Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తెలుగు సాహిత్యం
#1
తెలుగు సాహిత్యం

ఈ దారంలో కేవలం తెలుగు పుస్తకాలను మాత్రమే అప్లోడ్ చేస్తాను.


మీ వికటకవి 02

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
[Image: Fire-Shot-Capture-113.png]
వ్యాస చంద్రిక
(ముద్రితాముద్రిత రచనాసంపుటి)

రచన : మహాకవి గురజాడ
సంకలితము : అవసరాల సూర్యారావు

ఇందులో...
  • కావ్యాలలో శృంగారం
  • కవిత్వము : వర్డ్సువర్తు
  • ముత్యాలసరాల లక్షణము
  • విద్యా పునరుజ్జీవనము
  • వంగీయ సాహిత్యపరిషత్
  • రవీంద్రకవి
  • బంకిమచంద్రుని నవలారచన
  • వాడుక భాషలు : గ్రామ్యము
  • గ్రామ్యశబ్దవిచారణము
  • ఆకాశరామన్న వుత్తరాలు
  • చుట్టుచూపులేని విద్య
  • కన్నడ వ్యాకరణములు
  • ఆంధ్ర కవితాపిత
  • విశ్వవిద్యాలయాలు : సంస్కృత, మాతృభాషలు
  • ఆధునిక వచనరచన
  • మద్రాసు కాంగ్రెసు మహాసభ
VYASA-CHANDRIKA PDF >>> DOWNLOAD

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#3
మీకు వేవేల కృతజ్ఞతలు
దాదా ఖలందర్ 
Like Reply
#4
copy from facebook

ఎన్ని తరంగాలను పుట్టించినా, సముద్రానికి అలసట రాదు. ఎన్ని ఆలోచనలు చేసినా, మనసుకి విసుగు రాదు.

తన మనసుకి వచ్చే ప్రతీ ఆలోచనని ఒక కీర్తనగా మలచి శ్రీవేంకటేశ్వరునికి అర్పించిన మహనీయుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. తన వందేళ్ళ సంపూర్ణ జీవితంలో 32,000 సంకీర్తనలతో స్వామిని అర్చించి...'చందమామ రావో, జాబిల్లి రావో' అని స్వామిని పసివాడిని చేసి, తెలుగు భాషకి అమ్మదనాన్ని తీసుకొచ్చిన ధన్యజీవి శ్రీఅన్నమయ్య.

ఆయన వ్రాసిన కీర్తనల్లన్నీ ఈనాడు 'ఎందరో మహానుభావులు' పాడగా వినగలుగుతున్నా, ఆనాటి రాయలసీమ వాడుక భాషలో వ్రాయడం వల్ల అర్థం తెలియడం లేదు. మన భాషనే మర్చిపోతున్న ఈ రోజుల్లో... ప్రతీపదంలో ఆకాశమంత విస్తృతంగా, సముద్రమంత లోతుగా సాగిన రచనలకి అర్థం చెప్పేవారెవరు? ఆ సేవని ఈరోజుల్లో ఉచితంగా చేసేదెవరు?

అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు - తను చదివిన MA Lit. తో ఆ సేవ చేసి, తన చదువునీ తన జీవితాన్ని ధన్యం చేసుకొన్న పుణ్యాత్ముడు.

అన్నమాచార్య కీర్తనలకు అర్థం వ్రాసిన ఆయన రచనలు, Kinige.com లో ఉచితంగా దొరుకుతున్నాయి.

http://kinige.com/author/Amaravadi+Su. ya+Deekshitulu

పామరులు పాడుకొనే జానపదాలనుంచి, పండితులు అర్థం చేసుకోలేని జ్ఞానపథాల వరకు...

కొత్త జంటల అనురాగం నుంచి, జీవితం చివరి రోజుల వైరాగ్యం వరకూ సాగిన అన్నమయ్య కీర్తనా యాత్ర, మన జీవితంలో చేసుకొనే ఒక తిరుమల యాత్ర.

"నన్ను రక్షించగ ఒక్క సంకీర్తన చాలదూ" అని అర్థించిన అన్నమయ్య కీర్తనల్లో ఒకదానికి అర్థం తెలుసుకొన్నా...

"చెడనీక బతికించే సిద్ద మంత్రమా...
రోగాలడచి రక్షించే దివ్య ఔషధమా.."

ఆయన వ్యక్తిగత స్త్రొత్రజాలం
http://geetadeeksha.com/
|| सततं वाग्भूषणं भूषणम् ||
http://eemaata.com/em/
Like Reply
#5
[Image: Bhakti-Sudha-1a1.jpg]
image uploading site
[Image: Bhakti-Sudha-1a2.jpg]
[Image: Bhakti-Sudha-1a3.png]
upload
[Image: Bhakti-Sudha-1a4.jpg]
copy from facebook

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, ఆదిమధ్యాంత రహితుడు, అచ్యుతుడు అవ్యయుడు ఐన ఆ శ్రీనివాసమూర్తిని కొనియాడడానికి వెయ్యి నాల్కలు గల విద్వత్ శిఖామణి ఆదిశేషునికే అలవికాలేదట. ఇక మానవమాత్రులం మనమెంత, మన భాషయెంత, భక్తిభావమెంత విద్వత్ సంపత్తియెంత. ఐతే అపారమైన అర్ణవానికి ఉడత చేసిన సాయమెంత దాని ఆయమెంత? ఆ ఉదారగుణ సంపన్నుడు. ఉడతను సైతం కరుణించలేదా? దాని ఉత్సాహానికి ఊపిరి పొయ్యలేదా? ప్రేమ, విశ్వాసం, వినయం పెనవేసిన శక్తియే భక్తి. ఆ భక్తి ఒక్కటే భగవంతుణ్ణి మెప్పించడానికి మానవునికి ఉన్న మహాశక్తి. ఆ భక్తి పారవశ్యంలో ఎన్ని కలాలు, ఎన్ని గళాలు ఎన్నెన్ని విధాలు కీర్తించినా విన్నకొద్దీ విందుగా, అన్నకొద్దీ పసందుగా ఆనంద సుధాబిందువులు చిందిస్తూనే ఉంది తిరుమల నిలయుని వరగుణ గానం.

ప్రతీ హృదయంలో, ప్రతీ క్షణం ప్రతిధ్వనించే పరమ మంత్రమే వేంకటేశ్వరుని నామం. ఆ కమలనాభుని కనులు కాంతిపుంజాల గనులు.

స్వామీ శ్రీ వేంకటేశ్వరా...

నీవు మేల్కొన్ననేగదా నీరజాక్షా...
నిఖిల తేజ: పటాలముల్ నిదుర లేచీ...
తిమిరసంహార మొనరించి దిశల బ్రోచూ...
తిరుమలేశ కనులింక తెరువుమయ్యా...

1985 ల్లో వచ్చిన గొప్ప ప్రైవేట్ రికార్డింగుల్లో "భక్తిసుధ" ఒకటి. శ్రీవేంకటేశ్వరుణ్ణి మేల్కొలిపి, ఆర్తితో పిలిచి, హారతిచ్చి, తన కష్టాల్ని చెప్పుకొని కరుణించమనే ప్రతీ భక్తుడి వేదనకు ఈ నివేదన అద్దం పడుతుంది. రోహిణీ కుమార్ రచించిన ఈ రచనలకు తమ గానంతో ప్రాణం పోసినవారు ప్రముఖ సినీ గాయకులు: బాలు, సుశీల, రామక్రిష్ణ. "కళాప్రపూర్ణ" సుస్వరాల సాలూరి రాజేశ్వర రావు తమ బాణీల్లో వండిన ఈ పాయసానికి అప్పుడే కాచిన వేడినెయ్యిలా సినీ నటుడు కొంగర జగ్గయ వ్యాఖ్యానం వినే చెవులకు భక్తిసుధే.

పండితుల అంతరంగంలో శ్రుతి చేసుకొనే మౌనగీతం నుండి పామరుల నోటిలో సందడి చేసే జానపదాల మీదుగా ప్రవహించిన ఈ భక్తిసుధ వినేవారి మనస్సుల్ని స్వామి పాదాలను తాకిస్తుంది.

"ఆయ్యబాబో ఇక్కడున్నవా... ఏడు కొండలెక్కి బాగ కూకున్నవా..." పాటలో...

"కట్టాలెందుకు సామీ పుట్టించావు?
మా నట్టింట్లో ఆటికి గుడి కట్టించావు?
ఆపదలే మాకు తోడు లేకుంటేనూ...!
మేమసలు నిన్ను తలుచుకోము అది నిజమేలే...!!"

ఈ భక్తిసుధలో వైకుంఠం నుండి శ్రీవేంకటేశ్వరుడి ఆగమనాన్ని, తిరుమల వైభవాన్ని కీర్తించిన "హే సప్తశైలేశా"... స్వామి సన్నిధిలో తెలుగుభాషలో నోరారా కీర్తించుకొనే గానసుధే.

భగవంతుణ్ణి భూత భవ్య భవత్ ప్రభు: - భూత భవిష్యత్ వర్తమానము లందరి సర్వమునకు ప్రభువైన వాడు. అని విష్ణు సహస్రం కీర్తించింది. సర్వ సృష్టిని పుట్టించి, పెంచి, నడిపించి హరించే కాలం, స్వామికి విశ్రమించే పానుపు(మంచం)గా మారి సేవ చేస్తుంది. అలా తనగర్భంలో కలిసిపోయిన ఎన్నో మంచివిషయాలను తిరిగి ఈతరానికి అందిస్తూ స్వామిని సేవించుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఎప్పుడో 80ల్లో క్యాసెట్‌గా వచ్చిన ఈ ప్రైవేట్ రికార్డింగ్, ఈ రోజుల్లో మళ్ళీ నెట్‌లో డిజిటల్ రూపంలో దొరకడం, ఆ కాలసర్పం స్వామి భక్తులకు అందించిన మహా ప్రసాదం. మీకు తెలిసిన వారిలో ఆ శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించుకొనే మీఆత్మీయులకు ఈ భక్తిసుధను అందించండి. మీకు ఎక్కడైనా, ఎప్పుడైనా ఒరిజినల్ రికార్డింగ్ కనిపిస్తే దయచేసి కొనండి. కళాకారులకు మీరు ఇచ్చిన ఆ విలువ, స్వామి హుండీకి సమర్పించుకొన్న ధనమే!

http://bhaktisongsmusic.blogspot.com/201...6GWI9Pc1ho
|| सततं वाग्भूषणं भूषणम् ||
http://eemaata.com/em/
Like Reply
#6
[Image: Fire-Shot-Capture-125.png]

ఓల్గా గా ప్రసిద్ధి పొందిన పోపూరి లలిత కుమారి ప్రముఖ తెలుగు రచయిత్రి. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ, సాహిత్యరంగపు చర్చలో స్త్రీవాద ధృక్పధాన్ని ప్రవేశపెట్టిన రచయితగా ఈమెను గుర్తిస్తారు. స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఓల్గా, తనను తాను తెలుగులో గురజాడ అప్పారావు వ్రాసిన కన్యాశుల్కంతో ప్రారంభమైన అభ్యుదయ రచనా పరంపరలో భాగంగా కూడా భావించింది.

నవంబర్ 27, 1950లో గుంటూరు జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి గ్రామములో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పోపూరి వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ. ఈమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యం ఎం.ఎ. చేసిన తర్వాత తెనాలిలోని వి.ఎస్.ఆర్. కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. ఓల్గా కథలు, నవలలు, పద్యాలు మహిళా సాహిత్యములో ఎన్నదగినవి. చలం, కొడవటిగంటి కుటుంబరావు రచనల వల్ల ప్రభావితమై స్త్రీ చైతన్యము అంశముగా రచనలు చేసి తనకై ఒక ప్రత్యేక స్థానము సంపాదించింది. పత్రికలలో, సాహిత్యములో, అనువాదములలో మహిళా హక్కులపై వివాదాస్పద చర్చలు గావించింది. చలన చిత్ర రంగములో 'ఉషా కిరణ్' సంస్థకు కథా రచయిత్రిగా పనిచేసి మూడు చిత్రాలు నిర్మించి పురస్కారాలు పొందింది. ఈమె రాసిన స్వేచ్ఛ నవలని వివిధ భారతీయ భాషల్లోకి అనువదించడానికి నేషనల్ బుక్ ట్రస్టు స్వీకరించింది.1986 నుండి 1995 వరకు ఆమె ఉషా కిరణ్ మూవీస్ లో సీనియర్ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేసారు. 1991 నుండి 1997 వరకు అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ కు అధ్యక్షురాలిగా పనిచేసారు. ఆమె ప్రస్తుతం అస్మితలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారు ఓల్గా వ్రాసిన 12 రచనలను, ఆమె కథల ఆంగ్లానువాదములను తమ సంగ్రహములో చేర్చారు.
>>> DOWNLOAD <<<

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#7
వంశీ కథలు
ఆకుపచ్చని జ్ఞాపకం

[Image: IMG-20190718-102013.jpg]
(Aakupachani Gnaapakam
Short Stories by Vamsy)

గతంలో వచ్చిన నా ఆనాటి వాన చినుకులు కథలు కూడా ఈ సంకలనంలో వున్నాయి. వాటినిందులో ఎందుకు చేర్చానంటే ఈమధ్య ఆ కథలకి కళాప్రపూర్ణ బాపుగారు రంగుల్లో బొమ్మలు వేశారు. దాంతో ఈ కలర్ బుక్‌లో ఆ కలర్ బొమ్మల్ని జత చెయ్యాలనిపించి చేశానండీ.

ఆ తర్వాత మిగతా కథలన్నీ కూడా గోదావరి, తూర్పు గోదావరి గ్రామీణ నేపథ్యానికి మాత్రమే సంబంధించినవి కాదు. కొన్ని నగరాల్లోనూ ఆమెరికాలోనూ కూడా కలతిరిగిన కథలు. నిజానికి నేను మా గ్రామం పసలపూడి వదిలి పట్నం వచ్చి 35 ఏళ్ళయ్యింది. అయినా నా పల్లెటూరు నా గోదావరి మీద మాతృప్రేమతో ఇన్ని రాశాను. 

సినిమా డైరెక్టర్నయినా నా ఆ సినిమా ఇన్‌ఫ్లుయన్స్ ఈ కథల మీద పడకుండా కాపాడుకుంటా వచ్చేనని వస్తున్నాననీ బలంగా నమ్ముతున్నాను. 
— వంశీ
[Image: IMG-20190718-085249.jpg]
ఇదుగో... దిగుమోపు లంకె ;)
ఆకుపచ్చని జ్ఞాపకం

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#8
please upload 
                    sri sri 
                    Gurram Jashuva
 Books
Like Reply
#9
[Image: IMG-20190723-195836.jpg]
కాలాతీత వ్యక్తులు

డా. పి. శ్రీదేవిగారు రచించిన తెలుగు నవల. ఈనాటి కాలంలో అనవసరమైన నియమాలను నిరసిస్తూ, పురుషాధిక్యతను ప్రతిఘటిస్తూ, తమపై అనేక రూపాల్లో జరుగుతున్న సామాజిక అత్యాచారాలపై పోరాడుతున స్త్రీశక్తి యొక్క ప్రారంభదశను 6వ దశాబ్దంలో రచయిత ఈ నవలలో ప్రదర్శించారు. ఇది తెలుగు స్వతంత్ర మాసపత్రికలో 7-9-1957 నుండి 25-1-1958 వరకు 21 వారాలు ధారావాహికగా వెలువడింది.

ఈ నవల ఆధారంగా తెలుగులో చదువుకున్న అమ్మాయిలు (1963) అనే సినిమాను నిర్మించారు.


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#10
[Image: IMG-20190724-174404.jpg]
మను ధర్మ శాస్త్రము

మనుస్మృతిలో ఏముంది...? 
మనుధర్మశాస్త్రం కృతయుగం లోనూ, గౌతమస్మృతి త్రేతాయుగంలోనూ, శంఖలిఖితుల రచన ద్వాపరయుగంలోనూ ప్రామాణికం కాగా (ఈ) కలియుగంలో పారాశరస్మృతికే ప్రాధాన్యముంది. యుగధర్మాలను పరిగణించినట్లయితే మనుధర్మశాస్త్రం ఈ యుగానికి సందర్బించదని పై మాటలు నిరూపిస్తు న్నాయి. అయినా బ్రిటిష్ వాళ్ళు కూడా పౌరస్మృతి శిక్షాస్మృతుల రచనలో మనుస్మృతిని ఒక ఆధార గ్రంథంగా పరిగణించారు. 
ఈ గ్రంథంలో పన్నెండు అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయం చివరా భృగు మహర్షి చెప్పిన మానవధర్మశాస్త్రమనే సంహితలో ఇన్నో అధ్యాయం సంపూర్ణమయిందని కనిపిస్తుంది. మనువు నేరుగా చెప్పింది కాదుగాని ఆయన బ్రహ్మదేవుడినుంచి మౌఖికంగా తెలుసుకొని మరీచి మొదలైన మహర్పులకు ఉపదేశించగా ఆ వివరాలను భృగువు చెప్పిన తీరున ఈ గ్రంథం రూపుకట్టింది.

మొదటి ఆరు అధ్యాయాల్లో కులాచారం వంటి వాటి ప్రస్తావన ఉండగా సప్తమాధ్యాయం పాలకుల విధులను, అష్టమం వ్యవహారపద్దతులను, నవమం ఆస్తిపంపకం సంగతులను, దశమం ఆపద్ధర్మాలను, ఏకాదశం ప్రాయశ్చిత్తాదులను, చివరిది శుభాశుభ కర్మలను, తత్వాన్ని వివరిస్తుంది.

ఇందులోని విధిని షేధాలు వర్తమాన సమాజాలకు ఎంతవరకు వర్తిస్తాయో గ్రంథం చదివి తర్కించటం మంచిది. ధర్మ సూక్ష్మ నిర్ణయానికి ఎటువంటి పరిషత్తు (జ్యూరీ) పనికివస్తుందో చివరి అధ్యాయంలో చర్చించింది.

ఇప్పటి సమాజానికి, మనం రాజ్యాంగరీత్యా శాసనరీత్యా అనుసరిస్తున్న పౌర శిక్షాస్మృతులకుగాని ఈ గ్రంథ విషయాలు ప్రత్యక్షంగా ఉపయోగం ఏ మేరకు ఉన్నదీ విజులే నిర్ణయించాలి.

స్మృతి అంటే...? 
వేదానికి 'శ్రుతి' అని పేరు. దీనికి అర్ధం 'వినబడినది' అని. మహర్పులకు వేద శబ్దం వినబడింది. దీనికి కర్తలెవరూ లేరు. అందుకే వేదం అపౌరుషేయమన్నారు.

ఆ వేదాన్ని వినిన మహరులు, అందులో తెలుపబడిన విషయాలను గుర్తు పెట్టుకుని లోకానికి అందించారు. అందువలన వాటికి స్మృతులని పేరు. వాటిలో మన జీవనవిధానం ఎలా ఉండాలో, ఏమేమి ఆచరించాలో, ఏవి పనికిరావో తదితర వివరాలన్నీ ఉన్నాయి. అందువలన వాటికి ధర్మశాస్త్రాలని పేరు. అటువంటి స్మృతులు చాలా ఉన్నాయి. మనుస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, గౌతమ ధర్మస్మృతి, పరాశరస్మృతి, మొదలైనవన్నీ ఉన్నాయి.

ఇక్కడ ఒక ప్రధాన విషయాన్ని గ్రహించాలి. మనం సనాతన, వైదిక ధర్మానికి చెందినవారం. ధర్మమన్నది గడచిన, గడుస్తున్న, గడువబోయే మూడు కాలాలకు వర్తిస్తుంది. అదే విధంగా అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది.. ఉదాహరణకు నిప్పుకు కాలడం ధర్మం. నిన్న, నేడు, రేపు నిప్పుకు కాలడమనే ధర్మమున్నది. అదెక్కడైనా కాలుతుంది. అలాంటిదే మనం అనుసరించే సనాతన ధర్మం. సనాతన మంటే పాతదన్న అర్థం కాదు. సనాతనమంటే, ఎంత పాతదో, అంత కొత్తదని అర్థం. అటువంటి ధర్మాన్ని దేశకాలాలకు అనుగుణంగా కొద్దిపాటి, మార్పులు చేర్పులతో ఎప్పటికప్పుడు సరిదిద్ది, సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నూతన స్మృతిని రూపొందిస్తుంటారు మహరులు. అందుకే అన్ని స్మృతులు వచ్చాయి. ఇవాళ సనాతన ధర్మాన్ని ఆచరించే మనలను కొందరు 'మనువాదులు' అని పిలుస్తున్నారు. కానీ, చిరకాలంగా మనం మనుస్మృతిని ప్రమాణంగా భావించాం! 'కలౌ పారాశర స్మృతిః', అనీ చెప్పారు. అందువల్ల ఈ కలియుగంలో అనుసరించవలసిన స్మృతి పరాశరస్మృతిగా గుర్తించారు.

ఇంకా చదవాలంటే, క్రింది డౌన్లోడ్ లింక్ ని క్లిక్ చెయ్యండి...
>>> మను ధర్మ శాస్త్రము — స్మృతులు <<<

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#11
సినబ్బ కతలు
(Sinabba Kathalu)
[Image: EsKyghe.jpg]
నామిని సుబ్రహ్మణ్యం నాయుడు
(Namini Su. yam Nayudu)

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#12
నా జీవన గమనం 
(Naa Jeevana Gamanam)
కలల సాకారం
[Image: IMG-20190727-211712.jpg]
ఎ.పి.జె. అబ్దుల్ కలాం
(A.P.J. Abdul Kalaam)
 
  అత్యంత గౌరవనీయుడు, మేధావీ, రాజకీయవేత్త అయిన అబ్దుల్ కలాం జీవితంలోని స్పూర్తిదాయకమైన ఉదంతాలు.
రామేశ్వరంలో గడిపిన బాల్యంతో మొదలు పెట్టి దేశాధ్యక్షుడిగా ఎదగడం వరకు అబ్దుల్ కలామ్ నడిచిన దారి అసాధారణమైనది. పట్టుదలా, కృతనిశ్చయం, ధైర్య సాహసాల రహదారి........ఈ పుస్తకంలో అయన తన గతంలోని కొన్ని ముఖ్యమైనవి, కొన్ని సాధారణమైనవి అయిన అనుభవోదాంతాలను, కొందరి వ్యక్తిత్వాలను స్మరించుకుంటూ, అవి తనకు ఎట్లా స్పుర్తినిచ్చాయో సుందర సులభమైన శైలిలో చెప్పారు. తాను పెరిగి పెద్దవాడువుతున్నప్పుడు తన వ్యక్తిత్వంపై ముద్ర వేసిన వ్యక్తులను వాత్సల్య గౌరవాలతో తలుచుకున్నారు. వారితో తనకు గల సాంగత్యంలో తాను నేర్చుకున్న విలువైన పాఠాలను నెమరువేసుకున్నారు. తనకు అత్యంత ప్రేమ పాత్రుడైన తన తండ్రిని, ఆయన దైవభక్తిని వివరంగా జ్ఞాపకం చేసుకున్నారు. ఒక దేశాధ్యక్షునిగా ఎదిగిన క్రమంలో ఎదుర్కొన్న సమస్యలను, సంఘర్షణలను, చేసిన త్యాగాలను ఒక్కసారి వెనుతిరిగి చూసుకున్నారు.
వెనుకటి తీపి జ్ఞాపకలతోను, మరెంతో నిజాయితితో చెప్పిన ఈ వ్యక్తిగత అనభవ పరంపర ఒక అసాధారణమైన వ్యక్తి జీవిత కథ. ఇందులోంచి నేర్చుకోవలసిన విలువైన పాఠాలతో సహా.........


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#13
(24-07-2019, 06:19 PM)Vikatakavi02 Wrote:
[Image: IMG-20190724-174404.jpg]
మను ధర్మ శాస్త్రము

మనుస్మృతిలో ఏముంది...? 
మనుధర్మశాస్త్రం కృతయుగం లోనూ, గౌతమస్మృతి త్రేతాయుగంలోనూ, శంఖలిఖితుల రచన ద్వాపరయుగంలోనూ ప్రామాణికం కాగా (ఈ) కలియుగంలో పారాశరస్మృతికే ప్రాధాన్యముంది. యుగధర్మాలను పరిగణించినట్లయితే మనుధర్మశాస్త్రం ఈ యుగానికి సందర్బించదని పై మాటలు నిరూపిస్తు న్నాయి. అయినా బ్రిటిష్ వాళ్ళు కూడా పౌరస్మృతి శిక్షాస్మృతుల రచనలో మనుస్మృతిని ఒక ఆధార గ్రంథంగా పరిగణించారు. 
ఈ గ్రంథంలో పన్నెండు అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయం చివరా భృగు మహర్షి చెప్పిన మానవధర్మశాస్త్రమనే సంహితలో ఇన్నో అధ్యాయం సంపూర్ణమయిందని కనిపిస్తుంది. మనువు నేరుగా చెప్పింది కాదుగాని ఆయన బ్రహ్మదేవుడినుంచి మౌఖికంగా తెలుసుకొని మరీచి మొదలైన మహర్పులకు ఉపదేశించగా ఆ వివరాలను భృగువు చెప్పిన తీరున ఈ గ్రంథం రూపుకట్టింది.

మొదటి ఆరు అధ్యాయాల్లో కులాచారం వంటి వాటి ప్రస్తావన ఉండగా సప్తమాధ్యాయం పాలకుల విధులను, అష్టమం వ్యవహారపద్దతులను, నవమం ఆస్తిపంపకం సంగతులను, దశమం ఆపద్ధర్మాలను, ఏకాదశం ప్రాయశ్చిత్తాదులను, చివరిది శుభాశుభ కర్మలను, తత్వాన్ని వివరిస్తుంది.

ఇందులోని విధిని షేధాలు వర్తమాన సమాజాలకు ఎంతవరకు వర్తిస్తాయో గ్రంథం చదివి తర్కించటం మంచిది. ధర్మ సూక్ష్మ నిర్ణయానికి ఎటువంటి పరిషత్తు (జ్యూరీ) పనికివస్తుందో చివరి అధ్యాయంలో చర్చించింది.

ఇప్పటి సమాజానికి, మనం రాజ్యాంగరీత్యా శాసనరీత్యా అనుసరిస్తున్న పౌర శిక్షాస్మృతులకుగాని ఈ గ్రంథ విషయాలు ప్రత్యక్షంగా ఉపయోగం ఏ మేరకు ఉన్నదీ విజులే నిర్ణయించాలి.

స్మృతి అంటే...? 
వేదానికి 'శ్రుతి' అని పేరు. దీనికి అర్ధం 'వినబడినది' అని. మహర్పులకు వేద శబ్దం వినబడింది. దీనికి కర్తలెవరూ లేరు. అందుకే వేదం అపౌరుషేయమన్నారు.

ఆ వేదాన్ని వినిన మహరులు, అందులో తెలుపబడిన విషయాలను గుర్తు పెట్టుకుని లోకానికి అందించారు. అందువలన వాటికి స్మృతులని పేరు. వాటిలో మన జీవనవిధానం ఎలా ఉండాలో, ఏమేమి ఆచరించాలో, ఏవి పనికిరావో తదితర వివరాలన్నీ ఉన్నాయి. అందువలన వాటికి ధర్మశాస్త్రాలని పేరు. అటువంటి స్మృతులు చాలా ఉన్నాయి. మనుస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, గౌతమ ధర్మస్మృతి, పరాశరస్మృతి, మొదలైనవన్నీ ఉన్నాయి.

ఇక్కడ ఒక ప్రధాన విషయాన్ని గ్రహించాలి. మనం సనాతన, వైదిక ధర్మానికి చెందినవారం. ధర్మమన్నది గడచిన, గడుస్తున్న, గడువబోయే మూడు కాలాలకు వర్తిస్తుంది. అదే విధంగా అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది.. ఉదాహరణకు నిప్పుకు కాలడం ధర్మం. నిన్న, నేడు, రేపు నిప్పుకు కాలడమనే ధర్మమున్నది. అదెక్కడైనా కాలుతుంది. అలాంటిదే మనం అనుసరించే సనాతన ధర్మం. సనాతన మంటే పాతదన్న అర్థం కాదు. సనాతనమంటే, ఎంత పాతదో, అంత కొత్తదని అర్థం. అటువంటి ధర్మాన్ని దేశకాలాలకు అనుగుణంగా కొద్దిపాటి, మార్పులు చేర్పులతో ఎప్పటికప్పుడు సరిదిద్ది, సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నూతన స్మృతిని రూపొందిస్తుంటారు మహరులు. అందుకే అన్ని స్మృతులు వచ్చాయి. ఇవాళ సనాతన ధర్మాన్ని ఆచరించే మనలను కొందరు 'మనువాదులు' అని పిలుస్తున్నారు. కానీ, చిరకాలంగా మనం మనుస్మృతిని ప్రమాణంగా భావించాం! 'కలౌ పారాశర స్మృతిః', అనీ చెప్పారు. అందువల్ల ఈ కలియుగంలో అనుసరించవలసిన స్మృతి పరాశరస్మృతిగా గుర్తించారు.

ఇంకా చదవాలంటే, క్రింది డౌన్లోడ్ లింక్ ని క్లిక్ చెయ్యండి...
>>> మను ధర్మ శాస్త్రము — స్మృతులు <<<

Thanks కవి గాారు
Like Reply
#14
ఇనుప కచ్చడాలు
(Inupa Kacchadaalu)
[Image: IMG-20190801-160600.jpg]
తాపీ ధర్మారావు
(Tapi Dharmarao)

నిజం చెప్పాలంటే, ఇనుపకచ్చడం అన్నది కల్పనా కాదూ. కాకరకాయా కాదు. కడిగివడపోసిన సత్యం. ఇనుపకచ్చడాలుండేవి. ఇప్పుడుగూడా అవి వుంటే వుండవచ్చును. మానవ స్వభావం మారకుండా వుంటే, ఈ కచ్చడాలకు కావలసినంత అవకాశం ఎప్పుడయినా వుండవలసిందే. ఈ ఇనుపకచ్చడాలు ఒక్క పురుషులకే కాదు, స్త్రీలకు కూడా వుండేవి.
    ఎవరికి ఎలాంటి కచ్చడాలుండేవో, ఎందుకుండేవో, ఎలా వుండేవో, ఇప్పుడు వాటి గుర్తులు ఏవయినా వున్నవో తెలుసుకోవాలీ అంటే, మానవ చరిత్రను మళ్ళీ ఒకసారి పరకాయించి చూడాలి. మొదటి పుటలు తిరగవెయ్యాలి.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#15
శతపత్రంబుల మిత్రుని
సుతుజంపినవాని బావసూనునిమామన్ 
సతతము దాల్చెడు నాతని
సుతువాహనవైరివైరిసున్నంబిదిగో

శతపత్రంబులు గలది తామర. దాని మిత్రుడు సూర్యుడు.అతని సుతుడు కర్ణుడు.అతన్ని చంపినవాడు అర్జునుడు.అతని బావ శ్రీకృష్ణుడు.అతనిసుతుడు ప్రద్యుమ్నుడు.అతనిమామ చంద్రుడు.అతన్ని తలమీద ఉంచుకొన్నవాడు శివుడు.అతని కొడుకు వినాయకుడు.అతని వాహనం ఎలుక.దాని శత్రువు పిల్లి.దాని విరోధి కుక్క సున్నం ఇదిగో తీసుకో అని భావం
దాదా ఖలందర్ 
Like Reply
#16
అంపశయ్య నవీన్ గారి బాంధవ్యాలు నవల ఉన్నదా? మీదగ్గర?
ఉంటే పంపగలరా?
దాదా ఖలందర్ 
Like Reply
#17
శప్తభూమి (Saptabhoomi)
[Image: IMG-20190806-135950.jpg]
బండి నారాయణస్వామి (Bandi Narayana Swamy)

శప్తభూమి రాయలసీమ చరిత్ర నేపథ్యంగా రాసిన నవల. రాయల కాల తదనంతరం సుమారు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన అధికార రాజకీయాలు. అప్పటి జీవితము చిత్రించిన చారిత్రాత్మక నవల. హండే రాజుల కాలంనాటి సంఘటనలు, కక్షలు, కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాల, పాలెగాళ్ల దౌర్జన్యాల సమాహారం శప్తభూమి.
ఈ నవలలోని చారిత్రక పాత్రలను సమీక్షించుకుంటున్నప్పుడు ఎక్కువమంది అణగారిన వర్గాల వారే అయి ఫున్నారన్న సంగతి తెలిసివచ్చింది. వారు దళిత బహుజన కులాలవారే ఈ విషయం గుర్తించిన తర్వాత రాయలసీమ చారిత్రక నవల కాస్తా, రాయలసీమ దళిత బహుజన చారిత్రక నవలగా రూపం తీసుకోవడం ప్రారంభించింది. ఈ విధంగా, చారిత్రక కథ నుండి చారిత్రక నవలకూ, చారిత్రక నవల నుండి దళిత బహుజన చారిత్రక నవలకూ ప్రయాణించిన ఆలోచన క్రమం కూడా ఈ నవలా రచన వెనుక పనిచేసింది.
- బండి నారాయణస్వామి


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#18
Please upload namini books
Like Reply
#19
మహా భారతము

మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) ప్రకారము మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 400 B.C లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది. మహాభారత మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ) లు తెలుగు లోకి అనువదించారు.

"యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్" - "ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టతను అంచనా వేయవచ్చును.

మహాభారతాన్నిచెరకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది.


మహాభారతంలోని పర్వాలు:

1. ఆది పర్వము: DOWNLOAD
2. సభా పర్వము: DOWNLOAD
3. వన పర్వము (లేక) అరణ్య పర్వము: DOWNLOAD
4. విరాట పర్వము: DOWNLOAD
5. ఉద్యోగ పర్వము: DOWNLOAD
6. భీష్మ పర్వము: DOWNLOAD
7. ద్రోణ పర్వము: DOWNLOAD
8. కర్ణ పర్వము: DOWNLOAD
9. శల్య పర్వము: DOWNLOAD
10. సౌప్తిక పర్వము: DOWNLOAD
11. స్త్రీ పర్వము: DOWNLOAD
12. శాంతి పర్వము: DOWNLOAD
13. అనుశాసనిక పర్వము: DOWNLOAD
14. అశ్వమేధ పర్వము: DOWNLOAD
15. ఆశ్రమవాస పర్వము: DOWNLOAD
16. మౌసల పర్వము: DOWNLOAD
17. మహాప్రస్ధానిక పర్వము: DOWNLOAD
18. స్వర్గారోహణ పర్వము: DOWNLOAD
ఉపసంహారము: DOWNLOAD

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#20
తెలుగు విజ్ఞాన సర్వస్వం 6 విశ్వసాహితి (1961)

https://www.mediafire.com/download/ajh1r0kijzzpf3u
దాదా ఖలందర్ 
Like Reply




Users browsing this thread: