Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
“మీకు సైంటిస్ట్ నారాయణ తెలుసా….” అంటూ రాము పరిశీలనగా సతీష్ మొహంలోకి చూసాడు.

రాము అలా అడగ్గానే సతీష్ ఆలోచిస్తున్నట్టు కళ్ళు మూసుకుని మళ్ళి రాము వైపు చూస్తూ, “సైంటిస్ట్ అంటే….ఏ డిపార్ట్ మెంట్‍కి సైంటిస్ట్….అయినా ఈ పేరు ఎక్కడో విన్నట్టున్నదే,” అన్నాడు.
రాము : న్యూరాలజీలో టాప్ మోస్ట్ సైంటిస్ట్….మొదడు….దానికి సంబంధించిన ఫంక్షనింగ్‍లో బాగా ఫేమస్…..
సతీష్ : సారీ రామూ గారు….నాకు తెలియదు….
రాము : వాళ్ళింట్లో సైకాలజీ మీద మీరు రాసిన బుక్ ఒకటి దొరికింది….అందుకని మీకు ఏమైనా తెలుసేమో అని అడుగుతున్నాను…అందుకనే అతను ఇంతకు ముందు మీ సెమినార్ అటెండ్ అయ్యారా….లేక మీకు పరిచయం ఏమైనా ఉన్నదా…..
రాము అలా అడుగుతున్నప్పుడు సతీష్ తన టేబుల్ మీద ఉన్న టిష్యూ పేపర్ బంచ్ లోనుండి ఒకటి తీసుకుని దానితో గ్లాసు పట్టుకుని నీళ్ళు తాగుతున్నాడు.
రాము అలా సతీష్ ని అడుగుతూ టిష్యూ పేపర్‍తో గ్లాసు పట్టుకోవడం చూసి….ఇంతకు ముందు బార్‍లో మేకప్ మేన్ సుబాని కూడా సేమ్‍టుసేమ్ ఇలాగే టిష్యూ పేపర్‍తో మందు గ్లాసు పట్టుకోవడం గుర్తుకురావడంతో రాముకి ఇంకా అనుమానం బలపడసాగింది.
దాంతో రాము మనసులో ఏదో తెలియని కంగారు మొదలయింది….ఏం జరుగుతుందో అర్ధంకాకపోవడంతో మళ్ళీ ఆలోచనల్లో పడ్డాడు.
“అతను ఎవరో నాకు తెలియదు….” అంటూ సతీష్ వాటర్ తాగిన తరువాత గ్లాసు టేబుల్ మీద పెట్టి ఆలోచనల్లో ఉన్న రాము వైపు చూస్తూ, “రామూ గారు….మీరు బాగానే ఉన్నారు కదా,” అన్నాడు.
దానికి రాము ఏమీ సమాధానం చెప్పకుండా బయటకు వచ్చి నేరుగా రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాడు.
రాము అలా ఎందుకు వెళ్ళిపోయాడో అర్ధం కాక ప్రసాద్ కూడా చైర్‍లో నుండి లేచి, “సరె….సార్….మేము వెళ్తాము,” అంటూ బయటకు వచ్చాడు.
బయటకు వచ్చిన రాము రిసెప్షన్ దగ్గరకు వచ్చి ఆమెతో…..
రాము : సతీష్ గారు ఎన్ని రోజులుగా స్మోక్ చేస్తున్నారు….ఇంతకు ముందు ఎప్పుడైనా స్మోక్ చేసారా….
రిసిప్షన్ : లేదు సార్….ఇంతకు ముందు ఎప్పుడూ ఆయన స్మోక్ చేయడం చూడలేదు….ఈ మధ్యే చేస్తున్నారు….
ఆ మాట విన్న రాముకి తన మనసులో అనుమానం ఇంకా బలపడిపోయింది.
కాని వీటన్నింటికీ లింక్ ఎక్కడ ఉన్నదో అర్ధం కాక ఆలోచిస్తూ అక్కడ నుండి బయటకు వచ్చేసాడు.
ప్రసాద్ కూడా రాము వెనకాలే బయటకు వచ్చి, “సార్…సార్….ఏమయింది…అలా మధ్యలో లేచి వచ్చేసారేంటి,” అనడిగాడు.
రాము ఏమీ మాట్లాడకుండా కారు దగ్గరకు వచ్చి డోర్ తీస్తు, “అదే….నీకు ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు,” అని అంటుండగా పక్క నుండి ఒక కుక్క అరుస్తున్న శబ్దం విని అటు వైపు చూసాడు.
అక్కడ ఒక చెట్టుకు ఇంతకు ముందు తాను సెమినార్ అటెండ్ అయినప్పుడు సతీష్తో పాటు ఉండటం చూసాడు.
దాంతో రాము చిన్నగా ఆ కుక్క దగ్గరకు వెళ్తుంటే అక్కడ నిలబడి ఉన్న సెక్యూరిటీ గార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చి, “ఏయ్ నోర్ముయ్….ఎందుకలా అరుస్తావు,” అంటూ కుక్కని గదుముతున్నాడు.
రాము అక్కడకు వచ్చి సెక్యూరిటీ అతని వైపు చూసి, “ఇది సతీష్ గారి పెంపుడు కుక్క కదా,” అనడిగాడు.
సెక్యూరిటీ గార్డ్ : అవును సార్….ఆయనదే….
రాము : సెమినార్‍లో ఉన్నంతసేపు ఇది ఆయనతోనే ఉండేది కదా….సెమినార్‍లో ఎప్పుడూ సైలెంట్‍గా ఉంటుంది…. ఇప్పుడేంటి ఇలా అరుస్తుంది…..
సెక్యూరిటీ గార్డ్ : ఏం జరిగిందో తెలియదు సార్….విపరీతంగా మొరుగుతున్నది….నాలుగురోజులుగా సార్‍ని చూసి కూడా అరుస్తున్నది….మొన్న కరడానికి కూడా ట్రై చేసింది…అందుకే సతీష్ సార్ దీన్ని బయట కట్టేయమన్నారు….
అతని మాటలు విన్న రాము ఒక్కసారి వెనక్కు తిరిగి బిల్డింగ్ పైన ఉన్న సతీష్ బొమ్మ ఉన్న బ్యానర్‍ని, మళ్ళి కుక్కని చూసి ఏదో ఆలోచన వచ్చిన వాడిలా మళ్ళీ లోపలికి వెళ్ళి సతీష్‍ని కలిసాడు.
సతీష్ : ఏంటి మళ్ళీ వచ్చారు….ఏమయింది…మీరు ఏదో టెన్షన్‍లో ఉన్నారు….
రాము : సార్…నేను చెప్పేది ప్రశాంతంగా వినండి….కోప్పడకుండా వినండి…
సతీష్ సిగిరెట్ తాగుతూ చెప్పండి అన్నట్టు రాము వైపు చూసాడు.
రాము : సతీష్ గారూ….మీరు కొద్దిరోజులు పోలిస్ కస్టడీలో ఉంటే బెటర్….ఇది మీ మంచి కోసమే చెబుతున్నా….
సతీష్ : (చిన్నగా నవ్వుతూ…) ఏం మాట్లాడుతున్నారు రామూ…నేను పోలిస్ కస్టడీలొ ఉండటం ఏంటి….మీరు ఏం మాట్లాడుతున్నారో అర్ధమవుతున్నదా….
రాము : లేదు సతీష్ గారు….మీకు ప్రమాదం జరగొచ్చు….లేక మీ వలన ఇంకొకరికి ప్రమాదం జరగొచ్చు….ప్లీజ్ సతీష్ గారు…నేను ఇలా చెప్పడానికి ఒక రీజన్ ఉన్నది…అది మీకు చెబితే అర్ధం కాదు….మీకు జరిగినట్టే ఇంతకు ముందు ఇద్దరికి జరిగింది…వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రాణాలతో లేరు…ఈ మర్డర్స్ వెనకాల ఎవరున్నారో…ఏం చేస్తున్నారో….అసలు మోటివ్ ఏంటో….ఏమీ అర్ధం కావడం లేదు…..(అని ఇంకా చెబుతుండగా సతీష్ మధ్యలోనే అతన్ని ఆపుతూ)
సతీష్ : ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి….Get out….
సతీష్ అలా అనగానే రాము మనసులో అనుమానం కాస్తా నిజమే అని తేలిపోయింది.
దాంతో రాము వెనక్కు చైర్‍లో ఆనుకుని సతీష్ వైపు చూస్తూ…..
రాము : ఎవరిని బయటకు వెళ్ళమంటున్నావో నీకు అర్ధమవుతున్నదా….నీముందు కూర్చున్నది మామూలు SI అనుకుంటున్నావా…..Deputy Commissioner Of security officer…ఇందాకటి నుండి మర్యాదగా చెబుతుంటే అర్ధం కావడం లేదా…..క్రైమ్ డిపార్ట్ మెంట్ హెడ్‍ని….నేను తలుచుకుంటే ఏమీ చేయగలనో నీకు తెలియదు….అయినా మర్యాదగా అడిగాను…
కాని సతీష్ మాత్రం రాము మాటలను ఏమాత్రం లెక్కచేయకుండా సిగిరెట్ పొగ నోట్లొ నుండి వదులుతూ ముందుకు ఒంగి టేబుల్ మీద మోచేతులు ఆనించి రాము వైపు చూస్తూ…..
సతీష్ : నేను తల్చుకుంటే ఏం చేయగలనో నీక్కూడా తెలియదు…నా లాయర్‍తో చెప్పి కేసు వేసానంటే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది…అనవసరంగా నన్ను డిస్ట్రబ్ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో…..
రాము : నీకు అంత కొరికగా ఉంటే పెట్టి చూడు…నాకు ఈ కేసులు కొత్తేం కాదు…అయినా ఇక నీతో మాటలు అనవసరం అని తేలిపోయింది…నిన్ను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు….బెస్ట్ ఆఫ్ లక్….(అంటూ అక్కడ నుండి బయటకు వచ్చేసాడు.)
బయటకు వచ్చిన రాముని చూసి ప్రసాద్ కార్లో కూర్చుని స్టార్ట్ చేసి రాము కారు ఎక్కగానే పోనిస్తూ, “ఏమయింది సార్…మళ్ళీ లోపలికి వెళ్లారేంటి,” అనడిగాడు.
“ఏం లేదు ప్రసాద్….Too many co-incidents….ఈ సతీష్‍ని బాగా observe చేసి లాక్ చేయాలి….అన్నిటి కన్నా ముఖ్యమైనది ఏంటంటే…ఇంకో మర్డర్ జరగక ముందే వీడిని ప్రాణాలతో పట్టుకోవాలి…..” అన్నాడు రాము.
అప్పటి నుండి రాము చెప్పినట్టు కానిస్టేబుల్స్ ముగ్గురు మఫ్టీలో సతీష్‍ని ఫాలో చేస్తూ అతన్ని observe చేయడం మొదలుపెట్టారు.
అతని డైలీ యాక్టివిటీస్….మొత్తం రిపోర్ట్ ఏ రోజుకారోజు రాముకి రిపోర్ట్ చేయడం మొదలుపెట్టారు.
వారం రోజుల నుండీ సతీష్ ప్రవర్తనలొ పూర్తిగా మార్పు వచ్చిందని రాముకి అర్ధమైపోయింది.
ఒక రోజు రాత్రి సతీష్ మెడికల్ షాప్‍లో నుండి మెడిసిన్స్ తీసుకుని బయటకు వచ్చి కారు డోర్ తీయబోతుండగా ఆటోలో నుండి ఒకతను దిగి కత్తి తీసి సతీష్ని పొడవడానికి ట్రై చేసాడు.
సతీష్ వెంటనే తేరుకుని అతని కత్తి పోటు నుండి తప్పించుకున్నాడు.
అది చూసి అక్కడ టిఫిన్ బండి దగ్గర టిఫిన్ తింటున్న వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఆపడానికి ట్రై చేసారు.
కత్తి దాడి చేసిన అతను ఇంతకు ముందు సెమినార్‍లో తనను మోసం చేసాడంటూ సతీష్ మీద గొడవ పెట్టుకున్నవాడు.
“డబ్బులు అడిగితే ఇవ్వవా….ఇప్పుడు నీ ప్రాణం తీస్తా,” అంటూ అతను మళ్ళీ సతీష్ మీద దాడి చేసాడు.
కాని సతీష్ వెంటనే అతని చేతిని గట్టిగా పట్టుకుని మొహం మీద గుద్దాడు.
అతను వెంటనే పైకి లేచి సతీష్ చేతిలో ఉన్న మెడిసిన్ కవర్, దానితో పాటు కింద పడ్డ సతీష్ వాలెట్ తీసుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడు.
దాంతో సతీష్ వెంటనే అతని వెనకాల పరిగెడుతూ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు.
అప్పుడే ఇంటికి వెళ్తున్న ప్రసాద్ వెంటనే కారు ఆపి అక్కడ నిల్చున్న వాళ్ళతో, “ఏమయింది….” ఆడిగాడు.
“కత్తి చూపించి….డబ్బులు అడుగుతున్నాడు సార్….” అన్నారు అక్కడ వాళ్ళు.
ప్రసాద్ వెంటనే ఫోన్ తీసి కంట్రోల్ రూమ్‍కి ఫోన్ చేసి విషయం చెప్పి అక్కడ స్పాట్‍లో ఉన్న వాళ్లను అలెర్ట్ చేసాడు.
సతీష్ అతని వెనకాలే పరిగెడుతూ, “ఏయ్…ఆగు….నా వాలెట్ ఇచ్చెయ్….” అంటూ అరుస్తున్నాడు.
కాని అతను మాత్రం పట్టించుకోకుండా అలాగే పరిగెడుతూ పాత గోడౌన్ లోకి పరిగెత్తాడు.
[+] 7 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 24-12-2019, 01:12 PM



Users browsing this thread: 6 Guest(s)