Thread Rating:
  • 4 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మిక చింతన
#23
కర్మ బంధం - శరీరానికా, ఆత్మకా ?

కర్మ ఫలితం అనుభవించాల్సిందే, తప్పదు అని చెప్తున్నారు.

మరి కర్మ ఫలితం ఎవరిని బంధిస్తుంది, శరీరాన్నా, ఆత్మనా? సరైన సందేహమే కదా! దీనికి దాదాశ్రీ ఇలా సమాధానం చెప్పారు.
అసలు శరీరం అంటేనే కర్మ ఫలితం కదా, ఇక దాన్ని మళ్ళీ బంధించడం ఏముంటుంది? ఉదాహరణకి ఒకరు జైల్లో ఉన్నారనుకో, బంధనం దేనికి, జైలుకా లేక లోపలున్న వ్యక్తికా? అలాగే ఈ శరీరమే కారాగారం అయితే, ఆ లోపలున్న వ్యక్తికే బంధనం అన్నమాట! అయితే ఈ వ్యవహారంలో ఆత్మకు ఏ సంబంధం ఉండదు. అది స్వేచ్చగా, స్వతంత్రంగా ఉంటుంది. కానీ అపోహల ద్వారా పుట్టే అహంకారం – ఇగో ఉంటుందే, అది కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటుంది. నువ్వే పరిశుద్ద పరమాత్మవు అయి వుండి కూడా సుబ్బారావనో, సుబ్బమ్మ అనో అనుకుంటూ ఉంటావే అది అహంకారం.

ఇదిగో ఆ అహంకారమే కర్త్రుత్వానికి దారి తీసి, కర్మ ఫలితం అనుభంవించేలా చేస్తుంది. ఆ అహంకారం వీడినప్పుడు నువ్వు మళ్ళీ యధాస్థితికి వెళ్తావు, ఇక బంధనం ఉండదు.
అసలు కర్మ కి – ఆత్మకి ఉండే సంబంధం ఎలాంటిది ?
కర్తృత్వం లేక పొతే రెండూ వేరు పది పోతాయి. దేని స్థానంలో అది ఉంటుంది. కర్తృత్వం లేకుండా కర్మ లేదు. అది ఉంటేనే ఇది ఉంటుంది. నువ్వు కర్తవు కానప్పుడు నువ్వేం చేసినా నువ్వు కర్మకు బద్దుడవు కావు. ఆత్మా, కర్మ వేరుగా ఉన్నప్పటికీ ఈ కర్తృత్వం అనేది వాటిని కలుపుతున్నట్లు అనిపిస్తుంది. ఈ చేసే ‘నేను’ లేకపోతె రెండూ వేర్వేరు గానే ఉంటాయి.
మనకి బయటి ప్రపంచంలో కనపడి జరిగే ప్రతి విషయం ఫలితమే.

కర్మ ఎప్పుడో జరిగిపోయింది. దాని ఫలితమే మనం చూస్తున్నాం. ఉదాహరణకు మీరు పరీక్ష రాసి పేపర్ ఇచ్చేశారు. ఇక ఫలితం రావడమే తరువాయి. పరీక్ష పేపర్ ఇచ్చాం అంటే ఏదో ఫలితం రావాల్సిందే కదా – ఇక దాని గురించి దిగులు ఎందుకు? అంటే మనం ఫలితం ఒకలా రావాలని ఆశిస్తూ ఎదురు చూస్తున్నాం అన్నమాటేగా! ప్రపంచం మొత్తం ఇలాగే ఫలితాల గురించే మధన పడుతోంది.

కర్మ, ఫలితాల ఈ చక్రానికి మరి ఆది ఏది? ఇది ఎలా మొదలైంది ?
ఓ పూసల దండ ఉంది, దానికి ఆది ఏది,తుది ఏది? అలాగే ఈ చక్రంలో మొదలు, తుదలు లేదు. అలా జరుగుతూనే ఉంటుంది. ఇది ఎక్కడ మొదలైంది అంటే ఎప్పుడు వివేకం లేదా ప్రజ్ఞ మొదలైందో అక్కడ మొదలైంది, ప్రజ్ఞ ముగిసినప్పుడు ఇది కూడా ముగుస్తుంది. అలా కాదంటే దీనికి మొదలే లేదు. ప్రజ్ఞ ఉన్నప్పుడే నేను చేశాను అన్న భావన, దాన్ని బట్టి కర్మ, దాన్ని బట్టి ఫలితం.

జన్మాంతరాల నుంచి చేసిన ఈ కర్మలన్నీ ఒకే జన్మలో ఫలితం ఇవ్వవు కదా – అంటే వీటిని జన్మజన్మల నుంచి అనుభవిస్తూ వస్తున్నామా? ఈ కర్మలన్నీ ముగిస్తేనే కదా మోక్షం?
ఒక జన్మలో ఫలితాలన్నీ అనుభవించేసాక ఆ శరీరం పతనం అవుతుంది.

కానీ ఈ జన్మలో చేసిన కర్మలు మళ్ళీ బంధిస్తాయి కదా – మరింక మోక్షం ఎక్కడిది? ఎప్పుడు కర్తృత్వం అంతమై, నేను పరిశుద్ధ ఆత్మను అనే అపరిమితమైన ఆనందం పొందగాలుగుతామో అప్పుడు ఈ కర్మ – ఫలితాల చక్రం నుంచి బయటకు వస్తాం. ఆలా కాక నేను చేశాను అని అనుకున్నంతసేపూ ఆ ఫలితాలకు బాధ్యత వహించి జననమరణాల చక్రంలో తిరుగాడుతూనే ఉంటాం!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మిక చింతన - by Vikatakavi02 - 30-11-2019, 07:23 PM



Users browsing this thread: 4 Guest(s)