24-12-2019, 10:26 AM
(23-12-2019, 01:37 PM)prasad_rao16 Wrote: అప్డేట్ రాసి....దానికి తగ్గ బొమ్మలు వెదికి పట్టుకుని పెడతాం....అంత కష్టపడి అప్దేట్ రాసి, బొమ్మలు వెదికి పెడితే రీడర్స్ నుండి కనీస స్పందన కూడా రావడం లేదు...ఈ మాట నేను అందరి గురించి అనడం లేదు....రెగ్యులర్ గా కధ చదివి కామెంట్లు పెట్టే వారి పట్ల ఎప్పుడూ సంతోషంగా ఉన్నాను....అందుకే నాక్కూడా కధ మీద ఇంట్రెస్ట్ పోయింది....కాకపోతే మధ్యలో ఆపకూడదని ఈ పార్ట్ వరకు అప్దేట్లు ఇచ్చి కధ ఆపేస్తున్నాను.....టైం వేస్ట్ చేసి కధ రాస్తున్నప్పుడు కనీసం కామెంట్లు కాకపోయినా వ్యూస్ ఆశించడంలో తప్పులేదని అనుకుంటున్నా.....ఎవరో సంగతి కాదు కాని....నాకు మాత్రం కామెంట్లు, వ్యూస్ రెండూ కావాలి.....కనీసం వ్యూస్ కూడా పెరగకపోతే ఇక రాయడం ఎందుకు....ఇది నా ఆలోచన మత్రమే....అందరు రచయితల గురించి చెప్పడం లేదు....ఇదివరకు కొంతమంది కామెంట్లు గురించి పట్టించుకోకండి...వ్యూస్ ఎన్ని వస్తున్నాయో చూడండి అన్నారు....ఇప్పుడు ఆ వ్యూస్ కూడా బాగా తగ్గిపోయాయి...బహుశా ఈ కధని ఎక్కువ ఎపిసోడ్స్ రాయడం వలన లేకపోతే సినిమా కధలను రాయడం వలన రీడర్స్ కి ఇంట్రస్ట్ తగ్గిందని అనుకుంటున్నాను....మిగతా ఫోరమ్స్ లో సంగతి నాకు తెలియదు...కాని ఇక్కడ మన తెలుగు ఫోరమ్ లో నేను గమనించింది చెబుతున్నా...తప్పుగా అనుకోవద్దు....రీడర్స్ కి ఆగిపోయిన కధలకు "అప్డేట్ ప్లీజ్" అని కామెంట్లు పెట్టడానికి ఉన్న సమయం, ఓపిక....రన్నింగ్‍లో ఉన్న కధలకు తమకు కధలో ఏం నచ్చిందో కామెంట్ రూపంలో పెడితే బాగుంటుంది....అది కూడా కుదరకపోతే జస్ట్ "అప్డేట్ బాగుంది...." అన్న కామెంట్ పెట్టడానికి కూడా టైం ఉండదు....కాని రైటర్స్ మాత్రం గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకుని కధలు రాస్తుండాలి....ఇదివరకు అంటే కామెంట్ పెట్టడానికి రిజిష్టర్ కావాలి కాబట్టి కామెంట్లు ఆశించడం తప్పు....కాని ఇప్పుడు సైట్ కంపల్సరీ లాగిన్ అవాలి....అలాంటప్పుడు చదివిన వాళ్ళ దగ్గర నుండి ఒక్క కామెంట్ ఆశించడం రచయిత తప్పు కాదు అని అనుకుంటున్నాను...ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే....నా మనసుకు అనిపించింది చెప్పాను....తప్పుగా అనుకోవద్దు....ఎవరిని నొప్పించాలని నాకు ఎటువంటి ఉద్దేశ్యం లేదు....ఇప్పటి వరకు నేను రాసిన కధను ఆదరించి, ప్రోత్సహించి ఇంత దూరం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను....మీరు అన్నదాంట్లో తప్పు లేదు ఈ కథ రాయడం వలనడబ్బులు మీకీ చదివిన వాళ్ళకి రావు కథని చదివిన వారు ఈ లైన్ బాగుంది ఈ కథ లో ఇంకా ఇలా రాయవచ్చు అలా రాయవచ్చు అని సలహాలు ఇవ్వడం చాలా ముఖ్యం నటుడికి కావల్సింది ప్రేక్షకుల చప్పట్లు అలాగే రచయిత కూడా కావల్సింది గుర్తింపు అలా కామెంట్స్ వ్యూస్ రానప్పుడు కచ్చితంగా అసహనానికి గురి అవుతారు ఎవరు ఎన్ని చెప్పిన మీరు రాయాలి మేము చదవాలి కానీ రాయడం రాయకపోవడం మీ ఆలోచనికి వదిలేస్తునము ప్రసాద్ గారు ఇంకా ఒకేసారి ఆలోచన చేయగలరు..
Chandra