09-01-2020, 07:11 PM
లోపలి వెళ్ళిన పెళ్లి కొడుకు మంచం మీద కుచోని పెళ్లి కూతురు రాగానే , తన చేతిలో పాల గ్లాస్ తీసుకొని మంచం మీద కుచో పెట్టుకొన్నాడు. తను మంచం మీద కుచోగానే ఆ రూమ్ లో పిల్లి కూతలు వినబడ సాగాయి . వాళ్ళు చాలా సేపు వెతికారు , ఆ సౌండ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయే తెలుసుకోవడానికి . కొద్ది సేపటికి విసుగు వచ్చి తలుపు తీశారు.
బయట ఉన్న పెద్ద వాళ్ళు ఏమైంది అని అడగ్గా , లోపల మంచం కింద ఏవో పెట్టారు , మంచం మీద కుచోగానే సౌండ్స్ చేస్తున్నాయి అన్నాడు పెళ్లి కొడుకు
రాజీ వాళ్ళ గ్యాంగ్ ని పిలిచి లోపల ఎక్కడ డెక్కడ ఆ సౌండ్ వచ్చేవి పెట్టారో తీయమని చెప్పారు , మాకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తే తీస్తాము అని కుచోన్నారు.
వాళ్ళకు ఇవ్వాల్సింది తొందరగా ఇస్తే , మీ పని మీరు చేసుకోవచ్చు , లేదంటే రాత్రంతా ఇలా వేస్ట్ చేయాల్సి వస్తుంది అన్నారు ఎవరో గుంపు లోంచి. ఇంక తప్పదు అన్నట్లు ఓ పది వేలు రూపాయలు రాజీ గ్యాంగ్ చేతిలో పెట్టాడు పెళ్లి కొడుకు. అది తీసుకొని 5 నిమిషాలు ఇక్కడే ఉండండి అని చెప్పి, రాజీ తో పాటు ఓ ఇద్దరు అమ్మాయిలు లోపలి వెళ్లి తలుపు గడియ పెట్టారు.
ఓ పది నిమిషాల తరువాత వాళ్ళ చేతి నిండుగా రక రకాల బొమ్మలతో తిరిగి వచ్చారు . ఇప్పుడు వెళ్ళండి మీకు ఎం ఇబ్బంది కాదు అంటూ తన ఫ్రెండ్స్ ను తీసుకొని రాజీ శాంతా వాళ్ళ ఇంటి వైపు వేల్లింది.
వాళ్ళు వెళ్ళిన కొద్ది సేపటికి నేను వాళ్ళ వెనుక వెళ్లాను పడుకోవడానికి.
రాజి తో పాటు వచ్చిన గ్యాంగ్ పెళ్లి కొడుకు దగ్గర వాళ్ళు collect చేసిన డబ్బులు రేపు ఎలా ఖర్చు పెట్టాలా అని మాట్లాడు కో సాగారు. నాకు నిద్ర వస్తుంది అని చెప్పి మిద్దె ఎక్కి పడుకోండి పోయాను. పరుపు మీద పడుకోగానే నిద్రా దేవి తన వెచ్చని కోగిట్లోకి నన్ను లాగేసుకుంది.