16-11-2019, 12:48 PM
...మానేజ్ చెయ్యగలమనుకున్నాం గానీ , ఆరోజు పొద్దున్నే మరో రెండుసార్లు వాంతులయ్యేసరికి మొహాలు పీక్కుపోయాయేమో నాకూ ,వకుళకీ!...మాదొడ్డమ్మ పట్టేసింది... ‘... మీరూనా!?...’ అని అడిగేసిందావిడ... మరో మార్గం లేక అవునన్నట్లు తలలూపాం... ‘...మీ అమ్మలకి చెప్పారా?...’ అని నిలదీసింది.... ... ఇంకా లేదని గొణిగాం... ‘...పిచ్చిపనులేమీ చెయ్యకండి...’ అందావిడ , పెద్దరికంగా... అటువంటి ఆలోచనలేం లేవని ఆవిడకి నచ్చచెప్పేసరికి తాతలు దిగొచ్చారు... మధ్యాహ్నం టీ లు తాగేదాకా కబుర్లతో సరదాగా గడిచిపోయింది...ఎవరిళ్లకి వాళ్ళు బయల్దేరుతూంటే... ‘...మీ ముగ్గురికీ ఒకేసారి సూడిదలు ఏర్పాటుచేస్తే సరదాగా ఉంటుందే పిల్లా!...’ అందావిడ ... ‘...చూద్దాంలే!...’ అని తప్పించుకున్నాం , ఆవిడతో వాదనలెందుకని...
...మర్నాడు పొద్దున్న తొమ్మిదింటికల్లా వకుళ దగ్గర్నుంచి ఫోను... ‘...చాలా సేపట్నుంచీ ఎంగేజ్ ఉందేంటీ నీ ఫోనూ!...సెల్ ఎక్కడ పెట్టావ్?...’ అంటూ ఫైరైపోయింది ... బెడ్ రూంలో ఉండిపోయినట్లుందమ్మా!...ఏంటీ విషయం?...అన్నాను....‘...కొంప ముంచిందే మీ దొడ్డమ్మ!...’ అని లబ లబ లాడింది...
...వెంటనే అర్థమైపోయింది విషయం...
...నా పనీ అంతేనమ్మా!... ఇప్పటిదాకా, అమ్మలెక్చరూ ...ఏమే!...నేను చచ్చాననుకున్నావా?...శుభవార్త మీ దొడ్డమ్మద్వారా వినాల్సొచ్చింది... వకుళా వాళ్ల అమ్మగారి నంబర్ కోసం ఫోన్ చేసిందామహాతల్లి...నే చెప్తాలే , వకుళా వాళ్లమ్మకి ...అని మాట మార్చేశాను... నీ దొడ్డమ్మకేమీ!...ఇతర జంజాటాలేమీ లేవు కనక రెక్కలు కట్టుకుని వచ్చేసింది ... నాకెలా అవుతుందీ!... వీలు చూసుకుని వస్తాను... అంటూ తోడికోడలు మీద రుసరుసలన్నీ నామీద చూపించేసింది ....
...నాకు సుజాతక్క అంత సమస్య లేదమ్మా!...కాస్త మొహమాటమనిపించి...చెప్పడం ఆలస్యం చేశాను... అని ఆవిడని శాంత పరుద్దామనుకుంటే ... దేనికీ మొహమాటం!...ముప్ఫైఏళ్ళకే ముసల్దానివైపోయావా?...పిచ్చి పనులేమీ చెయ్యకు... మీ నాన్నని మాట్లాడమంటాలే అల్లుడితో!... సర్లే మళ్ళీ మాట్లాడతా!... మీ అత్తగారితోనూ , వకుళా వాళ్ళమ్మగారితోనూ మాట్లాడాలి... అని పెట్టేసింది... అందుకే ఇంత టైం పట్టింది!... అని సంజాయషీ చెప్పుకున్నాను వకుళకి...
‘...ముందు మా అమ్మకీ , తరవాతే మీ అత్తగారికీ ఫోన్ చేసినట్లుంది ఆంటీ!...ఆవిడదీ ఇదే గోల!...వచ్చేస్తానంటుంది...ఇంకా టైముందని డేట్ల వివరాలతో సహా చెప్పేదాకా , వగైరాలూ అవిడ చల్లబడ లేదు... ’ అంది వకుళ...
...ఎలాగైతేనేం!... దగ్గర బంధువులంరికీ తెలిసిపోయింది... తోడికోడళ్ళూ , మరదళ్ళూ , ఒకళ్ల తరవాత మరొకళ్ళు కంగ్రాట్స్ చెప్పడం... మా ఆడపడుచులైతే ... ఈసారైనా ఓ ఆడపిల్లని కనవమ్మా!... మనం వియ్యమందవచ్చూ ...అని సరసాలూ!... ప్రస్తుతానికి సరదాగా ఉన్నా విషయం బైట పడితే ఏమౌతుందో అన్న బెరుకు అప్పుడప్పుడు కెలుకుతూంటుంది...
...ఆ మాటే వకుళతో అంటే ...అవునమ్మా!...అంది... ఇప్పుడే మొగుళ్ళకి చెప్పుకుంటేనో!...అనిపించినా...వాళ్లకీ చూచాయగా తెలుసనీ , అనవసరంగా కెలకడమెందుకనీ ఊరుకున్నాం...
...రోజులు గడుస్తున్నాయి ... మాకు నెలలు నిండుతున్నాయి...సమ్మర్ హాలిడేస్ ఇచ్చే సమయం దగ్గరపడింది ... మా ఆకారాల్లో మార్పులు గమనించి కంగ్రాట్స్ చెప్పారు , కొలీగ్స్ అందరూ...
... సెలవలకి ఎక్కడికైనా వెళ్దామన్నారు పిల్లలు...ఓపిక లేకపోయినా వాళ్లని నిరుత్సాహపరచడమెందుకని... ఓ పది రోజులు ఓ హిల్ రిసార్ట్ లో గడిపొచ్చాం... మా కుటుంబం , వకుళ కుటుంబం కలిసికట్టుగా...నేనూ ,వకుళా పెద్దగా తిరగలేక ఒక దగ్గర కూర్చుంటే , వికాస్ , మధూలే మానేజ్ చేశారు... మగాళ్ళతో... కలయికలు... తగ్గించాం...
...స్కూళ్ళు తెరిచారు , మరో రెండు నెలలతరవాత ... పేరెంట్ -టీచర్ మీటింగ్ కి వెళ్ళి తిరిగొచ్చేటపుడు వకుళా వాళ్ళింట్లో చేరాం రెండు కుటుంబాలూ... పిల్లలూ గమనిస్తున్నారేమో!... మా శరీరాల్లో మార్పులూ ‘... వై యూ అండ్ సంధ్యా ఆంటీ ఆర్ బికమింగ్ సో ఫాట్?...’ అని అడిగేశాడు , మా చిన్నాడు... చెప్పవలసిన టైం వచ్చిందని గ్రహించి ‘... మీకు తమ్ముడు కావాలా!...చెల్లెలా ’ అని అడిగాడు వికాస్ ... , చెల్లెలని చెప్పేశారు మా పిల్లలు ... తమ్ముడని , రోహిత్... ఎవరైనా పరవాలేదని దివ్య... చెప్పారు...
...ఇద్దరూ అయితే!... అన్నాడు మధు... గ్రేట్...అన్నారు నలుగురు పిల్లలూ....
‘...మగాళ్లకింకా ఆశ ఛావలేదే!...రిజల్టు వచ్చింతరవాత ఎలా తట్టుకుంటారో!... అంది వకుళ.... నాకూ అదే భయంగా ఉంది ... వాళ్లని సిధ్ధం చెయ్యాలనుకుంటా!... అన్నాను... ...అవునన్నట్లు తలూపింది వకుళ...
‘...ఏమైనా ప్రయత్నం చేశావే!?...’ అంది వకుళ , ఓ సోమవారం నాడు...
...మొన్ననే! , అదీ ఓ ఫ్రెండ్ ఫోన్ కాల్ వల్ల! ... అన్నాను... ‘...అదెలా!?...’ అందది... ....చెప్తా విను... అంటూ మొదలెట్టాను...
...రాత్రి భోజనాలు చేసి , పడుకోబోతూంటే లాండ్ లైన్ కి ఓ ఫోన్ వచ్చింది ... నంబరు చూస్తే వైజాగ్ ది... తెలిసిన నంబర్ కాకపోయినా ఎవరో మనవాళ్ళే ఐఉంటారని ఎత్తాను... ‘... వికాస్ ఇల్లేకదమ్మా!... నేను కరుణాకర్ ని...గుర్తు పట్టారా!...’ అన్నాడు సంతోషంగా
...పెద్ద పరిచయం లేకపోయినా అతగాడు వికాస్ కొలీగ్ అనీ , వాళ్లకి పిల్లలు లేరనీ , కలిసినప్పుడల్లా మా వాళ్ళని తెగ ముద్దుచేశేవారనీ గుర్తుకొచ్చి ,... ఆయ్యో!...ఎంత మాట!...మీ అమ్మగారూ , సుశీలా బాగున్నారా?... అంటూ పలకరించాను....
‘...ఆఁ...ఆఁ!... ఇన్నాళ్ళ తరవాత , ఓ మగనలుసుని అందించి ఇంట్లో అందరి కోరికా తీర్చింది గా మీ ఫ్రెండూ!...’ అని ఆయన చెప్పుకుపోతూంటే , వికాస్ గదిలోకొచ్చాడు...ఎవరూ అంటూ!... పేరు చెప్పి ,ఫోను చేతికిస్తూంటేనే వికాస్ మొహంలో రంగులు మారాయి...పక్క గదిలోకెళ్ళిపోయాడు ఫోనుచ్చుకుని...ఓ పావు గంట తరవాత నా పక్కనే చేరాడు , మొహం సీరియస్ గా పెట్టుకుని...
...ఏంటి సంగతి!?... అన్నాను ... ‘... కరుణాకర్ గుర్తున్నాడా!...నా సీనియర్ , వైజాగ్ లో!... అతడికి మగపిల్లాడు...’ అన్నాడు...కాస్త మొహం ముడుచుకుని...
...మంచిదేగా!...నీకెందుకూ బాధ!... అన్నాను... విషయం చూచాయగా అర్థం అయిపోయినా!...
...కాసేపు మాట్లాడకుండా ఉండిపోయి ... ‘...మనకి ట్విన్సే పుడతారంటావా!/...’ అన్నాడు...
... ఏం చెప్పగలం!...డాక్టర్ అలా ఏమీ అనటం లేదు ... అన్నాను... ...మళ్ళీ మౌనం... ‘...మగపిల్లాడైతే నా సంతానమని...’ అన్నాడు వికాస్...
నా గుండెలు జారిపోయాయి ఆ మాటతో!.. ....నేనేం చెప్పగల్నూ!... అయినా ఎందుకీ మాట మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావ్!?.... అన్నాను , ఎలాగో ధైర్యం కూడగట్టుకుని...
‘...ఓ విషయం ఒప్పుకోవాలి సంధ్యా !... నా వల్ల మగపిల్లలే పుడతారని రూఢి అయిపోయింది ఈ కేసుతో!...’ అన్నాడు , తల దించుకుని...
....ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాను...గుండెలు దడదడలాడుతూంటే...
‘...మన పిల్లలు కాక ఇది మూడో కేసు...’ అంటూంటే
స్టూడెంటుగా ఉన్నప్పుడు ... ఫస్టు , మా ఇంట్లో కొంతకాలం కిరాయికున్న ఓ ఆంటీ...పైకి తమ్ముడూ , తమ్ముడూ అంటూనే నన్ను ముగ్గులోకి లాగింది... రెండు ...పిల్లలు లేని ఓ సీనియర్ ఆడ కొలీగు...మొగుడి కన్ను కప్పి గ్రంధం నడిపింది... ఈ సుశీల కేసు మరీ దారుణం...వాళ్ళాయన కి తెలిసే జరిగింది... మనం ఇక్కడికి రావడానికి ఓ రెండు నెలల ముందర...అతడి మొహం చూడాలంటే సిగ్గుగా ఉండేది...’ అని ఆగిపోయాడు...
...అంటే!...నాకు ఆడపిల్ల పుడితే నీ సంతానం కాదంటావా!?... అనేశానే , ఓ పక్క గొంతు పూడుకుపోతూన్నా , తాడో పేడో తేల్చుకోవాలనే మొండి ధైర్యం తో...
‘...ఏవన్నాడేంటీ!?...’ అంది వకుళ...
...ఛ.ఛ్ఛ...ఎవరైనా మనసంతానమే!...’ అంటూ నన్ను దగ్గరకి తీసుకున్నాడు... ...మాట తప్పవుకదా!... అంటూ భోరుమన్నాను తన గుండెల మీద పడి... ‘...ఎహె!...ఊరుకో!...’ అంటూ చాలా సేపు నన్ను ఓదార్చాడు...
...నీ వల్ల ఆడపిల్ల కలగదని ఏంటీ గ్యారెంటీ/...ఆన్నాను కాసేపు తరవాత తేరుకుని...
‘...చాలా తక్కువ ఛాన్సులు సంధ్యా!...’ అన్నాడే నా జుత్తు దువ్వుతూ... అంటే తను సిధ్ధమైనట్లేగా!?... అని , వకుళ మొహం చూశాను....
‘...ఇప్పటికి అలాగే అనిపిస్తూంది...తరవాత ఎలా ఉంటాడో!...’ అంది వకుళ...
...మాట తప్పేవాడేం కాడులేమ్మా , మా ఆయన!... అన్నాను , దెబ్బతిన్న స్వరంతో...
‘...ఛ! ...నేనెందుకంటానే ఆమాట!...’ అంది వకుళ సర్దుకుంటూ ...సర్లే!...మధేమంటాడూ?...అన్నాను...
‘.... ఎందుకోగానీ , కవలలు కాకపోయినా మగపిల్లాడైతే చాలనుకుంటున్నాడు... మగాళ్లకి మగపిల్లాడంటేనే మోజేమో!...’ అందది...
...అపుడు తల్లిపోలికొస్తుంది కనుక కప్పడిపోతుందని తన ఉద్దేశ్యం!... అని మనస్సులో అనుకున్నా ....చేతికి ఆసరా అవుతాడనేమో!... అన్నాను పైకి..
...రోజులు గడుస్తున్నాయి...మెటర్నటీ లీవ్ తీసేసుకున్నాం...నేనూ , వకుళా , దీపా మేడం...
మా దొడ్దమ్మ , మా అమ్మ , వకుళా వాళ్ళ అమ్మ వచ్చేశారు ఢిల్లీకి ... అమ్మలందరూ కలిసి మా ముగ్గురికీ సూడిదలు ఏర్పాటు చెయ్యడమే కాకుండా , అత్తగార్లని పిలిచేసి మా కొలీగ్స్ ని పిలవమని పట్టుపట్టారు...ఇక తప్పక బేబీ షవర్స్ అని చెప్పుకుని పిలిచాం...ఫోన్లల్లో...
...కాంపుల పేరుతో మొగుళ్ళు తప్పించుకున్నారు... ఎలాగో వేళాకోళాలు భరించాం ఆ సాయంత్రం...