Thread Rating:
  • 13 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance "అతి"మధురం
#62
26.చెప్పలేను...

"నన్నెందుకు మోసం చేసావ్ రియా...?"అన్న విజయ్ మాటతో...అతని కళ్ళలోకి చూసింది రియా

"విజయ్...."అంది కన్నీళ్ళు దిగమింగుకుంటూ......

"ఐ యాం ఎక్స్ పెక్టింగ్ యూ టూ సే ద ట్రూత్..."అన్నాడు విజయ్ చేతులు ముడుచుకుంటూ

"ఎందుకలా అంటున్నావ్ విజయ్...?"అడిగింది రియా

తన ఫోన్ లోని గ్యాలరి ఓపెన్ చేసి....రియ-విక్కి క్లోస్ గా వున్న పిక్ ని చూపించాడు విజయ్....అది చూసిన రియా భారంగా గాలి వదులుతూ...

"నిన్నే కాదు విజయ్ నన్ను నేనే మోసం చేసుకున్నాను...అభి..ఐ మీన్ విక్కి ఐ మీన్ విక్రాంత్ అభిమన్యు లేకుండా బతకగలను అనుకున్నాను..కాని నా వల్ల కాలేదు..."అంటూ ఆగింది రియా

ఆ పేరు వినడం తోనే విజయ్ భృకుటి పడింది..."వాట్....నువ్వు చెప్పిన అభి...?విక్కి ఒకరేనా...?"అడిగాడు విజయ్

అవున్నన్నట్టు తలూపింది రియా.....

"విజయ్...నేను అభి ని ప్రేమించాను...ఇన్ ఫాక్ట్ తనకి కూడా చెప్పాను...తన కోసం అమెరికా కూడా వచ్చాను...అప్పుడె నువ్వు కరెక్ట్ గా ఇండియా వచ్చి వున్నావు.....అభి నీ పిక్ తన గ్యాలరి లో చూపించాడు...నువ్వు తనకి నీ కంపెని లో జాబ్ ఆఫర్ చేసిన సంగతి కూడా తను నాకు చెప్పాడు....ఇన్ ఫాక్ట్ నేను నీకు అభి భార్య గా పరిచయమవ్వాల్సింది...కాని అలా జరగలేదు దానికి కారణం .....నా మెడికల్ టెస్ట్ రిపోర్ట్స్ ఒకరోజు ఒంట్లో నలతగా వుందని హాస్పిటల్ కి వెళ్ళిన నాకు అక్కడి డాక్టర్ ఏవో టెస్ట్లు చేసి నేను ఎక్కువ కాలం బతకను అని చెప్పారు...నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు......అభి నేను లేకుండా బతకలేడని తెల్సు...నేను లేకపోయినా తను నన్ను తల్చుకోకుండా వుండాలి అని ఆలోచించాను.....ఒకవేళ నేను తనకి దూరమయినా నా ఙపకాలతో తను బతికేస్తాడని నాకు తెల్సు అలా జరగకూడదని నీకు దగ్గరయ్యాను...కాని నేనలా వుండలేకపోయాను....అందుకే ఆ రోజు బస్ లో నీకు ప్రపోస్ చేసినా ఆ టాపిక్ మళ్లి మనమధ్య తీసుకు రాలేదు....ఆ తర్వాత నువ్వొచ్చి ప్రపోస్ చేసినప్పుడు నో చెబుదామనుకుంటుండగా అభి రావడం కనిపించింది...ఇక నో చెప్పలేకపోయాను...ఆ తర్వాత అయినా నీతో మాట్లాడదాం అనుకున్నా కాని నువ్వు ప్రాజెక్ట్ పని మీద వెళ్ళిపోయావ్....ఈ మధ్యలో.....నేను అభి నుంచి దూరంగా వుండలేనన్న నిజం నాకర్థం అయ్యింది......నా జబ్బు విషయం తెల్సినప్పుడు నేను దానికి తగిన మందులెప్పుడు వేసుకోలేదు...సో దట్ తను వచ్చేలోపు చనిపోతే బెటర్ అని...కాని అలా జరగలేదు.,....మీన్ వైల్ నా చివరి రోజులు అభి తో వుండాలనిపించింది....అందుకే మెడిసిన్ తెచ్చుకోవడానికి వెళ్తే....తెల్సింది ఏమనగా నాకెలాంటి జబ్బు లేదని...అనవసరంగా నేనే చేజేతులారా ఇదంతా చేసుకున్నాని.....ఇదంతా నాకివాళె తెల్సింది...ఐ హోప్ యూ అండర్ స్టాండ్..."అంది రియా తను చెప్పడం పూర్తి చేస్తూ

"అభి కి చెప్పావా...?"అడిగాడు విజయ్

"లేదు....నీ దగ్గరికి వచ్చేముందు ఐ హ్యాడ్ ఏ బ్యాద్ డ్రీం....సో"అంది రియా

"నీకేమైనా పిచ్చా.....?ఇప్పుడే చెప్పు...."అని అభి కి ఫోన్ కలపబోతుండగా....

"నో...విజయ్...చెబుతాను కాని ఇవాళ కాదు.....లెట్ మీ ప్రిపేర్...తను ఎలా మాట్లాడినా నేను తట్టుకోగలగాలి...సొ గివ్ మి సం టైం...యండ్ థ్యాంక్యూ ఫర్ అండర్ స్టాండింగ్ మి...."అని లేచింది రియా....

తనకి బై చెప్పి.....ఒంటరి గా నడవసాగాడు విజయ్

"నేను చేసింది కరెక్ట్ ఆ తప్పా...?"ఆలోచించసాగాడు విజయ్.....

తనలో ఒక భాగం రియా ని వదులుకోవడానికి అస్సలు సిద్ధంగా లేదు ...మరొక భాగం తనని ప్రేమించని అమ్మాయి తనెలా ఆనందంగా వుండగలడు అని వాదిస్తుంది....

రియా ని వదులుకోవడానికి ఇష్టపడని భాగం....ఒకవేళ రియా ని అభి నుంచి దూరం చేస్తే అప్పుడు తను కచ్చితంగా ప్రేమిస్తుంది కదా అన్న ఆలోచనని రేకెత్తిచింది...నిజమే కదా అనుకుంది రెండవ భాగం.....

*********

మరుసటి వుదయం......అభి కి ఇష్టమైన పింక్ కలర్ కుర్తి లో మెరిసిపోతుంది రియా......ఆఫీస్ కి చేరుకుని ఎంట్రంస్ లో అడుగుపెట్టిందో లేదొ.....అక్కడ రిసెప్షెనిష్ట్ తో మాట్లాడుతున్న విజయ్...అప్పుడే పని మీద బయట కొచ్చిన అభి ఇద్దరూ కళ్లార్పకుండా తననే చూడసాగారు.....

విజయ్ ని చూసిన రియా...కళ్ళతో తనెలా వున్నానంటూ సైగ చేసింది...."సూపర్ "అని కళ్ళతోనే తెలిపాడు విజయ్.....వాళ్ళిద్దరి చూపులు చూసిన అభి కి లోపల చెప్పలేనంత బాధ.....

ఇంతలో రియా ఫోకస్ అభి వైపు షిఫ్ట్ అయ్యింది.....రియా చూపు తన వైపు నుంచి తప్పుకోవడం తో సేం అదే బాధ విజయ్ మనసులో వచ్చి చేరింది.....

అభి ని చూడగానే రియా కళ్లలో వచ్చిన మెరుపు విజయ్ చూపు దాటి పోలేదు.....రియా అభి ని సమీపిస్తుండగా అబి కొత్తగా జాయిన అయిన షాలిని క్యూబికల్ వైపు నడవడం చూసి......తన అడుగులు కాస్తా ఆగిపోయాయి......

షాలిని క్యూబికల్ నుంచి బయటకొచ్చిన విక్కి చిరునవ్వులు చిందిస్తూ తన క్యాబిన్ కి వెళ్ళిపోయాడు......అభి ని అలా చూసిన రియా ఉత్సాహం నీరు గారి పోయింది...తన క్యూబికల్ లోకి అసహనం గా వెళ్ళి వర్క్ చేస్కోసాగింది......

2 గంటల తర్వాత.....కోపం తగ్గిన రియా అభి క్యాబిన్ కి వెళ్దామని లేచి నిల్చుందో లేదొ....అభి షాలిని క్యూబికల్ వైపు నడుస్తూ కనిపించాడు అసహనంగా కుర్చిలో కూలబడిన రియా దగ్గరికి వచ్చాడు విజయ్....

"రియా...హౌ ఎబౌట్ ఎ కాఫీ..."అన్నాడు విజయ్

రియా కి వెళ్ళాలని లేకున్నా అభి అక్కడే వుంటాడు అని విజయ్ తో పాటు వెళ్ళింది....ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు....వాళ్లకి ఆపోసిట్ టేబుల్ లో షాలిని-అభి కూర్చున్నారు........

"ఇంతకి ఎప్పుడు చెబుతున్నావ్...?"అడిగాడు విజయ్

"చెప్తాను...కాని ఎక్కడ అభి ఎప్పుడూ ఆ షాలిని తోనే వుంటున్నాడు..."అంది రియా తనలా అసహనం వ్యక్తం చేస్తుండగానే అభి షాలిని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ కనిపించాడు......ఇంక రియా వల్ల కాలేదు......

"ఏం చెయ్యాలి...ఏం చెయ్యాలి..."అని ఆలోచిస్తూ.....తన కాఫీ కప్పులో సడన్ గా చెయ్యి పెట్టింది....."అమ్మా...."అని అరిచింది.......

అంతే వెనక్కి తిరిగి చూసిన అభి.......తన కోసం రాబోతూ......అక్కడ కనిపించిన దృశ్యాని చూసాగిపోయాడు

******#####******
[+] 2 users Like అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: "అతి"మధురం - by coolsatti - 07-11-2018, 09:52 PM
RE: "అతి"మధురం - by raaki86 - 07-11-2018, 09:58 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 07-11-2018, 10:46 PM
RE: "అతి"మధురం - by Mohana69 - 07-11-2018, 11:09 PM
RE: "అతి"మధురం - by vickymaster - 07-11-2018, 11:59 PM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 11:05 AM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 11:26 AM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 01:54 PM
RE: "అతి"మధురం - by vickymaster - 08-11-2018, 03:24 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 08-11-2018, 04:07 PM
RE: "అతి"మధురం - by prasad_rao16 - 08-11-2018, 08:02 PM
RE: "అతి"మధురం - by raaki86 - 09-11-2018, 06:31 AM
RE: "అతి"మధురం - by tvskumar99 - 09-11-2018, 12:43 PM
RE: "అతి"మధురం - by vickymaster - 09-11-2018, 03:20 PM
RE: "అతి"మధురం - by vickymaster - 09-11-2018, 08:22 PM
RE: "అతి"మధురం - by raaki86 - 09-11-2018, 10:27 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 09-11-2018, 10:53 PM
RE: "అతి"మధురం - by vickymaster - 10-11-2018, 03:33 PM
RE: "అతి"మధురం - by utkrusta - 10-11-2018, 04:21 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 10-11-2018, 05:04 PM
RE: "అతి"మధురం - by Thiru8855 - 10-11-2018, 08:26 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 11-11-2018, 10:47 AM
RE: "అతి"మధురం - by mahesh477 - 12-11-2018, 11:11 AM
RE: "అతి"మధురం - by tvskumar99 - 12-11-2018, 11:28 AM
RE: "అతి"మధురం - by vickymaster - 12-11-2018, 11:39 AM
RE: "అతి"మధురం - by saleem8026 - 12-11-2018, 11:40 AM
RE: "అతి"మధురం - by Nikhil noel - 12-11-2018, 01:58 PM
RE: "అతి"మధురం - by utkrusta - 12-11-2018, 02:30 PM
RE: "అతి"మధురం - by Nikhil noel - 12-11-2018, 10:44 PM
RE: "అతి"మధురం - by vickymaster - 12-11-2018, 11:32 PM
RE: "అతి"మధురం - by raaki86 - 12-11-2018, 11:44 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 13-11-2018, 08:14 AM
RE: "అతి"మధురం - by saleem8026 - 13-11-2018, 01:30 PM
RE: "అతి"మధురం - by అన్నెపు - 22-11-2018, 10:37 PM
RE: "అతి"మధురం - by saleem8026 - 23-11-2018, 04:21 PM
RE: "అతి"మధురం - by SanthuKumar - 24-11-2018, 10:47 AM
RE: "అతి"మధురం - by SanthuKumar - 24-11-2018, 12:04 PM
RE: "అతి"మధురం - by Dpdpxx77 - 24-11-2018, 06:18 PM
RE: "అతి"మధురం - by Chandra228 - 24-11-2018, 09:41 PM
RE: "అతి"మధురం - by krish - 25-11-2018, 11:03 AM
RE: "అతి"మధురం - by SanthuKumar - 01-12-2018, 07:30 PM
RE: "అతి"మధురం - by Uma_80 - 10-12-2018, 03:06 PM
RE: "అతి"మధురం - by Kd2016 - 25-12-2018, 04:57 PM
RE: "అతి"మధురం - by SHREDDER - 26-12-2018, 07:03 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 02-01-2019, 01:49 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 02-01-2019, 01:52 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 08-01-2019, 11:17 PM
RE: "అతి"మధురం - by sri7869 - 08-03-2024, 09:57 AM



Users browsing this thread: 7 Guest(s)