Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఎన్టీఆర్: కథానాయకుడు రివ్యూ అండ్ రేటింగ్
#1
ఎన్టీఆర్: కథానాయకుడు రివ్యూ అండ్ రేటింగ్

[Image: ntr-kathanayakudu-movie-review-690-1547012841.jpg]

By Rajababu A

Updated: Wednesday, January 9, 2019, 15:05 [IST]

NTR : Kathanayakudu Movie Review | ఎన్టీఆర్: కథానాయకుడు రివ్యూ | Filmibeat Telugu


నటీనటులు, సాంకేతికవర్గం

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కల్యాణ్ రాం, సుమంత్, రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ తదితరులు
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
రచన: సాయి మాధవ్ బుర్రాః
సంగీతం: ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫి: జానశేఖర్
ఎడిటర్: అర్రమ్ రామకృష్ణ
ప్రొడక్షన్ కంపెనీ: ఎన్‌బీకే ఫిల్మ్స్, వరాహి చలన చిత్రం, విబ్రి మీడియా
రిలీజ్: జనవరి 9, 2019

Rating: 3.0/5


నందమూరి తారక రామారావు అంటే ఓ చరిత్ర.. తెలుగు వాడి ఆత్మగౌరవం.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయని ధీరత్వం.. అలాంటి మహనీయుడి గురించి ఎన్ని మాటలు చెప్పినా.. రాసిన తక్కువే. అతి సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి భారతీయ సినిమా పరిశ్రమలో తొలి సూపర్‌స్టార్, వెండితెర ఇలవేల్పు అనే మాటలను సొంత చేసుకొన్న వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న గొప్ప సినీ, రాజకీయ నాయకుడు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్.. తొలిభాగంగా ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగోడి ప్రతిష్ణను నలుదిశలా చాటిన మహానుభావుడి వెండితెర జీవితం ఈ జనరేషన్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

ఎన్టీఆర్: కథానాయకుడు స్టోరీ
[Image: ntr-kathanayakudu-movie-review-688-1547012044.jpg]
ప్రభుత్వ కార్యాలయంలో తాహసిల్దార్‌గా పనిచేసే నందమూరి తారకరామారావు అవినీతి అక్రమాలను చూడలేక ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకొంటారు. అలా మద్రాసు చేరిన ఎన్టీఆర్ సినిమా హీరోగా మారడానికి ఎలా ఇబ్బందిపడ్డారు. ఆయన జీవితంలో చవిచూసిన ఒడిదుడుకులు, అద్బుతమైన విజయ శిఖరాలను ఎలా అధిరోహిచారనేది సంక్ష్లిపంగా అందరికి తెలిసిన కథ.

ఎన్టీఆర్ కథానాయకుడులో మలుపులు
[Image: ntr-kathanayakudu-movie-review-684-1547012078.jpg]
ఎన్టీఆర్ సామాన్య ఉద్యోగిగా ఇండియన్ తొలి సూపర్‌స్టార్‌గా ఎలా మారాడు? హీరోగా అద్భుతమైన విజయాలు సాధిస్తున్న సమయంలో దర్శకుడిగా, నిర్మాతగా ఎందుకు మార్సాలి వచ్చింది? సంపూర్ణమైన జీవితాన్ని అనుభవిస్తున్న గొప్ప నటుడు ప్రజాసేవకు పూనుకోవడానికి ఎలాంటి పరిస్థితులు కారణమయ్యాయి. రాజకీయ పార్టీని ఎలాంటి పరిస్థుతుల్లో పెట్టారనే ప్రశ్నలకు తెరమీద రూపమే ఎన్టీఆర్ కథానాయకుడు.

తొలిభాగం
[Image: ntr-kathanayakudu-movie-review-680-1547012114.jpg]
ఎన్నో వేలమంది పోటీపడితే అందరిలో ఆరోవ్యక్తిగా తహసీల్దార్ హోదాను సాధించిన ఎన్టీఆర్ తన ఉద్యోగాన్ని వదులుకోవడమనే ఆసక్తికరమైన అంశంతో సినిమా ప్రారంభమవుతుంది. మద్రాసులో సినిమా హీరో కావడానికి పడిన కష్టాలను మంచి కంటెంట్‌తో కథ ముందుకు తీసుకెళ్తుంది. తొలిభాగంలో రాయలసీమ కరువు, కుమారుడు రామకృష్ణ మరణం హైలెట్‌గా నిలుస్తుంది. ఇక కృష్ణుడి పాత్ర ఎంట్రీ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లేలా ఉంది. కృష్టుడు గెటప్‌లో నందమూరి తారకరామారావు నడిచి వచ్చే సన్నివేశాలు రోమాలు నిక్కబొడిచే విధంగా ఉంటాయి

రెండో భాగం
[Image: ntr-kathanayakudu-movie-review-682-1547012126.jpg]
ఇక రెండోభాగంలో సింహాభాగం ఎన్టీఆర్ కెరీర్‌ గురించిన సన్నివేశాలే కనిపిస్తాయి. అలాంటి రొటీన్ సన్నివేశాల మధ్య దివిసీమ ఉప్పెన కోసం జోలె పట్టిన ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ ఎపిసోడ్ ప్రధాన ఆకర్షణ. అలాగే దివిసీమ బాధితుల కోసం విరాళాల సేకరణలో ఎన్టీఆర్ రాష్ట్రమంతా పర్యటించే సమయంలో కొన్ని సీన్లను అద్భుతంగా తెరకెక్కించారు. ఇక చివర్లో ఎన్టీఆర్ పార్టీని ప్రకటించే సీన్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది.


డైరెక్టర్ క్రిష్ టేకింగ్

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చూస్తున్నంత సేపు క్రిష్ పనితీరే ముందుగా కనిపిస్తుంది. ఈ సినిమాను మలిచిన విధానం క్రిష్ ప్రతిభకు అద్దంపట్టిందని చెప్పవచ్చు. తొలిభాగంలో రావణబ్రహ్మ ఎపిసోడ్, శ్రీకృష్ణుడు, కుమారుడి మరణం సీన్లు దర్శకుడిగా క్రిష్‌ను ఆకాశానికి ఎత్తేసేలా ఉంటాయి. కథకు ఉన్న పరిమితుల వల్ల రెండోభాగంలో సినిమా కాస్త నెమ్మదించినట్టు అనిపించిన క్లైమాక్స్‌తో సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఓవరాల్‌గా ఈ సినిమాను జనరంజకంగా మలచడానికి క్రిష్ చేసిన ప్రయత్నం అభినందనీయం.

బాలకృష్ణ విశ్వరూపం

ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. పలు రకాల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశాడా అనే రేంజ్‌లో కనిపిస్తాడు. పాతాలభైరవి, గుండమ్మ కథ, రావణబ్రహ్మ, సన్నివేశాల్లో ఇరగదీశాడని చెప్పవచ్చు. కుమారుడు మరణించిన ఎపిసోడ్‌లో బాలయ్య విశ్వరూపం ప్రదర్శించాడు. గుండెలు పిండేసేలా నటనను కనబరిచాడు. సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి సీన్ బాగున్నాయి. ఎమర్జెన్సీ సన్నివేశాలు, పద్మశ్రీ అవార్డు అందుకొన్న సమయంలో కనబరిచిన హావభావాలు ప్రేక్షకుడిని మైమరిపిస్తాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో మేకప్ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి.

విద్యాబాలన్ పెర్ఫార్మెన్స్
[Image: ntr-kathanayakudu-movie-review-675-1547012180.jpg]
విద్యాబాలన్ తొలిభాగంలో తన ఫెర్మార్మెన్స్‌తో అదరగొట్టింది. ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్టీఆర్ సినీ రంగానికి వెళ్లున్న సన్నివేశాల్లో విద్యాబాలన్ ఆకట్టుకొన్నది. అలాగే తన కుమారుడి మరణం ఎపిసోడ్‌, అలాగే యమగోల సినిమాలో జయప్రదతో డ్యాన్సులు వేసే సీన్ల సమయంలో సాదాసీదా మహిళను తలపించేలా నటనను కనబరిచారు. అలాగే చివర్లో రాజకీయాల్లోకి వెళ్తున్న సమయంలో భర్తకు మించిన ఇష్టంగా లేదనే విషయాన్ని తెరమీద చెప్పిన తీరు నిజంగా హ్యాట్సాఫ్.

ఏఎన్నాఆర్‌గా సుమంత్
[Image: ntr-review-8-1547013507.jpg]
అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించిన సుమంత్ చక్కటి నటనను ప్రదర్శించాడు. తొలిభాగంలో ఏఎన్నాఆర్, ఎన్టీఆర్ మధ్య బలమైన సీన్లు లేకపోయాయి. తన ఇంటి ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌తో కలిసి చేసిన తమాషా సన్నివేశాల్లో ఏఎన్నాఆర్‌గా సుమంత్ అదరగొట్టాడు. సెకండాఫ్‌లో ఆయన పలికించిన హావభావాలు బ్రహ్మండంగా ఉన్నాయి. సినిమాకు ఏఎన్నాఆర్ పాత్ర ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు.

మిగితా నటీనటులు

మిగితా పాత్రలు చెప్పుకోవడానికి పెద్దగా స్కోప్ లేని పాత్రలే. ప్రధానంగా ప్రకాశ్ రాజ్, క్రిష్ జాగర్లమూడి, సాయిమాధవ్ బుర్రా, దగ్గుబాటి రాజా తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనించారు. వీరిలో ప్రకాశ్ రాజ్ ఉన్నంతలో నిర్మాత నాగిరెడ్డిగా తన పాత్రను ఎలివేట్ చేయడంలో సఫలమయ్యాడు. ఎల్వీ ప్రసాద్‌గా జిషు సేన్ గుప్తా సేన్ గుప్తా ఒకే అనిపించారు. చక్రపాణిగా మురళీరావు ఆకట్టుకోలేకపోయారు. రకుల్, షాలిని పాండే, హన్సిక తదితర పాత్రలు పెద్దగా గుర్తిండిపోయేవి కావు. ఎన్టీఆర్ పాత్ర ముందు ఇవన్నీ తేలిపోయాయి

సాయిమాధవ్ డైలాగ్స్

[Image: ntr-kathanayakudu-movie-review-689-1547013585.jpg]

సాంకేతిక విభాగాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్. సినిమాకు ఆయన అందించిన సంభాషణలు బలంగా నిలిచాయి. ఎమోషనల్ సీన్లలో పాత్రలతో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేసేలా ఉన్నాయి. బాలకృష్ణ జననం, అన్నప్రసాన సమయంలో వచ్చే డైలాగ్స్ ఫ్యాన్స్‌తో కేకపెట్టించాయి. అలాగే అన్మదమ్ముల అనుబంధం రిలీజ్ సమయంలో వచ్చే సీన్లలో క్లుప్తంగా చెప్పినప్పటికీ డైలాగ్స్‌లో పవర్ కనిపించింది.

సినిమాటోగ్రఫి, ఇతర విభాగాలు

జ్ఞాన శేఖర్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. లైటింగ్, కలర్ ప్యాటర్న్ తదితర అంశాలు బాగున్నాయి. అప్పటి వాతావరణాన్ని తెర మీదకు తీసుకువచ్చిన ఆర్ట్ విభాగం పనితీరు సూపర్ అని చెప్పవచ్చు. రామకృ‌ష్ణ ఎడిటింగ్ క్రిస్పిగా ఉంది. సెకండాఫ్‌లో పాత్రల బిహేవ్ కారణంగా కొంత ల్యాగ్ అనిపిస్తాయి.

ప్రొడక్షన్ వ్యాల్యూస్

ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన నిర్మాతలు నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి అని మొదటి నుంచి ప్రచారంలో ఉంది. కానీ సినిమా టైటిల్స్‌లో నందమూరి వసుంధరాదేవి, బాలకృష్ణ పేర్లే కనిపించాయి. అయినా మహనీయుడి జీవితాన్ని ఆవిష్కరించడానికి వారు అనుసరించిన నిర్మాణ విలువలు ప్రతిష్ఠాత్మకమైన రీతిలోనే ఉన్నాయి. నటీనటుల ఎంపికలోనూ, సాంకేతిక నిపుణుల సమకూర్పులోనూ వారి అభిరుచి ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.

ఫైనల్‌గా

వెండితెర దైవం ఎన్టీఆర్ జీవిత కథగా రూపొందిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఎన్టీఆర్ జీవితమనే నాణానికి మరో కోణంలో ఉండే ఒడిదుకుడులు, భావోద్వేగాలు కళ్లకు కట్టినట్టు చూపించారు. మళ్లీ ఎన్టీఆర్‌ లైఫ్‌ను ఈ తరం ప్రేక్షకులకు చక్కటి విందుగా వడ్డించారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ తెలుగు వారమనుకొనే ప్రతీ ఒక్కరు చూడాల్సిన చిత్రం.

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్

బాలకృష్ణ, విద్యాబాలన్ పెర్ఫార్మెన్స్క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్సాయిమాధవ్ బుర్రా రచనఇతర నటీనటుల ప్రతిభ

మైనస్ పాయింట్స్

సెకండాఫ్‌ స్లో నేరేషన్, మిగతా క్యారెక్టర్లను పెద్దగా ఎలివేట్ చేయలేకపోవడం

FILMBEAT WEBLINK

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: