Thread Rating:
  • 4 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మిక చింతన
#24
మనసా... వాచా... కర్మణా...[Image: IMG-20191201-081855.jpg]

త్రికరణశుద్ధి అంటే ఏమిటి?
త్రికరణాలు అంటే ఏమిటి?

1. మనసా ( మన ఆలోచన, సంకల్పం )
2. వాచా ( వాక్కు ద్వారా, చెప్పినటువంటిది )
3. కర్మణా (కర్మ, చేతల ద్వారా )

మనలో చాలామందికి మనస్సులో
ఒక సంకల్పం ఉంటుంది.
అది ఎదుటివారి మెప్పు కోసమో, లేక
మన సంకల్పం బయల్పరచడం ఇష్టం లేకో, లేదా
మరొక కారణం చేత అనుకున్నది చెప్పలేక,
చెప్పిన పని చెయ్యలేము.
మనస్సు అనుకున్న విషయం నాలుక ద్వారా చెప్పలేము, చెప్పినది ఆచరించలేము.
అది ఏది పడితే అది ఆలోచించి మాట్లాడి
చేసెయ్యడం కాదు.
ధార్మికమైన, శాస్త్ర ఆమోదయోగ్యమైన,
అందరికీ ఉపయోగి పడే కర్మ ఉండాలని
శాస్త్రం చెబుతుంది.
అదే త్రికరణశుద్ధి.

త్రికరణశుద్దిగా చేసిన పనులకు..
దేవుడు మెచ్చును లోకము మెచ్చును”
అని హెచ్చరిస్తాడు అన్నమాచార్యుడు.
ఎవరు చూసినా చూడక పోయినా మనలోని అంతరాత్మగా మెలిగే భగవంతునికి అన్నీ తెలుస్తాయి. మన మనస్సులో విషయం మరొకరికి తెలియకపోవచ్చు కానీ మన సంకల్పాలన్నీ చదవగలిగిన దేవునికి
ఇది తెలిసి ఉండదా?

ఒకసారి పురందరదాసులవారిని ఎవరికీ తెలియకుండా అరటిపండు తినమని వారి గురువుగారు చెప్పగా, దేవుడు లేని ప్రదేశం కానీ, అంతరాత్మ చూడని చోటు కానీ తనకు కనబడలేదని చెప్పగా గురువుగారు
ఎంతో సంతోషించి ఆశీర్వదించారు.

ఎవరి మెప్పుకోసమో కాదు కదా మనం చేసే కర్మ.
అది మనకోసమే కదా.
అనుకున్నది చేప్పి, చెప్పిన సత్కర్మ చెయ్యడం
అభ్యాసం మీద కానీ రాదు.
అన్నీ మంచి ఆలోచనలే వస్తే వాటిని ఆచరించడంలో మనం జాప్యం చెయ్యకుండా భగవంతుని ఆజ్ఞ అనుకుని ఆచరించడమే శ్రేయస్కరం.

ఒక చిన్న లౌకిక ఉదాహరణ తీసుకుందాం.
చిన్నప్పుడు కిడ్డీ బ్యాంకులు అని చిన్న బొమ్మలను అందరూ చూసి ఉంటారు.
ఆ బొమ్మ క్రింద భాగంలో అంకెల చట్రాలు
మూడు ఉంటాయి.
సరైన అంకెల కలయిక ఇవ్వనిదే ఆ మూత తెరవబడదు. పైన ఒక చిన్న రంధ్రంనుండి మనం పైసలు లోపలకు వేస్తాము. చివరన అవసరమైనప్పుడు ఆ అంకెల కలయిక సరిగ్గా ఇచ్చి దానిలో డబ్బులు తీసుకోవడానికి
వీలు ఉంటుంది.
మనం కూడా మన చిట్టాలో చేసుకున్నంత పుణ్యం
కొద్ది కొద్దిగా వేసుకుంటూ దాచుకుంటూ ఉంటాము. దైవానుగ్రహాన్ని ఆ కిడ్డీ బ్యాంకులో దాచుకున్టున్నట్టు మనం ప్రోది చేసుకుంటూ ఉంటాము.
అటువంటి అనుగ్రహ డిబ్బీలో ఒక చట్రం మానసిక,
ఒక చట్రం వాచిక, ఒక చట్రం కాయిక కర్మలు.
ఎప్పుడైతే ఈ మూడు సరిగ్గా సరిపోతాయో
అప్పుడు ఆ గని తెరువబడి దైవానుగ్రహం అనే
సుధాధార మనమీద వర్షిస్తుంది.

మనం పాపాలు కూడా ఈ మానసిక, వాచిక, కాయిక కర్మల ద్వారా ఆచరిస్తాము.
ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం మానసిక పాపం, ఒకడికి చెడు కలగాలని దూషించడం వాచిక పాపం, చేతల ద్వారా చేసే పాపం కాయిక పాపం.

ఇంతేకాదు ఆది కాయిక మరియు మానసిక సంఘర్షణకు లోను చేసి ప్రశాంతతను ఇవ్వదు.
సరికదా అపరాధభావం వెంటాడుతూ ఉంటుంది.
కానీ ఇవి హాని కలిగించే పాపాలు కావున
వీటిని త్యజించి మనలో ఎల్లప్పుడూ కేవలం
సుకర్మలు మాత్రమె శుద్ధిగా జరిపించాలని
త్రికరణశుద్ధిగా ఆ భగవంతుని
వేడుకుంటూ ఉండాలి.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 01-12-2019, 08:23 AM



Users browsing this thread: 5 Guest(s)