Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.63%
666 87.63%
Good
9.87%
75 9.87%
Bad
2.50%
19 2.50%
Total 760 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 229 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
కానిస్టేబుల్ వెంట వచ్చిన కుర్రాడు అక్కడే చేతులు కట్టుకుని భయంగా రాము, ప్రసాద్ వైపు చూస్తూ, “సార్…నన్నెందుకు తీసుకొచ్చారు సార్….నేను ఏ తప్పు చేయలేదు,” అన్నాడు.

రాము : ఇంతకు నీ పేరు ఏంటి……
కుర్రాడు : ఆదిత్య సార్…..
రాము : చూడు ఆదిత్యా….నువ్వు తప్పు చేసావని నేను చెప్పలేదే….లేక నువ్వు ఇంతలా కంగారుపడుతున్నావంటే ఇంతకు ముందు ఏమైనా తప్పు చేసి ఉండాలి….(అంటూ అతని మొహంలోకి చూసాడు.)
ఆదిత్య : (కంగారుగా….) నేను ఏ తప్పు చేయలేదు సార్…..
రాము : మరి అంత కంగారెందుకు పడుతున్నావు….
ఆదిత్య : సెక్యూరిటీ ఆఫీసర్లంటే నాకు చిన్నప్పటి నుండీ భయం సార్….అందుకే కంగారుగా ఉన్నది…..
ప్రసాద్ : అవునా బాబూ….ఆ కంగారు వెనక ఉన్న రహస్యం మేము తెలుసుకుంటాం….ఒక్క విషయం అడుగుతాము నిజం చెబుతావా……
ఆదిత్య : ఏంటి సార్…..అడగండి సార్…..
రాము : (తన రివాల్వింగ్ చైర్‍లో వెనక్కు వాలుతూ) నీకు సుభద్ర అనే ఆవిడ తెలుసా…..
రాము నోటి వెంట సుభద్ర పేరు రాగానే ఆదిత్య మొహంలో రంగులు మారాయి.
అది గమనించిన ప్రసాద్ వెంటనే రాము వైపు సైగ చేసాడు.
రాము కూడా గమనిస్తున్నట్టు సైగ చేస్తూ ఆదిత్య వైపు కోపంగా చూసాడు.
ఆదిత్య : సుభద్ర….ఆవిడ ఎవరో నాకు తెలియదు సార్…..
ప్రసాద్ : చూడు ఆదిత్యా…ఒక్కసారి నువ్వు ఆలోచించుకుని నిజం చెప్పు…మేము ఎవరినీ ఊరకనే ఇక్కడకు తీసుకురాము….కాబట్టి ఇంకొక్కసారి ఆలోచించుకుని నిజం చెబితే నీకే మంచిది…..
అంతలో ఒకాయన డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు.
రాము అతని వైపు ఎవరు అన్నట్టు చూసాడు.
అతను : సార్….నేను ఆదిత్య ఫాదర్‍ని….
రాము : (అక్కడ చైర్ చూపించి) కూర్చోండి….మీ పేరు….
అతను : నా పేరు జనార్ధనరావు సార్…మా అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చారు సార్…వాడు ఎలాంటి తప్పు చేయలేదు….
ప్రసాద్ : మీ అబ్బాయి తప్పు చేసాడని ఇక్కడకు తీసుకురాలేదు జానార్ధనరావు గారు…మాకు ఒక కేసు విషయంలో కాల్ లిస్ట్ వెదుకుతుంటే మీ అబ్బాయి నెంబర్ దొరికింది…అందుకుని ఒక్కసారి ఎంక్వైరీ కోసం ఇక్కడకు తీసుకొచ్చాము …అంతె…..
జనార్ధన రావు : ఏం కేసు సార్……
రాము : అన్నీ తెలుస్తాయి జనార్ధన్ గారు…మీ అబాయి నోరు తెరిస్తే…మాకు కావలసినంత ఇన్ఫర్‍మేషన్ వస్తుంది… (అంటూ ఆదిత్య వైపు తిరిగి) ఇప్పుడు చెప్పు ఆదిత్యా…సుభద్ర ఎవరో నీకు తెలుసా…..
జనార్ధనరావు : ఆవిడ ఎవరో మాకు తెలియదు సార్….మా బంధువుల్లో ఆ పేరు కలవాళ్ళు ఎవరూ లేరు…..
రాము : జనార్ధన్ గారూ…నేను మీకు తెలుసా అని అడగలేదు…మీ అబ్బాయికి తెలుసా అని అడిగాను…మీరెందుకు సమాధానం చెబుతున్నారు…..
రాము అలా అనగానే జనార్ధన రావు మెదలకుండా ఉన్నాడు.
కాని ఆదిత్య మాత్రం మాట్లాడకుండా తల వంచుకుని నిల్చున్నాడు.
ప్రసాద్ తన చైర్ లోనుండి లేచి ఆదిత్య దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేసాడు.
ఆదిత్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
ప్రసాద్ : ఆదిత్యా…మేము నిన్ను కొట్టలేదు కదా…నువ్వు ఎందుకు భయపడుతున్నావు…మేము అడిగిన వాటికి వెంటనే సమాధానాలు చెప్పావనుకో ఐదు నిముషాల్లో మీ నాన్నగారితో పాటు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు…..
జనార్ధనరావు : చెప్పమ్మా ఆదిత్యా….సుభద్ర ఎవరూ…నీకు తెలుసా…..
ప్రసాద్ : నువ్వు చెప్పకుండా మొండికేసావనుకో మా పధ్ధతిలో మేము చెప్పించాల్సి వస్తుంది….ఆలోచించుకో….
జనార్ధన రావు : సార్….మీరు మా అబ్బాయిని బెదిరిస్తున్నారు…..అయినా ఏ ఆధారంతో మా అబ్బాయిని ఇలా తీసుకొచ్చారు….
రాము : మేము ఏ ఆధారాలు లేకుండా ఎవరినీ తీసుకురాము జనార్ధన్ గారు…ఒక్క విషయం అడుగుతాను చెప్పండి…
జనార్ధనరావు : అడగండి సార్….
రాము : మీ అబ్బాయి దగ్గర సెల్‍ఫోన్ ఉన్నదా…..
జనార్ధనరావు : ఈ రోజుల్లో సెల్‍ఫోన్ లేకుండా ఎవరున్నారు సార్…..మా అబ్బాయి దగ్గర కూడా ఫోన్ ఉన్నది….దాని కాస్ట్ దాదాపు ముప్పై వేలు పైనే ఉంటుంది….(అంటూ గర్వంగా చెప్పాడు.)
రాము : అంతంత ఖరీదైనవి కొనిపెట్టి పిల్లల్ని చెడగొట్టడండి రావు గారు….
జనార్ధనరావు : ఏంటి మీరు మాట్లాడేది….సూటిగా చెప్పండి…..
రాము : మీ అబ్బాయి ఫోన్ నెంబర్ మీకు తెలుసా…..
జనార్ధనరావు : హా తెలుసు….89xxx xxx32…..
రాము : (ఆదిత్య వైపు తిరిగి) ఏం ఆదిత్యా….నెంబర్ కరెక్టేనా…..
ఆదిత్య : అవును సార్….కరెక్టే…..
రాము : మరి నీది ఇంకో నెంబర్ చెప్పు…..
జనార్ధనరావు : ఇంకో నెంబర్ ఏంటి సార్….మా అబ్బాయి దగ్గర ఒక్కటే నెంబర్ ఉన్నది…..
రాము : అంత కంగారెందుకు సార్….ఒక్క నిముషం ఆగండి మొత్తం బయటకు వచ్చేస్తాయి…..(అంటూ ఆదిత్యతో) చెప్పు ఆదిత్యా…..మీ నాన్నగారు చెప్పిన నెంబరు కాకుండా ఇంకో నెంబర్ ఉన్నది కదా…..
ఆదిత్య సమాధానం చెప్పకుండా మెదలకుండా ఉన్నాడు.
ప్రసాద్ : నువ్వు సమాధానం చెప్పకుండా ఉంటే….ఇప్పటి వరకు జరిగిన హత్యలకు నువ్వే చేసావని మేము అనుమానించాల్సి వస్తుంది….
దాంతో ఆదిత్య నిజంగానే చాలా భయపడిపోయాడు.
ఆదిత్య : హయ్యో సార్….నేను ఎవరినీ హత్య చేయలేదు…..నన్ను నమ్మండి…..
ప్రసాద్ : మరి సుభద్ర ఎవరో తెలుసా అంటే సమాధానం ఎందుకు చెప్పావు…..
రాము : చూడు ఆదిత్యా….మేము నిన్ను ఊరకనే ఇక్కడకు తీసుకురాలేదు….నీ కాల్ డేటా మొత్తం చెక్ చేసే ఇక్కడకు తీసుకువచ్చాము…..
జనార్ధనరావు : అసలు మీరు అంటున్న రెండో నెంబర్ మా అబ్బాయిదే అన్న నమ్మకం ఏంటి…..
రాము : మేము ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునే రియాక్ట్ అవుతాం జనార్ధన్ గారూ…..
ప్రసాద్ : ఇక చెప్పు ఆదిత్యా….సుభద్ర నీకు ఎలా తెలుసు…..
ఆదిత్య : అదీ…అదీ….ఆమె….(అంటూ నసుగుతున్నాడు.)
ఆదిత్య చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నాడో అర్ధం అయిన రాము వెంటనే జనార్ధన్ వైపు తిరిగి, “జనార్ధన్ గారూ…. మీరు కొద్దిసేపు బయట ఉంటారా…మేము మీ అబ్బాయితో మాట్లాడాలి,” అన్నాడు.
జనార్ధన రావు : లేదు సార్….మీరు మా అబ్బాయిని కొట్టి నిజం ఒప్పించేలా ఉన్నారు….ఏది జరిగినా నా ముందే జరగాలి….
రాము : లేదు జనార్ధన్ గారు…మేము మీ అబ్బాయిని కొట్టం…ఎందుకంటే అతను క్రిమినల్ కాదు…కేవలం ఎంక్వైరీ కోసం తీసుకొచ్చాము…..అంతే….(అంటూ కానిస్టేబుల్‍ని పిలిచాడు...కానిస్టేబుల్ రాగానే రాము అతని వైపు చూసి,) జనార్ధన్ గారిని హాల్లో ఉన్న టీవి ముందు కూర్చోబెట్టు….(అంటూ జనార్ధన్ వైపు తిరిగి) జనార్ధన్ గారూ…మీ ముందు ఉన్న టీవీలో ఇక్కడ జరిగేది అంతా కనిపిస్తుంది…మీరు కంగారు పడొద్దు,” అన్నాడు.
రాము అలా అనగానే జనార్ధనరావు చైర్ లోనుండి లేచి ఆదిత్య దగ్గరకు వచ్చి, “నాన్నా….వాళ్ళు అడిగిన దానికి నీకు తెలిసినంత వరకు దాయకుండా చెప్పేయరా….ఎందుకు ఇబ్బందుల్లొ పడతావు,” అని కానిస్టేబుల్‍తో అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు.
ప్రసాద్ : ఇప్పుడు చెప్పు ఆదిత్యా….మీ నాన్నగారు బయటకు వెళ్ళిపోయారు….ఆయనకు మనం మాట్లాడుకునేది ఏదీ వినిపించదు….కాబట్టి భయపడకుండా నిజం చెప్పు….ఇప్పుడు నువ్వు చెప్పే విషయాలు ఏవీ మీ ఇంట్లో ఎవరికీ తెలియనివ్వం…..
ఆదిత్య : సార్….అదీ సుభద్ర గారు….నాకు తెలుసు…..
రాము : అదే ఎలా తెలుసు….
[+] 9 users Like prasad_rao16's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 30-12-2019, 01:30 PM



Users browsing this thread: 3 Guest(s)