29-11-2019, 11:18 AM
(This post was last modified: 29-11-2019, 11:20 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
Xossipy : రివైండ్ @ 365
పార్టు - 2
XOSSIPY పేరుని అందరూ ఆమోదించాక ఫోరమ్ కి అలా నామకరణ ప్రక్రియ జరిగింది. అయినా ఏదో వెలితి. ఫోరమ్ interface చూడ్డానికి అంత బాగుండలేదు. కానీ, అంతకన్నా ఏం ఆశిస్తాం? మనకు చేతకాదు. 'ఐనా... ఇలా చెయ్యటమే చాలా కష్టం' అని అనుకున్నాన్నేను.
ఐతే... సరిత్ మరియు శివ తెరవెనుక గతించిన సృష్టికి ప్రతి సృష్టిని చేస్తున్నారని మాకెవ్వరికీ తెలియదు. మెల్లిగా ఆ ప్రక్రియ జరిగిపోతున్నది.
ఒకనాడు సరిత్ గారు వారు తయారు చేసిన కొత్త Xossipy ముఖాన్ని నాకు చూపించారు.
అద్భుతం!
అచ్చంగా పాత xbని చూస్తున్న భావన కలిగింది.
చిన్న పిల్లాడికి మళ్ళే ఉత్సాహంగా ఆ సైట్ లో కలియతిరిగాను. కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ భవనం మాదిరి ఫోరమ్ మొత్తం ఖాళీగా వుంది. కానీ, ఆ interface నాకు చాలా నచ్చేసింది. అలాగే, కొత్త ఫీచర్లు కొన్నింటిని తెలుసుకున్నాను. కొన్ని అవసరమనిపించిన మార్పులను సూచించాను.
కొన్నిరోజులు గడిచాయి.
ఆ సరికొత్త మాధ్యమం యొక్క పనితీరుని సరి చూసుకొన్నాక ఒక మంచి రోజుని చూసుకొని గతేడాది నవంబర్ నెల నాల్గవ తేదీన లాంఛనంగా ఈ www.Xossipy.com ని ప్రారంభించడం జరిగింది.
అదీ ఆరంభం!
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK