29-11-2019, 11:26 AM
(This post was last modified: 29-11-2019, 11:28 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
Xossipy : రివైండ్ @ 365
పార్టు - 4
అలా కొన్ని కొన్ని పిల్లమూకల పిచ్చి చేష్టలను (నన్ను కూడా కలిపి చెప్పుకుంటున్నాను ;)) ఓర్పుతో భరిస్తూ నేర్పుగా ఫోరమ్ ను ముందుకి నడిపించసాగారు అడ్మిన్లు.
అడపాదడపా డేటా చౌర్యం గురించి boltikhani వంటి పలు సైట్ల నుంచి కంప్లయింట్స్ వచ్చాయి. అలాంటి సమయంలో అనుభవలేమి వారిని వెక్కిరించినా పట్టుదలతో వాటినన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.
క్రమంగా జనాదరణ పెరిగి నెమ్మనెమ్మదిగా ఫోరమ్ లో మెంబర్స్ పెరిగారు. దాంతో ఓ వైపు సంతోషంగా వున్నా మరోప్రక్క భయం పెరిగింది. 'ఇంతమందిని తట్టుకునేంత చోటు ఫోరమ్ లో వుందా?'
అందుకు తగ్గట్లే సూచనలు కనపడసాగాయి. అప్పుడప్పుడు ఫోరమ్ హ్యాంగ్ అయిపోయేది.
'మంది పెరిగేకొద్ది...' అన్నట్లు జనం రద్దీ వలన సైట్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంతమంది ఆదరణ లభించడం ఆనందాన్ని కలిగించినా, పదేపదే సైట్ కి అంతరాయం కలగటం కన్నీరు పెట్టించింది.
అడ్మిన్లు రకరకాలుగా ప్రయత్నించారు. మరింత సొమ్ముని పెట్టి బెటర్ సెర్వర్ ని కొనుగోలు చేశారు. అయినా, అదీ సరిపోలేదు.
రోజుకి 80 వేలమంది ఫోరమ్ లో సంచరిస్తుండటంతో వెబ్ ట్రాఫిక్ అమాంతం పెరిగి సెర్వర్ తట్టుకోలేకపోయింది. అడ్మిన్లు తాత్కాలిక ఏర్పాట్లతో కొంతకాలం సైట్ కుంటి నడకను సాగించింది. చివరికి ఫోరమ్ నిర్వహణ ఖర్చు అడ్మిన్లకి తలకి మించిన భారంగా మారింది. ఏం చెయ్యాలి?
ఇలాగే కొనసాగితే చరిత్ర తప్పక పునరావృతం అవుతుంది. ఈ సైట్ కూడా పాత XB మాదిరి మూత పడవలసినదే...
ఏమిటి మార్గం...?
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK