18-12-2019, 10:42 PM
కార్తిక్ వేరే వాళ్ళ తో మాటల్లో పడి సంజయ్ మేలుకున్నది గమనుంచలేదు ప్రణి పూరి ల పలకరింపు తో సంజయ్ వంక చూసి తను మేలుకున్నాడని తన ని పలకరించి అసలిదంత ఎలా జరిగింది అని అడిగే సరికి జరిగిందంతా చెప్పుకొచ్చాడు.
ఇంతలో ఎవరో ఇంటి బైట నించుని సార్ అంటూ పిలిచే సరికి దివ్య వచ్చింది ఎవరా అని చూడడానికి వెళ్ళింది తలుపుదగ్గర ఒక కానిస్టేబుల్ ని చూసి ఎవరు కావాలి అని అడిగితే మేడం గారు పంపారు కార్తిక్ సర్ ని కలవాలి అని చెప్తే దివ్య రూంలోకి వెళ్లి కార్తిక్ ని పంపుతుంది.
కార్తిక్ ఆ కానిస్టేబుల్ తో ఎదో చెప్తే అలాగే సర్ నేను కనుక్కుంటాను అని వెళ్ళిపోతాడు, కార్తిక్ మళ్ళీ రూంలోకి వచ్చి రియా ని తనతో రమ్మని చెప్పి బైటికి తీసుకెళ్లి తనతో కానిస్టేబుల్ తో ఎం చెప్పాడు అనేది చెప్పి తరువాత కలుస్తాను అంటూ వెళ్ళిపోతాడు.
ఇక్కడ తన పిల్లలని ఇన్నేళ్ల తరువాత కలిసినందుకు సంజయ్ లో చాలా సంతోషం ఉన్న ఎదో బాధ అదే బాధ ప్రీతి లో ఉంది అది ఎవరికి కనిపించకుండా మేనేజ్ చేస్తూ ఉన్నారు కానీ రియా వీల్లేదో దాస్తున్నట్టు ఉన్నారు అని అనిపించి సంజయ్ పక్కకి వెళ్లి తనకి మాత్రమే వినిపించే తట్టు అడిగింది.
సంజయ్ ఎం లేదు అని చెప్పిన వినకుండా చెప్పక పోతే నా పైన ప్రామిస్ అని అంటే ఇక చెప్పాల్సిందే అని అందరిని ఒకసారి తన మాట వినండని చెప్పే లోపు గేట్ దగ్గర ఉన్న సెక్యురిటి నుండి ఫోన్ వస్తుంది ఎవరో అది ఆన్సర్ చేసి మిగితా వాళ్ళతో ఎం చెప్పకుండానే ఆ వ్యక్తి బైటికి పరుగులు తీస్తూ వెళ్తారు.
కాసేపట్లో అందరూ ఉన్న రూం దగ్గరికి ఒక సెక్యూరిటీ అధికారి యూనిఫామ్ లో ఒక ఆవిడ తన వెనక ఒక కానిస్టేబుల్ ఒక అబ్బాయి వస్తారు సంజయ్ ఆవిడ ని చూడగానే అరే వచేశావ నేనె నీకు కాల్ చేద్దాం అనికుంటున్న ఇప్పుడే అందరితో విషయం చెప్పేద్దం అనుకున్న అంటూ తన దగ్గరికి వెళ్లి తన వెనక ఉన్న అబ్బాయి ని ముందుకు రమ్మని సైగ చేస్తూ అందరివైపు చూసి ఇప్పుడు నేను చెప్ప బోయే విషయం ఏంటంటే.
అని ఆ అబ్బాయి భుజం పైన చేయి వేసి కార్తిక్ వైపు చూసి ఇతను మీరు అనుకుంటునట్టు మన అర్జున్ కాదు, ఈవిడ కొడుకు వరుణ్ అని బాంబ్ పేలుస్తాడు అది విని అందరూ షాక్ కాకపోయినా ఇన్నాళ్లు తమతో అర్జున్ లా ఉంటున్న వాళ్ళు షాక్ అయ్యారు.
What…….tha……..f………ak…….
ఒక్కసారిగా అలా చప్పుడు వినిపించే సరికి అప్పటివరకు ఒక మాదిరిగా గోల గోల గా ఉన్న చోట అంత నిశ్శబ్దం గా మారిపోయింది.
ఎస్క్యూస్ మీ మిస్టర్ వాట్ హప్పేండ్ వై అర్ యు షౌటెడ్ లైక్ థట్ అని ప్రశ్నించే సరికి కళ్ళు తుడుచుకుంటూ అసలు నేను ఎక్కడున్నాను అని చుట్టూ చూస్తూ ఉండగా హే మిస్టర్ ఐ ఆమ్ టాకింగ్ టు యు, …… హలో……. మిస్టర్ ……… హే……. అర్జున్ …… లుక్ హియర్…… అని అరిచాడు.
ఉన్న చోటు నిండి లేచి నించుని తను ఉన్నది క్లాస్ రూమ్ లో అని ఎదురుగా లెక్చరర్ ఉన్నాడని గమనించి తల గోక్కుంటు ఎంజరిగింది అని దిక్కులు చూస్తూ ఉంటే ఆ లెక్చరర్ తన దగ్గర ఉన్న ఒక వస్తువు ని అర్జున్ పైకి విసిరే సరికి అది తల కి తగిలి అబ్బా అని కళ్ళ దగ్గర పడ్డ డస్టర్ ని తీసుకుని ఉన్న చోటు నుండి లెక్చరర్ దగ్గరికి వచ్చి సారి సర్ అని డస్టర్ టేబుల్ పైన పెట్టేసి బైటికి వెళ్ళిపోయాడు.
కొంత దూరం నడిచి వాటర్ డిస్పెన్సరీ కనిపించడం తో కాసిన్ని మంచి నీళ్లు తాగి కళ్ళు కూడా కాస్త కడుక్కుని…, దీనమ్మ జీవితం ఇలాంటి కల వచ్చిందేంటి అంత నిజంగానే జరిగినట్టు అనిపించింది కానీ…… హమ్మయ్య కల కాబట్టి సరిపోయింది, అయినా నేను కనే కలలో నేను లేకుండా ఎలా అన్నేళ్ళు నేనె అంట చివరికి నన్ను చూయించి ఎవడో వరుణ్ అన్నాడు నాన్న. ఎంత విచిత్రంగా ఉంది అనుకుంటూ కొంత దూరం నడిచి ఒక చోట కూర్చుండి పోతాడు.