01-12-2019, 02:47 PM
(30-11-2019, 02:43 PM)Lakshmi Wrote: ఎంత చక్కటి చర్చ జరిగింది... ఇప్పుడు ఇలాంటివి జరగట్లేదు...
సరిత్ గారికి ధన్యవాదాలు
కేవలం చర్చలే కాదు, కథలకి కమెంట్లు ఏం పెడుతున్నామో కూడా తెలియటం లేదు. గబగబా రావడం పది పదిహేను దారాల్లో సూపర్ అప్డేట్... నైస్ అప్డేట్... అద్భుతమైన అప్డేట్... నా శార్ధం... సింగినాధం... పిండాకూడు... అంటూ అఘోరిస్తారే తప్ప అసలు ఏం అప్డేట్ పెట్టారని కూడా చూడరు. మొన్నామధ్య నా దారంలో ఒకతను నేను ఏ అప్డేట్ పెట్టకుండానే సూపర్ అప్డేట్ అని రిప్లయి పెట్టాడు. నాకే అనుమానమొచ్చేసింది. నేనేం పెట్టానా అని. వీళ్ళందరూ కేవలం అధిక రిప్లయిలు ఇచ్చాం... రచయితలను ప్రోత్సాహించేస్తున్నాం అనే అపోహలో ఉంటున్నారు. నిజంగా మనసులోంచి వచ్చేది చిన్న మాటైనా అవతల వ్యక్తికి ఖచ్చితంగా హత్తుకుంటుంది. వీళ్ళు వ్రాసే మొక్కుబడి కమెంట్లకి వ్యర్ధంగా పేజీలు నిండుతాయి తప్ప రైటర్ మనసు మాత్రం కొంచెం కూడా నిండదు. రైటర్లు మరో అడుగు ముందేసి వాళ్ళకి రిప్లయిలు ఇవ్వడానికి మరికొన్ని పేజీలని నింపుతారు.
అంతా స్క్రాప్!
మిగతా రైటర్స్ ఏం కోరుకుంటున్నారో నాకు తెలీదుగానీ, నాకు కావలసింది మాత్రం... టాప్ కమెంటర్స్ కాదు. కథని మనసుపెట్టి చదివే కమెంటర్స్. అలా చదవలేనివారు అసలు నా దారానికి రాకపోయినా పర్లేదు. ఎందుకంటే, నేను కమెంట్లు ఆశించి వ్రాయను. కథకి కనెక్ట్ అయ్యేవారు ఎందరు అనేదే చూస్తాను.
ఇక కింగ్స్ గ్యాంబిట్ గారు వ్రాసిన ఒక కథ వుంది. పేరు సరిగ్గా గుర్తులేదు. 'ఇది నా ఆత్మకథ' అని ఏదో వుంటుంది. కానీ, ఆ కథని అతను వ్రాసిన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది. దురదృష్టవశాత్తు ఆ కథని xbలో ఉన్నప్పుడు నేను చూడలేదు. Waybackmachine ద్వారా xbలో తిరుగాడుతుండగా నాకు కనిపించిందా కథ. దానిలో పూర్తిగా చదివే భాగ్యం లభించలేదు. మీ ఎవరి దగ్గరైనా ఆ కథ ఉంటే ఇక్కడ పోస్టు చెయ్యగలరు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK