Poll: అమలిన శృంగార కథలు
You do not have permission to vote in this poll.
కావాలి
100.00%
1 100.00%
వద్దు
0%
0 0%
Total 1 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అమలిన శృంగార కథలు - దయ్యం వలచిన రాత్రి(శృంగార కథ)
#41
అందమైన తల్లి- బి.రాజ్యలక్ష్మి
[Image: jrj3b7]
సంధ్యాసమయం, చల్లనిగాలి ,పచ్చని చెట్లు ,నీలిమేఘాలపయనం ,అరుణరగాసూర్యాస్తమయం !అందమైన చంద్రోదయం !మనోహర దృశ్యం .కళ్లల్లో నిలిచిపోతున్న కమనీయకావ్యగీతిక . ప్రశాంత ఆహ్లాదవాతావరణం ,రాధిక పెరట్లో వాలుకుర్చీలో కూర్చుని ప్రకృతిలో లీనమై అరమోడ్పుకళ్ళతో నిలీగగనపు సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నది .ఎందుకో పెదాలపై నవ్వు !భావాలను పంచుకోవడానికి యెవరూ లేరు .కవితలల్లడానికి తనకు అంతపద సంపద లేదు .చిన్నచిన్న చినుకులు నీకు మేం తోడు వున్నాం గా అన్నట్టు వానజల్లు మొదలయ్యింది .చినుకులలో తడుస్తూ పాట పాడుకోవడం రాధిక కు చలాయిష్టం .ఆహ్లాదసమయం లో ,ఆహ్లాదం పంచుకోవాల్సిన సమయం లో రాధిక మనసులో యేదో వెలితి !తనకే తెలియని తనకు తానే వేసుకునే ప్రశ్నలు .

మురళి తన భర్త ,తన సహచరుడు ,తనంటే అమితప్రేమ .యెంతో అన్యోన్యత .అందమైనవాడు .హోదా ,చదువు ,అందమైన ఇల్లు ,అందమైన తోట అన్నీ లేదా అన్నీ భార్య కోరుకున్నవన్నీ లభించాయి .మురళి కాలేజి లో భౌతికశాస్త్రం చెప్తాడు .వస్తుతః భావుకుడు కాదు .అతని ప్రపంచం పుస్తకాలూ పరిశీలన ,జిజ్ఞాస !రరాధిక మురళి దగ్గర కోరుకుంటున్నది ఏమిటి !

రాధికకు కిందటి రోజు సంఘటన గుర్తుకొచ్చింది .మురళి చదువుకుంటున్నాడు ,అతనినే చూస్తూ ఇంత అందమైన వ్యక్తి తన భర్త . ఉంగరాల జుట్టు ,కోటేరులాంటి ముక్కు !చక్కటి కనుబొమ్మలు .ఆజానుబాహువు !కాఫీ కప్పు తో నించున్న భార్య ను చూస్తూ "చీర చాలా బాగుంది రాధీ "నవ్వుతు అన్నాడు మురళి .

రాధిక చీర చిలకాకుపచ్చ జరీచీర !నెమళ్లు అంచు ,రాధికకు చీర నప్పిందికూడా !కానీ కానీ చీర మాత్రమే నచ్చిందా మురళికి ?తను అందం గా లేదా !తనలో తాను నవ్వుకుంది .పైకిమాత్రం మురళిని చూసినవ్వింది . వానతుంపరలో ప్రకృతి సోయగాలను చూస్తూ రాధిక మనసు గతంలోకి తొంగిచూసింది .

"రాధీ యీ చీరలో యెంత బాగున్నావో ,ముద్దొస్తున్నావు .బాపుబొమ్మలా వున్నావు "తన స్నేహితురాళ్లు పొగుడుతుంటే రాధికకు సంతోషం

రాధిక చక్కటి అందం చుపారులను వెంటనే ఆకట్టుకుంటుంది . పచ్చటి పసిమి ,గుండ్రటి కళ్ళుమిలమిలా మెరుస్తూ నావ్వ్వుతూ వుంటాయి .విశాలమైన ఫాలభాగం యే బొట్టుచుక్క పెట్టినా ముద్దుగా వుంటుంది .సహజం గా ఆడపిల్ల యెప్పుడూ అందాన్ని గుర్తిస్తే ఆనందిస్తుంది .రాధిక ప్రక్రుతి నీలిమేఘాలపయనం కోకిలమ్మ గానం పరవశించిపోతుంది .

భవిష్యత్తువైవాహిక జీవితం తన భర్త తన అందాన్ని యెంత పొగుడుతాడో తలుచుకుని తలుచుకునీ మురిసిపోయేది రాధిక అద్దం లో చూసుకుంటూ తిలకం దిద్దుకున్నా కాటుక కళ్లు దిద్దుకుంటున్నా ముంగురులు సవరించుకుంటున్నా తన భర్త తనల్ని యెంత పొగుడుతాడో తల్చుకుంటూ సిగ్గూ సంతోషం నవ్వూ అన్నింటినీ వూహించుకుని బంగారు కలలు కన్నది .తనూ తన భర్తా షికారుకెళ్తున్నట్టుగా -------------------

"రాధి యెంత అందం గా వున్నావు ?"

"ఏదీ నవ్వు ముత్యాలు రాల్చవా "

"వయ్యారి నడక లో యెన్ని హొయలొ "

ఇలా వూహించుకుని రాధిక పరవశించి యెన్నో తీయని వూహలు !మధురభావనలు !!! రాధిక పెళ్లయ్యింది . అందమైన మురళి భర్త .సోయగాల కళ్లతో అతనిని చూసే తరుణం వచ్చిందని మురిసింది కానీ ------కానీ పెళ్లయ్యింది --తరుణం వచ్చింది ----వెళ్లిపోయింది . కలలు కలలుగానే మిగిలాయి .

తను ఆశించినట్టుగా ఒక్కరోజూ అందాన్ని పొగిడేవాడు కాదు . మంచి భర్త . ఆప్యాయం గా ప్రేమగా చూసుకుంటాడు మొదట్లో రాధిక గమనించలేదు ,తర్వాత గమనించిన రాధిక పట్టించుకోలేదు . కొద్దిగా చనువు పెరిగాక "ఏమండీ కొప్పు యిలా బాగుందా "ఒకరోజు అడిగింది .

"ఆఁ --బానేవుంది "అని మురళి రాధికను చూసి సీరియస్ గా చదువులో తలదూర్చాడు .

రాధిక యే ప్రశ్న వేసినా ముక్తసరిగా "బాగుంది"అనే సమాధానమే !! రాధికకు నిర్లిప్తత అలవాటయ్యింది .

--------------

చీకటి పడుతున్నది . వానజల్లు యెక్కువయ్యింది .మురళి యింకా రాలేదన్న కంగారు మొదలయ్యింది . లోపలికి వచ్చి తలుపుమూసింది . నిరాశగా,కరిగిపోతున్న కాలం ఆశాకిరణం ఒకటి మురిపించి మెరిపించింది . రాధిక జీవితపయనం లో మధురచలనం వచ్చింది . ,మాతృభావన !!!అందమైన భావన !!మరో జీవికి తను తల్లి !! రాధికకు మధుర అనుభూతి !! "రాధీ

మృదువైన పిలుపుకి మత్తుగా పడుకున్న రాధిక కళ్లు తెరిచింది .

"బాబు నీలా యెంతో అందం గా వున్నాడు "అన్నాడు మురళి .ఏమిటీ .... అతడంటున్నది --- తను వింటున్నది వింత గా మెరుస్తున్న కళ్ళతో భర్తను చూసింది .

"అవును రాధీ విశాలమైన కళ్లు ,కోటేరులాంటి ముక్కు ,సన్నని పెదాలు ,నీ అందాన్నంతా పోగుపోసుకున్నాడు " యెంతో తమకం గా బాబును మద్దాడుతున్నాడు మురళి .

తను కన్న కలలు కల్లలు కాదు ,తన మురళి సౌందర్యారాధకుడే !!తనుకోరుకున్న మాట తన భర్త నోట్లోనించి వచ్చింది . తనచిన్నకోరిక యీ రోజు తీరింది . నీరసం గా వున్న రాధిక కళ్లల్లో తృప్తి . అందమైన తల్లినయ్యాను హాయిగా నవ్వుకుంది రాధిక .



 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
గృహిణి - చంద్ర శేఖర్ కోవూరు
[Image: Picture2.png]


ఏమండి ఈ ఒక్క రోజు సెలవు పెట్టండి. ఎందుకు? ఈరోజు ఏమిటో మీకు గుర్తులేదా లేదు ఏమి? ఏమైనా పండగ? మన పెళ్లి రోజు అండి. ఓహో అలాగా అయిన నాకు లీవ్ లేదు. పోనీ సాయంత్రం త్వరగా వస్తారా చూస్తా అని వెళ్ళిపోయాడు అజయ్... సాయంత్రం 6 అయింది భర్త రాలేదు. 7 అయింది అయిన రాలేదు. ఫోన్ చేసింది రింగ్ అవుతుంది కానీ భర్త తీయలేదు. ఈలోపు మరో ఫోన్ మ్రోగింది. భర్త ఏమో అని ఆశగా చూసింది కాదు వాళ్ళ మమ్మీ. అమ్మ సంధ్య ఎలా ఉన్నావమ్మా. బాగానే ఉన్నానమ్మా. పెళ్లి రోజు శుభాకాంక్షలు తల్లి . Thank you అమ్మ . అల్లుడు నువ్వు ఎక్కడున్నారు బయటకెళ్లారా. అల్లుడికి ఫోన్ ఇవ్వమ్మా మీ నాన్నా మాటాడతారంట. అయన ఇంకా రాలేదమ్మా ఆఫీస్ నుండి. అదేమిటి అల్లుడుగారు సెలవు పెట్ట లేదా .నువ్వు చెప్పలేదా. చెప్పానమ్మా అయిన లివ్ లేదని వెళ్లిపోయారు. కనీసం త్వరగా కూడా రాలేదు ఎంత చెప్పినా". అంతేనమ్మా ఈమగాల్లాంతా ఇంతే అంటుూ ఫోన్ పెట్టేసింది. ట్రింగ్ ట్రింగ్ అజయ్ ఫోన్ మోగుతుంది. హలో బాబు నేను మీ మావయ్యని బాగున్నావా. హా మావయ్య గారు బాగున్నాను. హ్యాపీ anniversary బాబు. Thank you మావయ్యా గారు. ఏమిటి నాయన పెళ్లి రోజు సెలవు పెట్టి అమ్మాయితో ఎక్కడికైనా వెళ్లొచ్చు కదా. మావయ్యగారు నేను బిజీగా ఉన్నాను మల్లి ఫోన్ చేస్తా. అని పెట్టెసాడు. ఏమే శ్యామల అల్లుడు గారు బిజీ అని ఫోన్ పెట్టేసాడు. హా ఎందుకు పెట్టడు మా అల్లుడు మా అల్లుడు అని నెత్తిన పెట్టుకున్నారుగా అసలు నేను ఆనాడే చెప్పాను. ప్రైవేట్ జాబ్ అల్లుడు వద్దండి సెలవులు ఉండవు జీతం తక్కువ అది ఇది అని. హాయిగా ఎ గవర్నమెంట్ టీచర్ కో, లెక్చరర్ కో ఇచ్చి ఉంటే బాగుండేది కదా బోలెడన్ని సెలవలు ఎప్పుడు కావాలంటే అప్పుడు లివ్ లు ఉంటాయి. నా మాట విన్నారా మంచి సంబంధం మీ చెల్లెలి కొడుకు అని నానోరుమూయించి పెళ్లి చేసారు. ఇప్పుడు చూడండి. అబ్బబ్బాయిప్పుడు ఏమైయింది కారాలు మిరియాలు నూరుతున్నావు. వాళ్లిద్దరు బానే ఉన్నారు. హ అని మీరు నేను అనుకోవడం కాదు అమ్మాయి చేస్పాలి. మళ్ళీ అమ్మాయి ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మోగుతుంది. అమ్మ చెప్పమ్మ. ఎమ్మా వచ్చాడా అల్లుడు. లేదమ్మా ఫోన్ కూడా ఎత్తలేదు. అదేమిటి టైం 9.30 అవుతుంది ఇంకా రాకపోవటమేంటి. ఏమో అమ్మ ఈయన ఎప్పుడు ఇంతే. అది సరేగాని అబ్బాయి నిను బాగా చూసుకుంటున్నారంటే. హా బానే చూసుకుంటాడు అమ్మ . కాకపోతే ఎక్య వ టైం ఆఫీస్ ఆఫీస్ పని పని అని నాతో ఎక్కువ సేపు ఉండరు. పెళ్లి రోజుకి చీర ఏమన్నా కొనిచ్చాడా. లేదమ్మా అసలు ఆయనకి గురుతులేదు అంటా. ఏమిటో ఒక్కగానొక్క కూతురువి మహారాణిలా చూసుకున్నాం మేము ఏది కావాలంటే అది కొనిచ్చేవాళ్ళం. ఇపుడేమో యిలా బాధపడుతున్నావు. అవన్నీ ఎందుకులేమ్మా నేను బానే ఉన్నాను. టింగ్ టింగ్ calling బెల్ మోగుతుంది. సరే ఉంటానమ్మా ఆయనొచ్చినట్లున్నారు. చెంగు చెంగున వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. తీరా చుస్తే హౌస్ ఓనర్ ఆంటీ. సారీ అమ్మ పొద్దున్నుండి లేము బయటకు వెళ్లి వచ్చాము హ్యాపీ మ్యారేజ్ డే. Thank యు ఆంటీ. అబ్బాయి ఉన్నాడా అమ్మా. ఇంకా రాలేదు ఆంటీ. వచ్చాక తనకి కూడా చెప్పమ్మా. సరే ఆంటీ. వోచి సోఫాలో కూర్చుని లీలగా కళ్ళు మూసింది. ఏవో జ్ఞాపకాలు ఆలా ఆలా నుదుటి మీద జుట్టు జాలువారినట్లు వస్తున్నాయి. చిన్నప్పుడు తాను ఆడుకున్న రోజులు, స్నేహితులతో పిక్ నిక్ కి వెళ్లినరోజులు, అమ్మచేతి గోరుముద్దలు తిన్న రోజులు, పెద్దమనిషి అయిన రోజులు, వోనీ వేసి సిగ్గుపడిన రోజులు, కాలేజీలో పాట పాడిన రోజులు, తనని ప్రేమించమని కుర్రాళ్ళు వెంటబడ్డ రోజులు, 20 ఏళ్లు వచ్చినా అమ్మ వడిలో పడుకున్నరోజులు, తన బర్త్ డే కి నాన్నా స్కూటి కొనిచ్చిన రోజులు, అన్ని ఒక్కసారి వోచి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నిద్రమత్తులో పడబోయి ఉలిక్కిపడిలేచింది. ఎదురుగ చుస్తే తన భర్త అజయ్ కూర్చుని ఆమెనే చూస్తున్నాడు ఏమండి మీరెప్పుడు వోచారు అంటూ భర్త ని హగ్ చేసుకుంది. ఏమైంది సంధ్య డోర్ వేయకుండా పరధ్యానం గా ఉన్నావు. ఏమైంది. ఆబ్బె ఏమి లేదు అంది మీకోసమే ఎదురుచూస్తున్నాను. సారీ సంధ్య లేట్ అయింది అంటూ టైం చుస్తే 11 అయింది. ఆఫీస్ లో ఓవర్ టైం చేసాను. అందుకే లేట్ అయింది. అయ్యో సారీ ఎందుకండీ మీగురించి నాకు తెలియదా అని. అదేమిటి నామీద కోపం గా లేదా అన్నాడు. కోపమెందుకు అండి. ఇప్పటికైనా వోచారు కదా. అన్నం తిన్నావా. లేదండి మీరు వస్తే తిందామని అన్ని సిద్ధం చేసాను. సరే నీకు రెండు శుభవార్త లు చెప్తాను. అవునా ఏమిటి అవి చెప్పండి. రేపటినుండి 6 అయేసరికి నీ ముందు ఉంటాను. వావ్ నిజామా ఎంత మంచి మాట చెప్పారు మరి రెండోది ఏంటి. తన జేబులో నుండి ఒక ప్యాకెట్ తీసి ఇచ్చాడు. ఏంటిది. ఓపెన్ చేసి చూడు. ఓపెన్ చేస్తే తనకి ఎంతో ఇష్టమైన నెక్లెస్. తాను ఆశ్చర్యపోయింది ఏమండి ఇది నేను నేను అంటుంటే. అవును సంధ్య సరిగా వన్ ఇయర్ క్రితం నువ్వు కోరిన నెక్లస్. అప్పుడు నాకు స్తోమత లేక కొనివ్వలేకపోయాను. దానికోసమే ఇన్ని రోజులు ఓవర్ టైం చేసాను డబ్బులు దాచాను. ఈరోజు దాని కొనగలిగాను అంటూ గర్వంగా చెప్పాడు. తన భార్య కళ్ళలో ఆనందం ప్రేమ ఆశ్చర్యం బాధ అన్ని ఒక్కసారిగా వచ్చాయి. తన భర్తను హాగ్ చేసుకుని గట్టిగ ఏడ్చేసింది. ఏమైంది సంధ్య అని అడిగాడు. నాకోసం మీరు ఇంత కష్టపడ్డారంటే నేనంటే మీకెంత ప్రేమండి. నేనే మిమ్మల్ని సరిగా అర్థ చేసుకోలేక అపుడప్పుడు బాధపడ్డాను నన్ను క్షమించండి. నో సంధ్య నేనే టైం స్పెండ్ చేయలేకపోయాను సారీ. నాకు ప్రమోషన్ కూడా వొచింది సంధ్య నా జీతం డబల్ అయింది ఇకనుండి మనకు అనీ మంచి రోజులే అనగానే . భార్య ఇంకా ఆనందపడింది.. ఇద్దరు కలిసి భోజనం చేసి హాయిగా నైట్ షికారు వెళ్లి ఆలా ఆలా చల్లగాలికి తిరిగి వోచి హ్యాపీ గ పడుకున్నారు. కదా గోతెలుగుకి మనం ఇంటికి... ??☘?☘?☘?☘??
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#43
ఉప్పు-ఉసిరికాయ - గొర్తి.వాణిశ్రీనివాస

[Image: Picture5.png]

ఏవండీ!మంచి నీళ్లు కావాలా?" అంటూ చాపా,పక్కబట్టల్ని చుట్టగా చుట్టుకుని నీళ్ల గ్లాసు పట్టుకుని రాత్రి పన్నెండు గంటల వేళ మేడ మీదకి వచ్చింది రుక్మిణి. పిట్టగోడ మీద చేతులు ఆనించి మింటి చంద్రుడి వంక చూస్తూ ఏదో ఆలోచనల్లో ఉన్న రామం భార్య పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. "దాహమేసినప్పుడు తాగుతా అక్కడ పెట్టు. కింద అందరూ పడుకున్నారా? వాళ్ళకి కావలసిన దుప్పట్లు అవీ ఇచ్చే వచ్చావుగా?" అన్నాడు రామం చదునుగా ఉన్న డాబామీద చాప పరుస్తూ. "ఆ..అంతా సర్దుమణిగినట్టే..హాయిగా నిద్ర పోతున్నారు.చూసే వస్తున్నాను.ఈ ప్రశాంతత మీ చలవేనండీ , పొద్దున ఇల్లంతా రణరంగంలా ఉంది. ఇంతకీ తప్పు మీ బావగారిదా, మీ చెల్లిదా?" అంది రుక్మిణి చాప మీద దుప్పటి పరచి పడుకున్న భర్త రామం పక్కనే కూర్చుంటూ. "మనలాంటి మధ్య తరగతి కుటుంబాల్లో అంతా బ్రహ్మ ప్రళయమే. ప్రతిదీ ఒక వివాదమే ,సమస్యే. కొత్తగా పెళ్ళైన చెల్లీ,బావా ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం చేలాయించాలనే ధోరణే ఈ గొడవకు అసలు కారణం."అన్నాడు రామం. "అవును.వాళ్ళు గొడవ పడింది చాలక వాళ్ళ అమ్మా నాన్నలను పిలిపించి మీ అమ్మా నాన్నలను, మనల్ని కూడా ఎంత ఖంగారు పెట్టేసారో. విడిపోతారేమో అనిపించేంతగా కీచులాడుకున్నారు. మీరు కలగజేసుకుని సమస్యను ఇట్టే తేల్చేశారు. అయినా మీకు ఎలా వచ్చిందండీ ఆ ఆలోచన."అంది రుక్మిణి "ఉప్పు ద్రావణంలో నానబెట్టిన ఉసిరికాయల్ని సీసాతో తీసుకొచ్చి వాళ్ళ చేతికిచ్చేసరికి ఇద్దరూ అయోమయంగా నా వంక చూసారు. ఎక్కడో పుట్టి పెరిగిన ఇద్దరు మనుషుల్ని ఆలుమగలుగా కలిపి ఉంచే వివాహ బంధం గొప్పతనాన్ని వినూత్న రీతిలో తెలియచెప్పారు. సముద్రపు ఉప్పునూ,అడవిలో ఉసిరికాయనూ ఒక్క చోటకు చేర్చిన విధికి విలువిచ్చి కలిసిన బంధాన్ని గౌరవించి తల వంచాలని, ఉసిరికాయ ఎక్కడ పుట్టినా ఉప్పుతో కలిశాక దాని నాణ్యత,విలువ మరింత పెరుగుతాయి తప్ప తగ్గవనీ, ఉప్పుకల్లు కరిగి పోతేనే మరొక పదార్ధంతో మిశ్రమం చెంది మనగలదని సులభంగా ,విపులంగా చెప్పేసరికి ఇద్దరూ మారు మాట్లాడకుండా వాళ్ళ గదిలోకి వెళ్లిపోయారు. అమ్మా నాన్నా కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు."అన్నాడు రామం "కానీ నాదో చిరు సందేహం"అంది రుక్మిణి భర్త మొహంలోకి చిలిపిగా తొంగి చూస్తూ. "రాణి గారి సందేహ నివృత్తే మా తక్షణ కర్తవ్యం, చిత్తం దేవీ.అడగండి"అన్నాడు రామం భార్య నగుమోమును చూస్తూ . "మా ఇద్దరిలో ఎవరు ఉప్పు,ఎవరు ఉసిరికాయ అంటూ మీ చెల్లీ బావా మళ్లీ తగవు పడితే అప్పుడు ఏంచేసేవారు"?అంది రుక్మిణి.వస్తున్న నవ్వును పెదవి అంచునే అదిమి పడుతూ. "ఏముందీ.ఉడుకుమోతులెవరైతే వాళ్ళు ఉప్పు కల్లు, ఉదాసీనంగా ఉండేవాళ్ళు ఉసిరికాయ అంటాను. ఉడుకుమోతులం నేను కాదంటే నేను కాదంటారు ఇద్దరూ. అయితే ఇద్దరూ ఉసిరికాయ అన్నట్టేగా. ఒకే జాతికి చెందిన వాళ్ళ మధ్య వైరం దేనికట. "అమ్మో చాలా గడుసు వారే." అంది రుక్మిణి "సముద్రంలో పుట్టిన ఉప్పుకి ఆ సముద్ర లక్షణాలే ఉంటాయి. సహన శీలి చెట్టు అందించే ఫలాలకు ఆ లక్షణాలే వున్నా రెండూ కలిసినప్పుడు సర్దుకుపోవటానికి కొంత సమయం పడుతుంది. ఆ మధ్యలో కొద్దిపాటి సంఘర్షణ తప్పదు. సయోధ్య కుదిరాక సత్ఫలితాలు కూడా అంతే మధురంగా ఉంటాయి.అది తెలుసుకున్న జంట మధ్యన గొడవలు రావు"అన్నాడు రామం భార్య ముంగురులను సవరిస్తూ. "అవునండీ!వేర్వేరు చోట్ల పుట్టి పెరిగిన ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను మరొకరు అర్ధం చేసుకుంటే చాలు. పదేళ్ల మన దాంపత్య జీవితంలా, తొందర్లు లేని హాయి రాగంలా బతుకు నావ ప్రశాంతంగా సాగిపోతుంది కదూ" తననే చూస్తున్న భర్త రామం కళ్ళలో పైన విశాల ఆకాశంలోని చంద్రుని కాంతి ప్రతిఫలిస్తుంటే మురిపెంగా చూస్తూ గుసగుసగా అంది రుక్మిణి. భార్య వంక తృప్తిగా చూస్తూ ఉండి పోయాడు రామం.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#44
గతమెంతో...వైభవమే! - రాము కోలా దెందుకూరు.
[Image: Picture1.png]
అదో అద్భుతమైన మానవ నిర్మిత ప్రపంచం! రంగుల లోకం! రాత్రికి రాత్రి కోటీశ్వరులను రోడ్డు పైకి లాగగలదు. అతి సామాన్యుని అహో!అనుకునే స్థాయికి చేర్చనూ గలదు. హారతులు పంటించేది అదే. జీవితాలను చేజార్చుకునేలా చేసేది కూడా అదే. అదో రంగుల మాయాలోకం. వింతైన ఊహల సౌధం.. ఇప్పటికి అప్పటికి ఎంతో తేడా! అది 1978 ఉదయం పదిన్నర. శుక్రవారం. అందరం ఎదురు చూస్తున్నది .

గోడపై మారే బొమ్మ కోసమే... ప్రతి శుక్రవారం మారుస్తారని తెలుసు . అందుకే మా కోతి మూక అంతా అక్కడే చేరిపోయింది. "వస్తుందంటావా!" గుంపులో ఎవ్వడో అనుమానంగా అనేసాడు అందరం వాడి వైపు అదోలా చూసాం. మా చూపులకే శక్తి ఉంటే! పాపం వాడి సంగతి దేవుడికే తెలియాలి.

దూరంగా! మైక్ సౌండ్. "రండి బాబూ రండి! నేడే చూడండి! మీ అభిమాన టూరింగ్ టాకీస్ "రంగమహల్" వెండి తెరపై, తెలుగు చలన చిత్ర చరిత్రలోనే ఇంతవరకు కనీ వినీ ఎరుగని , పైట్లతో, ఒళ్ళు జలదరించే విన్యాసాలతో! వినసోంపైన పాటలతో! కన్నులు జిగేల్ మనిపించే లైటింగ్ లతో మీ ముందుకు వస్తున్న చిత్రం "కాలయముడు" మీ అభిమాన హీరో, ఆరడుగుల అందగాడు.. కోన సీమ కుర్రవాడు శోభన్ బాబు. అతిలోక సుందరి!చిరు ధరహాసిని పదహారణాల తెలుగు కుందనాల బొమ్మ! శ్రీదేవి.. కలసి నటించిన ఈస్ట్ మన్ కలర్ తెలుగు చిత్రం.. .

కాలయముడు". భారీఫైట్లు... మునుపెన్నడూ చూడని కుటుంబ కథా చిత్రం... . మీ అభిమాన అందాల తార శ్రీదేవి నటించిన సకుటుంబ సమేతంగా చూడ దగిన సినిమా కాలయముడు" చూపులకు చిన్నది! పాలకోవా సోగసులది! నవరసాలు పండించడంలో నటమయూరి శ్రీదేవి. ఆరడుగుల ఆజానుబాహుడు. కుర్రకారు హృదయాలను గెలుచుకున్న నీవే మన్మధుడు. శోభన్ బాబు జతగా కలిసి నటించిన,విజయా వారి కలర్ చిత్రం కారయముడు ‌ రండి బాబూ రండి.. !

కడుపుబ్బా నవ్వించే మీ హాస్య నటులు.. రేలంగి, రమా ప్రభ కలసి నటించిన ఉత్తమ హాస్య చిత్రం. రేపటి నుండి నాలుగు ఆటలతో మీ అభిమాన టూరింగ్ టాకీసు "రంగమహల్ "లో.. భారీ తారాగణం నటించిన చిత్రం.. మరియూ మీ అభిమాన నర్తకి జయమాలిని ఆటా పాటలతో మత్తెకించే చిత్రం... ! రేపటి నుండి. నాలుగు ఆటలు ప్రదర్శించబడును తప్పక చూడండి. అంటూ మైక్ తో చెప్పుకుంటూ వస్తున్న రిక్షా కనిపించడంతో పరుగెత్తుకుంటూ ఎదురుగా వెళ్ళి. రిక్షా తో పాటు మా రాగిచెట్టు వరకు పరుగెత్తుకుంటూ ,రిక్షాలో అతను అందించే కాయతాలకోసం పరుగులే ఊరులోకి రిక్షా వచ్చిందంటే మాలాంటి బడిలో చదువు కునే పిల్లలకు పండగే... రిక్షా అగి సినిమా పోస్టర్ తీసుకుని, కాస్త మైదా గొడకు రాసి అంటించే వరకు, కళ్ళు పెద్దవి చేసుకుని ఆత్రంగా చూసేవాళం.

సినిమా పోస్టర్ లో ఏవరు కనిపిస్తారో, ఎలా కనిపిస్తారో చూడాలని ఒకటే ఆశ! అంతటితో ఆగుతామా! సినిమాకు సంబందించిన కరపత్రాలు అందుకునే వరకు రిక్షా వెంట పరుగులే. అందకపోతే బతిమాలి మరీ అడిగి తీసుకుని ఇంట్లో తలుపుకు గంజితో అంటించి తెగ సంబరపడిపోయేవాళ్ళం. పోస్టర్ పైన హీరోలా.. చేతిలో బొమ్మ తుపాకితో డిషుయ్.. డిషుమ్ అంటూ, ఇంట్లో తలుపులు వేసుకుని ఒకటే పైట్లు చేసెవాళ్ళం. సినిమాను రంగమహాల్ టాకీసు లో చూడాలని ఒకటే ఆశ. మా అయ్యను ఎన్నోసార్లు అడిగినా, !

"అయ్యా! పట్నం బోయి ఒకసారి సినిమా చూద్దామే అని. అయ్య ముసిముసిగా నవ్వుతుంటే చిర్రేత్తుకొచ్చేది నాకు. సినిమా కోసం వరి కోసిన పొలంలో మిగిలిన కంకులు ఏరి నూర్చి, షావుకారి అంగట్లో అమ్మి.. పదిపైసలు. పావలా ఒక్కొకటిగా ఇంటి యెనెక కాకర పాదు మొదట్లో దాచేవాన్ని.. రోజులు గడుస్తుంటే సినిమా చూడాలని ఒకటే కోరిక పెరిగిపోతుండే, చూడు చూడూ మని కాలేజీకు దసరా సెలవులు ఇచ్చిండ్రి. ఇక చూడు!

రోజూ అయ్యను సతాయించుడే.. నా పని. అయ్య! నా గోల తట్టుకోలేక "సరే "అనేసిండు. ఇక చూడండ్రి, నా సంతోషం. నా సహహస గాండ్లకు అందరికి చెప్పినా. ! సినిమా జూడ పట్నం పోతున్నా అని. ఇక చూడుండ్రి మావాళ్ళు.. "అరే రాగానే మాకు చెప్పలరా సినిమా ఎట్టుంటదో," అని ఒకటే సతాయించుడు మొదలెట్టిండ్రు. అందరి నడుమ మధ్య లో.. సినిమాలో హీరో లెక్క..నేను. కొత్త అంగీ కోసం ఊరిలో మా దర్జీ దగ్గరకు ఎన్ని సార్లు పోయిన్నో.. "కుట్టావా నా అంగీ, నే పట్నం సినిమాకి పోవాలా..!" అంటూ గర్వంగా అంటుండేవాడిని తనకు కూడా తెలియాలి అని.. అనుకున్న రోజు రానే వచ్చింది,

పొద్దు పొద్దుగలనే లేచి కొత్త అంగీ ఏసుకు కూకున్న, అయ్య బయలుదేరుడే ఇక సురూ అనుకుంటూ... పట్నం చేరుకునే సరికి మిట్టమధ్యాహ్నం అయిపోయో. టూరింగ్ టాకీసు రోడ్డుపక్కన గోలీసోడా తాగినా, పది పైసలిచ్చి., చల్లగుంది. అయ్యనడిగి పుటో కూడా ఒకటి దిగినా! అక్కడే ఉన్న రంగురంగుల కళ్ళజోడు, ఒక టోపీ అడిగి తీసుకుని .. టాకీసు నుండి" నమో వెంకటేశా "అనే పాట మొదలయ్యే.. జనాలు కదులుతుండ్రు. ఆ పాట మొదలు "సినిమాకు టిక్కెట్లు ఇస్తున్నడని గుర్తు" అని అయ్య చెప్పిండు. టాకీసు ముందుగాలో జూడాలా..! ఎవరో పెద్ద గథ భుజాన యెట్టుకున్న బొమ్మ పెద్దగుంది. అయ్యచెప్పిండు!

మహానటుడు యస్ వీ రంగారావుగారని. " చూడగనే చేతులెత్తి దండమెట్టెలా, అంత గొప్ప గుంది మరి బొమ్మ. అయ్య! వరుసలో నిలబడి జనాలను నెట్టుకుంటూ రెండు కాయితం ముక్కలు తెచ్చిండు, కాస్త ఎర్రగుంది. టాకీసు పేరు గూడుంది. టాకీసు నుండి "శుక్లం భరధరం "పాట వస్తుంది. "పదపదా సినిమా ఇక మొదలౌద్ది అంటూ " నా చెయ్యట్టుకుని లోపలికి తీసుకుపోయిండు...

అయ్య కింద అంతా ఇసక ,ఎవరికి వారు కుప్పచేసుకుని కూచ్చుంటండ్రూ. వెనక్కి తిరిగి చూసినా. మా ఇసుకుల్లో పంతులయ్య కూకునే బల్లలెక్క కనిపించే. "అయ్యా! అక్కడ కూకుందామే "అన్నాను. "అట్టా కుదరదురా.. " "అక్కడ డబ్బులు ఉన్నోల్లు కూచుంటరు.."

"చాలా ఖరీదు పెట్టాలి అక్కడ కూడుకుని చూడాలంటే " "ఎక్కడుండి చూత్తే ఏముంది! సినిమా యేకదా" అంటున్న అయ్య మాటకు నిజమే అని తలూపినా. ఏటో అనుకుంటాం కానీ... చుస్తుంటే బలే ఇచిత్రంగుంది.. తెర గుడ్డ చుట్టూ రంగురంగుల బుడ్లు ఎలిగి ఆరిపోతుంటే ఎంతబాగుందో..

"అయ్యా! ఈల్లంతా తెర వెనకుంటారా. ! ఇప్పుడు బయటకు వచ్చి కొట్టుకుని, పాటలు పడుకుని లోపలకు పోతారా!" అడిగిన నన్ను దగ్గరకు తీసుకుంటూ, "కాదురా అయ్యా. మన యెనకాల ప్రోజిట్టర్ ఉంది ,అక్కడ రీలెట్టి తిప్పుతుంటే ఇక్కడ బొమ్మ ఆటాపాట వస్తది.." "చూడు చూడు మొదలైంది" అంటూ తెరవైపు చూపిండు అయ్య. యేటీ అర్దం కాలేదు..

ముందుగల దేవుడు బొమ్మ.. తరువాత ఇక చూడూ.. గుర్రాల పరుగులు.. తన్నుకోడాలు.. కత్తులు దూసుకోడాలు అబ్బో అబ్బో బలే రంజుగుంది ఆట. మధ్య లో కాస్త ఆపిండు, బయటకు పోయి కలర్ సోడా తాగి పావలా సెనక్కయలు. పదిపైసల బఠాణీలు కొనితెచ్చిండయ్య. అవి నవులుతూ తిరిగి తెరమీద బొమ్మ లు కదులుతుంటే, నాకు కూడా అలా ఎగిరెగి తన్నేయాలనిపించింది.. మధ్య లో ఓ పాట వచ్చింది ఇక చూసుకో. జనాలు ఈలలు. ఎగురుడు అబ్బో అబ్బో ఎంతో సందడి చేసిండ్రు, అయ్యను అడిగా" ఎవరే అయ్యా అట్టా ఎగురుతుంది." "మన ఊర్లో కొలుపులకు ఈరతాడు అట్టుకుని ఎగిరినట్టు" అంటుంటే అయ్య చెప్పిండు. ఆమేరా జ్యోతిలచ్చిమి." "ఈమె పాట లేకుండా సినిమా ఉండదు అసలు. సగం జనం ఈ పాటలకోసమే వత్తరు" అంటుంటే నిజమే అని పించింది.

"ఎం ఎగిరింది అబ్బా!" అనుకున్నా. సినిమా అయిపోయిందంటూ.. తిరిగి " నమో వెంకటేశా పాట మొదలైంది. అందరు లేసి దులుపుకుంటూ బయటకు వస్తుంటే, "అయ్యా. !పాపం దెబ్బలు అన్ని తగిలాయికదా! మళ్ళి లేచి ఎట్టా ఎగురుతారే" అంటున్న నాతల నిమిరాడు అయ్య.. వస్తూ వస్తూ పోద్దుగల తీయించుకున్న పుటో తీసుకుని ఇంటికి చేరుకున్న..... ఇంటి దగ్గర నా దోస్తులు సిద్దంగున్నరు. నే చెప్పే సినిమా ఇస్టోరి ఇనేందుకు. అప్పుడు తీయించుకున్న పుటోనే మీరు విచిత్రంగా చూసింది.అందులో ఉన్నది నేనే" నలబై సంవత్సరాల క్రితం నా సినిమా అనుభవం చెపుతుంటే కాలేజీ పిల్లలు ఎంత శ్రద్దగా వింటున్నారంటే.. సినిమాను ఆస్వాదించడం అంటే ఇలాగే కదా! అంటూ ఆశ్చర్యంగా...... గతమెంతో వైభవం కదా అనుకుంటూ..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#45
ఆ రాత్రి - జాహ్నవి ప్రియా
[Image: Picture.png]
అభినయ్, స్వప్నలకు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అభినయ్ వాళ్ళ నాన్న మాధవరావు, స్వప్న వాళ్ళ నాన్న వీర్రాజు మంచి స్నేహితులు. పిల్లల్ని ఎక్కడో దూరంగా పెళ్లి చేసి, యోగక్షేమాలు ఆరా తీస్తూ బ్రతకడం ఎందుకు? ఒకరికొకరు తెలిసినవాళ్ళము. పిల్లలు ఒకరినొకరు ఎరుగున్నవాళ్ళు. వాళ్ళకి ముడి పెట్టేస్తే, మన స్నేహ బంధము, వియ్యంకుల బంధంగా కొనసాగుతుంది అని నిశ్చయించుకుని అభినయ్, స్వప్నల కళ్యాణం జరిపించారు.
ఆ రోజు అభినయ్, స్వప్నల మొదటి రాత్రి. తొలి రాత్రికి గదిని నవ దంపతుల కోసం నూతనంగా తీర్చిదిద్దారు. రంగుల కలలతో వచ్చే ఆ దంపతుల కోసం మంచాన్ని రంగు రంగుల పువ్వులతో అలంకరించారు. గదిలోని టేబుల్ మీద ఆ తియ్యని రాత్రి కోసం, తియ్యని స్వీట్లు, జ్యూస్ ఏర్పాటు చేసారు. బంధువుల్లో ఎవరో ఏసీ అన్ చేసి గదిని చల్లబరిచారు.
సమయం సమీపించే సరికి బంధువులు అందరు బయటకు వచ్చేశారు. అభినయ్, స్వప్నలని ఆడవాళ్లు గుమ్మం దగ్గర ఆటపట్టించారు. ఇద్దరు బిడియంతో బిగుసుకుపోయారు. అభినయ్ దగ్గర సరదా ప్రకారం ఆడవాళ్లు డబ్బులు వసూలు చేసి, ఇద్దరిని లోపలికి పంపారు. ఆ పరిసర ప్రాంతాలని బంధువులు ఖాళీ చేసారు.
ఇద్దరిలోను సిగ్గు. మొదట అభినయ్ మంచం మీద కూర్చొన్నాడు. స్వప్నని రమ్మని కళ్ళతో సైగ చేసాడు. స్వప్న మెల్లగా నడుచుకుంటూ వచ్చి అభినయ్ పక్కన కూర్చొంది. స్వప్నలో ఎన్నో ఆలోచనలు! ఎన్నో భయాలు! అన్నింటికీ మించి ఆ రాత్రి కోసం తను కన్న ఎన్నో కలలు. మెల్లగా తల తిప్పి, కళ్ళు పైకెత్తి అభినయ్ ని చూసింది. అప్పటికే తను తన వైపు చూస్తున్నాడు. స్వప్న సిగ్గు పడింది. మెల్లగా అభినయ్ వెనుక నుండి చెయ్యి వేసి స్వప్నని గుండెల మీదకి లాక్కున్నాడు. స్వప్న గుండె ఝల్లుమంది. “చిన్నప్పటి నుండి నన్ను చూస్తూనే ఉన్నావు కదా! ఇంతకు నేను నీకు ఇష్టమేనా?” అన్నాడు అభినయ్. “స్వప్న మెల్లగా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, కాబట్టే నచ్చావు. తెలియని వాళ్ళు అయితే ఎలాంటివారో అని టెన్షన్ ఉండేది అంది.” అలా ఇద్దరి మధ్య చాలా సేపు ప్రశ్నలు, జవాబులు తిరిగాయి.
ఇప్పుడు వాళ్ళ మధ్య సిగ్గు, బిడియం కొంచెం పక్కకి జరిగాయి. కొత్త భార్యాభర్తల కాకా, పాత మిత్రులుల హాయిగా మాట్లాడుకుంటున్నారు. కాని స్వప్నలో ఏదో మూల జరగబోయే కార్యం గురించి చిన్న భయం, కుతూహలం దాగి ఉండిపోయాయి. చివరగా అభినయ్ అన్నాడు. “స్వప్న, మన మధ్య ఏదో జరగాలి అని ఇక్కడ మనల్ని ఉంచారు.” స్వప్న తలదించుకుంది. “కాని పెళ్లి తంతులో నేను చాలా అలసిపోయాను. మనం దీనిని కొంచెం వాయిదా వేద్దాము.” స్వప్న మొదట కొంచెం మీమాంసలో పడ్డా! అభినయ్ ని నొప్పించడం ఎందుకులే అని వెంటనే, “సరే, మీ ఇష్టం. నేను కూడా అలసిపోయాను అంది.”
ఇద్దరు ఆ మంచానికి చెరో వైపు పడుకున్నారు. పూల అలంకారాలు, స్వీట్లు, పళ్ళు అలంకారాలుగానే ఉన్నాయి. తరవాత కాని అర్ధం కాలేదు స్వప్నకి జరుగుతున్న తప్పు. మొదటి మూడు రాత్రులు అలానే కబుర్లలో ముంచి హయిగా నిద్రపోయేవాడు అభినయ్. నిద్ర పట్టక, ఈ పక్క స్వప్న. కొత్తగా పెళ్లి అయినా జంటకు ఎలాంటి ఆరాటం ఉంటుందో స్వప్నకి తెలియంది కాదు. ఇక్కడ తన పరిస్థితి మాత్రం తారుమరయ్యింది. అసలు అభినయ్ కి నాతో పెళ్లి ఇష్టం లేదా. లేక తనకి ఏదైనా లోపం ఉందా అని ఆలోచించుకుని తనలో తను మధన పడింది.
“ఆఫీస్ లో ఇచ్చిన సెలవులు అయిపోయాయి. వర్క్ అటెండ్ అవ్వాలి. ఈ సారి కొన్ని ఎక్కువ రోజులు లీవ్ తీసుకుని వస్తాను. అప్పుడు స్వప్నని నాతో తీసుకువెళతాను” అని ఇంట్లో స్వప్న తల్లిదండ్రులకి చెప్పాడు అభినయ్. స్వప్న దగ్గర కూడా వీడ్కోలు తీసుకున్నాడు. వెళుతూ తన నుదుట ముద్దు కూడా పెట్టుకున్నాడు. అతను వెళ్ళాక స్వప్నకి ఆలోచనలు మరింత ఎక్కువయ్యాయి. తనతో బాగానే ఉంటున్నాడు. అయినా ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది అని బాధపడుతుంది.
ఈ బాధని మోయలేక తమ ఇంటికి దగ్గరలో ఉండే ప్రాణ స్నేహితురాలు రమ్య ఇంటికి వెళ్ళింది స్వప్న. ఇద్దరు చిన్నప్పటి నుండి కలిసే చదువుకున్నారు. ఇద్దరు అరమరికలు లేని స్నేహితులు. స్వప్న రమ్య దగ్గర అప్పటి వరకు దాచుకున్న తన బాధ అంత చెప్పుకుంది. రమ్య పరిస్థితిని అర్ధం చేసుకుంది. “నువ్వు బాధపడకు స్వప్న, నాకు తెలిసి అభినయ్ లోనే ఏదో లోపం ఉండి ఉంటుంది.!” అంది రమ్య. స్వప్న అవును అన్నట్లు తల ఊపింది. “ఈ విషయం వీలైనంత తొందరగా మీ పేరెంట్స్ కి చెప్పు. ఇలాంటివి సాగదీసి నువ్వు కుంగిపోవడం అనవసరం” అంది రమ్య. “నాకు చెప్పాలనే ఉంది. కాని అభినయ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఎప్పటి నుండో కలిసి ఉంటున్నాము. మా మూలంగా మంచి కుటుంబాలు విడిపోతాయి అని ఆలోచిస్తున్నాను” అంది స్వప్న.
రమ్య కాసేపు ఆలోచించి, “నువ్వే ఒకసారి అభినయ్ తో మాట్లాడి చూడు.” స్వప్నకి ఆ ఆలోచన నచ్చిన, అభినయ్ ని అడగాలంటే భయం. స్వప్న, రమ్య కాసేపు ఆలోచనలో పడిపోయారు. రమ్య తేరుకుని, స్వప్న జవాబు చెప్పలేదని, “ఏమిటే అతనిని కూడా అడగలేవా? మరి ఏం చేస్తావు? నీలో నువ్వు ఏడుస్తూ కూర్చొంటావా!” స్వప్న మళ్ళి మౌనంగా ఉండిపోయింది. “స్వప్న సమస్య ఉంది అని చూస్తూ కూర్చొంటే అది తీరదు. ఏదోక నిర్ణయం తీసుకో” అంది రమ్య. “నేను కొంచెం ఆలోచించి పరిష్కారం చూస్తాను రమ్య” అంది స్వప్న. రమ్య దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది. వస్తూ దారిలో ఆలోచించింది. అభినయ్ కి, తనకి మధ్య ఏమీ జరగలేదు అనే విషయం నాన్నకి చెప్పి, అభినయ్ ని మెల్లగా ఆ విషయం నొప్పించకుండా అడగమని నాన్నకి చెప్పాలి అనుకుంది.
ఆలోచనలోనే ఇల్లు చేరుకుంది. నాన్నని పిలిచి చెబుదాం అనుకుని వాళ్ళ నాన్న వీర్రాజు గదికి వెళ్ళింది. లోపలికి చూస్తూనే ఆశ్చర్యపోయింది. లోపల నాన్నతో కబుర్లు చెబుతూ అభినయ్. అభినయ్ స్వప్నని చూస్తూనే, “హాయ్ స్వప్న. ఫ్రెండ్ ఇంటికి వెళ్లావు అని మావయ్య గారు చెప్పారు.” అవును అన్నట్లుగా తలూపింది స్వప్న. వీర్రాజు స్వప్నని కూర్చోమని, “అభినయ్ ఇప్పుడే చెబుతున్నాడు, మావయ్య పెళ్లి అయ్యాక హనీమూన్ వెళ్ళలేదు కదా. నేను స్వప్న అలా కేరళ వెళ్లి వస్తామని. నీ భార్య, నీ ఇష్టం. మధ్యలో నా పర్మిషన్ ఏమిటి! అని చెబుతున్నాను. నువ్వు వచ్చావు.”
“స్వప్న నీకు ఇష్టమే కదా” అన్నాడు అభినయ్. అవును అన్నట్లు తలూపింది స్వప్న. స్వప్న మనసులో అనుకుంది తొందరపడటం ఎందుకు? హనీమూన్ అంటున్నాడు కదా. అది అయ్యాక అక్కడ విషయం లేకపోతే, విషయం ఇంట్లో చెబుదాం అనుకుంది. అలా స్వప్న, అభినయ్ కేరళ చేరారు.
కేరళలో వారం రోజులు గడిపారు. చూడవలిసినవి అన్ని చూసారు. కాని వారం రోజుల్లో స్వప్న అనుకున్నది మాత్రం జరగలేదు. స్వప్న యాంత్రికంగా అభినయ్ తో తిరుగుతుంది. చివరిగా కేరళలోని ఒక పల్లెటూరిలో ఉన్న ఒక ఇంటికి తీసుకువెళ్లాడు అభినయ్. వెళ్లినప్పటికి రాత్రి సమయమయింది. “ఇది ఎవరిదీ?” అని అడిగింది స్వప్న. “చెప్తా కాని, ఇక్కడే మనం మూడు రోజులు ఉండబోతున్నాము” అన్నాడు అభినయ్. ఇద్దరు యధా ప్రకారం ఒక మంచం పై వేరు వేరుగా పడుకున్నారు.
స్వప్న ఉదయం లేచింది. ఆ ఇంట్లో కావలిసనవి అన్ని అమర్చి ఉన్నాయి. తల స్నానం చేసి కాఫీ పెట్టింది. అభినయ్ అప్పుడే స్నానం చేసాడు. ఇద్దర కాఫీ తాగారు. స్వప్న ఇదే మంచి సమయం అభినయ్ ని విషయం అడుగుదాం అనుకుంది. ఇద్దరు తాగిన కాఫీ గ్లాస్ లు సింక్ లో పెట్టి గది లోపలికి వస్తుంది. అభినయ్ వెనుక నుండి కౌగలించుకున్నాడు. స్వప్న ఉలిక్కిపడి “ఏమిటి?” అంది. అభినయ్ తన మెడ మీద జుట్టుని పక్కకి జరుపుతూ, “మన మధ్య ఎప్పుడో జరగవలిసినది, ఇప్పుడు జరుగుతుంది” అని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. స్వప్న అతనికి ఎదురుగా తిరిగింది. అభినయ్ స్వప్న చెంపలను వేళ్ళతో మెల్లగా తాకుతూ, “అవును ఇప్పుడు ఏం చెయ్యాలో నీకేమైనా తెలుసా! అన్నాడు.” స్వప్న సిగ్గుతో తల దించేసుకుంది. “సర్లే గూగుల్ చేద్దాం” అన్నాడు అభినయ్. చిరు కోపంతో “ఛీ.. పో..” అంది. అభినయ్ నవ్వేస్తూ తన గెడ్డాన్ని పట్టుకుని తల పైకెత్తి తన పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. స్వప్న మనసులో అమృత ధారలు. అభినయ్ స్వప్న నడుము చుట్టూ చెయ్యి వేసి కౌగిలి బిగిస్తుంటే, ఇద్దరిలో నిద్రాణంగా ఉన్న కోరికలు రెక్కలు విప్పి విహరిస్తున్నాయి. రెండు తనువులు పెన వేసుకుంటూ ఒకటిగా కలిసిపోతున్నాయి. స్వప్న ముంగురులు వెనక్కి సవరించి చెవి కింద ముద్దుపెట్టాడు అభినయ్. స్వప్న ముని వేళ్ళ పై పైకి లేచి, అభినయ్ నుదిటిని, చెంపని ముద్దాడింది.
అభినయ్ స్వప్నని అమాంతం రెండు చేతులతో లేపి మంచం దగ్గరకి తీసుకువచ్చాడు. తన టీ షర్ట్ తీసేసాడు. మంచం మీద ఉన్న స్వప్న మీదకి ఒరిగి మెల్లగా తన శరీరాన్ని ముద్దాడుతూ ఆమె మీదకి ఎగబాకాడు. స్వప్న చీరని పై ఎద మీద నుండి తొలగించబోతుండగా స్వప్న ఆపింది. “అభినయ్ ఇన్ని రోజులు లేని తొందర ఈరోజు ఎందుకు పుట్టుకు వచ్చింది నీకు?” అంది. అభినయ్ పక్కకి తప్పుకుని, “మేడం గారు ఈ ప్రశ్న అడుగుతారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు అడుగుతారు అనుకోలేదు.” స్వప్న చిన్నగా నవ్వింది.
“స్వప్న నా దృష్టిలో శృంగారం అంటే మొక్కుబడి కార్యం కాదు, అది సృష్టి కార్యం. ప్రతి జీవికి అవసరం. అదే పుట్టుకకు ఆరంభం. చాలా మంది దీనిని గుంభనంగా, ఏదో బూతు అన్నట్లు దాచేస్తారు. నాకు అలా నచ్చదు. అలాగే శోభనం చేసుకొమ్మనారు అని చేసుకున్నట్లు, కాకుండా తొలి కలయిక స్వేచ్ఛగా, మన ఇద్దరి ఇష్టాల మధ్య జరగాలి అనుకున్నాను. అందుకే ఆగాను. నీ ఓపికకు ధన్యవాదములు. ఇది నా మిత్రుని ఇల్లు. వాడికి అంత వివరించాను. నేను కలలు కన్న ఆ రాత్రి, ఇదే చాలా మేడం గారు.”
స్వప్న ఏదో అడగబోయింది. అభినయ్ ప్రశ్న బయటకు రాకుండా పెదవుల పై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళ కళ్ళు మాత్రమే మాట్లాడుకున్నాయి. శరీరాలు సహకరించుకున్నాయి. శృంగారాన్ని ఆస్వాదిస్తూ, ఇద్దరు స్వర్గాన్ని మించిన లోకాలను చేరారు.
ఆ మూడు రోజులు వాళ్ళు కలలు కన్న ఆ రాత్రులుగానే గడిచిపోయాయి. ఇంటికి చేరిన స్వప్న మొఖంలోని కొత్త కల, రమ్యకు విషయం చెప్పకనే చెప్పింది. అభినయ్ స్వప్నని తనతో తీసుకువెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. మొత్తానికి స్వప్న తన స్వప్నాలను చేరింది. అభినయ్ తనకు కావలసినట్లు అభినయించాడు. అంతే కదా జీవితం ఒక స్వప్నం, బ్రతకడం ఒక అభినయం.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#46
ఏ1 ఫార్ములా - వై.కె.సంధ్యా రావు
[Image: Picture.png]
ఫోన్ పదే పదే రింగవుతుంటే బద్ధకంగా కళ్ళు మూసుకునే " హలో...!"అనగానే అవతలి వైపు నుండి "హాయ్..జో..గుడ్మార్నింగ్" అన్నాడు జే. నిద్ర మత్తులోనే "హలో హా... య్..జే..గుడ్ మార్నింగ్ ..ఏంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు..?" అంది నిద్ర సరిపోకపోతే వచ్చే ఆవలింతతో. "జో...ఇది పొద్దున్న కాదు..ఇంకో అరగంట పోతే మధ్యాహ్నం పన్నెండవుతుంది."అన్నాడు నింపాదిగా. "హో...మధ్యాహ్నమవుతోందా..?"అంటూ కళ్ళు పెద్దవి చేసుకుని ఫోన్లో సమయం చూసుకుంది. "హా..మేడం గా రు రాత్రంతా ఏం చేస్తున్నట్లు నిద్ర పోకుండా..?"అంటూ దీర్ఘం తీశాడు జే. "నైట్ షిఫ్ట్ జె ,ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేయడానికే ఫైవయింది,ఎలాగూ ఈరోజు వీకెండ్ కాబట్టి లేట్ గా లేచినా ఫర్వాలేదని పడుకున్నా..ఇంతలో నీ ఫోన్..నా నిద్ర డిస్టర్బ్ చేస్తూ"అంది బుంగమూతి పెట్టి మరొక ఆవలింత రాగానే ..చూశావా..నాకింకా నిద్రొస్తోంది..బై.తర్వాత మాట్లాడుకుందాం.."అని కాల్ కట్ చేస్తోంటే. "జో..ప్లీజ్..ఒక్క మాట.."అన్నాడు. "హా..చెప్పు "అంది "నేను అడిగినదానికి ఏం ఆలోచించావు? "అన్నాడు. తన నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందోనని ఆలోచిస్తూ. "ఐ యామ్..నాట్ ఓకే..జె, బట్ స్టిల్ ఐ థింక్ అబౌట్ ఇట్..గివ్ సమ్ స్పేస్" అంది కాస్త సీరియస్ గా మొహం పెట్టి. "జో..ఇంకోసారి ఆలోచించు.. ముందు సరే అన్నావ్..ఇప్పుడేమో..వద్దు అంటున్నావ్ ..వాట్స్ యువర్..ప్రాబ్లం ప్లీజ్ షేర్ యువర్ ఫీలింగ్స్ విత్ మి...."అన్నాడు కాస్త ఆర్థ్రతగా జే. "నాకు ఇంకొంచెం టైం కావాలి.. "అంటూ కాల్ కట్ చేసింది జో. *** ముంబై మహా నగరంలో ఫాస్ట్ ట్రెండ్ కు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్న ప్రపంచంలో కలుసుకున్న జోహ్నిక ,జెశ్వంత్. ఇద్దరూ ఒకే కంపెనీలో రెండేళ్లుగా హెచ్ ఆర్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు. ఒకే ప్రాంతం కావడంతో తొందరగానే ఫ్రెండ్సయ్యారు. వీకెండ్ పార్టీలతోనూ పిక్ నిక్ లతోనూ కాలక్షేపానికి తగినంత మందిని వెంటేసుకుని తిరిగి రావడం ఎవరి ఫ్లాట్స్ కు వారు వెళ్ళడం జరుగుతోంది. ఇలా తిరిగి వెళ్ళడంలోనే ఒకరిని వదిలి ఒకరు వుండలేనంత పరిచయం స్నేహం ప్రేమలో వున్నప్పుడే ఒకరిపై ఒకరికి కలిగిన ఇంట్రాక్షన్ తో జీవితాంతం కలిసి ఇలాగే వుండగలమా లేదా అనే సందేహం ఇద్దరికీ కలిగింది. అలా వుండాలంటే పెళ్ళి చేసుకోవాలి. కానీ ..ప్రస్తుతం తమచుట్టూ వున్న ప్రపంచంలో పెళ్ళి కి ఎవరూ సిద్ధంగా లేరు. అలా ముందుకు వెళ్లిన ఒకటి రెండు సంవత్సరాల్లో విడాకులు తీసుకుని.. మరొకరు అంటూ తలోదారిలో వెళుతున్నారు. అందుకే ప్రస్తుత ట్రెండ్ "లివింగ్ టుగెదర్" దారిలో నడవాలనుకుంటున్నారు.ఒకరికొకరు ఇష్టం వున్నంతకాలం కలిసి వుండి తర్వాత బ్రేక్ అప్ చెప్పుకుని విడిపోయి ఎవరికివారు బతకడమేనని, చాలా ఈజ్ గా వుంది కదూ అంటూ అందరూ అదే ఫాలో అవుతున్నారు. ఇదే విషయంపై వారం ముందు వరకు జోహ్నిక ,జెశ్వంత్ కూడా ఫ్రెండ్స్ తో ఏఖీభవించారు. లాస్ట్ వీకెండ్ ట్రిప్ లో జోతో తన మనసులోని మాటను జెశ్వంత్ చెప్పగానే ఒక్కసారిగా కలవరపాటు పడి.. 'ప్రేమ వరకు ఓకే గాని లివింగ్ టుగెదర్ లో ఒకే ఇంట్లో ఒకటిగా వుండి ఇష్టం లేకపోతే విడిపోదాం..'అన్న మాట తలచుకోగానే గుండెల్లో ఎందుకో భయం తొణికసలాడింది జో కు. "గివ్ సమ్ టైం జే"అంటూ సమయం తీసుకుంది. *** ఈరోజు వీకెండ్ కాబట్టి తను ఫ్రీగా వుంటుందని మనసులోని మాటను తెలుసుకోవాలనే ఆత్రుతతో స్వతహాగా.. అడిగేశాడు జే. తను ఓకే చెప్తే ఇప్పుడే వెంటనే తనని కలిసి ఇద్దరి టేస్ట్ కి నచ్చే వాటిని షాపింగ్ చేయాలని , మరో ఫ్రెండ్ పిలిస్తే కూడా రానని చెప్పేశాడు . ఇప్పుడు 'జో..'ఇంకా టైం కావాలని అడుగుతోంది. 'ఇంతకు తను నచ్చినట్లా...లేదా..? పరిచయం ఐనప్పటి నుండి ఇంత వరకూ కూడా బాగానే వున్నాం.. హద్దు మీరి ప్రవర్తించింది లేదు. ఒకరికి ఒకరంటే అమితమైన గౌరవం. ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా వుంటాయి. అంతకంటే తనంటే ఎంతో ప్రేమ.. తొలి పరిచయం లోనే తన మాట తీరుకు తన ఆత్మాభిమానానికి తన మెచ్యూరిటీకి బానిసనైపోయాను. ఇక రూపం అంటే వంశీ చిత్రాల్లో చూపిన గోదారి హొయలన్నీ తనలోనే వున్నాయి. తన నవ్వుకైతే అయస్కాంతం అవసరం లేనంత ఆకర్షణ. ఆ కళ్ళు వర్ణించ వీలు కాదు.. ఇంద్ర ధనుస్సులా ఇన్ని సుగుణాల రాశిని ఇష్టపడని వాడుంటాడా.. కానీ .. స్నేహం వేరు ప్రేమ వేరు, లివింగ్ టుగెదర్ లో కలిసి జీవించడం వేరు. ప్రేమకు అడ్డు చెప్పని జో.. దీనికి ఎందుకు ఇంత ఆలోచిస్తోందో.. అర్థం కాలేదు. ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చిన ముంబైలో ఫ్రెండ్స్ తో పాష్ గా వున్న అమ్మాయిలనే చూశా..కానీ.. తనెందుకు టైం తీసుకుంటోంది.. ఒక వేళ తన సమాధానం నో..ఐతే తన ప్రేమకు కూడా బ్రేకప్ చెప్పేస్తుందా. కానీ జోకు తనంటే చాలా ఇష్టమని తన మాటల్లోనూ చేతల్లోనూ ఎప్పటికప్పుడు చూపిస్తూనే వుంటుంది. జో సమాధానం ఏదైనా.. ముందు ఎలా వున్నానో అలాగే వుండాలని మనసుకు నచ్చజెప్పుకున్నాడు. తన స్నేహం తనతో లైఫ్.. లైఫ్ లాంగ్ కావాలనే తను ఆరాటపడుతున్నాడు. అలాంటిది జో నో చెప్పినా.. తనకు దూరంగా వుండలేడు. అంతగా ప్రేమించాడు జోహ్నికను. *** జే కాల్ కట్ చేసిన జోహ్నిక బెడ్ పైనే అలాగే కళ్ళు మూసుకుని జే రూపాన్ని తలచుకుంటూ 'సారి ...జే, టైం అడిగింది నిన్ను కాదనడానికి కాదు. మనం లైఫ్ లాంగ్ కలసి వుండటానికి. ఇది నీకు అర్థమయ్యేంత వరకు ఇలాగే చెప్తుంటాను'అని దిండుని గట్టిగా పట్టుకుని నవ్వుతూ పక్కకు తిరిగి పడుకుంది. *** చిన్నప్పటి నుంచి తల్లి జలజ తో అన్నీ షేర్ చేసుకునే అలవాటు వుండటంతో జే ను ప్రేమిస్తున్న విషయం కూడా చెప్పింది. ఇప్పుడు జే అడిగిన లివింగ్ టుగెదర్ కు తను "ఏం చెప్పాలో ఆలోచిస్తున్నాను అమ్మా.. ! ఏం చేయమంటావు?" అని అడగటంతో. ఏ తల్లైనా..నాలుగు చీవాట్లు పెట్టి ఉద్యోగం మాన్పించి మరొకడితో సంబంధం చూసి ఇష్టం వున్నా లేకపోయినా పెళ్ళి జరిపించాలనుకుంటుంది. కానీ తన తల్లి అలా ఆలోచించదని తెలిసే తన ఆలోచనను తల్లి తో పంచుకుంది. " ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే అమ్మా..అందరూ ఇటు వైపే మొగ్గు చూపుతున్నారు. నన్ను జే అడగకముందు వరకు కూడా నేను దీనిని సపోర్ట్ చేశాను ఫ్రెండ్స్ తో. కానీ, ఇప్పుడు తనతో లివింగ్ టుగెదర్ కు ఒప్పుకోవాలా వద్దా అనే మిమాంసలో వున్నా ,నువ్వు చెప్పమ్మా..?" అంటూ తన సమస్య ను తల్లి ముందుంచింది. "నువ్వు జేను మనఃస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా...?"అనడిగింది జలజ కూతురిని. "అవును.." "తనకు..? " "నేనంటే ఇష్టమే అమ్మా.."అంది "అంటే కొద్ది రోజులు మాత్రమే వుండే ఇష్టమా.. లేక తనతో ఎప్పుడూ కలిసే వుండాలనేంత ఇష్టమా...?" అనడిగింది జలజ. "అమ్మా... తను నా పక్కనుంటే బాగుంటుంది , నువ్వు నాతో వున్నప్పుడు నేనెలా సెక్యూర్ గా ఫీలవుతానో..తనతో వున్నప్పుడు కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది..,అందుకే మేమిద్దరం మాటల్లోనే ఒకరికొనొకరం ఇష్ట పడుతున్నట్లు కనిపెట్టాం..ఎవరూ ముందుగా ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పుకోలేదు..తను మెచ్యూర్ గా ఆలోచిస్తాడు.. ప్రతిదీ ప్రొటెక్ట్ చేసే విధానం ఆఫీస్ వర్క్ ఐనా..పర్సనల్ విషయమైనా..ఒకేలా తీసుకుంటాడు.. అతిగా ఎవరి నుండీ ఏమీ ఆశించడు.. అందుకే నేను త్వరగా తనకు అట్రాక్ట్ అయ్యానేమో అనిపించింది.. ఆజ్..లైక్ యు..మామ్ "అంది.. జో "మరైతే..తన ఆలోచన , తను కూడా నిన్ను ఇలాంటి ఆలోచనతోనే చూస్తున్నాడా... లేక యూజ్..అండ్...త్రో.." అంటూ ఆపింది జలజ.. "అమ్మా..!" అంది జో గట్టిగా "జో ...ఐ మీన్..నువ్వు అర్థం చేసుకుంటావనే చెప్తున్నాను..,ఇప్పటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ వుంటాయి..ఈ క్షణం కావాలనుకున్నది మరో క్షణం అవసరం లేనిదిగా అనిపించవచ్చు.. అది నీ విషయమైనా మరొకటైనా.."అంటూ జలజ జోను సందేహంలోకి నెట్టేసింది. అటువైపు నుండి నిశ్శబ్దం. జో, తల్లి తో ఏం చెప్పాలో ఆలోచిస్తుంటే "జో...,తనతో నీ లైఫ్ ఎప్పుడూ బాగుంటుందనుకుంటే హ్యాపీగా పెళ్ళి చేసుకో..తనకు కూడా నిన్ను పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం వుందో లేదో తెలుసుకో.. ముందు" అంది కూతురిని అనునయిస్తూ .తన మనసును ఎక్కువ సేపు కష్టపెట్టడం తల్లిగా తనకే ఇష్టం వుండదు. "అమ్మా పెళ్ళికి తను ఒప్పుకుంటాడంటావా..?"అంది అనుమానంగా జో , జెశ్వంత్ ను విడిచి వుండలేని భావనతో. "జో.. మన దేశంలో వివాహానికి వున్నంత గొప్పతనం మరే దేశంలోనూ లేదు. ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరులను ఆదర్శ దంపతులుగా సీతారాములను కొలిచే దేశం మనది., కలిసి వుండడమో.. విడిపోయి బ్రతకడమూ మన చేతిలోనే వుంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని అర్థవంతమైన జీవితాన్ని గడపడంలోనే సాఫల్యత పొందాలి కానీ, చీటికిమాటికి డబ్బు కోసమో..అనుమానంతోనో మరేదానికోసమో.. గొడవపడుతూ దినదినం నూరేళ్ళ గండంగా కాదు. ఈరోజు నేను అమ్మగా నీకు నేర్పిన పాఠాన్నే రేపు నీ తరాన్ని నడిపించే మాతృక కావాలి నువ్వు. అంతే కానీ ఈరోజు ఇప్పుడు నీకు నచ్చిన వాడితో లైఫ్ షేర్ చేసుకుని మధ్యలో మరొకడితో నీ లైఫ్ మొదలు పెట్టావంటే అది నీ పిల్లలకు ఎలాంటి సంకేతాలను ఇస్తుందో నువ్వే తెలుసుకో. అలాగని నిన్ను సర్దుకుపోయి బతకమని అనడం లేదు. ఒకరికోసం మరొకరు వున్నామనే ప్రేమను పంచుకోవాలి. అప్పుడే ఏ క్షణం ఎవరు తప్పు చేసినా అది పెద్దగా కనిపించదు.. అలాంటి బంధాన్ని కోరుకోండి ఇద్దరూ.సహజీవనం చేస్తాం.. సరదాగా వుంటాం అంటే వయసులో వున్నంత వరకు హ్యాపీనే.. ఆ తర్వాత అనుభవించే ఒంటరితనంలోకి బలవంతంగా వెళ్ళకు.. అని ఖచ్చితంగా జలజ చెప్పడంతో.. ఆలోచనల్లో పడింది జోహ్నిక. *** "జే...! ప్లీజ్ వదులు...టైం అవుతోంది, ఆఫీస్ కి వెళ్ళాలి ఇద్దరూ.. ప్లీజ్" అంటూనే, తన నడుంచుట్టూ వేసిన చేతులను తన చేతులతో బిగించి.. వెల్లకిలా పడుకొని పైకి లాక్కున్నట్లే లాగి దూరంగా నెట్టింది జోహ్నిక. "జో.. ఒక్క క్షణం .. జో.. "అంటూ నిద్ర మత్తు వదలని జే , తన ఎర్రని పెదాలను తన పెదాలతో హత్తుకుపోయి తన కళ్ళలోకి ఆరాధనగా చూశాడు జెస్వంత్ . "లవ్ యు జే "అంటూ తన కౌగిట్లోకి ఒదిగిపోయింది. ఇంతలో జెస్వంత్ ఫోన్ రింగవడంతో పేరు చూసి .." ఓహ్.. డాడ్.. "అంటూ బెడ్ పైన నుండి గబగబా లేచి..కూర్చుని "హలో.. డాడ్ ,చెప్పండి "అనగానే.. "జే..ఆఫీసుకు బయల్దేర లేదా.. ?"ఇంకా అనడిగాడు జెస్వంత్ తండ్రి జగదీష్. "హా..లేదు.. ,వెళతాను.. వెళ్ళలేదు.. "అంటూ జోతో డాడ్ అని సైగ చేస్తూ కంగారుగా అనడంతో. "సరే..సరే.. అమ్మాయి ,ఆఫీసుకు వెళిపోయిందా.. "అనడిగాడు "లేదు డాడ్ ఇద్దరం కలిసే వెళతాము" అన్నాడు జే. ఫోన్లో కొడుకు కంగారు చూసి.. తను ఏ పొజిషన్లో వుంటాడో అర్థమై.. "ఫార్ములా సరిగ్గా ఉపయోగిస్తున్నావా.. ?"అనడిగాడు నవ్వుతూ కొడుకుని. "డాడ్.. !"అని గట్టిగా "ఫార్ములా .. ష్" అనడంతో జె. "ఓకే బై.. బీ హ్యాపీ జె "అంటూ కాల్ కట్ చేశాడు జగదీష్. ఫార్ములా మాట విని జో అర్థం కానట్లు "జే..ఇందాక అంకుల్ ఏదో ఫార్ములా అంటున్నారు.. ఏంటది.. ?"అనడిగింది అనుమానంగా. "అది..అది.."అంటూ జోని వెనక వైపు నుంచి శంఖం లాంటి చెవిలో "అది సీక్రెట్ "అన్నాడు.. ఏదో చెప్తున్నాడని ఆశగా ఎదురు చూసిన జో కు నిరాశ కలగడంతో.. "యూ.. "అంటూ తనను దూరంగా నెట్టి తలగడను విసిరింది జె తన దగ్గరగా వెళ్ళబోతే.. "రావద్దు.. నా దగ్గరకు అసలు రావద్దు ..!"అంటూ అటుతిరిగి బుంగమూతి పెట్టుకుంది.. జోహ్నిక. "హే..ఓకే ఓకే చెప్తాను.. ఈ హ్యాపీ డేని అప్ సెట్ చేయకు "అంటూ కన్ను గీటి తనకు దగ్గరగా వెళ్లి చేతులను పట్టుకున్నాడు.. ఐతే చెప్పమన్నట్టుగా బెట్టుగా చూసింది జె ని. ఇక తప్పదన్నట్లుగా.. "ఏ ప్లస్ బి హోల్ స్కొయర్ ఫార్ములా " అన్నాడు తాటి తొనల లాంటి తన బుగ్గలను అరచేతితో తడుముతూ.. జో .. అర్థం కానట్లు.. "ఏ ప్లస్ బి హోల్ స్కొయర్ "అంది "హా.. !"అన్నాడు నిజమేనని.. "దేనికి ఎందుకు .. ?"అంది ప్రశ్నార్థకంగా.. "మన లైఫ్ ని మనం అనుకున్నట్లుగా గడపడానికి.."అన్నాడు.. "ప్లీజ్ జె ,కాస్త అర్థం అయ్యేలా చెప్పు" అంది..జో. జో కళ్ళలోకి చూస్తూ "నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో.. నేను నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమించాను.. నీతో కలిసి జీవించాలనుకున్నా.. ఏదో ఒకరోజో రెండు రోజులో కలిసి చేసే డేటింగ్ లా కాదు.. ఆర్నెల్లు సంవత్సరంలోనో విడిపోయే లివింగ్ టుగెదర్ లా కూడా కాదు.. లైఫ్ లాంగ్.. నువ్వు నాకు కావాలనుకున్నా.. ఓ వైపు లివింగ్ టుగెదర్ కు నువ్వు ఎక్కడ నో చెప్తావో.. అనే భయం.. మరోవైపు నీ స్నేహం కూడా దూరమవుతుందేమోననే బాధ.. రెండు నన్ను నిలువనీయ్యలేదు.. నీ నుంచి జవాబు కోసం ఎదురు చూస్తుంటే అప్పుడే డాడీ ముంబై వచ్చారు.. నీగురించి చెప్పాను.. లివింగ్ టుగెదర్ గురించి ఆలోచిస్తుందంటే.. ఆ అమ్మాయి నిన్ను సంపూర్ణంగా కావాలని కోరుకుంటుందేమో.. అని చెప్పారు"అన్నాడు జె "అదీ నిజమే కదా.. !"అనుకుంది జో.. తన మనుసులోనే.. "మరి ఫార్ములా ఏంటి .. ?" అంది తన అనుమానం తీరడానికి.. డాడ్ చెప్పిందే.. "నువ్వు ఆ అమ్మాయి నుంచి స్నేహం ప్రేమ శృంగారం ఏది కోరుకుంటున్నావని అడిగారు.. " ఆ ప్రశ్నకు నాకు ఏం చెప్పాలో.. తెలియక.. స్నేహం.. అన్నా.. ,కానీ డాడ్ అందుకు అంగీకరించలేదు.. ఈ వయసులో కోరుకునేది శృంగారం.. దానికే స్నేహం ప్రేమ మరొకటని పేరు పెట్టి కలిసుందాం.. కలుసుకుందామని లివింగ్ టుగెదర్ గా డేటింగ్ గా సహజీవనంగా మార్చేసుకున్నారు.. నీకు ఆ అమ్మాయిపై నిజమైన ప్రేమే వుంటే ఏ ప్లస్ బి హోల్ స్కొయర్ ఫార్ములాని ఫాలో అయిపో.. అన్నారు.. అంటే( ఏ ప్లస్ బి హోల్ స్కొయర్ = ఏ ప్లస్ బి ప్లస్ టుఏబి . శృంగారం ప్లస్ ప్రేమ/స్నేహం = శృంగారం ప్లస్ ప్రేమ/స్నేహం ప్లస్ ప్రేమతో కలిగిన శృంగారం.. హోల్ స్కొయర్ లో జీవితం మొత్తం అనుభవించమని..మధురమైన అందమైన జీవితాన్ని గడపడానికి ఈ ఫార్ములా కు ఏకైక మార్గం పెళ్ళి.. అందరి అమ్మాయిల్లా ఆ అమ్మాయి లేదు అంటే ,తను సమ్ థింగ్ .. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థకు కట్టుబడి వుండే అమ్మాయే అయి వుంటుంది.. పెళ్ళి చేసుకుందామని అడుగు .. తప్పకుండా ఒప్పుకుంటుందన్నారు.. అలాగే నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి పెళ్ళి కి ప్రపోజ్ చేశాను.. నువ్వు ఒప్పుకున్నావు.. నా ఏ1 ఫార్ములా ఆర్నెల్లు గా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.. మరో అరవై యేళ్ళకు నీ హామీ కావాలి డియర్ అంటూ ప్రేమించిన అమ్మాయితో జీవితాంతం కలిసి ప్రేమగా స్నేహంతో వుండాలని కోరుకున్నాను..నువ్వు వుంటావుగా జో "అన్నాడు ఆరాధనగా..పాల మీగడ లాంటి తన ముఖంలోకే చూస్తూ.. "జె... నేను కోరుకున్నది.. ఇదే.. థ్యాంక్యూ ఫార్ యువర్ ఫార్ములా"అంటూఎర్రబడిన బుగ్గలతో నవ్వుతూ జెస్వంత్ ని అల్లుకుపోయింది జోహ్నిక.
సమాప్తం.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#47
మరో భారతానికి పునాది'(శృంగార కథ) - మద్దూరి నరసింహమూర్తి
[Image: Picture.png]
"రంగీ, నేనోపాలి బాబాయ్య కాడికి పోయి వస్తాను. కబురెట్టేడు రమ్మని"
“సరే, బేగొచ్చీ"
అరగంట తరువాత వచ్చిన రంగడితో -- "ఎందుకు కబురెట్టేడు బాబాయి"
"రేపు సందేళ గుడికి ఆయనతో సాయంగా రమ్మని సెప్పేడు. గుడిలో పంతులుగారు భారతం మీద నాలుగు మాటలు సెప్తారట, బాబాయి ఇనడానికి ఎల్తాడు"
"రేపు సందేళ మాట ఇప్పుడే సెప్పాలా"
"నేనేదేనా పని ఎత్తుకుంటానేమో, ముందుగా సెప్తే మంచిదని ఇప్పుడే సెప్పేడు బాబాయి"
"సరిలే, నేను నీళ్ళాడి ఒస్తాను బువ్వ తినేద్దాం"
"నీ పక్కన నేను లేకుండా నువ్వు నీళ్ళాడతావేలాగే"
"ఆ నీళ్ళాడ్డం కాదు బావా, స్నానం సేసి ఒస్తాను"
"పద, నేనూ ఒస్తాను, ఇద్దరం ఒకే తూరి స్నానం సేసేస్తే పోలే"
"నువ్వక్కడ బుద్ధిగా ఉండవు, అందుకే నేను నువ్వు ఏరు ఏరుగానే సెయ్యాలి స్నానం" అని నవ్వుతూ ఎల్తున్నరంగిని సూస్తూ –
"నీపని రేత్రికి సెప్తానుండు, వడ్డీతో కలిపి ఒసూలు సేయకపోతే నేను నీ బావనే కాను" అన్న రంగడికి ఓ నమస్కారం సేసి రంగి నవ్వుకుంటూ స్నానం సేసేందుకు ఎల్లింది.
ఇద్దరూ బువ్వ తినేసి టీవీ ముందు కూర్చున్నారు.
రంగడు తాను తెచ్చిన కొత్త పట్టీలు తీసి –
"టీవీ సూడ్డానికి ఇంకా సానా టైముండాది. నీ కాల్లు సాపు ఈ కొత్తపట్టీలు తగిలిస్తాను"
"నువ్వు కొత్తపట్టీలు తగిలిస్తానంటే కాల్లు సాపకుండా ఉంటానా" అంటూ తన పాదాలు బావకు ఇచ్చింది రంగి.
కొంతసేపటి తరువాత --
"ఏయ్ రంగీ, కదలక తిన్నగా కూకోలేవా"
"నేనేటి సేసేది బావా, నీ సెయ్యి తగిలితే నాకేటో అయిపోతాంటే, నేనెట్లా కుదురుగా కూకొనేది"
"మరైతే, నీ కాలికి పట్టీలు ఎట్టా తొడిగేది"
"సర్లే, నువ్వు నా కాలు ముట్టీ ముట్టనట్టు పట్టుకో"
"అలాగే, ముందు కదలక కూకో"
కాలికున్న కొత్త ఎండిపట్టీలు సూసి మురిసిపోయిన రంగి ఒక్క ఊపున కిందకు దూకి, బావని వాటేసుకొని "ఈ ఎండిపట్టీలు నీలాగే దగాదగా మెరిసిపోతున్నాయి బావా" అని రంగడి పెదాలమీద ముద్దెట్టింది.
"ఇదేటే రంగీ, నీ కాళ్ళకి రెండు పట్టీలెడితే, నాకు రెండు ముద్దులెట్టకుండా ఒక్కటే ఎట్టేవు"
"ఒకటి బాకీ రాసుకో, ముందు టీవీ సూద్దాం కాసేపు, చిన్న ఎన్టీఓడి సినెమా ఒస్తాదట"
"ఇయ్యేల అందగత్తెల పోటీ రేత్రి 9 గంటలకి సురూ సేసి రెండు గంటలు పైనే సూపిస్తారట. అది సూద్దాం”
"ఆ ఆడాల్ల అందాలు సూసిన నీకంటికి నేను ఆంతనా బావా"
"ఆల్లంతా పెద్దోళ్ళు బాగా డబ్బుతో బలిసినోల్లు. బోలెడంత డబ్బు కర్సెట్టి అందంగా తయ్యారవుతారట. ఆ నకిలీ అందగత్తెలతో నీకు పోలికేందుకే. నీది పెకుర్తి అందమే. దేవలోకంలో ఉండే రంబకైనా నీతో పోలికుందేటి. ఇందురోడు పిలిసి ఎవడి దగ్గరకెళ్ళి తొంగో అంటే ఎల్లాలసిందేనట. మరి నువ్వో పతిరొతవి. నాకు నీ తొరాతే ఏ అందగత్తేనా రంబేనా"
"అవునూ బావా, అందగత్తెల పోటీ అంటే ఒకల్లతో ఒకల్లు కుస్తీ పడతారా ఏటి"
"కుస్తీ పోటీ కాదే. ఆల్లందరిలోకీ ఓరు అందంగా ఉంటారో అన్న పోటీ అట" – అంటూ కాళ్లు రెండూ బారసాపి రంగిని మధ్యలో కూర్చోపెట్టుకొని, వెనకనుంచి వాటేసుకొన్న రంగడు రంగితో కలిసి -- టీవీ చూడసాగేడు.
ఒక్కొక్క అమ్మాయి హొయలుగా నడచుకుంటూ వచ్చి మూడు నాలుగు విధాలుగా అంగాంగ ప్రదర్శనతో కూడిన తన అందాన్ని సూపిస్తూంటే వీక్షకులు చప్పట్లతో ప్రోత్సాహిస్తున్నారు.
ఆ అమ్మాయి వెళ్లిన తరువాత న్యాయనిర్ణేతలు వారి నిర్ణయం కాగితం మీద వ్రాయడం అయిన తరువాత మరొక అమ్మాయి వచ్చి అలాగే తన అందాన్ని ప్రదర్శిస్తూంది.
"బావా, ఈల్లలో ఒక్క ఆడకూతురు కూడా ఒంటినిండా సీరే జాకెట్టు కట్టుకోకుండా ఉంటాదేటి"
"పెద్ద పెద్ద ఊళ్లలో గొప్ప గొప్పోళ్ళు డబ్బున్నోళ్ళు అలాగే ఉంటారేమోనే"
"అంతేకాదు, అలా నడుస్తున్న ఆడోళ్లలో –
ఒకర్తి - కట్టుకున్న గుడ్డని మొలనించి సింపేసి, ఆ రెండు గుడ్డ ముక్కలతో ఏమాత్రమూ సిగ్గన్నదే
లేకుండా నడుస్తాది.
ఇంకోర్తి - పదిగజాల గుడ్డ ఒంటి చుట్టూ ఉన్నా, సిగ్గన్నదే లేకుండా ఒల్లంతా సూపిస్తూ ఎనక్కి
ముందుకు ఆగుడ్డతో ఇల్లు ఊడిసినట్టు నడుస్తాది.
మరొకర్తేమో - మొలకి సిన్న గుడ్డముక్క సుట్టుకొని, సగంపైన గుండెలు కనిపిస్తున్న సిన్న
గుడ్డముక్క ఛాతీమీద సుట్టుకొని నడుస్తాది.
కట్టుకుందికి గుడ్డముక్కలు లేనట్టు నలుగురిలో అలా నడవడానికి ఈల్లకు సిగ్గు లజ్జ ఉండవా. సుట్టూ
కూసోని సూసే ఓళ్ళు సిగ్గులేకుండా సప్పట్లు కొడతా ఉన్నారు కూడా”
"ఆల్లెలా ఉంటే మనకేటే రంగీ"
“ఆడది దాని ఒంటి అందం కట్టుకున్నోడికి బట్ట ఇప్పి సూపినా తప్పు లేదు కానీ, ఇలా అందరికీ సూపిస్తారేటి ఈల్లు. ఛీ ఈల్లు మల్లా అందగత్తెలూ, ఆళ్ళకి పోటీ ఒకటి, ఛీ" –
--అంటూ వెళ్లి టీవీ కట్టేసిన రంగి –
“టీవిలో మల్లా ఇలాటివి సూస్తానంటే టీవీ ఇరగ్గొడతాను జాగర్త"
"అలాగేలే మరెప్పుడూ సూడొద్దు. దా తొంగుందాం"
"టీవిలో ఆడంగుల సిగ్గులేని నడకలు సూసి సూసి, నాకు ఈరోజు మనసైతాలేదు, నువ్వలా తొంగో, నేనిలా ఏరుగా తొంగుంటాను"
"వాళ్ళేదో సేస్తే, మనకెందుకు సిచ్చ"
"సెప్పేనుకదా, నాకు మనసైతాలేదని. సల్లగా తొంగో"
మరి చేసేదేమీ లేక రంగడు కాళ్లు రెండూ ముడుసుకొని పడుకుంటే, రంగి వేరుగా అటు తిరిగి పడుకుంది.
మరునాడు రాత్రి --
"ఏటి బావా నీ పక్కలోకి నేనొచ్చి సానా సేపైనా సిన్న సరసం లేదూ. అయినా, నిన్నటి నా యవ్వారం మీద కోపం ఇంకా పోలేదా ఏటి. 'నిన్నరేత్రి నా సేత తప్పైపోనాది, సెమించు' అని పొద్దున్నే నీతో సెప్పేను కదా"
"నీ మీద నాకు కోపమెందుకే. నేను ఏరే ఆలోసిస్తున్నా. నే సెప్పేది మనసెట్టి ఇనుకో"
"సెప్పు మరి" అంటూ రంగడి మీద సేయి ఏసి ఇటు తిప్పుకుంది రంగి"
"ఈరోజు పక్కింటి బాబాయితో గుడికి ఎల్లేను కదా. గుడిలో పంతులుగారు మైకులో సెప్తూంటే, బాబాయి పక్కనే నేను కూడా కూసోని ఇన్నాను"
"ఆ పంతులుగారు ఏటి సెప్పేరు"
"పెక్కుతిలో కలిసిపోయి సరసమాడుకుంటే బాగా తెలివున్న పిల్లలు పుడతారట" అంటూ రంగడు రంగిని తన గుండెకి అదుముకున్నాడు.
"సరసం తరాత, ముంది పెక్కుతిలో కలిసిపోడమంటే ఏటో సెప్పు. ఇనడానికి గమ్మత్తుగా ఉంది"
"ఇనడానికే కాదే నా బంగారం, అనుబయించడానికి కూడా మా సెడ్డ గమ్మత్తుగానే ఉంటాది అనిపిస్తోంది"
"అసలు పంతులుగారు ఏటి సెప్పేరో ఇవరంగా సెప్పు"
"అప్పుడెప్పుడో ఓ ముని మజ్జేనం ఏల ఏరు దాటడానికి ఓ నావ ఎక్కేరట. ఆ నావ నీలాటి అమ్మి నడుపుతోందట. ఆ అమ్మి మీద ఆ మునికి మనసై ‘నీతో సరసమాడతాను’ అన్నాడట. అప్పుడు ఆ అమ్మి అందట --’ నా అబ్బ సేపలు అమ్మే రాజు, నా ఒంటినించి సేపల ఓసన ఒస్తోంది, అంతేకాక, ఈ మజ్జేనం ఏల సరసమేంటి ఎవరేనా సూస్తారు కదా’ -- అన్నాదట"
"మరి ఆ మునేటి అన్నాడట"
"నీ ఒంటినించి సేపల ఓసన పోయి ఎప్పుడూ చందనం ఓసన ఒచ్చేటట్టు సేసేస్తాను, మనం ఓరికీ కనపడకుండా మబ్బులడ్డు ఒచ్చేటట్టు సేసేస్తాను. ఈ నావ కిందన ఏరు, పైన ఎలుతురూ, గాలి, ఆకాశం, ఈ పక్క ఆ పక్క పెద్ద పెద్ద సెట్లతో నిండిన భూమి ఉన్నాయి. ఇలాటి పెకుర్తిలో కలిసిపోయి మనం సరసమాడితే నీకు బాగా తెలివున్న పిల్లాడు పుడతాడు అన్న ముని ఆ అమ్మిని మరేమీ మాటాడనివ్వక – ఆ అమ్మితో సరసమాడేడట"
"మీ మగాళ్లంతా ఇంతే బావా నాజూకైన ఆడది కనిపిస్తే సాలు మాయమాటలు సెప్పి బురిడీ కొట్టి ఎలాగేనా సరసమాడేస్తారు"
"నీ గోల ఆపి ముందు కత ఇనుకో”
"సెప్పు"
“ఆ ముని అలా సరసమాడితే ఆ అమ్మికి పుట్టినోరే యాసులోరట"
"ఈ పేరేడనో ఇన్నట్టుంది బావా"
"ఆరేనే భారతం రాసినోరు"
"ఆ గురుతొచ్చింది బావా"
"సూసేవా ఆ అమ్మి ముని పెకుర్తిలో కలిసిపోయి సరసమాడితే ఎలాటోరు పుట్టేరో. రంగీ మనం కూడా అలా సరసమాడుకుందామే ఏటంటావు"
"నువ్వు సెపుతూంటే నాకు కూడా కోరికగా ఉంది బావా. కానీ, ఈ పల్లెటూరిలో మనకలాటి సులువేదీ"
"నేను అదే ఆలోసిస్తున్నాను”
"బావా మనం మన పొలంలో మంచె ఎక్కేస్తే, మనం కూడా పెక్కుతిలో కలిసిపోయి సరసమాడుకొచ్చు కదా"
"భలే గుర్తు సేసేవే బంగారం"
"కానీ బావా మనం ఆ మునిలాగా మబ్బులడ్డంగా ఎట్టలేము, అక్కడ సుట్టూ ఉన్నోళ్లు మనల్నేసూస్తారు”
"ఓ పని సేద్దాం రంగీ. ఇప్పుడు పొలాల్లో పంటలేవీ లేవు, కాపలాకి పండుకొనే జనం ఎవరూ ఉండరు. మనల్ని ఎవరేనా సూస్తారన్న భయం ఏమీ లేదు. రెండు రోజులు పొతే పున్నమి కదా. రేత్రి అంతా సెంద్రుడు
ఎలుతురు నిండి ఉంటాది. మంచె కింద భూమి ఉండాది. గాలి ఎలాగా ఉంటాది. సెంద్రుడు ఉండేదే ఆకాశంలో. మనం ఎంచక్కా మన పొలంలో మంచె ఎక్కేద్దాం"
"మరి అక్కడ ఏరు లేదే"
"పిచ్చి రంగీ, మన పొలం కాలువ పక్కనే ఉంది కదే. ఆ కాలవ నిండా నీరుంది కదా"
"అంటే, మనం కూడా పెకుర్తిలో కలిసిపోయి సరసమాడుకోచ్చన్నమాట"
"అంతే మరి"
"మనకి కూడా యాసులోరులాంటి బుడ్డడు పుడతాడంటావా"
"ఎందుకు పుట్టడు? పుట్టి భారతం కూడా రాస్తాడు సూస్తూండు"
రెండు రోజుల తరువాత --
రంగీ రంగడు మనసు పడ్డ పున్నిమ రేత్రి, త్వరగా బువ్వ తినేసి, తుండుగుడ్డలు మరో జత బట్టలు దుప్పటీ పట్టుకొని ఎవ్వరి కంటా పడకుండా పొలం చేరుకున్నారు.
ముందుగా ఇద్దరూ కాలవలోకి దిగి సరిగంగ స్నానాలు సేసి, మనసుని తనువుని నెగడుతో నింపేరు.
సానాసేపు అలా ఆడుకొని గట్టు మీద చేరిన జంట తుండుగుడ్డలతో ఒకరి మేను మరొకరు తుడుస్తూ అప్పటికే నింపిన నెగడు ఆరకుండా ఎగదోసేరు.
కాలవలోకి దిగినప్పుడు విడిచిన బట్టలు పిండి ఆరేసి, తెచ్చుకున్న మరో జత బట్టలు మార్సుకొని, రంగడు ముందుగా మంచె ఎక్కి రంగికి చేయి అందించి మంచెమీదకు లాగేడు.
పున్నమి చంద్రుడు నింగి నేల అంతా వెన్నెల తివాసీ పరిచి పడుచు జంటల గుండెల్లో వేడి నింపుతున్నాడు.
మంచె కింద పొలం, మంచె మీదన ఆకాశం, ఆకాశంలో పుచ్చపువ్వు లాంటి వెలుతురుతో మత్తుగా వెన్నెల కురిపిస్తూ నెలరేడు, మంచె పక్కనే ఉన్న కాలువలో నిండిన నీటి మీంచి వస్తున్న చల్లని గాలి –
ఇలా ప్రకృతి నడుమ మంచె మీద పడచు జంట -- రంగడు, రంగి –
ఈ విశాల విశ్వమంతా వారిద్దరే ఉన్నట్టు, వారికి కూడా వ్యాసులవారిలాంటి అబ్బాయి పుడతాడన్న నమ్మకంతో –
ప్రకృతి నడుమ హుషారుగా సాగుతున్న వారి సరససల్లాపాల మధ్యన కురిసే వెన్నెల, వీచే గాలి, క్షణంలో ఆవిరైపోతున్నాయి.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#48
ధీర వనిత ప్రేమ కథ - డా.సి.యస్.జి.కృష్ణమాచార్యులు
[Image: image.png]
చెన్నయి విమానాశ్రయం.
ప్రయాణీకుల లాంజ్ లోనికి ప్రవేశించిన ఉదయ్ కొద్ది దూరంలో ఖరీదైన సూటులో వున్న యువతిని చూసి, రాణీ!అని పిలిచాడు. అతడిని చూస్తూనే ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది.
“హాయ్! ఉదయ్! ఎన్నాళ్లకు”అంటూ ఆమె అతడిని స్నేహపూర్వకంగా కౌగలించుకుంది .
“అమెరికా నుంచి వచ్చేసి వారం రోజులైంది. నువ్వు మంచి వుద్యోగంలో వున్నావని తెలిసింది. కంగ్రాట్స్.’
“ ఆహా!నీ దయవల్ల సియ్యే అయిన తర్వాత, ఒక కన్సల్టన్సీలో చేరాను. నా సామర్ధ్యం నచ్చి నన్ను ఇందూ ఇండస్ట్రీస్ యెండీ తన ఎక్సిక్యూటివ్ అసిస్టెంట్ గా తీసుకున్నాడు.” అని చెప్పింది రాణీ సంతోషంగా.
“గుడ్. అవకాశాలను అందిపుచ్చుకోవడమే కదా సామర్ధ్యం?”
“మా ఆడపిల్లల విషయంలో, అందుకోవడం కాదు, పోరాడి గెలుచుకోవడమే. పోరాడే ఆడదాన్నిఇంగ్లీషులో డెవిల్ అంటారు, పురుషుడిని మొనగాడంటారు.”
“నువ్వు మారలేదు. అదే ధైర్యం, అదే పోరాట స్పూర్తి.”
“థాంక్స్. బహుశా ఈ కార్పొరేట్ ప్రపంచంలోకి రాకుండా వుంటే వేరేలా వుండేదాన్నేమో?”
“నిజమే, ఇది పోటీ ప్రపంచం. ఎవరి స్వార్ధం వారిది. ఇంతకీ నీవుండేది యెక్కడ.?”
“చెన్నయి. కానీ ఎక్కువ రోజులు టూరులో వుంటాను.”
ఇంతలో బెంగళూరు విమానం బోర్డింగ్ అనౌన్స్ చేసారు. మళ్ళీ కలుద్దామని చెప్పుకుని ఫోన్ నంబర్లు ఒకరికొకరు యిచ్చిపుచ్చుకున్నారు. డిల్లీకి వెళ్ళే విమానంలో కూర్చున్న ఉదయ్ కి కాలేజి రోజులు గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు. పెంకి పిల్ల, పోట్ల గిత్త, రౌడీ లాంటి పేర్లతో చలామణి అయ్యే రాణి తో తను నెరపిన స్నేహం, గుర్తుకొచ్చి అతని పెదవులపై చిరు దరహాసం మెరిసింది. అతని మనసు గతంలోకి పరుగు తీసింది.
@@@
ప్రభుత్వ సైన్సు & ఆర్ట్స్ కళాశాల.
బీ కాం మొదటి సంవత్సరం. విద్యార్ధినీ విద్యార్ధులు కలిసీ కూర్చునే పద్దతి వుండడం వల్ల ఆడ పిల్లలతో పరిచయాలు సులభంగా అయ్యేవి. ఆడపిల్లలందరిలో రాణీని రౌడీ అనేవారు. ఆమె మిగిలిన ఆడపిల్లలతో పోలిస్తే భిన్నంగా వుండేది. సాధారణంగా, జీన్స్ ధరించి, ఎటువంటి మేకప్ లేకుండా వచ్చేది. అలా వున్నా కూడా, ఆమె చూపులకు అందంగా, ఆకర్షణీయంగా వుండేది. ఆమె మగపిల్లలతో స్వేచ్చగా ఎటువంటి అరమరికలు లేకుండా మాట్లాడేది. ఒక నెలరోజులు పాటు, ఆమెను గమనించిన తర్వాత, ఒక రోజు ఉదయ్ ఒంటరిగా వున్న రాణీని అడిగాడు.
“నిన్ను కొందరు ఎందుకు రౌడీ అంటున్నారు?”
“వాళ్ళకలా అనిపించింది.” అంటూ రాణి నవ్వేసింది. ఆమే స్వచ్చమైన నవ్వు ఉదయ్ కి నచ్చింది.
“కాదులే! చెప్పరాదూ, నాకు తెలుసుకోవాలని వుంది.” అన్నాడు ఆసక్తి కనబరుస్తూ
“ఇంకెప్పుడైనా”, అంటూ రాణి రివ్వున పరిగెత్తి మాయమైంది.
అక్కడే కొద్దిదూరంలో వున్న హరిణి, “నన్నడుగు చెప్తాను”, అంది ఉదయ్ తో.
“సరే! చెప్పు” అన్నాడు ఉదయ్.
హరిణి వచ్చి అతని ప్రక్కన కూర్చుని యిలా చెప్పింది.
“ దాన్ని రౌడీ అని ప్రేమగా అనేది మా వూరిపిల్లలే. రాణిది మావూరే. ఆమె తండ్రి త్రాగుబోతు. రోజూ త్రాగొచ్చి, తల్లిని తిట్టడం, కొట్టడం చేస్తూంటే, ఒక రోజు రాణి అతనికి యెదురు తిరిగింది. తల్లి వంటి మీద దెబ్బ వేస్తే చంపిపాతరేస్తానని బెదిరించింది. ఆ రోజునుంచి పూర్తిగా ఆయన మాట వినడం మానేసి. తనకు నచ్చినట్లు చదవడం, ఆటలాడడం చేసేది. తనను గాని, తన అక్కను గాని మగపిల్లలు హేళనగా ఒక మాట అంటే చాలు పరుగెత్తించి కొట్టేది. అలా దానికి పెంకి ఘటం, రౌడీగా పేరు వచ్చింది. ఒక్క సారి వాళ్ల అక్క చెయ్యిపట్టుకుని ఒకడు అల్లరి చేయబోతే, రాణి వాడి చెయ్యి విరగ్గొట్టింది. ఆ అబ్బాయి తండ్రి వూరిపెద్దల దగ్గర పంచాయతీ పెట్టాడు. రాణి ఎంతమాత్రం భయపడకుండా, వారి ముందు నిలబడింది. ఇది తెలిసిన వెంటనే మా వూళ్ళో ఆడవారు వచ్చి అల్లరి మూక చేష్టలను యెండగట్టి, రాణి చర్యను సమర్ధించారు. చేసేది లేక ఆ అబ్బాయి తండ్రి, వెళ్ళిపోయాడు. అలా రాణీ మా వూరి రుద్రమ గా పేరుతెచ్చుకుంది. తను కరాటే నేర్చుకుంది. మంచి బాడ్మింటన్ ప్లేయర్. చదువులో ముందుంటుంది. అదీ రాణి కథ” అని హరిణి చెప్పడం ముగించింది.
రాణీ గురించి తెలిసాక, ఉదయ్ కు ఆమె పట్ల ఒక గౌరవభావమేర్పడింది. ఆమెతో స్నేహం చేసి, ఆమెకు చదువులో తోడ్పడాలనుకున్నాడు.
పలకరిస్తే “హాయ్” అని వెళ్ళిపోతున్న ఆమెను ఒక రోజు “ఏమిటి? నన్ను చూసి పారిపోతున్నావు?” అని వెక్కిరించాడు. అంతే. అతననుకున్నట్లే ఆమె ఆగింది
“అలా అనిపించిందా నీకు! నేనింకా పని లేని వారితో పెత్తనాలెందుకనుకున్నా. విషయమేమిటి?” అని నిలదీసింది.
“ఇలా రా! ఒక నిమిషం,” అంటూ కళాశాల ఆవరణలో తనకు దగ్గరలో వున్న చెట్టు క్రిందికి వెళ్ళాడు. ఆమె వచ్చి అతని కభిముఖంగా నిలబడింది.
“నీ గురించి తెలుసుకున్నాను. నీ ధైర్యానికి , పోరాట పటిమకు నా అభినందనలు. నీ చదువుకు లక్ష్యమేమిటొ తెలుసుకుందామని నిన్ను ఆపాను.”
రాణి అనుమానంగా చూస్తూ, “నీ కెందుకు?” అని పుల్లవిరుపుగా అంది.
‘యిష్టం లేకుంటే చెప్పకు. తోటి విద్యార్ధిగా అడిగాను,’ అన్నాడు ఉదయ్ నవ్వుతూ.
ఒక నిమిషం మౌనంగా వుండి, “ సియ్యే చేయాలని నా కోరిక” అంది నెమ్మదిగా.
“మా పెదనాన్న ప్రాక్టీస్ చేస్తున్నచార్టర్డ్ అకౌంటెంట్. ఈ వూళ్ళోనే. నేను చెప్తే ఆయన నీకు గైడెన్సు యిస్తారు. ఈ ఆదివారం వుదయం వెళ్దామా?”
రాణి సందేహంగా అడిగింది. “నువ్వెందుకు నాకు సహాయం చేస్తున్నావు?”
‘నీకు మంచి స్నేహితుడిగా వుండాలని. ఇష్టం లేకుంటే బలవంతం లేదు’ అన్నాడు ఉదయ్. నిర్వికారంగా వున్న అతని వదనాన్నిచూసి రాణి, “నమ్ముతున్నాను” అంటూ చేయి చాచి కరచాలనం చేసింది.
అలా మొదలైన వారి స్నేహం, కలిసి చదువుకోవడంవల్ల , ఒకరి అభిప్రాయలను, మరొకరు గౌరవించడం వల్ల, బలపడింది. అలా సాగుతున్న వారి స్నేహ బంధానికి ఒకనాడు చిన్న పరీక్ష యెదురయ్యింది.
రాణి తరచుగా, ఆ కళాశాల పాలిటిక్స్ మాస్టారు రఘుతో మాట్ల్లాడడం గమనించిన ఉదయ్, ఆమెనొక రోజు “ఏం జరుగుతోంది?” అని ప్రశ్నించాడు. రాణికి అతనలా ప్రశ్నించడం నచ్చలేదు.
ఆమె ముఖ కవళికలను గమనించిన ఉదయ్ వెంటనే, “సారీ! నీ వ్యక్తిగతమైతే చెప్పకు” అని మాట మార్చాడు. అతనలా అపరాధ భావం ప్రకటించడంతో, రాణి నొచ్చుకుని, స్నేహపూర్వకంగా యిలా చెప్పింది.
“సారీ! నీకు చెప్పివుండాల్సింది. ఆయన, మా అక్క సుజాత ప్రేమించుకున్నారు. మా నాన్నను కలిసి ఆయన, తమ ప్రేమ విషయం చెపితే, వీలు కాదని చెప్పి, మా నాన్న మొన్న వేసవిలో అక్కనొక గవర్నమెంట్ వుద్యోగికిచ్చి పెళ్ళి చేసాడు. అదే చెప్పి రఘుగారు బాధ పడుతున్నారు.”
“పాపం! మీ అక్క యెలా వుందో! భర్త మంచి వాడైతే ఈ ప్రేమను మర్చిపోగలుగుతుంది.” అన్నాడు ఓదార్పుగా.
రాణీ మౌనంగా ఆలోచిస్తూ వుండిపోయింది. ఆమె మనసులో అగ్ని పర్వతాలున్నాయని, అవి ఒక రోజు పేలతాయని ఆనాడు అతడికి తెలియదు.
దాదాపు నెలరోజుల తర్వాత ఒక వార్తతో ఆ వూరూ, కళాశాల అట్టుడికిపోయాయి.
రాణీ అనే అమ్మాయి ఆమె బావ పురుషాంగం కొరికేసిందని, రాత్రి నిద్రపోతున్న సమయంలో మృగంలా మీద పడి అత్యాచారం చేయబోయిన అక్క భర్త నుంచి తనను తాను రక్షించుకునే క్రమంలో ఆమె యిలా చేసిందని టీవీలో మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. రాణి యెలాగుందో, సెక్యూరిటీ ఆఫీసర్ల అదుపులో వుందా అని ఉదయ్ భయపడిపోయాడు.
ఇంతలో హరిణినుంచి ఫోన్ వచ్చింది.
“రాణి ని ఆస్పత్రిలోచేర్చారు. గాయాలకు చికిత్స జరుగుతోంది. తనకేం పరవాలేదు. మన ప్రిన్సిపాల్ కూడా యిక్కడే వున్నారు. నిన్నుగాభరా పడవద్దని చెప్పింది”. .
ఆమె క్షేమ సమాచారం తెలిసాక, ఉదయ్ మనసు కుదుటపడింది. మరునాటికే ఆ సంఘటన మరుగున పడింది. పది రోజుల తర్వాత రాణి క్లాసులకు హాజరయ్యింది. మెల్లగా ఒక రోజు, రాణి ఉదయ్ కి అసలేం జరిగిందో వివరంగా చెప్పింది.
“బావ ఒక సెక్స్ సైకో. శోభనం రాత్రి ఆ దరిద్రుడు మాఅక్కకి వూహించని షాక్ యిచ్చాడు. అతడు మా అక్కతో, ఈ ప్రపంచంలో అన్నింటికన్నాయెక్కువ తృప్తినిచ్చేది సెక్స్. ఈ సొసైటీ దానినొక పాపంగా చూడడం మన దురదృష్టం. అందుకే నేను, నా స్నేహితులం కలిసి ఒక ఒప్పందానికి వచ్చాము. అదే భార్యల మార్పిడి. రాత్రి నువ్వు నా స్నేహితుడితో గడిపితే, అతని భార్య నాతో గడుపుతుంది. నచ్చిందా! ఇది అదృష్టం కదూ! అని వుత్సాహంగా చెప్పాడు.
బావ మాటలకు అక్క అదిరిపడింది. ఏదో గుట్టుగా బ్రతుకుదామనుకుంటే ఈ గోల యేమిటి అని తల్లడిల్లిపోయింది. బావతో కరాఖండిగా, ఇది నా వల్ల కాదు. మీరెలా వూరేగినా మీ యిష్టం. నా జోలికి రాకం డని చెప్పింది. బావ కోపంతో వూగిపోతూ అక్కను గొడ్డును బాదినట్టు బాదాడు. అప్పట్నుంచి అక్కను మానసికంగా హింసించడ మొక పనిగా పెట్టుకున్నాడు. శని, ఆదివారాలు అమ్మాయిలను ఇంటికి తెచ్చి అక్కను హేళన చేస్తూ వాళ్ళతో సరసాలాడేవాడు”.
‘వినడానికి అసహ్యంగా వుంది. మీ అక్క యెలా కాపురం చేస్తోందో ? ‘ అని సానుభూతి చూపాడు ఉదయ్.
“అవును. నిజానికి మా అక్క ఈవిషయం దాచింది. తను చేస్తోంది గొప్పపని అని నమ్మిన మా బావే నాకీ విషయం చెప్పి, నన్ను తనతో గడపమని కోరాడు. తన స్నేహితులకు పరిచయం చేస్తానన్నాడు. అక్కలా జడ పదార్ధంలా వుండడం అవివేకమని హితవు చెప్పాడు. అప్పుడే బావకి శాస్తి చేసి, ఆక్కకు విడాకులిప్పించాలని పధకం వేసాను. రఘు మాస్టారును కలిసి అక్క పరిస్థితి చెప్పి, విడాకులు తీసుకుంటే పెళ్ళి చేసుకొంటారా? అని అడిగాను. ఆయన తప్పక చేసుకుంటానని మాటయిచ్చారు.”
‘”పులి నోట్లో తలబెట్టి, పులిని చావగొట్టిన వీర నారీ మణివన్న మాట”, అన్నాడు ఉదయ్ ప్రశంసాపూర్వకంగా.
“అవును. ఒక రోజు మా బావని కాస్త రెచ్చగొట్టేలా ప్రవర్తించాను. అంతే, ఆ నాటి రాత్రి, మా బావ త్రాగి వచ్చి నామీద పడ్డాడు. ముందు జాగ్రత్తలో వున్న నేను వాడిని గాయపరిచాను. అంతే! నా దెబ్బకి గాయ పడి హాస్పిటల్ పాలయ్యాడు. కేసు దెబ్బకి పరువెలాగో పోయింది, వుద్యోగమైనా నిలబెట్టు కుందామని రాజీ కొచ్చాడు. లంచాలతో పొలీసుని, మీడీయాను సైలెంట్ చేసాడు. అక్కకు విడాకులు త్వరలో వస్తాయి.”
ఆనందంతో చెప్తున్న రాణి ని చూసి ఉదయ్ నవ్వుకుంటూ,“ నీవు సామాన్య స్త్రీవి కావు, ఒక యోధవి ”అని అభినందించాడు.
@@@
బెంగళూరు చేరిన వుదయ్, వుద్యోగంలో జాయినయ్యాడు. ఒక చక్కని అపార్టుమెంట్ అద్దెకు తీసుకున్నాడు. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ వుంది. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్ళనక్కరలేదు. ఈ విషయం రాణీకి చెబుదామని మరుసటి రోజు ఉదయమే ఫోన్ చేసాడు.
వెంటనే ఫోన్ అందుకున్న, రాణి అడిగింది.”‘ఎక్కడనుండి? ఎలా వున్నావు?”
“బెంగళూరులో వున్నాను. ఇక్కడే వుద్యోగం. నువ్వెక్కడ?”
“కంగ్రాట్స్. నేనిప్పుడు బెంగళూర్లో హోటల్ గదిలో వున్నాను.”
“అక్కడెందుకు? ఇంటికి వచ్చెయ్యి?”
“జలుబూ దగ్గు. గత వారం నుంచి చంపేస్తున్నాయి. నీకు కూడా అంటుకుంటాయి.”
“వంట్లో బాగోలేనప్పుడు హోటలెందుకు? లొకేషన్ పంపుతున్నాను. వెంటనే బయలుదేరి రా! రాగలవా, నేను రానా?” అని ఆదుర్దాగా అడిగాడు ఉదయ్.
అతని పిలుపులో ధ్వనించిన ఆప్యాయతని అర్ధం చేసుకున్న ఆమె మనసు ఆర్ద్రమైంది.
“వద్దు. లొకేషన్ వచ్చింది. దూరం పది కిలోమీటర్లే. నేనే వస్తాను,” అని జవాబిచ్చింది.
ఒక గంట తర్వాత రాణి తన సామానుతో వచ్చింది. తన వెంట వచ్చిన యువతిని తన సహోద్యోగి స్వాతి యని, ఉదయ్ కి పరిచయం చేసింది.
ఉదయ్ ఇద్దరినీ ఆహ్వానించి, యిల్లు చూపించాడు. టీ త్రాగి, కాసేపు కబుర్లు చెప్పి స్వాతి వెళ్ళిపోయింది. ఈ కొద్ది సమయంలోనే రాణి నాలుగైదు సార్లు దగ్గడం చూసి,”మందులు వాడుతున్నావా, డాక్టరేం చెప్పాడు?” అని అడిగాడు.
“ఎగువ శ్వాసకోశ సంక్రమణ, ఇదొక వైరల్ వ్యాధి అన్నాడు. టాబ్లెట్స్ యిచ్చాడు కానీ, విశ్రాంతి తీసుకోవడం, ఎక్కువగా నీరు త్రాగడం, యూకలిప్టస్ తో ఆవిరి పట్టడం, ఉప్పు నీటితో పుక్కిలించడం వగైరా వుపశమనాలు చెయ్యాలన్నాడు. రెండు వారాలకు పైగా వుంటుందట. ఒక వారమైంది.”
“అయితే రా! పడుకుని విశ్రాంతి తీసుకో”అంటూ ఆమె చేయి పట్టుకుని పడకగదికి తీసుకెళ్ళాడు.
“త్రాగడానికి గోరు వెచ్చని నీరు, వుమ్మి వేయడానికో పాత్ర, యిక్కడున్నాయి,” అని చూపించాడు. ఆమె పడుకున్నాక, పల్చని దుప్పటి కప్పి,”ఏం కావాలన్నా పిలు,” అని చెప్పి వెళ్ళిపోయాడు.
రాణి తృప్తిగా కళ్ళు మూసుకుని పడుకుంది.
@@@
స్వాతి ప్రతి రోజూ యేదో ఒక సమయంలో వచ్చి వెడుతోంది. ఒక రోజు స్వాతి, రాణి నడిగింది.
“మీకు ఉదయ్ అంటే యిష్టం , ఆయనకి కూడా మీరంటే ఇష్టమే కదా! మీరెందుకు పెళ్ళి చేసుకోరు?”
రాణి దిగులుగా బదులిచ్చింది.”ఉదయ్ నాకున్న ఒకే ఒక ఆప్తమిత్రుడు. నా శ్రేయోభిలాషి. అందుకే నేను నా ప్రేమను చెప్పలేక పోతున్నా” .
“ఆయనకు కూడా అదే భావన అనుకుంటా. బహుశా మీ కెరీర్ కి తను అడ్డుకాకూడదని ఆయన మీకు ప్రపోజ్ చేయలేదు. మీరే ముందు ప్రపోజ్ చెయ్యాలి” అని సలహా యిచ్చింది స్వాతి,
“నా గతం తెలిస్తే, నువ్వీ సలహా యివ్వవు. ఇంట్లో తాగుబోతు తండ్రిని, వూళ్ళో అల్లరి మూకని యెదిరించిన రౌడీ పిల్లని. ఒక సైకోని గాయపరిచిన నేరస్తురాలిని. కార్పొరేట్ పోటీ ప్రపంచంలో మగరాయుడిలా తిరిగే, నన్నెవ్వరూ పెళ్ళి చేసుకోవడానికి యిష్టపడరు.” అని తన మనసులోని బాధను వ్యక్త పరిచింది.
ఆమె బాధని చూసి, యేమనాలో అర్ద్ధం కాక స్వాతి కొద్ది సేపు మౌనంగా వుండిపోయింది. ఆ తర్వాత మృదువయిన స్వరంతో నవ్వుతూ అంది.
“ఎవరి సంగతో మనకెందుకు? ఉదయ్ మిమ్మల్నే కోరుకుంటున్నాడని నా నమ్మకం.”
@@@
నాలుగు రోజుల తర్వాత రాణి కి దగ్గు తగ్గింది. ఆమె హోటలుకి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొని ఉదయ్ తో యిలా చెప్పింది.
" మేమొక కంపనీ కొనుగోలు విషయంగా వచ్చాం. మూడు రోజుల్లో మా యెండీ వస్తున్నాడు. ఈ టైములో నేనక్కడ వుండడం అవసరం. ఈ డీల్ పూర్తయ్యాక నేను ఉద్యోగం వదిలేస్తాను. మా బాస్ నా స్థానంలో తన మేనల్లుడిని తెచ్చుకోవాలనుకుంటున్నాడు . నిజానికి, నేను అతని కోరిక తీర్చనందుకు యెప్పుడో వుద్వాసన చెప్పాలి. కానీ, నా అవసరం వుండబట్టి నన్ను వదులుకోలేదు. గౌరవంగా నేనే రాజీనామా చేస్తాను." అంది రాణి నిర్విచారంగా.
“అలాగా! మరి వేరే వుద్యోగం చూసుకున్నావా? .
" లేదు. కొన్నాళ్ళు ఇంట్లో వుందామనుకుంటున్నా. అమ్మా,నాన్నా పెళ్ళి చేసుకోమని గోల పెడుతున్నారు. కానీ నా బయోడేటా తెలిసిన వాడేవడూ నన్ను చేసుకోవడానికి సాహసించడం లేదు."
“అది నా అదృష్టం. ఆ దేవుడు నిన్ను నాకోసమే పుట్టించాడు."
ఉదయ్ మాటలకు రాణి వులిక్కి పడింది
"ఏమంటున్నావు? నీ తల్లి దండ్రులు ఒక రౌడీ పిల్లని యిష్టపడతారా?”
"వాళ్ళకి ఎప్పుడూ ఇష్టమే. ఒక ధీర వనిత కోడలుగా రావాలన్నది వారి కోరిక. రేపు వాళ్ళు వస్తున్నారు, మనల్ని ఆశీర్వదించడానికి"
"నిజమా?" ఆనందం, ఆశ్చర్యం ముప్పిరిగొనగా అడిగింది రాణి.
"మీ అక్కా, బావా, అమ్మా నాన్నా కూడా వస్తున్నారు. ఎల్లుండి మన నిశ్చితార్ధం"
చిరునవ్వుతో ఉదయ్ చెబుతున్న మాటలకు రాణి కళ్ళప్పగించి ఉదయ్ ని చూస్తూ స్థాణువులా నిలిచిపోయింది.
ఒక నిమిషం తర్వాత తేరుకుని, " నాతో ఒక్క మాటైన చెప్పకుండా."
ఆమె మాటలకు అడ్డుపడుతూ, "నా రాణి మనసు నాకు తెలియదా? నిన్నింక ఎక్కడికీ పోనివ్వను. నువ్వు నా భార్యగా నాతోనే వుండాలి"అంటూ ఉదయ్, ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఆమెను దగ్గరకి తీసుకున్నాడు . " నేనెంత అదృష్ట వంతురాలిని. " అంటూ రాణి అతడిని కౌగలించుకుంది.
@@@@@
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#49
దయ్యం వలచిన రాత్రి(శృంగార కథ) - తిరుమలశ్రీ
[Image: Picture.png]


రాత్రి పది గంటలవుతుంది... అమావాస్య చీకటి కాటుకలా చిక్కగా, దుష్టుడి మనసులా నల్లగా అలముకుంది. శీతాకాలమేమో, గ్రామం సందకడనే చీకటి దుప్పటి కప్పేసుకోవడంతో గ్రామస్థులంతా చలికి ముసుగులుదన్ని నిద్రాదేవి ఒళ్ళో వెచ్చగా ఒరిగిపోయారు.

ఊరికి ఉత్తరాన ఉన్న చింతతోపులో చెట్లు దయ్యాలలా తలలు విరబోసుకుని గాలికి భయంకరంగా ఊగుతున్నాయి. దట్టంగా నిండుకున్న చీకట్లో కీచురాళ్ళ ధ్వనులు, తీతువు పిట్టల కూతలు, గాలి వేసే ఊళలు, ఏవేవో వింత శబ్దాలు, స్వైరవిహారం చేస్తూన్న మిణుగురు పురుగుల మెరపు కాంతులూ తప్ప గుండెలు అవిసే నిశ్శబ్దం ఆవహించుకుంది. వాచ్ టవర్స్ నుండి కనిపెడుతూన్న పహరాగాళ్ళలా చెట్లమీదున్న గుడ్లగూబల కళ్ళు టార్చ్ లైట్సులా చీకట్లో వెలుగుతున్నాయి.

అదే సమయంలో - తెల్లటి చీరలో ఉన్న ఓ స్త్రీ ఆకారం ఆ చింతతోపులో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఒంటరిగా తిరుగాడుతోంది. ఆమెను చూసి కాబోలు, ఓ చెట్టు మొదట్లో మూడంకె వేసుకుని పడుకున్న కుక్క ఒకటి మొరిగింది. తరువాత ఎవరో పోయినట్టు మోర పైకెత్తి ఏడ్పు లంకించుకుంది. చెట్ల మీద ప్రశాంతంగా నిద్రిస్తూన్న పక్షులలో ఓ క్షణం కలకలం రేగింది. కుక్క పడుకున్న చోటు నుండి కదలకుండా ఏడుస్తూనే ఉంది.

హఠాత్తుగా నిల్చుండిపోయింది ఆ స్త్రీ. కట్టెదుట ప్రత్యక్షమైన ఆకారాన్ని చూడడంతో ’కెవ్వు’న అరచి తెలివితప్పి దబ్బున నేలపైన పడిపోయింది...

**** **** **** ****
"దయ్యాలు, భూతాలు... నాన్సెన్స్! అదంతా మన చిత్తభ్రమ. మన మనసులోని భయాలే దయ్యాలై మనల్ని భయపెడుతూంటాయి," అన్నాడు నాయుడు గారి బుల్లెబ్బాయి. "లోకంలో మనిషిని మించిన దయ్యం ఎక్కడుంటుంది!"

బుల్లెబ్బాయికి ఇరవయ్యేళ్ళుంటాయి. హ్యాండ్సమ్ గా ఉంటాడు. పల్లెలో పుట్టి పల్లెలో పెరిగిన పదహారణాల రైతు బిడ్డ. కాని, పల్లె ప్రజలలో ఉండే మూఢనమ్మకాలకు దూరం. చిన్నప్పట్నుంచీ దయ్యాల కబుర్లు, కథలూ వింటూ పెరిగినా... వాటి మీద నమ్మకంలేదు అతనికి.

"ఒకవేళ నిజంగానే నీకు దయ్యం ఎదురైతే ఏం చేస్తావ్?" అడిగాడు కృష్ణ.

"దాని పుట్టుపూర్వోత్తరాలు కనుక్కుంటాను" అన్నాడు బుల్లెబ్బాయి.

"అంత మొనగాడివా?" వెటకారంగా అడిగాడు ఎర్రియ్య.

"దయ్యమనేదే ఉంటే, పంపించి చూడు. దానితో ఆడుకుని నేనెంతటి మొనగాణ్ణో దానికే చూపిస్తాను" నవ్వాడు బుల్లెబ్బాయి. "ఐతే నీకు దయ్యాలంటే అసలు భయం లేదంటావ్?" రెట్టించాడు రాములు.

"దయ్యాలంటే భయమే కాదు, వాటి ఉనికి మీద నాకు నమ్మకం కూడా లేదు" దృఢంగా అన్నాడు బుల్లెబ్బాయి.

ముఖాలు చూసుకున్నారు మిత్రులు ముగ్గురూ. ఆ నలుగురూ ఇంచుమించు ఒకే వయసువాళ్ళే. చిన్నప్పట్నుంచీ ఆడుతూ పాడుతూ కలసి పెరిగినవాళ్ళే. గ్రామంలో ఉన్న బళ్ళో పదో తరగతి వరకు చదువుకుని, పై చదువులు చదివితే మాత్రం ఉద్యోగాలు దొరుకుతున్నాయా ఏమిటీ అనుకుని, తండ్రుల వ్యవసాయంలో సాయం చేయసాగారు.

ఇంతకూ వారి దయ్యాల సంభాషణకు మూలం ఏమిటంటే...

కాలక్షేపం కోసం కథల పుస్తకాలు చదవడం అలవాటు ఆ మిత్రులకు. క్రైమ్ కథలంటే మరీ ఇష్టం. సమీపంలోని టౌన్ కు వెళ్ళినప్పుడల్లా ఎవరికి కనిపించిన పత్రికలు వారు తీసుకొస్తూంటారు. వాటిని తమ మధ్య సర్క్యులేట్ చేసుకుంటూంటారు.

రెండు రోజుల క్రితం ఎరువులు కొనడానికి టౌన్ కు వెళ్ళిన ఎర్రియ్య స్టాండ్స్ లో ఓ కొత్త పత్రికను చూడడం జరిగింది. ఓసారి దాన్ని తిరగేసి చూసి వెంటనే కొనేసాడు... అందులోని కథలు, బొమ్మలు ఆకట్టుకోవడంతో రెండు రోజుల్లోనే దాన్ని చదవడం పూర్తిచేసేసారు ఎర్రియ్య, కృష్ణుడు, రాములూను. తరువాత వాళ్ళు దాని గురించే చర్చించుకుంటూంటే బుల్లెబ్బాయి అక్కడకు రావడం జరిగింది.

"దీని మీద భయానక మాసపత్రిక అని రాసుంది. అంత భయానకంగా ఉంటుందా?" సాశ్చర్యంగా అడిగాడు బుల్లెబ్బాయి.

"చదివి చూడు" అన్నాడు ఎర్రియ్య.

బుల్లెబ్బాయి పత్రిక తిరగేసి, "దీన్నిండా దయ్యాలు భూతాలే కనిపిస్తున్నాయి!" అన్నాడు నవ్వుతూ.

"నేరాలు ఘోరాలు కూడాను" అన్నాడు రాములు.

ఆ విధంగా మిత్రుల సంభాషణ ’అసలు దయ్యాలనేవి ఉన్నాయా లేవా?’ అన్న విషయంపైకి దారి తీసింది. పత్రిక చదువు. నీకే తెలుస్తుంది" అన్నారు వాళ్ళు. కథలు వేరు, కఠిన సత్యాలు వేరూనన్నాడు అతను. చినికి చినికి గాలివాన ఐనట్టు, వారి వాదం పందాల వరకు దారి తీసింది.

"మన ఊరి బైటున్న చింతతోపులో దయ్యాలు తిరుగుతున్నాయంటారు. అప్పుడప్పుడు రాత్రులు మన గ్రామంలో ఎందరికో అవి కనిపించిన దాఖలాలు ఉన్నాయి" అన్నాడు కృష్ణ.

"అవన్నీ నీడల్ని చూసి జడుసుకునే కేసులు. నేను నమ్మను" అంటూ కొట్టిపారేసాడు బుల్లెబ్బాయి.

"సరే. మనం ఓ పందెం వేసుకుందాం... రాబోయే అమావాస్యనాటి రాత్రంతా చింతతోపులో ఒంటరిగా గడపాలి నువ్వు. అప్పుడే నీకు నిజంగానే దయ్యాలంటే భయం లేదని నమ్ముతాం" అంటూ సవాలు విసిరాడు రాములు.

"తప్పకుండా. దయ్యం కనిపించాలే కాని, దానితో ఓ ఆటాడుకోనూ?" అన్నాడు బుల్లెబ్బాయి నవ్వుతూ.

"పరిహాసానికి పోయి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దురా, బుల్లెబ్బాయ్!" హెచ్చరించాడు ఎర్రియ్య.

"నో ప్రోబ్లెమ్. పందెం ఏమిటో చెప్పండి" అన్నాడు బుల్లెబ్బాయి.

"నువ్వు నిజంగానే అమావాస్యనాటి రాత్రంతా చింతతోపులో గడిపి వచ్చావంటే... ’మగధీర’ బిరుదుతో నిన్ను సత్కరిస్తాం" అన్నాడు ఎర్రియ్య.

"నాకు బిరుదులొద్దు. పందెంలో నేను గెలిస్తే మీరు ముగ్గురూ మా పొలంలో వారమేసి రోజులు పనిచేయాలి. మీరు గెలిస్తే నేను మీ పొలాలలో పనిచేస్తాను" చెప్పాడు బుల్లెబ్బాయి.

మిగతావారు ముఖాలు చూసుకుని, ’సరే’ నన్నారు.

**** **** **** ****
ఆ రోజు ఆదివారం. బహుళ అమావాస్య. చీకటికి భయపడి కాబోలు చంద్రుడు అంబరంలో అడుగుపెట్టలేదు. నెలరేడును కానక బిక్కు బిక్కు మంటున్నాయి నక్షత్రాలు.

చింతతోపు చీకట్లో జలకాలాడుతోంది. దూరంగా ఉన్న గోదావరి మీంచి వీస్తూన్న గాలి హోరు జోరు పెరగడంతో దయ్యాల్లా నిల్చున్న చింత చెట్లు పూనకం వచ్చినట్టు తలలు ఊపుతున్నాయి. కీచురాళ్ళు సంగీతం పాడుతూంటే... లయగా గాలి ఈల వేస్తూంటే... మిణుగురు పురుగులు ఫ్లయింగ్ సాసర్స్ లా ఎగురుతూ చీకటికి వెలుగు చూపడానికి వృథా ప్రయాస పడుతూంటే... నిశ్శబ్దం తోపును ఏలుతూంటే... చెట్ల మీది గుడ్లగూబలు టార్చ్ లైట్స్ లాంటి కనుగ్రుడ్లతో చూస్తూ ఉండి ఉండి అరుస్తూంటే... అక్కడి వాతావరణం భయానకంగా ఎంతటి ధైర్యవంతుడికైనా గుండెలు అవిసేలా ఉంది.

రాత్రి పది గంటలకు - ఆ చింతతోపులో అడుగుపెట్టాడు బుల్లెబ్బాయి. చేతిలో పెన్ టార్చ్ ఉంది. ఆ వాతావణం చూస్తే ఓ క్షణం ఏదో భీతి కలిగింది అతనికి... పెన్ టార్చ్ గ్రుడ్డి వెల్తురులో తోపంతా తిరిగివచ్చాడు.

ఓ చింతచెట్టు క్రింద కూర్చూంటూంటే, ఆ సాయంత్రం ఎర్రియ్య అన్న మాటలు గుర్తుకు వచ్చాయి -'ఒరేయ్! దయ్యాలు చింతచెట్ల మీదే ఉంటాయి. నువ్వు వెళ్తున్నది చింతతోపుకు. ఎందుకైనా మంచిది, ఇంకోసారి ఆలోచించుకోరా’ అన్నాడు... చిన్నగా నవ్వుకున్నాడు.

అంతలో ఎక్కణ్ణుంచో కుక్క మొరుగుడు, ఆ తరువాత ఏడ్పూ, పక్షుల కలవరం వినవచ్చాయి.

ఉన్నట్టుండి ’కెవ్వు’మన్న స్త్రీ కేక వినిపించడంతో అదరిపడ్డాడు బుల్లెబ్బాయి. చటుక్కున లేచి నిల్చున్నాడు. కేక పెట్టింది ఎవరో, ఎటువైపునుండి వచ్చిందో తెలియలేదు. "ఎవరదీ? ఏమయింది?" అంటూ తోచిన దిశగా అడుగులు వేసాడు. నాలుగు అడుగులు వేసేసరికి ఎవరో కొట్టినట్టు చేతిలోని పెన్ టార్చ్ ఎగిరి ఎక్కడో పడిపోయింది. దాంతో ఆ గ్రుడ్డి వెలుతురు కూడా లేకుండాపోయింది.

కాసేపు ఆ చీకట్లో గ్రుడ్డివాడిలా తడుముకుంటూ దిరిగాడు. ఎవరూ కనిపించలేదు…

ఈరీ సౌండ్స్ కు తోడు, కుక్క ఆగి ఆగి ఏడుస్తోంది.

అదే సమయంలో - ఎక్కడినుండో అడుగుల శబ్దం వినవచ్చింది.

ఆగి, చెవులు రిక్కించాడు. చప్పుడు ఆగిపోయింది.

మళ్ళీ ముందుకు సాగాడు. రెండడుగులు వేసాడో లేదో, పాదాల చప్పుడు మళ్ళీ వినవచ్చింది.

తన నెవరో వెంబడిస్తున్నారనిపించింది. నిశ్శబ్దంగా అటువైపు నడిచాడు. కొన్ని అడుగుల దూరం వెళ్ళేసరికి తెల్లటి ఆకారం ఒకటి చీకట్లో కదలుతున్నట్లనిపించింది.

"ఎవరదీ?" అంటూ అటువైపు వెళ్ళాడు. ఆకారం ఓ చెట్టు వెనుక అదృశ్యమైపోయింది.

కళ్ళు చించుకుని చుట్టూ పరికించాడు. ఎవరూ కనిపించలేదు.

అంతలో చేరువలో ఉన్న పొద దగ్గర చప్పుడయింది. అటువైపు గెంతాడు. ఎవరూ కనిపించలేదు కాని... చప్పుడునుబట్టి పెద్ద సర్పం ఒకటి తన కాళ్ళ దగ్గర నుండి జరజరా ప్రాక్కుంటూ వెళ్ళిపోతున్నట్టు గ్రహించాడు. ఒళ్ళు జలదరించింది. ఓ క్షణం అక్కడే నిలబడిపోయి, తిరుగు ముఖం పట్టాడు.

అదిగో, అప్పుడే... అల్లంత దూరంలో ప్రత్యక్షమయింది తెల్లటి ఆకారం.

ఈసారి నిశ్శబ్దంగా అటువైపు నడిచాడు. ఆకారాన్ని సమీపించాక, అది తెల్ల చీరలో ఉన్న స్త్రీగా గ్రహించాడు. ’ఆ వేళప్పుడు ఆ నిర్జన ప్రదేశంలో ఆడమనిషి ఎలా వచ్చింది!? ఆమె మనిషేనా? లేక, అందరూ చెబుతూన్న దయ్యమా??’ అన్న తలంపు కలగడంతో... తెలియకుండానే అతని గుండె ఓ బీట్ ని మిస్ చేసింది.

ఆమె అతన్ని చూసినట్టు లేదు. మెల్లగా నడచుకుంటూ వెళ్తోంది. చప్పుడు చేయకుండా అనుసరించాడు... చెట్టు పక్కగా వెళ్ళి నిల్చుంది ఆమె.

వెనుకగా వెళ్ళి నిల్చున్నాడు బుల్లెబ్బాయి. సెంటు వాసన అతని ముక్కుపుటాలను సోకింది. "ఎవరు నువ్వు?" అన్నాడు. ఉలికిపడి గిర్రున అతని వైపు తిరిగింది ఆమె.

చీకట్లో ముఖం స్పష్టంగా కనిపించడంలేదు. "ఎవరు నువ్వు?" సాశ్చర్యంగా అడిగాడు మళ్ళీ.

సమాధానంగా మంజులహాసం ఒకటి సన్నగా వినిపించింది. గిర్రున వెనుదిరిగి ముందుకు నడచిందామె. అతను విస్తుపోతూ అనుసరించాడు. దట్టంగా ఉన్న ఓ పొదరింటి వద్ద హఠాత్తుగా ఆగింది. చటుక్కున అతని వైపు తిరిగి గాఢంగా కౌగలించుకుంది.

బుల్లెబ్బాయి తెల్లబోయాడు. ఆమె లతలా తనకు అల్లుకుపోవడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆమె ఒంటి నుండి వస్తూన్న సుగంధాలు మదికి ఆహ్లాదం కలిగిస్తూంటే... ఆమె మృదు స్పర్శ, బిగి కౌగిలి, వేడి చుంబనాలు మత్తుకు గురిచేసాయి. ఆమె పరువాలు తనను ఆర్తిగా హత్తుకుంటూంటే, వేడిగా కాలిపోతూన్న ఆమె దేహం... అతని శరీరంలో విద్యుత్ షాక్ ను కలిగించింది. అతనిలో కోర్కె కోడెనాగులా చివాలున తల ఎత్తింది.

'ఎవరీమె? మనిషా, తన మిత్రులు చెప్పిన మోహినీపిశాచా?...’ అతని సందేహాలకు జవాబులు లేవు. మెత్తగా ఒత్తుకుంటూన్న ఆమె మేని స్పర్శతో రగిలిన మొగలిపొదలా అతని యవ్వనం బుసలు కొట్టింది.

క్షణ క్షణానికీ ఉధృతమౌతూన్న కాంక్షతో ఆమెను తన బిగి కౌగిట్లో బిగించి ఆమె ముఖమంతా ముద్దులతో ముంచెత్తాడు. ఆమె అధరాలను తన అధరాలతో పరామర్శించాడు. ఆమె కంఠాన్ని వెచ్చటి పెదవులతో రాస్తూ ఆమెలో అగ్ని రగిలించాడు. తమకంతో అతని వక్షానికి హత్తుకుపోయిందామె...

మృదువుగా ఆమెను నేలపైన పూదీవెలలో పరుండబెట్టాడు. ఆ తరువాత వారి నడుమ కాలం స్థంభించిపోయింది!

**** **** **** ****
బాలభానుడు లేత కిరణాలతో గ్రామానికి మేలుకొలుపు పలుకుతున్నాడు...

మిత్రులు వచ్చి లేపేంతవరకు బుల్లెబ్బాయికి మెలకువ రానేలేదు. రాత్రి ఎక్కడ పడుకున్నాడో అక్కడే తీగలపైన పడుకునియున్నాడు ఒంటరిగా.

బుల్లెబ్బాయిని ప్రాణాలతో చూడడంతో మిత్రబృందానికి ప్రాణాలు కుదుటబడ్డాయి.

"నేనెక్కడున్నాను?" అడిగాడు బుల్లెబ్బాయి కన్నులు నులుముకుని చూస్తూ.

"చింతతోపులో" అని జవాబిచ్చారు.

ఏదో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ, "ఆమె ఎక్కడా?" అనడిగాడు.

"ఎవరూ?" సాశ్చర్యంగా అడిగింది మిత్రబృందం.

"రాత్రి నాతో గడిపిన యువతి" చెప్పాడు బుల్లెబ్బాయి, మెరిసే కళ్ళతో.

"నీకు...దయ్యం కనిపించిందా!?" ముగ్గురూ ఒకేసారి అడిగారు ఉత్కంఠతో.

"దయ్యమా? లేదే!" "మరి, యువతి ఎవరు?" "ఆమె...ఓ శృంగార దేవత!"

"దాన్నే దయ్యాల భాషలో మోహినీపిశాచి అంటారు బాబూ!" అన్నాడు రాములు.

"చ ఛఁ, రాత్రంతా నాకు స్వర్గ సౌఖ్యాలను చవిచూపిన ఆ యువతిని దయ్యం అనడానికి మీకు నోరెలా వచ్చిందిరా? ఆమే మనలాగే మనిషి!" అన్నాడు బుల్లెబ్బాయి. ముఖాలు చూసుకున్నారు వాళ్ళు... రాత్రి తన అనుభవం గూర్చి విపులంగా చెప్పాడు బుల్లెబ్బాయి. ఆశ్చర్యపోయారంతా.

ఎర్రియ్య సైగ నందుకున్న కృష్ణ వెళ్ళి, చెట్టు చాటున నిల్చున్న ఓ యువతిని వెంటబెట్టుకొచ్చాడు. తెల్లగా, పొట్టిగా ఉందామె. కొంచెం ఒళ్ళుంది. తెల్ల చీర కట్టుకుంది.

"రాత్రి నీతో గడిపిన యువతి ఈమేనా?" అడిగాడు ఎర్రియ్య.

బుల్లెబ్బాయి ఆమె వంక ఎగాదిగా చూసి తల అడ్డుగా త్రిప్పాడు. "ఆమె స్లిమ్ గా, పొడవుగా, నాజూకుగా ఉంటుంది" అన్నాడు. "ఈమె ఎవరు?" మిత్రులు చెప్పింది ఆలకించి మిక్కిలి ఆశ్చర్యపోయాడతను...

’బుల్లెబ్బాయి గుండె ధైర్యాన్ని బాగా ఎరుగుదురు అతని మిత్రులు. పందెంలో అతను గెలిచినట్లైతే తామంతా అతని పొలంలో పనిచేయాల్సి ఉంటుంది. చింతతోపులోని దయ్యం ఎప్పుడు పడితే అప్పుడు కనిపించకపోవచ్చును. ఒకవేళ ఆరోజు బుల్లెబ్బాయికి దయ్యం కనిపించకపోతే అతను పందెం గెలవడం ఖాయం. అందుకే ఎందుకైనా మంచిదని, పక్క ఊరి నుంచి నాటకాలు వేసే శకుంతలను తీసుకువచ్చారు దయ్యం వేషం వేయడానికి! ఆ వేళప్పుడు చింతతోపులోకి వెళ్ళడానికి మొదట ఆమె ఒప్పుకోలేదు. తాము ఆమె వెనుకే నీడలా ఉంటామని హామీ ఇవ్వడంతో, దయ్యం వేషంలో ఓ గంటసేపు చింతతోపులో తిరగడానికి ఒప్పుకుంది... కాసేపటికే ఆమెకు నిజం దయ్యం కనపడడంతో భయంతో వెర్రికేక పెట్టి స్పృహతప్పి పడిపోయింది. ఆమె కేకతో జడుసుకున్న మిత్రత్రయం అక్కణ్ణుంచి పలాయనం చిత్తగించింది... తెల్లవారాక వచ్చి చూస్తే, పడున్న శకుంతల కనిపించింది. ఆమెను లేపి విషయం అడిగితే, రాత్రి తనకు దయ్యం ఎదురయిందని చెప్పింది...’

"నేను చూసిన దయ్యం అచ్చు మీరు వర్ణించినట్టే ఉంది" అంది శకుంతల బుల్లెబ్బాయితో, భయంతో గుండెలపైన చేయి వేసుకుంటూ.

"అంటే...రాత్రి నాతో గడిపింది...?!" తెల్లబోయాడు అతను. అతని మదిలో ’ఆమె’ రూపం మెదిలింది... తెల్ల చీర, విరబోసుకున్న కురులు, అడుగులో అడుగు వేసుకుంటూ ఆ నడక... తపనతో తనను కౌగలించుకున్న తీరు...! ఆ వేళప్పుడు అటువంటి నిర్జన ప్రదేశంలో ఏ సామాన్య స్త్రీ ఐనా ఒంటరిగా తిరుగాడుతుందా!?

అతని శరీరం భయంతో సన్నటి కంపనకు గురయింది. "ఐతే, అది... దయ్యమేనంటారా?" అన్నాడు.

"నిస్సందేహంగా! వయసులో ఉన్నవాళ్ళు ఒంటరిగా కనపడితే మోహినీపిశాచాలు వెంటపడతాయట. మానవకాంతలుగా మారి తమ కోర్కెలను తీర్చుకుంటాయట" అన్నాడు ఎర్రియ్య.

"నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఇంకా ప్రాణాలతో ఉన్నావు. సాధారణంగా దయ్యాలతో రమించిన వారెవరూ బ్రతికుండరని విన్నాను" అన్నాడు కృష్ణ రిలీఫ్ గా.

అంతటి ధైర్యవంతుడికీ గుండె ఝళ్ళుమంది బుల్లెబ్బాయికి.

"ఇప్పటికైనా ఒప్పుకుంటావా దయ్యాలున్నాయని?" నవ్వాడు రాములు.

"ఒప్పుకోవాలనే ఉంది. కాని, ఎందుకో ఆమె మనిషి కాదంటే నా మనసు అంగీకరించడంలేదురా" అన్నాడు బుల్లెబ్బాయి సాలోచనగా.

"పందెం ఎగ్గొట్టడానికి నాటకమాడకురోయ్!" అన్నాడు కృష్ణ.

"ఛ్, అదేం కాదురా. నిజంగానే ఎటూ డిసైడ్ కాలేకపోతున్నాను" నిజాయితీగా అన్నాడు బుల్లెబ్బాయి.

"ఒప్పుకోండి సార్. అది దయ్యమేననడానికి నేనే సాక్ష్యం కదా!" అంది శకుంతల నవ్వుతూ.

భుజాలు ఎగరవేసాడు అతను.

**** **** **** ****
నాయుడుగారి బుల్లెబ్బాయికి చింతతోపులో మోహినీపిశాచి కనిపించిందన్న వార్త మంత్రగాడు వేసిన సాంబ్రాణి ధూపంలా గ్రామ మంతటా గుప్పుమంది. అనవసరపు పందాలకుపోయి ప్రాణాలను రిస్క్ లో పెట్టుకున్నందుకు కొడుకును తల వాచేలా చీవాట్లు పెట్టాడు నాయుడు.

అరవయ్యేళ్ళ ఆ ఊరి కరణం గారి పాతికేళ్ళ రెండో భార్య శేషారత్నం ఎర్రగా బుర్రగా నాజూకుగా ఉంటుంది. సోకులు చేస్తుంది. కరణం గారు పట్నం నుండి తెప్పించే ’పాయిజన్’ సెంటును వాడుతుంది.

బుల్లెబ్బాయికి మోహినీపిశాచి కనిపించిందన్న వార్త ఆలకించి గుంభనంగా నవ్వుకుంది శేషారత్నం.

’కోడె వయసుతో... కండలు తిరిగిన దండలతో... ఎన్నాళ్ళు ఊరించావురా కుర్రోడా! ఆ రోజు మీ మిత్రుల పందెం, నీలాటి రేవు నుండి వస్తూన్న నా చెవిన పడబట్టి కాని, లేకుంటే చిటారు కొమ్మను మిఠాయి పొట్లం లాగే మిగిలిపోయేవాడివి కదురా!... రాత్రి నా ఒళ్ళంతా హూనం చేసి మగాడి వనిపించుకున్నావు... ఆ మధురానుభూతినే తలచుకుంటూ మా ముసలాడితో జీవితమంతా గడిపేస్తాను...’ చెక్కిలిపైన చేయి వేసుకుని అద్దంలో చూసుకుంటూ తన్మయత్వంతో అనుకుంది ఆమె.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#50
Namaskar
Like Reply
#51
పక్కింట్లో చెప్పా...(శృంగార కథ) - ఆకెళ్ళ శివప్రసాద్
[Image: Picture2.png]
రో జూలాగే రొమాంటిగ్గా తయారయి ఫినిషింగ్ టచ్ లా పెదాలకి లిప్ స్టిక్ అద్ది, అద్దంలో తనని తానే ముద్దు పెట్టుకుంది మల్లీశ్వరి. 'యింత అందమైన విగ్రహాన్ని చూసినా నిగ్రహంగా ఎలా వుంటున్నాడే మీ ఆయన' అన్న పిన్ని మాటలు గుర్తు కొచ్చాయి. కిశోర్ యిష్టపడే పెళ్ళిచేసుకున్నాడు. అంత కన్నా యిష్టంగా హైదరాబాద్ లో కాపురం పెట్టాడు. కంపెనీకి వెళ్ళే రోజు వరకు నిరంతర ప్రణయానందంలో ముంచేశాడు. సెలవులయి కంపెనీకి వెళ్ళి వొచ్చాకా కధే మారిపోయింది. అలసటతో వస్తున్నాడు. అలరించకుండా నిద్రపోతున్నాడు. కంపెనీలో పని ఒత్తిడి పెరిగినప్పుడేగా ఇలాంటి 'రిలాక్సేషన్' కావాలి! ఊహా! ల్యాప్ టాప్ ముందే న్యాషీతో మొదలుపెట్టి కునుకులో జారుకుంటున్నాడు.

ఆ రోజు కిశోర్ వచ్చేసరికి - టీవీలో వసందైన హిందీ సిన్మా లో పాట వస్తోంది. హీరో, హీరోయిన్లు సముద్రం ఒడ్డున వంటిమీద గుడ్డలు వున్నాయో లేవో కూడా పట్టించుకోకుండా రెచ్చి పోతున్నారు. కిశోర్ దృష్టి అటుపడిన వెంటనే, వచ్చిన అవకాశం అంది పుచ్చుకున్నట్లు మల్లీశ్వరి అతని పెదాలతో తన పెదాలు కలిపింది. కాసేపు ఆనందమిచ్చిన తమకం. తమకంలోంచి పుట్టిన వేడి.

కిటికీ లోంచి జాలువారుతున్న వెన్నెల కిరణాలు ఇటుగా చూసి సిగ్గుపడిపోయాయి. కాసేపే... ఆ తరువాత... పాతపాటే... అలసట బాటే!!

మల్లీశ్వరి ప్రతి రోజులా నిరాశపడకుండా, పిన్ని ఫోన్ లో ఛెప్పిన సలహాను అమలు చేస్తూ - "యివాళ మధ్యాహ్నం టూ నాట్ ఫోర్ లో వుండే శ్రీదేవి అడిగింది మీవారు బెడ్ రూమ్ లో ఎలా వుంటారని... కొత్తగా పెళ్ళయిన వాళ్ళంటే అదో ఆసక్తి వుంటుంది... పెళ్ళయి పిల్లలు పుట్టినా వాళ్ళాయన అస్సలు వదిలి పెట్టడట... నుదురు మీద మొదలయిన ముద్దులయాత్ర చిటికెన వేలు దాకా సాగవలసిందేనట... నన్ను అడిగింది..."మల్లీశ్వరి మాట పూర్తి కాకుండానే కిశోర్ గురక వినిపించింది. మల్లీశ్వరి విరహం గోడల్ని తాకింది!
మర్నాడు -
మళ్ళీ కధ బెడ్ రూమ్ కి వచ్చేసరికి -
"ఒన్ నాట్ సిక్స్ లో వుండే మార్గరెట్ కి అస్సలు సిగ్గులేదు..." అని మొదలుపెట్టే సరికి -
"ఎవరు?" కిశోర్ టక్కున అడిగాడు.
"అదేనండి... ఇవాళ మీరు బైక్ తీస్తుంటే టైట్ జీన్స్ వేసుకుని అందరిని రెచ్చగొట్టేటట్టు ఏదో హిందీ పాట పాడ్తోంది... ఆవిడ... బెడ్ రూమ్ బ్యాడ్ రూమ్ కావాలిట... బ్యాడ్ అంతా బెడ్ మీద గుడ్ గా జరగాలి... అని అడిగితే... నేను సిన్సియర్ గా మీరు అలిసిపోయి పడుకుంటున్నారని చెప్పేశా... హ్యాపీ లేని సంపాదన ఎందుకు?... డబ్బులతో ముద్దులు కౌగలింతలు రావుగా... అసలు తప్పునీది అని అరచి... తలుపులు మూసుకున్నవెంటనే తలపులన్నీ నా మీదే వుండేటట్టు చేసుకోవాలంది..."

ఈ సారి మల్లీశ్వరి మాటలు పూర్తిగా వినకుండా మల్లీశ్వరి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకి లాక్కున్నాడు. అపార్ట్ మెంట్ లో ఆడవాళ్ళందరకి తను 'చేస్తున్న' పని తెలిసిందనేసరికి 'ఇగో' దెబ్బతింది.
మల్లీశ్వరికి కావలసింది అదే!!
మళ్ళీ మర్నాడు పాత కధే!
మల్లీశ్వరికి విరహం తప్పలేదు!!
ఆ మర్నాడు -
కిశోర్ కంపెనీ నుండి వచ్చి ఫ్రెష్ అయి ఎప్పటిలాగే నిద్రకి ఉపక్రమిస్తుంటే -
మల్లీశ్వరికి ఫోన్ వచ్చింది -

ఫోన్ లో మాట్లాడుతూ మల్లీశ్వరి కాస్త గట్టిగానే -
"...ఆ... ఆ... పిన్నీచెప్పు... నన్నేం చెప్పమంటావ్... కిశోర్ గారు పడుకుంటున్నారు... కాసేపాగి ఫోన్ చేస్తే ఆయన నిద్రకి డిస్టర్బ్ వుండేది కాదు... పాపం... అదొకటే తక్కువ... ఎంత ప్రేమగా చూసుకుంటారని... మా అపార్ట్ మెంట్ లో వాళ్ళు చెప్పడం... వాళ్ళు ఆయనకి ఏం చెప్తారు?... మా దగ్గరుండే నార్త్ ఇండియన్ ఆంటీ అలిసి పోతున్నారంటే 'అచ్చా ఫుడ్ కిలావ్' అని డ్రై ఫ్రూట్స్ యిచ్చింది... కిశోర్ కి వాటిని తినే ఓపిక కూడా లేదు... మలయాళీ ఆంటీ అయితే 'యోగ' నేర్చుకోమను...'సంయోగ యోగం' బావుంటుంది అంది... ఆవిడ దగ్గరకి నన్నే కాదు కిశోర్ ని రమ్మంటోంది... రసం లేక నీరసంగా వుందేమో పళ్ళరసం యిమ్మని యింకోరి సలహా... మా అపార్ట్ మెంట్ లో ఈ విధంగా పాపులర్ అయినామనుకో... కిశోర్ గమనించడం లేదు గానీ ప్రొద్దున్నే జాలి పడ్తున్నారు ఆయన్ని చూసి..." అనేసింది.

కళ్ళలోకి ఎక్క బోయిన నిద్రమత్తు టక్కున కిశోర్ కి ఎగిరిపోయింది. రోజూ కంపెనీకి వెళ్తున్నప్పుడు 'పని'గట్టుకుని అపార్ట్ మెంట్ లో వున్న వాళ్ళందరు 'తననే' చూస్తున్నారా? మలయాళీ ఆంటీ అందుకే నవ్విందా? మార్గరెట్ కొంటె చూపులో అర్ధమదా?... ఒకావిడకి పెద్దావిడని సెంటర్ వరకు లిఫ్ట్ యిస్తే 'ఆల్ ది బెస్ట్ చెప్పడంలో అర్ధమింతవుందా?...
యిలా చాలా చాలా వూహించేసుకుని -
సామూహికంగా అందరూ తనలోని 'మొగాడి' ని ప్రశ్నిస్తున్నట్టుగా ఫీలై పోయాడు - దానికి తోడు - మల్లీశ్వరి బంధుమిత్రులకి కూడా జిల్లాల వారీగా తన 'మగతనం' ప్రతిభ చాటేస్తోందా?... 'నో' అలా జరగకూడదు!!
తనని తాను 'ఫ్రూవ్' చేసుకోవాలి!!

ఫోన్ లో మాట్లాడుతున్న మల్లీశ్వరిని అమాంతం తనవైపు లాక్కున్నాడు - ఫోన్ లో అప్పుడే పిన్ని అంటోంది -
"తన భార్య మాట ఎలా వున్నా పక్క ఆడవాళ్ళు తన గురించి 'తక్కువగా' వూహించడం ఏ మొగాడు తట్టుకోలేడు..." అని ఆతరువాత -
మల్లీశ్వరి ఫోన్ కట్ చేసే అవకాశం కిశోర్ యివ్వలేదు. అక్కడి శబ్ధాలకి పిన్ని మురిసిపోయి సీన్ వూహించుకుని ఆనందపడింది. పక్కింటి వాళ్ళకి చెప్పకుండా చెప్పేనని చెప్పమన్నా పిన్ని సలహాని రహస్యంగా దాచుకుని కిశోర్ కౌగిలలో కరిగిపోయింది మల్లీశ్వరి!!!
రో జూలాగే రొమాంటిగ్గా తయారయి ఫినిషింగ్ టచ్ లా పెదాలకి లిప్ స్టిక్ అద్ది, అద్దంలో తనని తానే ముద్దు పెట్టుకుంది మల్లీశ్వరి. 'యింత అందమైన విగ్రహాన్ని చూసినా నిగ్రహంగా ఎలా వుంటున్నాడే మీ ఆయన' అన్న పిన్ని మాటలు గుర్తు కొచ్చాయి. కిశోర్ యిష్టపడే పెళ్ళిచేసుకున్నాడు. అంత కన్నా యిష్టంగా హైదరాబాద్ లో కాపురం పెట్టాడు. కంపెనీకి వెళ్ళే రోజు వరకు నిరంతర ప్రణయానందంలో ముంచేశాడు. సెలవులయి కంపెనీకి వెళ్ళి వొచ్చాకా కధే మారిపోయింది. అలసటతో వస్తున్నాడు. అలరించకుండా నిద్రపోతున్నాడు. కంపెనీలో పని ఒత్తిడి పెరిగినప్పుడేగా ఇలాంటి 'రిలాక్సేషన్' కావాలి! ఊహా! ల్యాప్ టాప్ ముందే న్యాషీతో మొదలుపెట్టి కునుకులో జారుకుంటున్నాడు.

ఆ రోజు కిశోర్ వచ్చేసరికి - టీవీలో వసందైన హిందీ సిన్మా లో పాట వస్తోంది. హీరో, హీరోయిన్లు సముద్రం ఒడ్డున వంటిమీద గుడ్డలు వున్నాయో లేవో కూడా పట్టించుకోకుండా రెచ్చి పోతున్నారు. కిశోర్ దృష్టి అటుపడిన వెంటనే, వచ్చిన అవకాశం అంది పుచ్చుకున్నట్లు మల్లీశ్వరి అతని పెదాలతో తన పెదాలు కలిపింది. కాసేపు ఆనందమిచ్చిన తమకం. తమకంలోంచి పుట్టిన వేడి.

కిటికీ లోంచి జాలువారుతున్న వెన్నెల కిరణాలు ఇటుగా చూసి సిగ్గుపడిపోయాయి. కాసేపే... ఆ తరువాత... పాతపాటే... అలసట బాటే!!

మల్లీశ్వరి ప్రతి రోజులా నిరాశపడకుండా, పిన్ని ఫోన్ లో ఛెప్పిన సలహాను అమలు చేస్తూ - "యివాళ మధ్యాహ్నం టూ నాట్ ఫోర్ లో వుండే శ్రీదేవి అడిగింది మీవారు బెడ్ రూమ్ లో ఎలా వుంటారని... కొత్తగా పెళ్ళయిన వాళ్ళంటే అదో ఆసక్తి వుంటుంది... పెళ్ళయి పిల్లలు పుట్టినా వాళ్ళాయన అస్సలు వదిలి పెట్టడట... నుదురు మీద మొదలయిన ముద్దులయాత్ర చిటికెన వేలు దాకా సాగవలసిందేనట... నన్ను అడిగింది..."మల్లీశ్వరి మాట పూర్తి కాకుండానే కిశోర్ గురక వినిపించింది. మల్లీశ్వరి విరహం గోడల్ని తాకింది!
మర్నాడు -
మళ్ళీ కధ బెడ్ రూమ్ కి వచ్చేసరికి -
"ఒన్ నాట్ సిక్స్ లో వుండే మార్గరెట్ కి అస్సలు సిగ్గులేదు..." అని మొదలుపెట్టే సరికి -
"ఎవరు?" కిశోర్ టక్కున అడిగాడు.
"అదేనండి... ఇవాళ మీరు బైక్ తీస్తుంటే టైట్ జీన్స్ వేసుకుని అందరిని రెచ్చగొట్టేటట్టు ఏదో హిందీ పాట పాడ్తోంది... ఆవిడ... బెడ్ రూమ్ బ్యాడ్ రూమ్ కావాలిట... బ్యాడ్ అంతా బెడ్ మీద గుడ్ గా జరగాలి... అని అడిగితే... నేను సిన్సియర్ గా మీరు అలిసిపోయి పడుకుంటున్నారని చెప్పేశా... హ్యాపీ లేని సంపాదన ఎందుకు?... డబ్బులతో ముద్దులు కౌగలింతలు రావుగా... అసలు తప్పునీది అని అరచి... తలుపులు మూసుకున్నవెంటనే తలపులన్నీ నా మీదే వుండేటట్టు చేసుకోవాలంది..."

ఈ సారి మల్లీశ్వరి మాటలు పూర్తిగా వినకుండా మల్లీశ్వరి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకి లాక్కున్నాడు. అపార్ట్ మెంట్ లో ఆడవాళ్ళందరకి తను 'చేస్తున్న' పని తెలిసిందనేసరికి 'ఇగో' దెబ్బతింది.
మల్లీశ్వరికి కావలసింది అదే!!
మళ్ళీ మర్నాడు పాత కధే!
మల్లీశ్వరికి విరహం తప్పలేదు!!
ఆ మర్నాడు -
కిశోర్ కంపెనీ నుండి వచ్చి ఫ్రెష్ అయి ఎప్పటిలాగే నిద్రకి ఉపక్రమిస్తుంటే -
మల్లీశ్వరికి ఫోన్ వచ్చింది -

ఫోన్ లో మాట్లాడుతూ మల్లీశ్వరి కాస్త గట్టిగానే -
"...ఆ... ఆ... పిన్నీచెప్పు... నన్నేం చెప్పమంటావ్... కిశోర్ గారు పడుకుంటున్నారు... కాసేపాగి ఫోన్ చేస్తే ఆయన నిద్రకి డిస్టర్బ్ వుండేది కాదు... పాపం... అదొకటే తక్కువ... ఎంత ప్రేమగా చూసుకుంటారని... మా అపార్ట్ మెంట్ లో వాళ్ళు చెప్పడం... వాళ్ళు ఆయనకి ఏం చెప్తారు?... మా దగ్గరుండే నార్త్ ఇండియన్ ఆంటీ అలిసి పోతున్నారంటే 'అచ్చా ఫుడ్ కిలావ్' అని డ్రై ఫ్రూట్స్ యిచ్చింది... కిశోర్ కి వాటిని తినే ఓపిక కూడా లేదు... మలయాళీ ఆంటీ అయితే 'యోగ' నేర్చుకోమను...'సంయోగ యోగం' బావుంటుంది అంది... ఆవిడ దగ్గరకి నన్నే కాదు కిశోర్ ని రమ్మంటోంది... రసం లేక నీరసంగా వుందేమో పళ్ళరసం యిమ్మని యింకోరి సలహా... మా అపార్ట్ మెంట్ లో ఈ విధంగా పాపులర్ అయినామనుకో... కిశోర్ గమనించడం లేదు గానీ ప్రొద్దున్నే జాలి పడ్తున్నారు ఆయన్ని చూసి..." అనేసింది.

కళ్ళలోకి ఎక్క బోయిన నిద్రమత్తు టక్కున కిశోర్ కి ఎగిరిపోయింది. రోజూ కంపెనీకి వెళ్తున్నప్పుడు 'పని'గట్టుకుని అపార్ట్ మెంట్ లో వున్న వాళ్ళందరు 'తననే' చూస్తున్నారా? మలయాళీ ఆంటీ అందుకే నవ్విందా? మార్గరెట్ కొంటె చూపులో అర్ధమదా?... ఒకావిడకి పెద్దావిడని సెంటర్ వరకు లిఫ్ట్ యిస్తే 'ఆల్ ది బెస్ట్ చెప్పడంలో అర్ధమింతవుందా?...
యిలా చాలా చాలా వూహించేసుకుని -
సామూహికంగా అందరూ తనలోని 'మొగాడి' ని ప్రశ్నిస్తున్నట్టుగా ఫీలై పోయాడు - దానికి తోడు - మల్లీశ్వరి బంధుమిత్రులకి కూడా జిల్లాల వారీగా తన 'మగతనం' ప్రతిభ చాటేస్తోందా?... 'నో' అలా జరగకూడదు!!
తనని తాను 'ఫ్రూవ్' చేసుకోవాలి!!

ఫోన్ లో మాట్లాడుతున్న మల్లీశ్వరిని అమాంతం తనవైపు లాక్కున్నాడు - ఫోన్ లో అప్పుడే పిన్ని అంటోంది -
"తన భార్య మాట ఎలా వున్నా పక్క ఆడవాళ్ళు తన గురించి 'తక్కువగా' వూహించడం ఏ మొగాడు తట్టుకోలేడు..." అని ఆతరువాత -
మల్లీశ్వరి ఫోన్ కట్ చేసే అవకాశం కిశోర్ యివ్వలేదు. అక్కడి శబ్ధాలకి పిన్ని మురిసిపోయి సీన్ వూహించుకుని ఆనందపడింది. పక్కింటి వాళ్ళకి చెప్పకుండా చెప్పేనని చెప్పమన్నా పిన్ని సలహాని రహస్యంగా దాచుకుని కిశోర్ కౌగిలలో కరిగిపోయింది మల్లీశ్వరి!!!
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: 1 Guest(s)