03-01-2019, 07:59 PM
‘సర్’ పార్థివదేహం మోస్తూ కన్నీరు కార్చిన సచిన్
ముంబయి: ప్రముఖ క్రికెట్ కోచ్, ద్రోణాచార్య పురస్కార గ్రహీత రమాకాంత్ ఆచ్రేకర్ (87) అంత్యక్రియలు ముగిశాయి. వృద్ధాప్య సమస్యలతో బుధవారం సాయంత్రం ముంబయిలోని తన స్వగృహంలో ఆయన కన్ను మూశారు. ప్రపంచానికి సచిన్ తెందుల్కర్ లాంటి దిగ్గజాన్ని అందించిన గురువుగా ఆయన అందరికీ సుపరిచితం.
తన ఆటను, జీవితాన్ని తీర్చిదిద్దిన ‘ఆచ్రేకర్ సర్’ ఇకలేరని తెలుసుకున్న సచిన్ తెందుల్కర్ కన్నీటి పర్యంతం అయ్యారు. క్రికెట్ ఓనమాలు దిద్దించిన తన గురువు పార్థివ దేహాన్ని ఆయన స్మశానవాటిక వరకు భుజంపై మోశారు. అశ్రు నయనాలతో అంజలి ఘటించారు.
ప్రజల సందర్శనార్థం ఆచ్రేకర్ మృతదేహాన్ని శివాజీ పార్క్లో ఉంచారు. అక్కడే ఆయన ఎంతో మంది కుర్రాళ్లకు క్రికెట్ పాఠాలు నేర్పించారు. ఆ తర్వాత సమీపంలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మైదానం నుంచి ఆయన పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నప్పుడు సాధన చేస్తున్న కుర్రాళ్లు అభివాదం చేసి ‘అమర్ రహే’ అని నినాదాలు చేశారు. సచిన్, వినోద్ కాంబ్లి, బల్విందర్ సింగ్ సంధు, చంద్రకాంత్ పండిత్, ముంబయి క్రికెటర్లు అతుల్ రనడే, అమోల్ మజుందర్, రమేశ్ పొవార్, పరాస్ మహంబ్రే, రంజీ కోచ్ వినాయక్ సమంత్, నీలేశ్ కుల్కర్ణి, వినోద్ రాఘవన్ అంత్య క్రియల్లో పాల్గొన్నారు.
రాజస్థాన్ మాజీ కోచ్ ప్రదీప్ సుందరం, ముంబయి క్రికెట్ సంఘం అధికారులు, బీసీసీఐ మాజీ ఆఫీస్ బేరర్ ప్రొఫెసర్ రత్నాకర్ శెట్టి, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే, భాజపా ఎమ్మెల్యే ఆశీశ్ షెలర్, మేయర్ విశ్వనాథ్ మహదేశ్వర్ తదితరులు ఆచ్రేకర్కు నివాళి అర్పించారు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK