Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller కాలేజ్ డేస్
కాలేజ్ డేస్:    


                   భుజం మీదున్న రుక్సానా ఎంత బరువుగా వున్నా లెక్కచేయకుండా పరుగెత్తుతున్నాడు. ఆ సొరంగ మార్గం పూర్తీగా తెలిసిన వాడిలా తిరుగుతున్నాడు. అప్సానా మారు మాట్లాడకుండా అనుసరించింది. పది నిమిషాల తరవాత రుక్సానాని మోయడం కష్టమనిపించింది. ఆమెని కిందకి దింపి "చూస్తూవుండు ఇప్పుడే వస్తాను" అని చెప్పిముందుకు కదిలాడు. 
"ఎక్కడికి? " అడిగింది. "దాహం వేస్తొంది నీళ్లు దొరుకుతాయేమో చూస్తాను" అన్నాడు.
"ఈ సొరంగంలో నీళ్లెక్కడ దొరుకుతాయి" 
"వస్తున్నప్పుడు చూడలేదా ఒక రూమ్లో మనుషులున్నారు. వాళ్ల కాడ నీళ్లున్నాయోమో అడిగి తీసుకొస్తాను " అన్నాడు.
""ఎంది అడుగుతావా? . . " 
"వొరికే ఇస్తారా . . . ఎలాగోలా తీసుకొస్తాను " ముందుకు వెళ్లబోయాడు.
"ఎవరైనా వస్తే నేనేమ్ చేయాలి " 
"ఇదిగో దీన్ని నీకాడుంచు ఎవరైనా వస్తే " అని దాని పిడి పట్టుకుని లాగాడు. పెద్ద కత్తొకటి బయటికి వచ్చింది. "దీనిని చూపించి బెదిరించు వినకపోతే ఏసెయ్. పది నిమిషాలలో వస్తాను " అని వెళ్లాడు.

                అప్సానా ఆ కత్తిని తిప్పి తిప్పి చూసింది. చానా పదునుగా వుందా కత్తి. అరచేయంత వెడల్పుతో పొడవుగా వేటకత్తిలా వుంది. ఆ కత్తి నది దగ్గరే చిక్కి వుండాలి రాజుకి అని అనుకుంది. రాజు వచ్చేదాక రుక్సానా చూస్తూ కూర్చుంది. 

                సరిగ్గా పది నిమిషాల తరవాత రాజు చేతిలోని టార్చ్ వెల్లుగు గజిబిజిగా వెలుగుతూ వచ్చింది. పరుగెత్తుకుని ఆయాసంతో రొప్పుతూ వచ్చాడు. వచ్చీ రాగానే చేతిలో నీళ్ల బాటిల్, టార్చ్ ని అప్సానా చేతికిచ్చి రుక్సానాని భుజం మిదకేసుకుని వేగంగా నడవడం మొదలెట్టాడు. కళ్లు మూసి తెరిచేలోగా ఆ సందు నిండి ఇంకో సందులోకి జారుకున్నారు.
                నిమిషం తరవాత వాళ్లున్న ప్రదేశానికి నలుగురు మనుషులు వచ్చారు. వాళ్లలో ఇద్దరికి తలలకి దెబ్బలు తగులున్నాయి. "ఎక్కడ్రా వా నాకొడుకు " అని బొప్పి కట్టిన తల మీద చేయి పట్టుకుని అరిచాడు. 
"యా పక్కకి పోయింటాడు" అక్కడున్న రెండు సొరంగ మార్గాలలో ఏదాని వైపు పోవాలో తెలీక అడిగాడు రెండో వాడు.
"రేయ్ మీరిద్దురూ అట్ల పోయి యెతకండి, మేమిట్ల పోతాం " రెండు జట్లుగా చీలిపోయారు.

              ఎంత వేగంగా పరిగెత్తుదామనుకున్నా భుజం మీదున్న బరువు కారణంగా వేగాన్ని అందుకోలేక పోయాడు రాజు. వారు వెళ్తున్న ఇరుకైన మార్గం అంతమైపోయి వెడెల్పయిన మార్గం లోకి అడుగు పెట్టారు. ఆ మార్గంలో కొద్ది దూరం నడిచాక ఒక రాళ్ల కుప్పలాంటిది కనిపించింది. దాని వెనక రుక్సానాని దింపి వాళ్లిద్దరు కూడా అనుక్కున్నారు.

                రెండు జట్లుగా వీడిపోయిన వాళ్లు రెండు ఇరుకైన మార్గాల గుండా పయనించి ఆ రాళ్ల కుప్పదగ్గరే కలుసుకున్నారు. 
"ఏరా కనిపించినా రా వాడు" అని అరిచారు తల బొప్పికట్టిన వాడు. 
"లేదన్నా" అన్నారు ఇద్దురూ ఒకేసారి.
"యాడికి పాయరా నాకొడుకు" అని అసహనంగా అడిగాడు.
"అన్నా వాడాటికి పోయినా బయటకు పోయేకి ఒకే దావ కదన్నా. మన రవన్నకి చెప్పి పట్టుకుందాం లే అన్నా " అన్నాడు ఒకడు."వాడు నాకిప్పుడే కావల్ల రా" అని ఇంకోసారి తల నిమురుకున్నాడు. "ఎన్ని గుండెకాయలుంటే నన్నే కొడతాడ్రా వాడు" కోపంగా అన్నాడు. పైకి కోపం నటించినా అవమానంతో గుండె రగిలిపోతాంది వాడికి. తన దగ్గర పని చేసే వాళ్ల ముందర దెబ్బ తిన్నడం వల్ల అహం దెబ్బతినింది వానికి. 
"అన్నా మన వాళ్లలోనే ఎవరో ఒకరు చేసుంటారన్నా. నీకు తెలీనిదేముంది మన పనితనం చూసి కుళ్లుకునే నాకొడుకులు ఎంత మంది లేరు " అన్నాడొకడు.
"అవునన్నా, నాకిప్పుడనిపిస్తాంది మనందరం ఈడకొచ్చేసినాం ఇప్పుడానా కొడుకుని తప్పించేస్తే కొంప మునుగుతుంది" అని వచ్చిన దారినే పరిగెత్తాడు ఇంకోడు. వాడు చెప్పింది నిజమే అనిపించి వాళ్ల నాయకునికి. వాడు కూడా వాళ్లెనకే పరిగెత్తాడు.

             వాళ్లు వెళ్లిపోయారా లేదా అని తల పైకెత్తి చూశాడు రాజు. వెళ్లిపోయారని నిర్దారించుకున్నాక అప్సానా వైపు చూసి "దీనితోనే కొట్నా"  టార్చ్ ని చూపించి చెప్పాడు.
"దోనికో కొట్నారనుకుంటున్నాడు నీళ్ల కోసమని తెలిస్తే గుండు పగిలి చస్తాడు నా కొడుకు "అని వెనకాలున్న ఒక రాతిని బలవంతంగా పక్కకి జరిపాలని ప్రయత్నించాడు.
"అదెందుకు ఇప్పుడు జరపడం" అడిగింది అప్సానా.
"ఒక చేయి పట్టు . . . హుమ్మ్" అని మూలిగాడు. అప్సానా కూడా సాయం చేసింది.
ఇద్దరూ పది నిమిషాల పాటు కష్టపడగానే ఆ బండ కొంచెం కదిలింది. మరికొంత సేపటికి దాన్ని పూర్తీగా పెకలించి పారేశారు. ఒక పెద్ద బొక్క బయట పడింది.లోనకి తల పెట్టి టార్చ్ లైటుని వేశాడు. 

                అది మరో సొరంగం.అప్సానాకి మతి పోయింది.ఎన్ని సొరంగాలున్నా యిక్కడ అవి రాజుకెలా తెలుసని అనుకుంది. ఆ విషయం రాజుని అడగాలనుకుంది. "ముందు నేను దిగుతా తరవాత మీయక్క చివరగా నువ్వు" రాజు ఆ బొక్కలోకి జారుకున్నాడు.   
 
                   మరో పావుగంట ఆ సొరంగంలో ప్రయాణం చేశాక వాళ్ల ముందు మెట్లు ప్రత్యక్షమయ్యాయి. చివరి మెట్టు ఎక్కి రుక్సానాని కిందికి దించాడు.ఎదురుగా నున్న రాతి తలుపును బలవంతంగా లాగాడు. కిర్రుమని శబ్దం చేస్తూ పక్కకి జరిగి తోవనిచ్చింది.

                 వేణు గోపాల స్వామి గుడది. రాజు తెరిచిన తలుపు ఆ గుడిలోని నేలమాళిగలోకి దారి. పూర్వకాలం గుడిలోనించి తప్పించుకుని బయటికి పారిపోవడానికి తవ్వించిన సొరంగపు దారి. నేలమాళిగ దాటుకుని బయటకు రాగానే ఎదురుగా ఆ గుడి పూజారి.ఆయనని చూడగానే రాజు ఒక్క క్షణకాలం వూపిరాగినంత పనయ్యింది. 
 
                ఆ సమయంలో రాజు ఆయనను అక్కడ వుంటాడని రాజు వూహించలేదు. ఆయన ఇళ్లు వూళ్లో కదా వుండేది ఈ టైంలో . . . . పైగా గుడి వూరికి దూరంగా వుంటాది. కొంపదీసి దొంగ నాకొడుకు గుడి దొంగతనానికి వచ్చాడని వూళ్లో చెప్పడు కదా. తనతో పాటు ఇద్దరమ్మాయిలు వున్నారు. అమ్మాయిలను ఎత్తుకు పోయే వాడని చెబితే వూళ్లో వాళ్లు ఇరగొట్టేత్తారు. ఇవన్నీ వాని కళ్లల్లో కనిపించాయి.
 
              రాజు వూహలకు విరుద్దంగా ఆయన "ఎమైందా పాపకి " అని అడిగాడు.

             "ఎమో తెలీదు సామీ, ఎందుకో తెలివి తప్పి పడిపోయింది" చెప్పాడు. భుజాల మీదున్న రుక్సానాని కిందకి దింపబోయాడు.

             "ఈడొద్దు, ఆ పక్కన పాకుంది ఆడికి తీసుకపదా" దారి తీశాడు పాక లోకి. ఆ పాకలో ఒక మంచం వుంది. చిన్న కిరసనాయలు బుడ్డీ వెలుగుతావుంది. మంచం మీద రుక్సానాని పడుకోబెట్టాడు. పూజారి రుక్సానా నాడి పట్టుకున్నాడు. కొద్ది క్షణాల పాటు నాడి పరిశీలించగానే ఆయన కళ్లు మెరిశాయి. తరవాత చేయాల్సిన పనులతో ఆయన బిజీ అయిపోయాడు.

              రెండు నిమిషాల తరవాత ఒక గ్లాసు నీళ్లు రుక్సానా గొంతులో పోశాడు. ఒక గిన్నేలో నిప్పులు పోసి సామ్రాని పొగవేశాడు. ఆమ్మవారి కుంకుమని నుదుటన పెట్టాడు.

            "ఎవురీ పాప" అని అడిగాడు.

             "మా అక్క" అనింది అప్సానా.

            "చూడ్డానికి మన మతం వాళ్లలా లేరే " అన్నాడు రాజుతో. అవునన్నట్టు తలూపాడు రాజు.

            "ఎవురైనా కానీయండి రేపు మూడుపూటలా ఈ నిమ్మకాయలని రసం చేసి ఆ పాపకి ఇవ్వాలి. జాగ్రత్త అమ్మవారి దగ్గరుంచి మంత్రించిన నిమ్మకాయలు అంటు ముట్టు తగల కూడదు" అన్నాడు అప్సానా చేతికి ఇస్తూ.

             "ఎమైంది మా యక్కకు" అడింది బయంగా ఆయన చెప్పిన మాటలు విని.

             "ఏమి లేదమ్మా చిన్న మంత్రకట్టు మామూలుగా ఒక్క రోజు పాటు వుంటాది. మంత్రించిన కుంకమ,నిమ్మకాయ నీళ్లు తాపానుగా గంటలో కట్టు విడిపోతుంది " చెప్పాడు సమాదానంగా. అయినా అప్సానా భయమింకా పోలేదు. రాజు వైపు చూసింది భయం నిండిన కళ్లతో. 

            "ఏమి కాదులే, ఎందుకు భయపడతావు. ధైర్యంగా వుండు " అని చెప్పాడు.

            "ఇదిగో తల్లీ, ఆ పాప కట్టుకున్న బట్టలు విప్పి ఇవి కట్టు " ఒక జత బట్టలు అప్సానా చేతిలో పెట్టాడు. 
 
            "అవును ఈ బట్టలతో ఇంటికి పోతే అంతే" అన్నాడు. రాజు పూజారి బయటికి పోతూ "తెల్లారడానికి ఇంకా గంటకు పైగా సమయముంది కాసేపు కునుకు తీయమ్మా " అని చెప్పి బయటకి పోయారు.
        
            "నాయనా నీ కొద్ది సేపు ఏకాంతంగా మాట్లాడాలి" అని పాక బయటికి వచ్చిన తరవాత రాజుతో అన్నాడు పూజారి.
"నేను కూడా మీతో వొంటరిగా మాట్లాడాలను కుంటున్నాను. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు కాదు." అన్నాడు. 
"ఆ పిల్లోల్లు జాగ్రత్త" అని చెప్పి నేలమాళిగకు దారి తీసే రహస్య సొరంగంలోకి వెళ్లిపోయాడు.

             నాలుగు గంటలు అవుతుండగా రాజు ఈ సారి భుజం మీద ఒక మగ మనిషిని ఎత్తుకుని సొరంగం లోనుంచి బయటకొచ్చాడు.

            "ఈ యప్ప ఎవురప్పా" ఆశ్యర్యంతో నోరెల్ల బెడుతూ అన్నాడు పూజారి.

            "తెలిసి నోడే సామీ, సంపెత్తారేమోనని బయపడి ఎత్తుకొచ్చినా"

            "ఎందుకు సంపాలను కున్నరో, వాళ్లలో ఒకడేమో" అన్నాడు పూజారి. నాడి చూసి నుదురు రుద్దుకున్నాడు పూజారి.
         
            "బతికుతాడా సామీ" అని అడిగాడు రాజు. 

            "అన్నీ మూగి దెబ్బలు రా అప్పయ్యా, నాకు పసురు వైద్యం కూడా తెలుసు పసురేసి కట్టు కడితే ఎట్లాంటి దెబ్బలయినా మాయమై పోతాయి"అని ఆన్నాడు. "కాకపోతే ఆ పసురుకు కావల్సిన ఆకులు ఇప్పుడు నా కాడ లేవు  నువ్వో పని చెయ్యి ఆ పిల్లోల్లని ఇంటికాడ ఇడిసి మాఇంటి కాడికిపో మాయాడదాన్ని లేపి పసురాకులు తీసుకురా " ఆ పసురుకు కావలసిన ఆకు పేర్లు చెప్పాడు.

                నాలుగున్నర అవుతుండగా అప్సానా రుక్సానాలను ఇంటికాడ దిగబెట్టాడు. అక్కకు జరిగిందంతా దారిలో వివరిస్తా వచ్చింది అప్సానా.అందుకనే రాజు వాళ్లకు వీడ్కోలు చెప్పి వెళ్లిపోతావుంటే గట్టిగా వాటేసుకుంది రుక్సానా. థ్యాంక్స్ అని బుగ్గ మీద ముద్దుపెట్టింది. అప్సానా పెదాల మీద ముద్దు పెట్టింది.
 
               అరగంటలో పూజారికి కావల్సిన పసురాకులు ఆయనకిచ్చి "ఈ మనిషి జాగ్రత్త" అని చెప్పి బంగళాకి వచ్చాడు.            

              బంగళా అడుగు పెట్టగానే సంద్య ఆనందంతో గంతులేసింది. "బావిలోనించి ఎటువంటి అరుపు ఇనపడక పోతే చచ్చిపోయినావే అనుకున్నా"అనింది. "అవును నీతో పాటు వున్న ఆ పిల్లెక్కడ" అని అడింది సంద్య. 

             "ఇంటికాడ ఇడిసేసి వచ్చినా" అన్నాడు.

             "అవును బావిలోనించి ఎలా బయట పడ్డావ్ " అని అడిగింది ఆశ్చ్యర్యంగా.

              "అవన్నీ మళ్లా మాట్లాడుకుందాం రెయ్యంతా నిద్ర లేదు " అని గదిలోకి వెళ్లి గడి పెట్టుకున్నాడు.

              పోయే ముందు మాత్రం రుక్సానా వంటి మీది నగలు వున్న మూటను ఆమె చేతి కందించాడు. వాటిని చూసిన సంద్య కళ్లు పెద్దవి చేసింది. వాటిని చూసినప్పుడే ఏమి జరిగిందో కొంతవరకు వూహించింది. ఎందుకంటే కేశి రెడ్డి కూడా అప్పుడప్పుడు ఇలాంటి నగలే తీసుకొచ్చే వాడు. అంటే వీడు కేశి రెడ్డి కోటలోనించి బయట పడ్డాడు. మొదటి సారి తన నిర్ణయం సరైనదే ననిపించింది.
[+] 9 users Like banasura1's post
Like Reply


Messages In This Thread
కాలేజ్ డేస్ - by banaasura - 05-11-2018, 11:06 PM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 06-11-2018, 03:24 AM
RE: కాలేజ్ డేస్ - by Okyes? - 06-11-2018, 07:36 AM
RE: కాలేజ్ డేస్ - by raaki86 - 07-11-2018, 07:15 AM
RE: కాలేజ్ డేస్ - by Pk babu - 07-11-2018, 07:32 AM
RE: కాలేజ్ డేస్ - by k3vv3 - 07-11-2018, 01:22 PM
RE: కాలేజ్ డేస్ - by Yuvak - 07-11-2018, 01:27 PM
RE: కాలేజ్ డేస్ - by Lakshmi - 07-11-2018, 03:44 PM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 10-11-2018, 06:39 AM
RE: కాలేజ్ డేస్ - by raaki86 - 11-11-2018, 10:14 AM
RE: కాలేజ్ డేస్ - by krish - 30-01-2019, 04:08 AM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 01-07-2019, 01:14 PM
RE: కాలేజ్ డేస్ - by sri_sri - 01-07-2019, 03:39 PM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 03-07-2019, 05:21 AM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 06-07-2019, 10:57 PM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 08-07-2019, 04:34 PM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 09-07-2019, 07:12 AM
RE: కాలేజ్ డేస్ - by Freyr - 10-07-2019, 10:15 PM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 12-07-2019, 05:50 AM
RE: కాలేజ్ డేస్ - by Freyr - 12-07-2019, 08:05 AM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 12-07-2019, 02:37 PM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 12-07-2019, 09:33 PM
RE: కాలేజ్ డేస్ - by Freyr - 14-07-2019, 08:32 AM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 15-07-2019, 12:25 PM
RE: కాలేజ్ డేస్ - by Freyr - 16-07-2019, 08:03 AM
RE: కాలేజ్ డేస్ - by barr - 16-07-2019, 12:47 PM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 18-07-2019, 04:55 AM
RE: కాలేజ్ డేస్ - by Freyr - 18-07-2019, 07:34 AM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 22-07-2019, 06:50 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 23-07-2019, 07:58 AM
RE: కాలేజ్ డేస్ - by Muni - 23-07-2019, 08:54 AM
RE: కాలేజ్ డేస్ - by naani - 23-07-2019, 01:02 PM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 25-07-2019, 04:08 PM
RE: కాలేజ్ డేస్ - by Pradeep - 25-07-2019, 08:24 PM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 26-07-2019, 01:34 PM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 26-07-2019, 03:56 PM
RE: కాలేజ్ డేస్ - by Pradeep - 26-07-2019, 07:32 PM
RE: కాలేజ్ డేస్ - by barr - 26-07-2019, 08:58 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 27-07-2019, 08:23 AM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 02-08-2019, 10:14 PM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 07-08-2019, 07:50 AM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 16-08-2019, 05:03 PM
RE: కాలేజ్ డేస్ - by Freyr - 24-08-2019, 09:45 AM
RE: కాలేజ్ డేస్ - by Pradeep - 26-09-2019, 08:42 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 27-09-2019, 06:59 AM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 27-09-2019, 08:45 AM
RE: కాలేజ్ డేస్ - by naree721 - 30-09-2019, 04:32 PM
RE: కాలేజ్ డేస్ - by Freyr - 14-10-2019, 02:27 AM
RE: కాలేజ్ డేస్ - by Muni - 15-10-2019, 08:23 AM
RE: కాలేజ్ డేస్ - by Freyr - 20-10-2019, 05:19 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 23-10-2019, 04:07 PM
RE: కాలేజ్ డేస్ - by Freyr - 24-10-2019, 05:31 AM
RE: కాలేజ్ డేస్ - by Pradeep - 24-10-2019, 02:06 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 24-10-2019, 11:58 PM
RE: కాలేజ్ డేస్ - by Mandolin - 26-10-2019, 07:14 AM
RE: కాలేజ్ డేస్ - by Freyr - 30-10-2019, 05:38 AM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 01-11-2019, 08:08 AM
RE: కాలేజ్ డేస్ - by Venrao - 01-11-2019, 10:56 AM
RE: కాలేజ్ డేస్ - by Naga raj - 07-11-2019, 06:47 PM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 12-11-2019, 02:10 PM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 12-11-2019, 02:11 PM
RE: కాలేజ్ డేస్ - by Naga raj - 13-11-2019, 09:41 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 14-11-2019, 03:23 PM
RE: కాలేజ్ డేస్ - by Naga raj - 15-11-2019, 06:29 AM
RE: కాలేజ్ డేస్ - by Naga raj - 17-11-2019, 05:16 AM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 17-11-2019, 09:34 AM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 17-11-2019, 10:20 AM
RE: కాలేజ్ డేస్ - by abinav - 19-11-2019, 04:30 PM
RE: కాలేజ్ డేస్ - by Naga raj - 20-11-2019, 05:14 PM
RE: కాలేజ్ డేస్ - by Naga raj - 21-11-2019, 01:10 AM
RE: కాలేజ్ డేస్ - by Mnlmnl - 21-11-2019, 09:03 AM
RE: కాలేజ్ డేస్ - by abinav - 21-11-2019, 12:22 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 21-11-2019, 12:30 PM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 22-11-2019, 06:38 PM
RE: కాలేజ్ డేస్ - by Mnlmnl - 27-11-2019, 06:43 AM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 27-11-2019, 09:15 AM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 28-11-2019, 07:19 AM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 29-11-2019, 06:08 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 30-11-2019, 09:37 AM
RE: కాలేజ్ డేస్ - by abinav - 30-11-2019, 11:43 AM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 30-11-2019, 03:23 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 04-12-2019, 08:12 AM
RE: కాలేజ్ డేస్ - by abinav - 04-12-2019, 01:43 PM
RE: కాలేజ్ డేస్ - by Fufufu - 05-12-2019, 01:38 PM
RE: కాలేజ్ డేస్ - by Mohana69 - 06-12-2019, 10:48 AM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 07-12-2019, 08:34 AM
RE: కాలేజ్ డేస్ - by Mnlmnl - 07-12-2019, 10:04 AM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 07-12-2019, 10:42 AM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 07-12-2019, 04:30 PM
RE: కాలేజ్ డేస్ - by readersp - 07-12-2019, 03:31 PM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 08-12-2019, 10:32 AM
RE: కాలేజ్ డేస్ - by Mnlmnl - 08-12-2019, 08:58 AM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 08-12-2019, 10:25 AM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 08-12-2019, 02:11 PM
RE: కాలేజ్ డేస్ - by abinav - 09-12-2019, 11:49 AM
RE: కాలేజ్ డేస్ - by readersp - 10-12-2019, 12:10 PM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 10-12-2019, 04:04 PM
RE: కాలేజ్ డేస్ - by banasura1 - 12-12-2019, 12:33 AM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 12-12-2019, 08:35 AM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 12-12-2019, 03:49 PM
RE: కాలేజ్ డేస్ - by readersp - 12-12-2019, 04:25 PM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 12-12-2019, 06:56 PM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 13-12-2019, 06:11 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 13-12-2019, 01:52 PM
RE: కాలేజ్ డేస్ - by readersp - 13-12-2019, 05:36 PM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 13-12-2019, 07:24 PM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 13-12-2019, 07:24 PM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 13-12-2019, 10:59 PM
RE: కాలేజ్ డేస్ - by Venrao - 14-12-2019, 10:38 AM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 15-12-2019, 10:02 AM
RE: కాలేజ్ డేస్ - by readersp - 15-12-2019, 07:51 PM
RE: కాలేజ్ డేస్ - by shadow - 17-12-2019, 04:20 PM
RE: కాలేజ్ డేస్ - by readersp - 17-12-2019, 04:30 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 17-12-2019, 08:06 PM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 18-12-2019, 05:56 PM
RE: కాలేజ్ డేస్ - by Banny - 20-12-2019, 09:23 PM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 21-12-2019, 09:43 AM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 21-12-2019, 10:53 AM
RE: కాలేజ్ డేస్ - by Mnlmnl - 23-12-2019, 09:55 AM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 23-12-2019, 11:27 AM
RE: కాలేజ్ డేస్ - by abinav - 23-12-2019, 03:25 PM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 24-12-2019, 09:07 PM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 25-12-2019, 11:27 AM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 26-12-2019, 03:02 PM
RE: కాలేజ్ డేస్ - by readersp - 29-12-2019, 09:37 PM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 30-12-2019, 06:38 PM
RE: కాలేజ్ డేస్ - by Bmreddy - 31-12-2019, 06:54 AM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 31-12-2019, 10:07 AM
RE: కాలేజ్ డేస్ - by abinav - 31-12-2019, 11:45 AM
RE: కాలేజ్ డేస్ - by readersp - 31-12-2019, 12:03 PM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 31-12-2019, 09:01 PM
RE: కాలేజ్ డేస్ - by DVBSPR - 31-12-2019, 10:41 PM
RE: కాలేజ్ డేస్ - by Mnlmnl - 01-01-2020, 08:26 AM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 01-01-2020, 08:52 AM
RE: కాలేజ్ డేస్ - by Mnlmnl - 02-01-2020, 12:34 PM
RE: కాలేజ్ డేస్ - by abinav - 02-01-2020, 02:50 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 03-01-2020, 11:41 AM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 06-01-2020, 05:40 PM
RE: కాలేజ్ డేస్ - by readersp - 08-01-2020, 02:30 PM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 09-01-2020, 09:55 PM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 10-01-2020, 12:58 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 10-01-2020, 05:33 PM
RE: కాలేజ్ డేస్ - by Mnlmnl - 10-01-2020, 07:02 PM
RE: కాలేజ్ డేస్ - by Bmreddy - 10-01-2020, 07:11 PM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 11-01-2020, 01:22 PM
RE: కాలేజ్ డేస్ - by readersp - 11-01-2020, 07:18 PM
RE: కాలేజ్ డేస్ - by Lanjalu - 14-01-2020, 05:16 PM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 15-01-2020, 10:39 AM
RE: కాలేజ్ డేస్ - by readersp - 15-01-2020, 12:14 PM
RE: కాలేజ్ డేస్ - by abinav - 16-01-2020, 10:55 AM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 18-01-2020, 11:57 AM
RE: కాలేజ్ డేస్ - by pfakkar - 18-01-2020, 02:48 PM
RE: కాలేజ్ డేస్ - by Jola - 19-01-2020, 08:56 AM
RE: కాలేజ్ డేస్ - by readersp - 19-01-2020, 10:12 AM
RE: కాలేజ్ డేస్ - by Pk1981 - 19-01-2020, 10:17 AM
RE: కాలేజ్ డేస్ - by Bmreddy - 20-01-2020, 09:43 AM
RE: కాలేజ్ డేస్ - by abinav - 20-01-2020, 03:54 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 20-01-2020, 04:17 PM
RE: కాలేజ్ డేస్ - by readersp - 21-01-2020, 08:46 PM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 22-01-2020, 11:43 AM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 25-01-2020, 08:49 AM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 27-01-2020, 12:07 PM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 06-02-2020, 02:42 PM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 07-02-2020, 06:37 PM
RE: కాలేజ్ డేస్ - by Naga raj - 07-02-2020, 06:43 PM
RE: కాలేజ్ డేస్ - by DVBSPR - 08-02-2020, 07:32 AM
RE: కాలేజ్ డేస్ - by Naga raj - 08-02-2020, 08:09 AM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 08-02-2020, 08:29 AM
RE: కాలేజ్ డేస్ - by Mnlmnl - 08-02-2020, 10:12 AM
RE: కాలేజ్ డేస్ - by abinav - 10-02-2020, 03:58 PM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 12-02-2020, 10:29 AM
RE: కాలేజ్ డేస్ - by Mnlmnl - 12-02-2020, 04:01 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 04-03-2020, 08:15 AM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 04-03-2020, 09:39 AM
RE: కాలేజ్ డేస్ - by DVBSPR - 04-03-2020, 01:57 PM
RE: కాలేజ్ డేస్ - by Mnlmnl - 04-03-2020, 03:21 PM
RE: కాలేజ్ డేస్ - by abinav - 05-03-2020, 12:07 PM
RE: కాలేజ్ డేస్ - by readersp - 10-03-2020, 07:19 PM
RE: కాలేజ్ డేస్ - by readersp - 22-03-2020, 05:52 PM
RE: కాలేజ్ డేస్ - by abinav - 01-04-2020, 01:02 PM
RE: కాలేజ్ డేస్ - by DVBSPR - 01-04-2020, 01:59 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 01-04-2020, 03:48 PM
RE: కాలేజ్ డేస్ - by drsraoin - 09-04-2020, 10:00 AM
RE: కాలేజ్ డేస్ - by DVBSPR - 12-04-2020, 10:12 AM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 12-04-2020, 07:07 PM
RE: కాలేజ్ డేస్ - by Freyr - 14-04-2020, 08:59 AM
RE: కాలేజ్ డేస్ - by drsraoin - 20-04-2020, 06:37 PM
RE: కాలేజ్ డేస్ - by Mnlmnl - 22-04-2020, 04:30 PM
RE: కాలేజ్ డేస్ - by DVBSPR - 24-04-2020, 06:03 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 24-04-2020, 08:20 PM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 30-04-2020, 04:44 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 01-05-2020, 08:48 PM
RE: కాలేజ్ డేస్ - by DVBSPR - 09-05-2020, 09:52 AM
RE: కాలేజ్ డేస్ - by Mnlmnl - 09-05-2020, 10:14 AM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 09-05-2020, 03:39 PM
RE: కాలేజ్ డేస్ - by abinav - 11-05-2020, 06:21 PM
RE: కాలేజ్ డేస్ - by drsraoin - 13-05-2020, 09:40 AM
RE: కాలేజ్ డేస్ - by DVBSPR - 18-05-2020, 09:52 AM
RE: కాలేజ్ డేస్ - by abinav - 18-05-2020, 04:00 PM
RE: కాలేజ్ డేస్ - by drsraoin - 19-05-2020, 09:12 AM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 20-05-2020, 11:27 PM
RE: కాలేజ్ డేస్ - by KRISHNA1 - 21-05-2020, 04:43 AM
RE: కాలేజ్ డేస్ - by KRISHNA1 - 21-05-2020, 05:28 AM
RE: కాలేజ్ డేస్ - by KRISHNA1 - 21-05-2020, 07:08 AM
RE: కాలేజ్ డేస్ - by KRISHNA1 - 23-05-2020, 06:02 AM
RE: కాలేజ్ డేస్ - by KRISHNA1 - 24-05-2020, 11:13 PM
RE: కాలేజ్ డేస్ - by KRISHNA1 - 23-05-2020, 09:23 PM
RE: కాలేజ్ డేస్ - by KRISHNA1 - 24-05-2020, 11:37 PM
RE: కాలేజ్ డేస్ - by KRISHNA1 - 25-05-2020, 12:43 AM
RE: కాలేజ్ డేస్ - by DVBSPR - 25-05-2020, 07:32 AM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 25-05-2020, 08:08 AM
RE: కాలేజ్ డేస్ - by drsraoin - 25-05-2020, 03:26 PM
RE: కాలేజ్ డేస్ - by Pradeep - 25-05-2020, 03:41 PM
RE: కాలేజ్ డేస్ - by abinav - 25-05-2020, 05:00 PM
RE: కాలేజ్ డేస్ - by KRISHNA1 - 26-05-2020, 11:54 AM
RE: కాలేజ్ డేస్ - by KRISHNA1 - 30-05-2020, 10:04 PM
RE: కాలేజ్ డేస్ - by KRISHNA1 - 01-06-2020, 11:53 PM
RE: కాలేజ్ డేస్ - by Venky.p - 02-06-2020, 02:59 PM
RE: కాలేజ్ డేస్ - by drsraoin - 03-06-2020, 01:05 PM
RE: కాలేజ్ డేస్ - by lovenature - 09-06-2020, 08:38 PM
RE: కాలేజ్ డేస్ - by KRISHNA1 - 11-06-2020, 01:59 PM
RE: కాలేజ్ డేస్ - by DVBSPR - 19-06-2020, 06:49 PM
RE: కాలేజ్ డేస్ - by KRISHNA1 - 28-06-2020, 09:46 PM
RE: కాలేజ్ డేస్ - by raj558 - 28-06-2020, 09:58 PM
RE: కాలేజ్ డేస్ - by drsraoin - 01-08-2020, 02:19 PM
RE: కాలేజ్ డేస్ - by DVBSPR - 22-08-2020, 06:56 AM
RE: కాలేజ్ డేస్ - by naree721 - 16-09-2020, 07:18 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 16-09-2020, 08:06 PM
RE: కాలేజ్ డేస్ - by ceexey86 - 17-09-2020, 12:03 AM
RE: కాలేజ్ డేస్ - by naree721 - 20-09-2020, 04:34 PM
RE: కాలేజ్ డేస్ - by naree721 - 28-10-2020, 08:06 PM
RE: కాలేజ్ డేస్ - by raja b n - 03-07-2021, 08:11 PM
RE: కాలేజ్ డేస్ - by DVBSPR - 29-10-2020, 07:24 AM
RE: కాలేజ్ డేస్ - by Mohana69 - 29-10-2020, 11:10 PM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 30-10-2020, 11:40 PM
RE: కాలేజ్ డేస్ - by naree721 - 07-11-2020, 04:48 PM
RE: కాలేజ్ డేస్ - by raj558 - 07-11-2020, 09:29 PM
RE: కాలేజ్ డేస్ - by naree721 - 15-11-2020, 05:17 PM
RE: కాలేజ్ డేస్ - by naree721 - 17-11-2020, 07:30 PM
RE: కాలేజ్ డేస్ - by raj558 - 24-11-2020, 08:45 PM
RE: కాలేజ్ డేస్ - by drsraoin - 26-11-2020, 10:13 AM
RE: కాలేజ్ డేస్ - by naree721 - 27-11-2020, 06:54 PM
RE: కాలేజ్ డేస్ - by SB1271 - 03-01-2021, 12:02 AM
RE: కాలేజ్ డేస్ - by Kasim - 31-01-2021, 12:17 AM
RE: కాలేజ్ డేస్ - by raj558 - 03-02-2021, 08:07 AM
RE: కాలేజ్ డేస్ - by drsraoin - 03-02-2021, 07:46 PM
RE: కాలేజ్ డేస్ - by Uday - 05-02-2021, 01:53 PM
RE: కాలేజ్ డేస్ - by Sammoksh - 22-03-2021, 03:05 AM
RE: కాలేజ్ డేస్ - by Uday - 08-07-2021, 04:05 PM
RE: కాలేజ్ డేస్ - by raja b n - 09-07-2021, 01:19 PM
RE: కాలేజ్ డేస్ - by raja b n - 03-07-2022, 05:31 AM
RE: కాలేజ్ డేస్ - by raja b n - 27-07-2022, 05:57 PM
RE: కాలేజ్ డేస్ - by BR0304 - 03-09-2021, 11:57 PM
RE: కాలేజ్ డేస్ - by ramd420 - 04-09-2021, 06:48 AM
RE: కాలేజ్ డేస్ - by Uday - 04-09-2021, 12:04 PM
RE: కాలేజ్ డేస్ - by nari207 - 06-10-2021, 02:09 PM
RE: కాలేజ్ డేస్ - by utkrusta - 18-12-2021, 01:16 PM
RE: కాలేజ్ డేస్ - by Paty@123 - 19-12-2021, 03:20 PM
RE: కాలేజ్ డేస్ - by Paty@123 - 21-02-2022, 09:31 PM
RE: కాలేజ్ డేస్ - by Paty@123 - 24-02-2022, 08:27 AM
RE: కాలేజ్ డేస్ - by sarit11 - 24-05-2022, 10:58 PM
RE: కాలేజ్ డేస్ - by munna001 - 25-06-2022, 04:40 PM
RE: కాలేజ్ డేస్ - by munna001 - 25-06-2022, 04:43 PM
RE: కాలేజ్ డేస్ - by raj558 - 01-08-2022, 02:07 AM
RE: కాలేజ్ డేస్ - by raja b n - 18-08-2024, 12:35 PM
RE: కాలేజ్ డేస్ - by sri7869 - 19-08-2024, 12:09 AM
RE: కాలేజ్ డేస్ - by maleforU - 30-08-2024, 07:26 PM



Users browsing this thread: 25 Guest(s)