25-10-2019, 07:50 PM
మహాసముద్రంలో సిరా బొట్టు...
నాకు తెలుసు నేను చేసింది కత్తుల మీద వంతెన కథ కళీ అని!
సెక్స్ అనే మాట వినగానే హర హరా శివ శివ అని చెవులు మూసుకునే పెద్ద మనుషులు నా ఈ నవలని ఓపికగా చివర వరకూ చదివి, ఈ చిరు విజ్ఞప్తిని కూడా వింటారనే నమ్మకం నాకు లేదు.
సెక్సు అనేది ఎప్పుడూ ఒక చిక్కువిడని ప్రశ్నే. దాన్ని ఎంత వివస్త్రను చేసినా అది నగ్నం కాదు. సెక్సు అనేది చాలా ప్రమాదకరమైనది అని నేను చెప్పడానికి చేసిన ప్రయత్నం కాదిది. సెక్సు ఎంత గొప్పదో, ఎంత ప్రభావితం చెయ్యగల అతీంద్రియ శక్తో చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఒక మహా గ్రంథం రాయవచ్చు. మానవ మస్తిష్కంలో ఎన్నో క్రూరఘోర కర్కోటక ఆలోచనలు వికృతనృత్యం చేస్తూ వుంటాయనేది నిర్వివాదాంశం. అవి వాస్తవరూపం ధరించినప్పుడు మనుషుల జీవితాల్లో అపస్వరాలు పలుకుతాయి అనేది కూడా నిరూపించబడిన సత్యం.
రామాయణం అంతా చదివి, రావణాసురుడు సీతని కిడ్నాప్ చెయ్యటం, సుగ్రీవుడు భార్యని వాలి చెరపట్టటం, నన్ను ఎంతగానో ఇన్*స్పయిర్ చేసాయనే సూడో ఇంటలెక్చువల్స్ వున్న ఈ సమాజంలో, భారతం అంతా చదివి... దుశ్శాసనుడినే కథానాయకుడిగా భావించే కుహనా మేధావులున్న ఈ వ్యవస్థలో... రంజిత్‌సింగులు, భాస్కర్ బావలు, ఎంతమంది వున్నారో నేర ప్రపంచపు చరిత్ర పుటలు తిరగేస్తే బట్టబయలవుతాయి. కాల్ గర్ల్స్ గా, వేశ్యలుగా చెలామణి అయ్యే అమాయక స్త్రీల గత చరిత్ర తిరగేస్తే ఇలాంటి ఉదంతాలు ఎన్నో. ఆ రోజు భాస్కర్ బావతో శృంగారంలో వుండగా సొంత అక్కయ్య చూసిందని ఆవేశంగా రంజిత్‌సింగుని ఆశ్రయించటమే ఉష చేసిన పొరపాటైతే— ఆమె అర్ధ రూపాయికి రూపాయికి ఒళ్ళమ్ముకునే బజారు వేశ్యగా మీకెక్కడో తారసపడేది.
ఉష తల్లిదండ్రులు బ్రతికేవుంటే, సంధ్య జీవితం కూడా వడ్డించిన విస్తరే అయ్యుంటే, అభినయ్ కి తల్లి ప్రేమ లభించివుంటే— వాళ్ళు ముగ్గురూ ఇలా కలుసుకుని వుంటే హిపోక్రాట్స్ లా ఒకరినొకరు గౌరవించుకుని మనసుల్లోనే సెక్సుకి సంబంధించిన ఫాంటసీలన్నిటినీ సమాధి చేసుకుని— మనందరి మధ్యన కలిసిపోయేవారు.
సెక్సుకి సంబంధించిన స్పందనలు ప్రతి స్పందనలు మామూలు మనిషికైనా, మహాత్మునికైనా ఒక్కటే. తన మనో నిగ్రహాన్ని పరీక్షించుకోవడానికి పదహారు సంవత్సరాల అభాని, పందొమ్మిది సంవత్సరాల మనుని... (ఇద్దరు అందమైన యవ్వనవతులు) తన పక్కలో నగ్నంగా పడుకోబెట్టుకున్న మహాత్మాగాంధీని శంకించి నిందించిన వాళ్ళున్నారు.
నెపోలియన్, లెనిన్, మావో, నెహ్రూ, ఐన్*స్టయిన్, షేక్స్‌పియర్, కెనెడీ, చార్లీ చాప్లిన్, టాల్*స్టాయ్... ఒకరేమిటి వందలాది ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూస్తే — సెక్సు ఎంతటి శక్తివంతమైన ఉద్రేక పూరితమైన అంశమో అర్ధమవుతుంది.
ఏకపత్నీవ్రతుడని చెప్పుకుంటూ ప్రియురాలి గదికి రహస్యమార్గం ఏర్పాటు చేసుకున్న హెన్రీఫోర్డ్. మొదట కమ్యూనిష్టు వివాహం చేసుకుని ఆ తర్వాత సినీతార మోజులోపడ్డ నవచైనా నిర్మాత చైనా కమ్యూనిస్టు పార్టీ స్థాపకుడు మావో సేటుంగ్, స్త్రీ తోడు లేకపోతే తల్లడిల్లి పోయి తలనొప్పితో సతమతమయ్యే మాజీ అమెరికా అధ్యక్షుడు ప్రపంచశాంతి కాముకుడు జాన్ ఎఫ్. కెన్నెడీ, సంపాదనలో సగం పైగా ఆడవాళ్ళతో శృంగార విలాసాలు అనుభవించడానికి ఖర్చు చేసిన ప్రపంచ ప్రసిద్ధ ఆంగ్ల కవి వరేణ్యుడు లార్డ్ బైరన్, కాళ్ళులేని అవిటివాడయినా కామక్రీడా కలాపాల్లో కింగ్ అనిపించుకున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్*వెల్ట్, సెక్సులో పండితుడుగా పేరుగాంచిన హావ్*లాక్ ఎల్లీస్ స్త్రీని సుఖపెట్టలేని అసమర్ధుడిగా హోమో సెక్సువల్ గా స్వజాతి సంపర్కంలో సెక్సు తృప్తిపొందిన వైనం, స్త్రీ వ్యామోహంలో మునిగిపోయి మతగురువు పీఠాన్ని వదులుకున్న అరియా ఖాన్, హోమో సెక్సువల్ వ్యవహరాల్లో ఉత్తేజం పొందిన సోమర్*సెట్*హామ్, ఆస్కార్ వైల్డు శిష్యురాలినే పెళ్ళి చేసుకున్న గ్రహంబెల్, సెక్సులో పాల్గొంటే అజీర్తిరోగం పోతుందని ప్రచారంచేసిన నోబుల్ బహుమతి గ్రహీత ఎర్నెస్ట్ హెమింగ్*వే, జీవితాంతం శృంగార ప్రేమ వ్యవహారాల్లో కోర్టు గౌరవం రొచ్చులో అశాంతిపాలైన హాస్య పితామహుడు చార్లీ చాప్లిన్, మౌంట్‌బాటన్ భార్య లేడీ మౌంట్‌బాటన్ తో ప్రేమకలాపం, సరోజినీనాయుడు కుమార్తె పద్మజానాయుడుతో అతి చనువు, శారదామాత అనే అందాలరాశితో శృంగార కలాపం సాగించినట్లు వార్తల్లో కెక్కిన భారతదేశపు ప్రధమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ డెబ్బెయిరెండు సంవత్సరాల వయసులో లక్ష్మీశివపార్వతిని వివాహమాడిన తెలుగుదేశం అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, నటరత్న, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు, ఇలా ఎందరో... ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
'సంధ్యావందనం' నవల రాయబోయేముందు నేనెంతో అలోచించి శోధించి, ప్రముఖుల రహస్య ఘట్టాలకు సంబంధించిన వాస్తవ గాథలు చదివి, ఈ నవల రాయఢానికి ఉత్తేజం పొందాను.
మిత్రులు డాక్టర్ శివరామప్రసాద్, కొండప్ప, మధుకర్ ల వ్యక్తిగత జీవితాల్లో సెక్సు సృష్టించిన అల్లకల్లోలం నన్ను కలవరపెట్టింది. ఎనానిమస్, డెస్మండ్ బ్యాగ్లి లాంటి ప్రముఖ ఆంగ్ల రచయితల నవలలు (ఎప్పుడో పదేళ్ళక్రితం) చదివిన ఇన్*స్పిరేషన్, శ్రీ వి జగపతిరావుగారు అందించిన ప్రముఖుల ప్రేమాయణాల అద్భుత వివరాల స్ఫూర్తిగా, మ్యానుస్క్రిప్టు స్టేజ్ లోనే నవల చదివి తమ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసి భుజం తట్టిన గురుతల్యులు శ్రీబీయల్లెన్ (ముందుమాట రాసిచ్చినందుకు థాంక్సు), టోనీ, ఫణి, బాలి తదితర మిత్రులు— వీరందరికీ కృతజ్ఞతలు.
సెక్సు ఒక మహా సముద్రం.
'సంధ్యావందనం' నవలలోని అంశాలని దూషించే ఉత్తరాలకోసం కాక— మనసారా సిన్సియర్‌గా అభినందించి ఈ నవలలోని అంతర్ఘోషని ఆదరించే ప్రియతమ పాఠకుల లేఖలకోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ వుంటాను.
ఈ నవల మీద వచ్చిన అభిప్రాయాలని అనుసరించి, అవసరమైతే— పాఠకులు అనుమతిస్తే 'సంధ్యాసంగమం' అనే మరో నవల రాయడానికి ఇదిగో, ఈ క్షణమే నాలో ఒక సరిక్రొత్త సబ్జెక్టు రూపుదిద్దుకుంటోంది.
అయితే—
బలహీన హృదయులకి ఎలాగైతే డాక్టర్ షాకింగు న్యూస్ చెప్పడానికి నిషేధిస్తాడో, తప్పతాగి నేరాలు ఘోరాలు చేసే బలహీన మనస్కులకి ఎలాగయితే విస్కీ, బ్రాందీ తదితర మత్తు పదార్ధాలని నిషేధించవచ్చో— సెక్సుని ఒక బలహీనతగా అపార్ధం చేసుకునేవాళ్ళు, నిగ్రహశక్తి లేదని భయపడేవాళ్ళు, తమ మానసిక స్థితిమీద అనుమానం వాళ్ళు ఈ నవల చదవకుండా సహృదయులని జాగ్రత్త పడమని వినమ్రంగా కోరుకుంటున్నాను.
నా రచనలన్నిటినీ ఆదరించే ప్రియతమ పాఠక మేధావులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభి వందనములు.
మీ
వి. యస్. పి. తెన్నేటి

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK