27-11-2019, 06:15 PM
రెండో రోజు తను బస్సు ఎక్కి నిలబడినప్పుడు రవీంద్ర గుర్తుకు వచ్చాడు. వెనక్కు తిరిగి చుస్తే తన వెనుకే నిలబడి చొంగ కార్చు కోవడం గమనించింది. వాడికి కొద్దిగా దగ్గరగా నిలబడి తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న కంపాస్ లోంచి ఓ instrument చేతిలో తీసుకొని బ్యాగ్ ను క్లోజ్ చేసింది.
చేతిలో ఉన్న instrument దుప్పటా కింద సర్దుకొని పట్టుకుంది. అలేఖ్య తనకు దగ్గరగా జరగడం వల్ల తనకు వెనుక నుంచి తగలడం ఇష్టం ఉన్నట్లు ఉంది అనుకొంటూ రవీంద్ర ఇంకా దగ్గరకు జరిగి నిలబడి తన ముందు బాగం అలేఖ్య వెనుక వైపు తాకించ సాగాడు.
కాలేజీ దగ్గర ఉన్న సిగ్నల్ వరకు ఓపికగా వాడిని భరించిన అలేఖ్య. సిగ్నల్ రాగానే వాడి దగ్గరగా జరిగింది. తను చేసే ది వెనుక ఉన్న వాళ్ళకు చూపించాలి అన్నట్లు వాళ్ళ వైపు చూస్తూ ముందుకు జరిగాడు రవీంద్ర.
అంత వరకు తన దుప్పటా కింద దాపెట్టిన instrument ను బలంగా వాడి ప్యాంటు ముందు ఎత్తుగా ఉన్న ప్రాంతం లో శక్తి కొద్ది దింపి వెనక్కు లాగేసింది. అలా లాగిన వెంటనే అదే చేత్తో బస్సు పైన ఉన్న రాడ్డు పట్టుకుంది చేతిలోని instrument లాఘవంగా తన పొడుగు చేతులు లోంచి తన డ్రెస్ లోకి జారుకోనట్లు చేస్తూ.
"అమ్మా " అంటూ గట్టిగా కేక వేస్తూ తన ముందు బాగాన్ని పట్టుకొని అక్కడే కూల బడి పోయాడు రవీంద్ర.
"ఏమైంది , ఏమైంది " అంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతూ ఉండగా అక్కడున్న అమ్మాయిలు అందరూ తనను చూస్తూ ఉంటె ఎం చెప్పాలో తెలియక తన ప్యాంట్ ముందు బాగాన్ని బిగపట్టి , తన బాధను దిగ మింగు కొంటూ కళ్ల వెంట నీళ్ళు కారుతూ ఉండగా అక్కడే కూల బడి పోయాడు.
వాడి పక్కనున్న సీట్ లోని వాళ్ళు ఖాళీ చేసి వాడిని అక్కడ కుచోమని చెప్పగా బస్సు కాలేజీ వైపు ముందుకు సాగింది.
అందరి తో పాటు అలేఖ్య కూడా "ఏమైంది రవీంద్ర " అంటూ వాళ్లతో పాటు జాయిన్ అయ్యింది వాడిని పరామర్శించడానికి.
అలేఖ్య క్లాస్ లోకి ఎంటర్ అయిన 5 నిమిషాలకు తన ఇద్దరు ఫ్రెండ్ బయటకు పరుగెత్తడం చూసి తనలో తనే నవ్వుకో సాగింది. కానీ ఈ రోజు బస్సులో జరిగిన దానికి పర్యవసానం ఎలా ఉంటుందో తను ఉహించ లేక పోయింది. తను చేసిన ఘన కార్యాన్ని తన ఫ్రెండ్ తో చెప్పక పోవడం అలేఖ్య వ్యక్తిత్వానికి నిదర్శనం.