Thread Rating:
  • 4 Vote(s) - 4.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పెద్ద బాలశిక్ష
#1
పెద్ద బాలశిక్ష

పెద్ద బాలశిక్ష — ఈ పుస్తకాన్ని తెలుగులో ఎన్సైక్లోపెడియా అనవచ్చు. బ్రిటీషువారు భారతదేశాన్ని పరిపాలించు కాలంలో ఆంధ్రదేశములోని పాఠశాలల్లో పిల్లలకు పెద్దబాలశిక్ష సిలబస్ గా ఉండేది. పిల్లలు మొట్టమొదట తమ విద్యాభ్యాసాన్ని పెద్ద బాలశిక్షతోనే ప్రారంభించేవారు.
ఈ—తరం వాళ్ళకి మన పెద్ద బాలశిక్ష ఔచిత్యాన్ని తెలియజేయటానికి సరిత్ గారి సూచనతో ఈ దారాన్ని ప్రారంభిస్తున్నాను.
మిత్రులందరూ తమ వంతుగా విలువైన సమాచారాన్ని అందజేసి ఈ దారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మనవి చేసుకుంటున్నాను.


మీ
వికటకవి O2



[Image: pb-2.jpg] . [Image: pb-1.jpg] 

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
అలనాడు బాలబాలికలు తప్పక నేర్చుకోవలసిన శిక్షణగా బాలశిక్ష ఉండేది. అందులోని
విషయాలని ఆకళింపు చేసుకుంటూనే కంఠతా పట్టే పద్ధతి ఓ సంప్రదాయంగా ఉండేది.

అక్షరాలని దిద్దుతూ క్రమక్రమంగా చిన్నచిన్న పదాలను నేర్చుకోవడం, పెద్ద పదాలని
తెలుసుకోవడం, నీతి సూక్తులు, నీతి కధలు, పద్యాలు, పాటలు, గణితం (లెక్కలు),
పరిసరాల పరిజ్ఞానం, భౌగోళిక అంశాలు, ... ... ఇలా అనేక అంశాల కలయికతో
బాలల శిక్షణ రూపొందించబడింది.

నేటి కాలంలో మనలో కొందరికి ఆరు ఋతువుల పేర్లే సరిగ్గా గుర్తుకి రావడం కష్టం.
ఇక అరవై తెలుగు సంవత్సరాల పేర్లని క్రమం తప్పకుండా, తడబడకుండా చెప్పగలిగేవారు
ఉంటారో - లేదో ! పంచాంగంలోని అంశాలు ఏమిటి, వాటి ప్రాముఖ్యత ఏమిటి, ...

తరచి చూసుకుంటే - మనకి తెలిసిన పరిజ్ఞానము కొంతే - తెలుసుకోవలసింది ఎంతో !

బాలబాలికలకి నేడు నేర్పిస్తున్న ప్రాధమిక విద్యలో పైన ప్రస్తావించుకున్నటువంటి
అంశాలకి తగిన ప్రాముఖ్యత లేదు. ఏవైనా అంశాలని కంఠతా పట్టించినా పరీక్షల్లో
మార్కులు పొందటానికే ప్రాధాన్యత. జ్ఞాన సముపార్జనకి ఉపయోగపడాలని తపన
చెంది అందుకు తగిన ప్రయత్నం చేయగలిగేవారు కొందరైనా ఉండాలని ఆశిద్దాం.
Like Reply
#3
(28-11-2018, 08:24 PM)Vikatakavi02 Wrote:
పెద్ద బాలశిక్ష

వికటకవి గారూ
ఇది ఒక మంచి ప్రయత్నం. ఈ తరం వారికి తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అందరూ తెలుసుకోవలసిన అంశాలు మరుగున పడే సమయమిది.
మీ కృషితో మిత్రులందరికి మన సంస్కృతి, విజ్ణానం అందుతాయని ఆశిస్తూ.....

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#4
ప్రతీ తెలుగువారింట తప్పక ఉండవలసిన పుస్తకం ఇది.

[Image: pedabalasiksha.jpg]



నేపథ్యం


వర్తకానికి వచ్చి రాజ్యాధిపతులైన ఆంగ్లేయులు వారి కొలువులో రెవెన్యూ డిపార్టుమెంటులో చాలీ చాలని జీతాలతో పనిచేస్తూ ఉన్న స్థానికులు అడ్డదారులు తొక్కి ధనార్జన కోసం అక్రమాలు, అన్యాయాలు మోసాలు దగాలు తప్పుడు రికార్డులు సృష్టించడం మొదలైనివి చేస్తున్నారని గుర్తించారు. స్థానికులు విశ్వసనీయంగా ప్రవర్తించాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అని ఆలోచించారు. స్థానికుల విద్యావిధానంలో లోపం ఉందని తెలుసుకున్నారు. ఆనాటి మద్రాసు గవర్నరు సర్ థామస్ మన్రో 1822 జూలై 2వ తేదీన ఒక యీ దస్తు కోరారు.అందులో ఇలా వుంది :
“     రాజ్యాలను సంపాదించాక మనం భౌగోళికంగా సర్వేలు చేయించాము. దేశంలో పండే పంటల ఆరాలు తీశాము. వనరుల గురించి భోగట్టాలు రాబట్టాము. జనాభా లెక్కలు గుణించాము. అంతేగాని స్థానికుల విద్యావిధానం గురించి తెలుసుకోడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు.     ”

స్థానికులలో మన విశ్వాసాలకు భంగం కలగకుండా వారి విద్యావిధానంలో ఏ మార్పులను తీసుకు రావాలో తెలుసుకున్నారు. అప్పటి దాకా తమ సివిల్ సర్వెంట్ల చదువు కోసమే పుస్తకాలను వ్రాయించిన ప్రభువులు స్థానికుల కోసం ప్రాథమిక గ్రంథాలను వ్రాయించాలని అనుకొన్నారు. 1832 లో మేస్తర్ క్లూలో (Clu Low) అనే తెల్లదొర, తన ఆశ్రితుడైన పుదూరు చదలవాడ సీతారామరావు చేత బాలశిక్ష అనే గ్రంథాన్ని రచింపచేశాడు. ఈయన రచనా ప్రణాళికను చాలా జాగ్రత్తగా కుర్రవాళ్ళ గ్రహణశక్తిని దృష్టిలో ఉంచుకొని రూపొందించాడు. ఇటువంటి పుస్తకం కోసమే ఆవురావురంటూ ఎదురు చూస్తున్న మన దేశం దీనిని రెండు చేతులా ఆహ్వానించింది.
పెద్దబాలశిక్ష 11 వ పేజి
[Image: 250px-PeddaBalaSikshaPage11.jpg]

1856లో అంటే మొదటి ముద్రణకు రెండు పుష్కరాల తర్వాత వెలువడిన బాలశిక్షలోని పుటల సంఖ్య 78. డెమ్మీ ఆక్టావో సైజు.ఆ తర్వాత సాహిత్య విషయాలు, భౌగోళిక విషయాలు, సంస్కృత శ్లోకాలు చేర్చి 12 పేజీలు అదనంగా కలుపుతూ 90 పేజీలతో 1865 లో ఇది పునర్ముద్రణ పొందింది. అంటే పన్నెండు పేజీలు పెరిగాయన్నమాట. పాత ముద్రణలో లేని సాహిత్య విషయాలను, చందస్సు సంస్కృత శ్లోకాలు, భౌగోళిక విషయాలను యిందులో చేర్చారు. దానిని బాలవివేకకల్ప తరువు గా రూపొందించారు. అందుకనే అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలోఉన్న పుస్తకం పెద్ద బాలశిక్షగా కొత్త పేరును దాల్చింది. ఈ పెద్ద బాలశిక్ష ఇందులో విషయపరిజ్ఞానికి-అంటే భాషాసంస్కృతులకు కావాల్సిన పునాదిరాళ్ళనదగిన భాషా విషయాలు, అక్షరాలు, గుణింతాలు వత్తులు, సరళమైన పదాలు- రెండు మూడు నాలుగు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు- నీతి వాక్యాలు, ప్రాస వాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ, అందరూ తెలుసుకోదగ్గవీ నాటికి తెలిసిన చారిత్రక, భౌగోళిక, విజ్ఞాన సంబంధ విషయాలను రూఢి వాచకాలను ఈ పుస్తకం ఆది స్వరూపంలోనే ఆనాడు పుదూరువారు పొందుపరచారు.

ఆ తరువాత, 1832 నుండి ఇప్పటివరకు పెద్ద బాలశిక్షను తెలుగు సమాజం ఆదరించగా కొన్ని మార్పుల చేర్పులతో ఎంతోమంది ప్రచురణకర్తలు ఎన్నో పండిత పరిష్కరణలతో అందిస్తూవచ్చారు. ఆ మధ్య ఎన్నో గుజిలీ ఎడిషన్లు కూడా లభిస్తూ వచ్చాయి. పుదూరివారి తర్వాత పేర్కొనదగిన పరిష్కరణ 1916లో వావిళ్ళ వారిది. 1916 లో వావిళ్ళ రామస్వామి శాస్తులు అండ్ సన్స్ సంస్థ నుండి ఒక పెద్దబాల శిక్ష వెలువడింది. దీని విపుల పరిష్కరణను 1949లో అందించారు. భాషోద్దారకులు వావిళ్ళ వేంకటేశ్వరరావు 1949 పరిష్కరణలో ఇలా చెప్పారు:
“     భారత దేశమునకు స్వరాజ్యము లభించినందుకు ఇక ముందు దేశభాషలకు విశేషవ్యాప్తి ఏర్పడి ఇట్టి (పెద్దబాలశిక్ష) గ్రంథములకు వేలకువేలు ప్రచారమగునని తలంచుచున్నాను.ఇప్పుడు భారత దేశానికి స్వరాజ్యం వచ్చిన ఏభైతొమ్మిది సంవత్సరాలకు కూడా వయోజనులకే కాక, తెలుగు పిల్లలకు తెలుగుదనాన్ని నేర్పి చక్కని పండితపౌరులుగా తీర్చిదిద్దే సామర్థ్యం ఈ పెద్ద బాలశిక్షకు ఉంది.     ”

1983లో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రాశస్త్యాన్ని గ్రహించి కొన్ని భాగాల్ని పాఠ్యాంశాలుగా కూడా చేర్చింది.పత్రికాధిపతులు, విజ్ఞులు పెద్ద బాలశిక్షను గుణశీల పేటికగా అభివర్ణించారు.
పెద్దబాలశిక్ష పేజీ 32, నీతివాక్యములు
[Image: 250px-PeddaBalaSikshaSamplePagesMonoSmall.jpg]
ఆరుద్ర పుదూరు చదలవాడ సీతారామరావు' చేత బాలశిక్ష అని వ్రాశారు గానీ, పుదూరు పుదూరు సీతారామరావు వేరు. చదలవాడ సీతారామరావు వేరు. పుదూరు సీతారామరావు అనే వారు వజ్ఝల సీతారామరావు . వీరి తమ్ములు వజ్ఝల నారాయణరావు. వారు అన్నగారైన పుదూరు సీతారామరావు గారికి బాలశిక్ష మలి ముద్రణలో తోడ్పడ్డారు. వీరు ఏనుగుల వీరాస్వామయ్యతో బాటు కాశీ యాత్రలో పాల్గొని పుదూరుకు వారిని తీసికెళ్లారు.

ఆ తర్వాత ఈ వందేళ్ళలో ఎన్నో పెద్దబాల శిక్షలను ఎందరో ముద్రించారు. ప్రస్తుతం గాజుల సత్యనారాయణ గ్రంధ్ర కర్తగా ఉండగా, విజయవాడకు చెందిన వనజా ఆఫ్ సెట్ ఫింటర్స్ ద్వారా పెద్దబాల శిక్ష ముద్రణ అవుతోంది. మహా భారతంలో 18 పర్వాలున్నట్టే నేడు పెద్దబాల శిక్ష - భాషావిజ్ఞాన పర్వం, సంస్కృతీ సంప్రదాయ పర్వం, బాలానంద పర్వం, శతక పర్వం, నీతి కథా పర్వం, సంఖ్యా శాస్త్ర పర్వం, ఆధ్యాత్మిక పర్వం, కంప్యూటర్ పర్వం, గణిత శాస్త్ర పర్వం, విజ్ఞాన శాస్త్ర పర్వం, వాస్తు శాస్త్ర పర్వం, పంచాంగ పర్వం, ఆరోగ్య పర్వం, మహిళా పర్వం, క్రీడారంగ పర్వం, ఆంధ్ర ప్రదేశ్ పర్వం, భారతదేశ పర్వం, ప్రపంచ పర్వం అను 18 పర్వాలతో మేటి పుస్తకంగా పేరు పొందినది.
ప్రజాదరణ పొందిన కొన్ని బాలశిక్ష ప్రచురణలు

    గొల్లపూడి ప్రెస్ రాజమండ్రి
    గాజుల సత్యనారాయణ రచన
    సురభి పెద్ద బాలశిక్ష
    విజేత కాంపిటీషన్ పెద్ద బాలశిక్ష

ఆవశ్యకత

తెలుగు వారు చదవాల్సిన పుస్తకాల్లో పెద్దబాల శిక్ష అతి ముఖ్యమైనది, ప్రతి తెలుగువారి ఇంట్లో ఉండవలసిన పుస్తకం పెద్దబాల శిక్ష. ఈ పుస్తకం బ్రిటీషువారు భారతదేశాన్ని పాలించే కాలంలో గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పాఠ్యపుస్తకంగా ఉండేది. పూర్వం పెళ్ళిసంబంధాలు మాట్లాడేటప్పుడు "మీ అబ్బాయి ఏం చదివాడు?" లేదా "మీ అమ్మాయి ఏం చదివింది?" అని అడిగితే "మావాడు పెద్దబాల శిక్ష పూర్తి చేశాడు", "మా ఆమ్మాయికి పెద్దబాల శిక్ష కంఠోపాఠం వచ్చు" అని గొప్పగా చెప్పేవారు. పెద్దబాలశిక్ష గ్రంథాన్ని పూర్తిగా చదివితే ప్రపంచంలోని అన్ని విషయాల గురించి తెలుసుకున్నట్లు భావించేవారు. తెలుగు సంస్కృతి, తెలుగు కథలు, విజ్ఞాన శాస్త్రం, క్రీడలు, సాహిత్యం వగైరా విషయాలు గల పెద్దబాల శిక్షను తెలుగు ఎన్ సైక్లోపెడియాగా పేర్కొనవచ్చు. 1960, 1970 శకాల్లో ఆంగ్ల విద్య ప్రవేశం వలన ఈ పుస్తకం ఆదరణ కోల్పోయినా ఇటీవల మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తెలుగువారు అత్యంత ప్రియంగా ఆదరించే పుస్తకంగా పేరొందింది.
మూలాలు

    బుడ్డిగ సుబ్బరాయన్ గారి సురభి-పెద్ద బాలశిక్ష (1997) [లోని ఆరుద్ర గారి ఆనంద వాక్యాలు మరియు బుడ్డిగ సుబ్బరాయన్ గారి నా మాట ]
 horseride  Cheeta    
Like Reply
#5


గణపతి శ్లోకం

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే !!

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం !
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే !!

సరస్వతీ ప్రార్ధన


సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి !
విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా. !!

పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ !
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ. !!

శరదిన్దువికాస మన్దహాసాం స్ఫుర దిన్దీవర లోచనాభిరామమ్ !
అరవిన్దసమాన సున్దరాస్యా మరవిన్దాసనసున్దరీ ముపాసే. !!

శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీప్యమ్ !
కరుణామసృణైః కాక్షపాతైః కురు మా మంబ కృతార్థసాధవాహమ్ !!

శారదా శారదాంభోజవదనా వదనాంభుజే !
సర్వదా సర్వదా‌‌‌‍ఽస్మాకం సన్నిధి సన్నిధిం క్రయాత్ !!


గురు ప్రార్ధన

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలనం యేన తస్మై శ్రీ గురవే నమః

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#6
ఏ దేశమేగినా...

ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లిభూమి భారతిని
నిలపరా నీ జాతి నిండుగౌరవము

ఏ పూర్వపుణ్యమో ఏ యోగబలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున
ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున

లేదురా ఇటువంటి భూదేవియెందూ !
లేరురా మనవంటి పౌరులింకెందు !

సూర్యునీ వెలుతురుల్ సోకునందాక
ఓడలా ఝండాలు ఆడునందాక
అందాకగల ఈ అనంతభూతలిని
మన భూమివంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ తెలుగు బాలగీతములు
పాడరా నీ వీరభావభారతము !

తమ తపస్సులు ఋషుల్ ధారవోయంగా
శౌర్య హారముల్ రాజచంద్రులర్పింప
భావ సూత్రము కవి ప్రభువులల్లంగ
రాగ దుగ్ధముల్ భక్తరత్నముల్ పిదక
దిక్కులకెగదన్ను తేజమ్ము వెలగ
రాళ్ళ తేనియలూరు రాగాలు సాగా
జగములనూగించు మగతనంబెగయ
సౌందర్యమెగ బోయు సాహిత్యమలర

వెలిగినదీ దివ్య విశ్వంబు పుత్ర !
దీవించె నీ దివ్యదేశంబు పుత్ర !

పొలములా రత్నాలు మొలిచెరా ఇచట
వార్ధిలో ముత్యాలు పండెరా ఇచట
పృథివి దివ్యౌషధుల్ పిదికెరా మనకు
కానలా కస్తూరి కాచరా మనకు

అవమానమేలరా?! అనుమానమేలరా?!
భారతీయుడనంచు భక్తితో పాడ!

-- రాయప్రోలు సుబ్బారావు (1892 - 1984)


గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#7
enti ee book asalu?
Add reps if you like my posts.
Like Reply
#8
^ it used to be an encyclopaedia for the children.
though it was meant for children, it was learnt by one and all in olden days.


[Image: 1a-Copy.jpg]
Like Reply
#9
(16-12-2018, 09:37 PM)~rp Wrote: ^ it used to be an encyclopaedia for the children.
though it was meant for children, it was learnt by one and all in olden days.

OK.
Do you have admin access here?
Add reps if you like my posts.
Like Reply
#10
^ No.
Like Reply
#11
[Image: d.jpg]
 horseride  Cheeta    
Like Reply
#12
[Image: 1b.jpg]
 horseride  Cheeta    
Like Reply
#13
[Image: IMG-20181218-184303.jpg]

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#14
[Image: IMG-20181218-184613.jpg]
[Image: IMG-20181218-184724.jpg]

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#15
                                      సంస్కృతం

మన పుస్తకాలలో పాణిని అనే పేరు కనబడదు.  లఘు సిద్ధాంత కౌముది వంటి సంస్కృత వ్యాకరణ గ్రంధాలలో మొదటి పుటలోనే ఉంటుంది.  ప్రపంచంలో అందరు కంప్యూ టర్ సైన్సు వారికి ఆపేరు సుపరిచితం. ప్రపంచ భాషలలొ సంస్కృతమునకు గల ప్రత్యేక స్థానమునకు కారకుడు పాణిని.
పంచతంత్రం ఆయనను ముని అంటుంది. ఆయన లేకపొతె నాటికీ నేటికీ భాషాశాస్త్రమే లేదు. ఆయన కాలం మూడు వేల సంవత్సరాలకు ముందే. పుట్టిన స్థలము గాంధారదేశము (నేటి వాయువ్య- పాకిస్తాన్). ఆయన వ్యాకరణ గ్రంధం 3959 సూత్రాల అష్టాధ్యాయి. భారతీయ తత్త్వ శాస్త్రములొ శబ్దమునకు, భాషకు ఉన్నతమైన స్థానము ఉంది. శబ్దాన్ని వాగ్దేవిగా, దేవతా స్వరూపముగా మనవాళ్ళు భావించారు. వ్యాకరణమే అన్ని శాస్త్రాలకు మూలం.

వ్యాకరణము అనేపదమే “శబ్దోత్పత్తి, శబ్ద లక్షణములను తెలిపే ఉపకరణము” అనే నిర్వచనాన్ని ఇస్తుంది. ఇప్పుడు కీ.శే మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెల శ్రీ రామ చంద్రుడుగారి లఘు సిద్ధాంత కౌముది లోని మొదటిదైన సంజ్ఞా ప్రకరణములోని మొదటి పుట పరిశీలిద్దాము.
నత్వా సరస్వతీం దేవీం శుద్ధాం గుణ్యాం కరోమ్యహం
పాణినీయ ప్రవేశాయ లఘుసిద్ధాంతకౌముదీం
శుద్ధ స్వరూపము,సర్వ సద్గుణ సంపన్నయునగు శ్రీ సరస్వతీదేవికి నమస్కరించీ పాణినీయ వ్యాకరణ ప్రవేశమునకై ఈ లఘు సిద్ధాంత కౌముదిని రచించుచున్నాను (ఇది వరదరాజ పండితుడను ఈ గ్రంథకర్త చెప్పినది)

మహేశ్వర సూత్రాలు: 1(అ,ఇ,ఉ,ణ్),2(ఋ,ఌ,క్)3(ఏ,ఓ,ఙ్)4(ఐ,ఔ,చ్) 5(హ,య,వ,ర,ట్)6(ల,ణ్) 7(ఞ,మ,ఙ,ణ,న,మ్)8 (ఝ,భ,ఞ్) 9 (ఘ,ఢ,ధ,ష్) 10 (జ,బ,గ,డ,ద,శ్) 11 (ఖ,ఫ,ఛ,ఠ,థ,చ,ట,త,వ్) 12(క,ప,య్)13 (శ,ష,స,ర్) 14 (హ,ల్)
(అ,ఇ,ఉ,ణ్) = అణ్ - string notation to represent the above sequences

(అ,ఇ,ఉ,ఋ,ఌ,ఏ,ఓ,ఐ,ఔ,చ్) = అచ్ = అచ్చులు
(హ,య,వ,ర,ల,ఞ,మ,ఙ,ణ,న,ఝ,భ,ఘ,ఢ,ధ,జ,బ,గ,డ,ద,ఖ,ఫ,ఛ,ఠ,థ,చ,ట,త,క,ప,శ,ష,స,ల్)= హల్ = హల్లులు
వీటిని ప్రత్యాహారాలంటారు. పాణిని సూత్రాలను స్వల్పాక్షరాలలో చెప్పడానికి ఇది ఉపయోగించాడు.

ఉదాహరణకు అతి+ ఆశ = అత్యాశ, గురు + ఆజ్ఞ = గుర్వాజ్ఞ దీనికి పాణిని సూత్రం - ఇకో యణచి , ఇక్ అంటే (ఇ,ఉ,ఋ,ఌ)క్, యణ్ అంటే (య,వ,ర,ల, ణ్). ఇది యణదేశ సంధి సూత్రం

శివుడు తాండవానంతరం ముక్తాయింపులో ఢమరుకం మీద పధ్నాలుగు అక్షరాల ధ్వనులు మ్రోగించాడు. అవే శివసూత్ర జాలంగా ప్రసిద్ధికెక్కాయి. ఢమరుకం లోంచి వెలువడిన పదునాలుగు అక్షర ధ్వనులతో పాణిని ప్రఖ్యాత వ్యాకరణం రచించాడు.
నృత్తావసానే నటరాజ రాజో సనాదఢక్కామ్ నవ పంచ వారమ్
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధానేతద్విమర్శే శివ సూత్ర జాలమ్||
नृत्तावसाने नटराजराजो ननाद ढक्कां नवपञ्चवारम्।
उद्धर्त्तुकामो सनकादिसिद्धादिनेतद्विमर्शे शिवसूत्रजालम् ||

బ్రహ్మ మానసపుత్రులైన సనకసనందనాది సిద్ధులు ఈ శబ్దాలను గ్రహించి పాణిన్యాదులకు ప్రసాదించారు. అందుకే అక్షరాభ్యాసంలో ఓం నమః శివాయ, సిద్ధం నమః అని వీరిని స్మరించడం.

ఒక మిత్రుడు ఈ వ్యాఖ్య చేశారు - It is meaning less to teach Sanskrit without alphabet and grammar నా సమాధానం సంస్కృతానికి ఆల్ఫబెట్ లేదు. ఆ మాటకు వస్తే తెలుగుకు కూడా లేదు. గ్రీకు లో ఆల్ఫా, బీటా,.. లాటిన్ (రోమన్)లో a, b, c.. వంటి పరస్పర సంబంధంలేని సంజ్ఞలు ఉన్నాయి. మన భాషలకు ఉన్నది వర్ణమాల. వర్ణమంటే ప్రత్యేక ఉచ్చారణ గల శబ్దాలను సూచించే సంజ్ఞలు. తెలుగు (సంస్కృతం) వ్యాకరణములలో కంఠ్యములు, తాలవ్యములు,మూర్థన్యములు, దంత్యములు,ఓష్ట్యములు -- క వర్గము, చ వర్గము, ట వర్గము, త వర్గము, ప వర్గము పైన చెప్పిన శబ్దోచ్చారణ స్థానాలలో పలుకుతాము. సంస్కృతం పదాలలో చ ఉచ్చారణ - చంద్ర,, చంద్రిక, చకోర . తాలవ్యము, తెలుగు పదాలలో ౘ .. ౘలి, ౘలిమిడి, ౘక్కని --- దంత్యము ౘ సంజ్ఞ తో బాటు ఉచ్చారణ మారి చెవికి కష్టంకలుగుతుంది. ఋణాన్ని రుణమని మార్చి మాఫీ చెర్చి కష్ట పడడమెందుకు,లోన్మాఫీ అంటే ఇంకా తేలిక,

ఉపాసనలో కూడా ఈ వర్ణాలు బీజాక్షరాలుగా ఉంటాయి.(హ,య,వ,ర
,ట్)(ల,ణ్)కలిపి లం ఇత్యాది పంచోపచార పూజ వస్తుంది
హం ఆకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి
యం వాయు తత్వాత్మనే ధూపం పరికల్పయామి
రం అగ్నితత్వాత్మనే దీపం పరికల్పయామి
వం వరుణతత్వాత్మనే అమృతం పరికల్పయామి
లం పృధ్వీతత్వాత్మనే గంధం పరికల్పయామి

యోగంలో ఈ వర్ణమాలలోని వర్ణాలు షట్చక్రాలలోని పత్రాలపై బీజాక్షరాలుగా ఉంటాయి. కఠోపనిషత్తులో హృదయాకాశములోని అనాహత చక్రంలోని ద్వాదశ దళాలలో కం, ఖం,నుండి ఠం వరకు ఉన్న బీజాక్షరాలు వస్తాయి. కఠో పనిషత్తు పేరుకు ఇది యొక కారణము.
 horseride  Cheeta    
Like Reply
#16
[Image: 1s.png]
 horseride  Cheeta    
Like Reply
#17
[Image: en1.jpg]
 horseride  Cheeta    
Like Reply
#18
[Image: hin1.jpg]
 horseride  Cheeta    
Like Reply
#19
[Image: urd1.jpg]
 horseride  Cheeta    
Like Reply
#20
[Image: ka1.jpg]
 horseride  Cheeta    
Like Reply




Users browsing this thread: 2 Guest(s)