీ అధికారి స్టేషన్ ఆ లేక రైల్వే స్టేషన్ ఆ లొకేషన్లు వుండడానికి...?ఇంతోటి దానికి అద్దం ఎందుకండి...?నేను చెబుతాను గా ఎక్కడుందో...."అన్నాడు విజయ్....

"గుడ్ ఐడియా ఎక్కడ...?"అడిగింది రియా

"ఇంకెక్కడ బుగ్గ మీద....."చెప్పాడు విజయ్

"అబ్బా...కరెక్ట్ గా చెప్పండి లేకపోతే నా ముఖం మొత్తం కాజల్ తో మేక్ అప్ చేసినట్టు వుంటుంది....."అనేసరికి డైరక్షంస్ చెప్పసాగాడు......

ఇంతలో రియా కి ట్రింగ్ మని ఙన బల్బ్ వెలిగి తన ఫోన్లో సెల్ఫీ మోడ్ అన్ చేసి ....తన బుగ్గ చుక్క ని తుడిచేసింది....గాజులు అన్నీ బ్యాగ్ లో వేసింది......కొంచెం స్థిమిత పడి ఊపిరి పీల్చుకుంది......

"ఇప్పటికైనా చెప్తుందా లేదా...?"అని ఆలోచిస్తున్న విజయ్ ఈ లోకం లోకి వచ్చాడు రియా చేయి స్పర్శ తో......

రియా వైపు ఆశ్చర్యంగా చూశాడు.........!
[+] 2 users Like అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: "అతి"మధురం - by అన్నెపు - 07-11-2018, 09:48 PM
RE: "అతి"మధురం - by coolsatti - 07-11-2018, 09:52 PM
RE: "అతి"మధురం - by raaki86 - 07-11-2018, 09:58 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 07-11-2018, 10:46 PM
RE: "అతి"మధురం - by Mohana69 - 07-11-2018, 11:09 PM
RE: "అతి"మధురం - by vickymaster - 07-11-2018, 11:59 PM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 11:05 AM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 11:26 AM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 01:54 PM
RE: "అతి"మధురం - by vickymaster - 08-11-2018, 03:24 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 08-11-2018, 04:07 PM
RE: "అతి"మధురం - by prasad_rao16 - 08-11-2018, 08:02 PM
RE: "అతి"మధురం - by raaki86 - 09-11-2018, 06:31 AM
RE: "అతి"మధురం - by tvskumar99 - 09-11-2018, 12:43 PM
RE: "అతి"మధురం - by vickymaster - 09-11-2018, 03:20 PM
RE: "అతి"మధురం - by vickymaster - 09-11-2018, 08:22 PM
RE: "అతి"మధురం - by raaki86 - 09-11-2018, 10:27 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 09-11-2018, 10:53 PM
RE: "అతి"మధురం - by vickymaster - 10-11-2018, 03:33 PM
RE: "అతి"మధురం - by utkrusta - 10-11-2018, 04:21 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 10-11-2018, 05:04 PM
RE: "అతి"మధురం - by Thiru8855 - 10-11-2018, 08:26 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 11-11-2018, 10:47 AM
RE: "అతి"మధురం - by mahesh477 - 12-11-2018, 11:11 AM
RE: "అతి"మధురం - by tvskumar99 - 12-11-2018, 11:28 AM
RE: "అతి"మధురం - by vickymaster - 12-11-2018, 11:39 AM
RE: "అతి"మధురం - by saleem8026 - 12-11-2018, 11:40 AM
RE: "అతి"మధురం - by Nikhil noel - 12-11-2018, 01:58 PM
RE: "అతి"మధురం - by utkrusta - 12-11-2018, 02:30 PM
RE: "అతి"మధురం - by Nikhil noel - 12-11-2018, 10:44 PM
RE: "అతి"మధురం - by vickymaster - 12-11-2018, 11:32 PM
RE: "అతి"మధురం - by raaki86 - 12-11-2018, 11:44 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 13-11-2018, 08:14 AM
RE: "అతి"మధురం - by saleem8026 - 13-11-2018, 01:30 PM
RE: "అతి"మధురం - by saleem8026 - 23-11-2018, 04:21 PM
RE: "అతి"మధురం - by SanthuKumar - 24-11-2018, 10:47 AM
RE: "అతి"మధురం - by SanthuKumar - 24-11-2018, 12:04 PM
RE: "అతి"మధురం - by Dpdpxx77 - 24-11-2018, 06:18 PM
RE: "అతి"మధురం - by Chandra228 - 24-11-2018, 09:41 PM
RE: "అతి"మధురం - by krish - 25-11-2018, 11:03 AM
RE: "అతి"మధురం - by SanthuKumar - 01-12-2018, 07:30 PM
RE: "అతి"మధురం - by Uma_80 - 10-12-2018, 03:06 PM
RE: "అతి"మధురం - by Kd2016 - 25-12-2018, 04:57 PM
RE: "అతి"మధురం - by SHREDDER - 26-12-2018, 07:03 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 02-01-2019, 01:49 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 02-01-2019, 01:52 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 08-01-2019, 11:17 PM
RE: "అతి"మధురం - by sri7869 - 08-03-2024, 09:57 AM



Users browsing this thread: 9 Guest(s)