Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller XossipY: రోలార్ కోస్టార్ జర్నీ!
#5
Xossipy : రివైండ్ @ 365
పార్టు - 5

Exbii లేని లోటుని ఇన్నిరోజులుగా పూడుస్తున్న Xossipy కూడా మూత పడే రోజులు దగ్గర పడ్డాయా?
సైట్ నిర్వహణ భారం కొండలా పెరిగిపోతోంది. నిధులు చూస్తే చాలా తక్కువగా వున్నాయి. ఏం చెయ్యాలో పాలుపోలేదు. మా అందరిలో స్పష్టంగా భయం కనపడసాగింది. అదే సమయంలో నిలబడగలమనే సంకల్పం కూడా మాలో ఉంది.
ఐతే, ఏం చెయ్యాలి? ఎలా కాపాడుకోవాలి?
కనీసం 240 USD (అంటే మన రూపాయిల్లో సుమారుగా ₹18,000/-) కావాలి సైట్ ని బ్రతికించుకోవటానికి. ఇది కేవలం ఒక్క నెలకి మాత్రమే! ఆ తర్వాత ఫోరమ్ తిరిగి సక్రమంగా పని చెయ్యటానికి ఇంకా చాలా ఖర్చవుతుంది.
ఓప్రక్క సైట్ ట్రాఫిక్ అధికమైపోతోంది... రోజుకి ఎనభై -ఎనభై ఐదు లక్షల చిల్లర జనం ఫోరమ్ ని సందర్శిస్తున్నారు. దానివలన లోడింగ్ కి ఎక్కువ సమయం అవుతోంది.
దాన్ని కాస్తయినా తగ్గించడానికి కంపల్సరీగా రిజిస్టరు చేసుకున్నవాళ్ళకే ఫోరమ్ ని సందర్శించడానికి అనుమతించడం జరిగింది.
ఇక ఆదాయం పెంచుకోవడం కోసం ఎటువంటి మార్గాలు ఉన్నాయా ఆని ఆలోచించసాగారు.
యాడ్స్ ద్వారా సమీకరించవచ్చునని అనిపించింది. అయితే, గూగుల్ adsense వాళ్ళు అడల్ట్ కంటెంట్ ఉన్న సైట్లలో తమ యాడ్లను పెట్టడానికి అనుమతించరు.
దాంతో, ఎడల్ట్ యాడ్లు అనే ఆప్షన్ తెరపైకి వచ్చింది. వాటిని పెట్టవచ్చు కానీ, వాటికి సంబంధించి అడ్మిన్లకి సరయిన అవగాహన లేదు. స్వతహాగా సరిత్ గారికి యాడ్ల సంద్రాన్ని ఈదుతూ సైట్ ని యాక్సెస్ చెయ్యటమంటే మొదట్నుంచీ పరమ చిరాకు. అందుకే, ముందునుంచి సైట్ లో యాడ్స్ ని పెట్టాలనే ఆలోచనని వ్యతిరేకించారు.
పైగా ఈ ఎడల్ట్ యాడ్స్ ప్రొవైడర్లు సైట్లని హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందని కూడా సమాచారం ఉండటంతో ఆ ఆప్షన్ ని తప్పనిసరి అయితేనే పరిగణనలోకి తీసుకోవాలని తీర్మానించుకున్నారు.
ఇక మరో దారి... మెంబర్ల నుంచి డొనేషన్లు స్వీకరించడం.!
అప్పటికే ఫోరమ్ లో రిజిస్టర్ అయ్యిన మెంబర్ల సంఖ్య రమారమీగా అరవై వేలు దాటింది. కంపల్సరీ రిజిస్ట్రేషన్ కి వెళ్ళినందుకు రోజూవారీ సందర్శకుల సంఖ్య తగ్గినా ఫోరమ్ లో రిజిస్టర్ చేసుకునేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ వచ్చింది. ఈ విశేష ఆదరణ చూసి కొందరికి కన్నుకుట్టి ఫోరమ్ పై దుష్ప్రచారం చెయ్యాలని కొన్ని పిపీలక సైట్లు ప్రయత్నించాయి, అది వేరే సంగతి.
ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే, బెటర్ సెర్వర్ ని అద్దెకు తీసుకోవటానికి అప్పటికే తమ పరిధికి మించిన సొమ్ముని వెచ్చించారు అడ్మిన్లు. ఏదో ఒక పరిష్కారం లభించకపోతే సెప్టెంబరు మాసం కల్లా సైట్ ని మూసెయ్యాల్సి వస్తుంది.
దాంతో, సైట్ మనుగడ కోసం డొనేషన్లని స్వీకరిస్తున్నట్లు అందరికీ మెసేజీలు పెట్టాలని తలిచారు. కానీ, ఇక్కడొక చిక్కొచ్చింది.
ఎటువంటి మాధ్యమం ద్వారా సొమ్ముని డొనేట్ చెయ్యమని అడగాలి?
మామూలు సైట్లలోలా బహిరంగంగా డొనేట్ చెయ్యటానికి ఎవరూ ఇటువంటి సైట్లలో అంతగా ఇష్టపడరు. ముఖ్యంగా గోప్యత పాటించడం చాలా ఆవశ్యకం. అసలు డొనేట్ చెయ్యాలి అన్నందుకే ఆమడ దూరం పారిపోయినవాళ్ళూ ఉన్నారులేగానీ, ఎంతోకొంత సహాయం చెయ్యాలనుకునేవారికి సహేతుకమైన మాధ్యమాన్ని ఏర్పరచాలని భావించి పలువురిని సంప్రదించి, అనేక సమాలోచనలు జరిపాక ఆఖర్న amazonpay, paypal ద్వారా డొనేట్ చెయ్యమని ఫోరమ్ లో ప్రతి చోటా సందేశాలను ఏర్పాటు చేయటం జరిగింది.
మొదట కొందరు ఈ ఆలోచనను సమర్ధిస్తే మరికొందరు వ్యతిరేకించారు. నడపలేకపోతే మూసేయమని మొహం మీదే తేల్చి చెప్పేశారు ఇంకొందరు.!
ఇలాంటి సైట్లలోకి వచ్చేది కేవలం ఆనందం కోసం... అంతేగానీ, అందుకోసం డబ్బులిచ్చేంత కమిట్మెంట్ ఎవరికీ వుండదు అంటూ వాపోయారు.

eXbii పోయి Xossipy వచ్చే డుం డుం డుం... Xossipy పోతే మరోటి వస్తుందిలేఁ డుం డుం డుం... అంటూ పాటలేసుకున్నారు!

ఇటుప్రక్క డొనేషన్ ప్రక్రియ మెల్లగా నడుస్తోంది. సభ్యులకి నగదు పంపడంలో ఎన్నో సందేహాలు తలెత్తాయి. వారి సందేహాలను తీరుస్తూ డనేట్ చేసే ప్రక్రియని తెలియజేసాం... ప్రతి ఒక్కరూ కనీసం ఒక డాలరు లేదా వంద రూపాయలను ప్రతి నెలా చెల్లించి ఫోరమ్ మనుగడకి దోహదపడవలసినదని అన్ని సెక్షన్లలో పదే పదే మెసేజీలను పోస్టు చేశాం.
మధ్యలో కొన్ని కొన్ని ఇబ్బందులు తలెత్తినా వాటిని ఓపికతో ఎదుర్కొన్నారు.
నెమ్మనెమ్మదిగా డొనేషన్లు పెరగసాగాయి. ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం అందరికీ సంతోషాన్ని పంచాలనే సంకల్పంతో ఫోరమ్ ని నడిపించిన అడ్మిన్ల కష్టాన్ని పంచుకోవటానికి సభ్యులందరూ తలో చెయ్యి వెయ్యసాగారు.


Contributions made by some members...
Acknowledged by the Admin time to time...


[Image: Fire-Shot-Capture-169-Dear-Friends-Contr...py-com.png]
[Image: Fire-Shot-Capture-170-Dear-Friends-Contr...py-com.png]
[Image: Fire-Shot-Capture-171-Dear-Friends-Contr...py-com.png]
[Image: Fire-Shot-Capture-172-Dear-Friends-Contr...py-com.png]
[Image: Fire-Shot-Capture-173-Dear-Friends-Contr...py-com.png]
[Image: Fire-Shot-Capture-174-Dear-Friends-Contr...py-com.png]

[Image: Fire-Shot-Capture-175-Dear-Friends-Contr...py-com.png]

ఇదంతా చూస్తే నమ్మకం, అభిమానం అనే మాటలకి ఇంతకంటే సరైన నిర్వచనాలు ఇంకెక్కడ లభిస్తాయి అనిపించింది.


[Image: IMG-20191129-105640.jpg]


సభ్యులందరి అపూర్వ సహకారంతో ఫోరమ్ గడ్డు పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొని నేటికిలా రెండవ ఏడాదిలోకి అడుగుపెట్టగలిగింది.
ఈ మొదటి మజిలీని చేరుకునే ప్రయాణంలో ఫోరమ్ లోని ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ఎంతలా ప్రోత్సాహించుకున్నారో అంతకు రెట్టించిన ఉత్సాహంతో ఇక ముందు కూడా కలిసి అడుగులేస్తే...
సుదూర ప్రయాణమైనా అలుపు వుండదు.
లేశమాత్రమైనా విసుగు దరిచేరదు.
ఎప్పటికీ యీ అనుబంధం వీగిపోదు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
RE: XossipY: తొలి మజిలీని చేరిందిలా! - by Vikatakavi02 - 29-11-2019, 11:34 AM



Users browsing this thread: 1 Guest(s)