Poll: అమలిన శృంగార కథలు
You do not have permission to vote in this poll.
కావాలి
100.00%
1 100.00%
వద్దు
0%
0 0%
Total 1 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అమలిన శృంగార కథలు - ఉప్పు-ఉసిరికాయ
#41
అందమైన తల్లి- బి.రాజ్యలక్ష్మి
[Image: jrj3b7]
సంధ్యాసమయం, చల్లనిగాలి ,పచ్చని చెట్లు ,నీలిమేఘాలపయనం ,అరుణరగాసూర్యాస్తమయం !అందమైన చంద్రోదయం !మనోహర దృశ్యం .కళ్లల్లో నిలిచిపోతున్న కమనీయకావ్యగీతిక . ప్రశాంత ఆహ్లాదవాతావరణం ,రాధిక పెరట్లో వాలుకుర్చీలో కూర్చుని ప్రకృతిలో లీనమై అరమోడ్పుకళ్ళతో నిలీగగనపు సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నది .ఎందుకో పెదాలపై నవ్వు !భావాలను పంచుకోవడానికి యెవరూ లేరు .కవితలల్లడానికి తనకు అంతపద సంపద లేదు .చిన్నచిన్న చినుకులు నీకు మేం తోడు వున్నాం గా అన్నట్టు వానజల్లు మొదలయ్యింది .చినుకులలో తడుస్తూ పాట పాడుకోవడం రాధిక కు చలాయిష్టం .ఆహ్లాదసమయం లో ,ఆహ్లాదం పంచుకోవాల్సిన సమయం లో రాధిక మనసులో యేదో వెలితి !తనకే తెలియని తనకు తానే వేసుకునే ప్రశ్నలు .

మురళి తన భర్త ,తన సహచరుడు ,తనంటే అమితప్రేమ .యెంతో అన్యోన్యత .అందమైనవాడు .హోదా ,చదువు ,అందమైన ఇల్లు ,అందమైన తోట అన్నీ లేదా అన్నీ భార్య కోరుకున్నవన్నీ లభించాయి .మురళి కాలేజి లో భౌతికశాస్త్రం చెప్తాడు .వస్తుతః భావుకుడు కాదు .అతని ప్రపంచం పుస్తకాలూ పరిశీలన ,జిజ్ఞాస !రరాధిక మురళి దగ్గర కోరుకుంటున్నది ఏమిటి !

రాధికకు కిందటి రోజు సంఘటన గుర్తుకొచ్చింది .మురళి చదువుకుంటున్నాడు ,అతనినే చూస్తూ ఇంత అందమైన వ్యక్తి తన భర్త . ఉంగరాల జుట్టు ,కోటేరులాంటి ముక్కు !చక్కటి కనుబొమ్మలు .ఆజానుబాహువు !కాఫీ కప్పు తో నించున్న భార్య ను చూస్తూ "చీర చాలా బాగుంది రాధీ "నవ్వుతు అన్నాడు మురళి .

రాధిక చీర చిలకాకుపచ్చ జరీచీర !నెమళ్లు అంచు ,రాధికకు చీర నప్పిందికూడా !కానీ కానీ చీర మాత్రమే నచ్చిందా మురళికి ?తను అందం గా లేదా !తనలో తాను నవ్వుకుంది .పైకిమాత్రం మురళిని చూసినవ్వింది . వానతుంపరలో ప్రకృతి సోయగాలను చూస్తూ రాధిక మనసు గతంలోకి తొంగిచూసింది .

"రాధీ యీ చీరలో యెంత బాగున్నావో ,ముద్దొస్తున్నావు .బాపుబొమ్మలా వున్నావు "తన స్నేహితురాళ్లు పొగుడుతుంటే రాధికకు సంతోషం

రాధిక చక్కటి అందం చుపారులను వెంటనే ఆకట్టుకుంటుంది . పచ్చటి పసిమి ,గుండ్రటి కళ్ళుమిలమిలా మెరుస్తూ నావ్వ్వుతూ వుంటాయి .విశాలమైన ఫాలభాగం యే బొట్టుచుక్క పెట్టినా ముద్దుగా వుంటుంది .సహజం గా ఆడపిల్ల యెప్పుడూ అందాన్ని గుర్తిస్తే ఆనందిస్తుంది .రాధిక ప్రక్రుతి నీలిమేఘాలపయనం కోకిలమ్మ గానం పరవశించిపోతుంది .

భవిష్యత్తువైవాహిక జీవితం తన భర్త తన అందాన్ని యెంత పొగుడుతాడో తలుచుకుని తలుచుకునీ మురిసిపోయేది రాధిక అద్దం లో చూసుకుంటూ తిలకం దిద్దుకున్నా కాటుక కళ్లు దిద్దుకుంటున్నా ముంగురులు సవరించుకుంటున్నా తన భర్త తనల్ని యెంత పొగుడుతాడో తల్చుకుంటూ సిగ్గూ సంతోషం నవ్వూ అన్నింటినీ వూహించుకుని బంగారు కలలు కన్నది .తనూ తన భర్తా షికారుకెళ్తున్నట్టుగా -------------------

"రాధి యెంత అందం గా వున్నావు ?"

"ఏదీ నవ్వు ముత్యాలు రాల్చవా "

"వయ్యారి నడక లో యెన్ని హొయలొ "

ఇలా వూహించుకుని రాధిక పరవశించి యెన్నో తీయని వూహలు !మధురభావనలు !!! రాధిక పెళ్లయ్యింది . అందమైన మురళి భర్త .సోయగాల కళ్లతో అతనిని చూసే తరుణం వచ్చిందని మురిసింది కానీ ------కానీ పెళ్లయ్యింది --తరుణం వచ్చింది ----వెళ్లిపోయింది . కలలు కలలుగానే మిగిలాయి .

తను ఆశించినట్టుగా ఒక్కరోజూ అందాన్ని పొగిడేవాడు కాదు . మంచి భర్త . ఆప్యాయం గా ప్రేమగా చూసుకుంటాడు మొదట్లో రాధిక గమనించలేదు ,తర్వాత గమనించిన రాధిక పట్టించుకోలేదు . కొద్దిగా చనువు పెరిగాక "ఏమండీ కొప్పు యిలా బాగుందా "ఒకరోజు అడిగింది .

"ఆఁ --బానేవుంది "అని మురళి రాధికను చూసి సీరియస్ గా చదువులో తలదూర్చాడు .

రాధిక యే ప్రశ్న వేసినా ముక్తసరిగా "బాగుంది"అనే సమాధానమే !! రాధికకు నిర్లిప్తత అలవాటయ్యింది .

--------------

చీకటి పడుతున్నది . వానజల్లు యెక్కువయ్యింది .మురళి యింకా రాలేదన్న కంగారు మొదలయ్యింది . లోపలికి వచ్చి తలుపుమూసింది . నిరాశగా,కరిగిపోతున్న కాలం ఆశాకిరణం ఒకటి మురిపించి మెరిపించింది . రాధిక జీవితపయనం లో మధురచలనం వచ్చింది . ,మాతృభావన !!!అందమైన భావన !!మరో జీవికి తను తల్లి !! రాధికకు మధుర అనుభూతి !! "రాధీ

మృదువైన పిలుపుకి మత్తుగా పడుకున్న రాధిక కళ్లు తెరిచింది .

"బాబు నీలా యెంతో అందం గా వున్నాడు "అన్నాడు మురళి .ఏమిటీ .... అతడంటున్నది --- తను వింటున్నది వింత గా మెరుస్తున్న కళ్ళతో భర్తను చూసింది .

"అవును రాధీ విశాలమైన కళ్లు ,కోటేరులాంటి ముక్కు ,సన్నని పెదాలు ,నీ అందాన్నంతా పోగుపోసుకున్నాడు " యెంతో తమకం గా బాబును మద్దాడుతున్నాడు మురళి .

తను కన్న కలలు కల్లలు కాదు ,తన మురళి సౌందర్యారాధకుడే !!తనుకోరుకున్న మాట తన భర్త నోట్లోనించి వచ్చింది . తనచిన్నకోరిక యీ రోజు తీరింది . నీరసం గా వున్న రాధిక కళ్లల్లో తృప్తి . అందమైన తల్లినయ్యాను హాయిగా నవ్వుకుంది రాధిక .



 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
గృహిణి - చంద్ర శేఖర్ కోవూరు
[Image: Picture2.png]


ఏమండి ఈ ఒక్క రోజు సెలవు పెట్టండి. ఎందుకు? ఈరోజు ఏమిటో మీకు గుర్తులేదా లేదు ఏమి? ఏమైనా పండగ? మన పెళ్లి రోజు అండి. ఓహో అలాగా అయిన నాకు లీవ్ లేదు. పోనీ సాయంత్రం త్వరగా వస్తారా చూస్తా అని వెళ్ళిపోయాడు అజయ్... సాయంత్రం 6 అయింది భర్త రాలేదు. 7 అయింది అయిన రాలేదు. ఫోన్ చేసింది రింగ్ అవుతుంది కానీ భర్త తీయలేదు. ఈలోపు మరో ఫోన్ మ్రోగింది. భర్త ఏమో అని ఆశగా చూసింది కాదు వాళ్ళ మమ్మీ. అమ్మ సంధ్య ఎలా ఉన్నావమ్మా. బాగానే ఉన్నానమ్మా. పెళ్లి రోజు శుభాకాంక్షలు తల్లి . Thank you అమ్మ . అల్లుడు నువ్వు ఎక్కడున్నారు బయటకెళ్లారా. అల్లుడికి ఫోన్ ఇవ్వమ్మా మీ నాన్నా మాటాడతారంట. అయన ఇంకా రాలేదమ్మా ఆఫీస్ నుండి. అదేమిటి అల్లుడుగారు సెలవు పెట్ట లేదా .నువ్వు చెప్పలేదా. చెప్పానమ్మా అయిన లివ్ లేదని వెళ్లిపోయారు. కనీసం త్వరగా కూడా రాలేదు ఎంత చెప్పినా". అంతేనమ్మా ఈమగాల్లాంతా ఇంతే అంటుూ ఫోన్ పెట్టేసింది. ట్రింగ్ ట్రింగ్ అజయ్ ఫోన్ మోగుతుంది. హలో బాబు నేను మీ మావయ్యని బాగున్నావా. హా మావయ్య గారు బాగున్నాను. హ్యాపీ anniversary బాబు. Thank you మావయ్యా గారు. ఏమిటి నాయన పెళ్లి రోజు సెలవు పెట్టి అమ్మాయితో ఎక్కడికైనా వెళ్లొచ్చు కదా. మావయ్యగారు నేను బిజీగా ఉన్నాను మల్లి ఫోన్ చేస్తా. అని పెట్టెసాడు. ఏమే శ్యామల అల్లుడు గారు బిజీ అని ఫోన్ పెట్టేసాడు. హా ఎందుకు పెట్టడు మా అల్లుడు మా అల్లుడు అని నెత్తిన పెట్టుకున్నారుగా అసలు నేను ఆనాడే చెప్పాను. ప్రైవేట్ జాబ్ అల్లుడు వద్దండి సెలవులు ఉండవు జీతం తక్కువ అది ఇది అని. హాయిగా ఎ గవర్నమెంట్ టీచర్ కో, లెక్చరర్ కో ఇచ్చి ఉంటే బాగుండేది కదా బోలెడన్ని సెలవలు ఎప్పుడు కావాలంటే అప్పుడు లివ్ లు ఉంటాయి. నా మాట విన్నారా మంచి సంబంధం మీ చెల్లెలి కొడుకు అని నానోరుమూయించి పెళ్లి చేసారు. ఇప్పుడు చూడండి. అబ్బబ్బాయిప్పుడు ఏమైయింది కారాలు మిరియాలు నూరుతున్నావు. వాళ్లిద్దరు బానే ఉన్నారు. హ అని మీరు నేను అనుకోవడం కాదు అమ్మాయి చేస్పాలి. మళ్ళీ అమ్మాయి ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మోగుతుంది. అమ్మ చెప్పమ్మ. ఎమ్మా వచ్చాడా అల్లుడు. లేదమ్మా ఫోన్ కూడా ఎత్తలేదు. అదేమిటి టైం 9.30 అవుతుంది ఇంకా రాకపోవటమేంటి. ఏమో అమ్మ ఈయన ఎప్పుడు ఇంతే. అది సరేగాని అబ్బాయి నిను బాగా చూసుకుంటున్నారంటే. హా బానే చూసుకుంటాడు అమ్మ . కాకపోతే ఎక్య వ టైం ఆఫీస్ ఆఫీస్ పని పని అని నాతో ఎక్కువ సేపు ఉండరు. పెళ్లి రోజుకి చీర ఏమన్నా కొనిచ్చాడా. లేదమ్మా అసలు ఆయనకి గురుతులేదు అంటా. ఏమిటో ఒక్కగానొక్క కూతురువి మహారాణిలా చూసుకున్నాం మేము ఏది కావాలంటే అది కొనిచ్చేవాళ్ళం. ఇపుడేమో యిలా బాధపడుతున్నావు. అవన్నీ ఎందుకులేమ్మా నేను బానే ఉన్నాను. టింగ్ టింగ్ calling బెల్ మోగుతుంది. సరే ఉంటానమ్మా ఆయనొచ్చినట్లున్నారు. చెంగు చెంగున వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. తీరా చుస్తే హౌస్ ఓనర్ ఆంటీ. సారీ అమ్మ పొద్దున్నుండి లేము బయటకు వెళ్లి వచ్చాము హ్యాపీ మ్యారేజ్ డే. Thank యు ఆంటీ. అబ్బాయి ఉన్నాడా అమ్మా. ఇంకా రాలేదు ఆంటీ. వచ్చాక తనకి కూడా చెప్పమ్మా. సరే ఆంటీ. వోచి సోఫాలో కూర్చుని లీలగా కళ్ళు మూసింది. ఏవో జ్ఞాపకాలు ఆలా ఆలా నుదుటి మీద జుట్టు జాలువారినట్లు వస్తున్నాయి. చిన్నప్పుడు తాను ఆడుకున్న రోజులు, స్నేహితులతో పిక్ నిక్ కి వెళ్లినరోజులు, అమ్మచేతి గోరుముద్దలు తిన్న రోజులు, పెద్దమనిషి అయిన రోజులు, వోనీ వేసి సిగ్గుపడిన రోజులు, కాలేజీలో పాట పాడిన రోజులు, తనని ప్రేమించమని కుర్రాళ్ళు వెంటబడ్డ రోజులు, 20 ఏళ్లు వచ్చినా అమ్మ వడిలో పడుకున్నరోజులు, తన బర్త్ డే కి నాన్నా స్కూటి కొనిచ్చిన రోజులు, అన్ని ఒక్కసారి వోచి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నిద్రమత్తులో పడబోయి ఉలిక్కిపడిలేచింది. ఎదురుగ చుస్తే తన భర్త అజయ్ కూర్చుని ఆమెనే చూస్తున్నాడు ఏమండి మీరెప్పుడు వోచారు అంటూ భర్త ని హగ్ చేసుకుంది. ఏమైంది సంధ్య డోర్ వేయకుండా పరధ్యానం గా ఉన్నావు. ఏమైంది. ఆబ్బె ఏమి లేదు అంది మీకోసమే ఎదురుచూస్తున్నాను. సారీ సంధ్య లేట్ అయింది అంటూ టైం చుస్తే 11 అయింది. ఆఫీస్ లో ఓవర్ టైం చేసాను. అందుకే లేట్ అయింది. అయ్యో సారీ ఎందుకండీ మీగురించి నాకు తెలియదా అని. అదేమిటి నామీద కోపం గా లేదా అన్నాడు. కోపమెందుకు అండి. ఇప్పటికైనా వోచారు కదా. అన్నం తిన్నావా. లేదండి మీరు వస్తే తిందామని అన్ని సిద్ధం చేసాను. సరే నీకు రెండు శుభవార్త లు చెప్తాను. అవునా ఏమిటి అవి చెప్పండి. రేపటినుండి 6 అయేసరికి నీ ముందు ఉంటాను. వావ్ నిజామా ఎంత మంచి మాట చెప్పారు మరి రెండోది ఏంటి. తన జేబులో నుండి ఒక ప్యాకెట్ తీసి ఇచ్చాడు. ఏంటిది. ఓపెన్ చేసి చూడు. ఓపెన్ చేస్తే తనకి ఎంతో ఇష్టమైన నెక్లెస్. తాను ఆశ్చర్యపోయింది ఏమండి ఇది నేను నేను అంటుంటే. అవును సంధ్య సరిగా వన్ ఇయర్ క్రితం నువ్వు కోరిన నెక్లస్. అప్పుడు నాకు స్తోమత లేక కొనివ్వలేకపోయాను. దానికోసమే ఇన్ని రోజులు ఓవర్ టైం చేసాను డబ్బులు దాచాను. ఈరోజు దాని కొనగలిగాను అంటూ గర్వంగా చెప్పాడు. తన భార్య కళ్ళలో ఆనందం ప్రేమ ఆశ్చర్యం బాధ అన్ని ఒక్కసారిగా వచ్చాయి. తన భర్తను హాగ్ చేసుకుని గట్టిగ ఏడ్చేసింది. ఏమైంది సంధ్య అని అడిగాడు. నాకోసం మీరు ఇంత కష్టపడ్డారంటే నేనంటే మీకెంత ప్రేమండి. నేనే మిమ్మల్ని సరిగా అర్థ చేసుకోలేక అపుడప్పుడు బాధపడ్డాను నన్ను క్షమించండి. నో సంధ్య నేనే టైం స్పెండ్ చేయలేకపోయాను సారీ. నాకు ప్రమోషన్ కూడా వొచింది సంధ్య నా జీతం డబల్ అయింది ఇకనుండి మనకు అనీ మంచి రోజులే అనగానే . భార్య ఇంకా ఆనందపడింది.. ఇద్దరు కలిసి భోజనం చేసి హాయిగా నైట్ షికారు వెళ్లి ఆలా ఆలా చల్లగాలికి తిరిగి వోచి హ్యాపీ గ పడుకున్నారు. కదా గోతెలుగుకి మనం ఇంటికి... ???????
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#43
ఉప్పు-ఉసిరికాయ - గొర్తి.వాణిశ్రీనివాస

[Image: Picture5.png]

ఏవండీ!మంచి నీళ్లు కావాలా?" అంటూ చాపా,పక్కబట్టల్ని చుట్టగా చుట్టుకుని నీళ్ల గ్లాసు పట్టుకుని రాత్రి పన్నెండు గంటల వేళ మేడ మీదకి వచ్చింది రుక్మిణి. పిట్టగోడ మీద చేతులు ఆనించి మింటి చంద్రుడి వంక చూస్తూ ఏదో ఆలోచనల్లో ఉన్న రామం భార్య పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. "దాహమేసినప్పుడు తాగుతా అక్కడ పెట్టు. కింద అందరూ పడుకున్నారా? వాళ్ళకి కావలసిన దుప్పట్లు అవీ ఇచ్చే వచ్చావుగా?" అన్నాడు రామం చదునుగా ఉన్న డాబామీద చాప పరుస్తూ. "ఆ..అంతా సర్దుమణిగినట్టే..హాయిగా నిద్ర పోతున్నారు.చూసే వస్తున్నాను.ఈ ప్రశాంతత మీ చలవేనండీ , పొద్దున ఇల్లంతా రణరంగంలా ఉంది. ఇంతకీ తప్పు మీ బావగారిదా, మీ చెల్లిదా?" అంది రుక్మిణి చాప మీద దుప్పటి పరచి పడుకున్న భర్త రామం పక్కనే కూర్చుంటూ. "మనలాంటి మధ్య తరగతి కుటుంబాల్లో అంతా బ్రహ్మ ప్రళయమే. ప్రతిదీ ఒక వివాదమే ,సమస్యే. కొత్తగా పెళ్ళైన చెల్లీ,బావా ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం చేలాయించాలనే ధోరణే ఈ గొడవకు అసలు కారణం."అన్నాడు రామం. "అవును.వాళ్ళు గొడవ పడింది చాలక వాళ్ళ అమ్మా నాన్నలను పిలిపించి మీ అమ్మా నాన్నలను, మనల్ని కూడా ఎంత ఖంగారు పెట్టేసారో. విడిపోతారేమో అనిపించేంతగా కీచులాడుకున్నారు. మీరు కలగజేసుకుని సమస్యను ఇట్టే తేల్చేశారు. అయినా మీకు ఎలా వచ్చిందండీ ఆ ఆలోచన."అంది రుక్మిణి "ఉప్పు ద్రావణంలో నానబెట్టిన ఉసిరికాయల్ని సీసాతో తీసుకొచ్చి వాళ్ళ చేతికిచ్చేసరికి ఇద్దరూ అయోమయంగా నా వంక చూసారు. ఎక్కడో పుట్టి పెరిగిన ఇద్దరు మనుషుల్ని ఆలుమగలుగా కలిపి ఉంచే వివాహ బంధం గొప్పతనాన్ని వినూత్న రీతిలో తెలియచెప్పారు. సముద్రపు ఉప్పునూ,అడవిలో ఉసిరికాయనూ ఒక్క చోటకు చేర్చిన విధికి విలువిచ్చి కలిసిన బంధాన్ని గౌరవించి తల వంచాలని, ఉసిరికాయ ఎక్కడ పుట్టినా ఉప్పుతో కలిశాక దాని నాణ్యత,విలువ మరింత పెరుగుతాయి తప్ప తగ్గవనీ, ఉప్పుకల్లు కరిగి పోతేనే మరొక పదార్ధంతో మిశ్రమం చెంది మనగలదని సులభంగా ,విపులంగా చెప్పేసరికి ఇద్దరూ మారు మాట్లాడకుండా వాళ్ళ గదిలోకి వెళ్లిపోయారు. అమ్మా నాన్నా కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు."అన్నాడు రామం "కానీ నాదో చిరు సందేహం"అంది రుక్మిణి భర్త మొహంలోకి చిలిపిగా తొంగి చూస్తూ. "రాణి గారి సందేహ నివృత్తే మా తక్షణ కర్తవ్యం, చిత్తం దేవీ.అడగండి"అన్నాడు రామం భార్య నగుమోమును చూస్తూ . "మా ఇద్దరిలో ఎవరు ఉప్పు,ఎవరు ఉసిరికాయ అంటూ మీ చెల్లీ బావా మళ్లీ తగవు పడితే అప్పుడు ఏంచేసేవారు"?అంది రుక్మిణి.వస్తున్న నవ్వును పెదవి అంచునే అదిమి పడుతూ. "ఏముందీ.ఉడుకుమోతులెవరైతే వాళ్ళు ఉప్పు కల్లు, ఉదాసీనంగా ఉండేవాళ్ళు ఉసిరికాయ అంటాను. ఉడుకుమోతులం నేను కాదంటే నేను కాదంటారు ఇద్దరూ. అయితే ఇద్దరూ ఉసిరికాయ అన్నట్టేగా. ఒకే జాతికి చెందిన వాళ్ళ మధ్య వైరం దేనికట. "అమ్మో చాలా గడుసు వారే." అంది రుక్మిణి "సముద్రంలో పుట్టిన ఉప్పుకి ఆ సముద్ర లక్షణాలే ఉంటాయి. సహన శీలి చెట్టు అందించే ఫలాలకు ఆ లక్షణాలే వున్నా రెండూ కలిసినప్పుడు సర్దుకుపోవటానికి కొంత సమయం పడుతుంది. ఆ మధ్యలో కొద్దిపాటి సంఘర్షణ తప్పదు. సయోధ్య కుదిరాక సత్ఫలితాలు కూడా అంతే మధురంగా ఉంటాయి.అది తెలుసుకున్న జంట మధ్యన గొడవలు రావు"అన్నాడు రామం భార్య ముంగురులను సవరిస్తూ. "అవునండీ!వేర్వేరు చోట్ల పుట్టి పెరిగిన ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను మరొకరు అర్ధం చేసుకుంటే చాలు. పదేళ్ల మన దాంపత్య జీవితంలా, తొందర్లు లేని హాయి రాగంలా బతుకు నావ ప్రశాంతంగా సాగిపోతుంది కదూ" తననే చూస్తున్న భర్త రామం కళ్ళలో పైన విశాల ఆకాశంలోని చంద్రుని కాంతి ప్రతిఫలిస్తుంటే మురిపెంగా చూస్తూ గుసగుసగా అంది రుక్మిణి. భార్య వంక తృప్తిగా చూస్తూ ఉండి పోయాడు రామం.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)