Thread Rating:
  • 45 Vote(s) - 3.64 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(2) వారసుడు - completed
రాగా గారు చాలా అద్భుతంగా ఉంది.
ఎంతకన్నా ఎలా చెప్పాలో తెలియలేదు.
[+] 1 user Likes the_kamma232's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Raaga garu...update adaragottaru...bujji ni save chesaru...bullet wound undi ga..GG antha long race body thattukogaladha?

awsome story.
[+] 1 user Likes Terminator619's post
Like Reply
Great Raaga Garu cinematic experience chupincharu mee story tho..nice elane continue cheyandi
[+] 1 user Likes Vinod kumar92's post
Like Reply
banana Nice wonderful marvelous mind-blowing update thanks
[+] 2 users Like saleem8026's post
Like Reply
Excellent updates
[+] 1 user Likes Paty@123's post
Like Reply
Excellent andi.. wonderful andi..
[+] 1 user Likes Nani666's post
Like Reply
దుబాయ్ రోడ్ల మీద గోపీ అందరినీ పరిగెత్తిస్తున్నాడు. రెండు బైకులు నాలు కార్లతో గోపీ కారులో ఉండగా తనని పట్టుకోవడం అసాధ్యమని తెలిసి తనని దారి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. షైక్ జయేడ్ రోడ్. తప్పించుకుపోవడం ఈజీనే కానీ రేస్ ట్రాక్ వెనక ఉంది. వెనక్కి వెళ్ళాలి. అసలు ప్రతీసారి ఫ్రాన్స్‌లో జరిగే లే మాన్స్ రేస్ మొదటి సారి దుబాయ్‌లో జరగడం. ఏదో తెలియని శక్తి సాయం చేస్తున్నట్టు అనిపించింది. నాలుగు కార్లకు ఇంకో నాలుగు తొడయ్యాయి. 



అవసరం లేకపోయినా ఎక్కువ రైజ్ ఇస్తున్నాడు గోపీ. జోయా తయారు చేసిన కారు అటువంటిది. ఎక్కడో అక్కడ ఆగక తప్పదు. తను తప్పించుకోవాలంటే ఇంజన్ వేడిగా ఉండాలి. ఇప్పటి వరకు Nos వాడలేదు గోపీ. 

అనుకున్నట్టే ఎదురుగా బ్లాక్ చేశారు. పిల్లల్ని ఎత్తుకొచ్చిన వాడు కారుకి అడ్డంగా నిలబడి నవ్వుతుంటే కోపం వచ్చింది. వేగంగా ఇంకా పూర్తిగా స్పీడ్ పెంచాడు. ఆగిపోతాడేమో అనుకున్న గోపీ ఇంకా వేగం పెంచేసరికి ఏం చెయ్యాలో తెలీక గన్ ఫైరింగ్ చేశాడు. అవి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు. గోపీ మొహంలో నవ్వు కనిపించిన మరుక్షణం కారు వాడి పొట్టని చీల్చుతూ గుద్దేశాడు గోపీ. 

గోపీకి దెబ్బలు తగిలాయి. తేరుకుని చూసాడు. ఇంజన్ ఓవర్ హీట్ సింబల్ చూపిస్తుంది. కిల్ స్విచ్ ఆన్ చేసి Nos పూర్తిగా తిప్పి వదిలేసాడు. మెల్లగా కిందకి దిగాడు. అప్పటికే అక్కడికి వచ్చిన మెయిన్ డాన్ గోపీ మెడ పట్టుకుని కిందకి ఈడ్చాడు. గట్టిగా నవ్వాడు. చుట్టూ మనుషులు. You are going to die అని నవ్వాడు గోపీ. ఏదో తేడా జరగబోతుందని తెలిసేలోపే ఒక్క ఉదుటున లేచి గుండె మీద తన్నాడు. వాడు కారు దగ్గర పడటం. కారులో ఓవర్ హీట్ ఆగిపోకుండా వెలగడం, దానికి పర్యావసానంగా జోయా కలిపి పెట్టిన వైర్లలో చిన్న నిప్పు రవ్వ. కారులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్. BOOOOOOOM.MM.MM

ముందే పక్కకి దూకేసిన గోపీ అందరూ తెరుకోక ముందే ఇంకో కారు ఎక్కి అక్కడి నుంచి జంప్ అయ్యాడు. మెయిన్ హెడ్ చచ్చాడు. వాడి కింద చేసే వాడు చచ్చాడు. గోపీ వెనక ఇంకెందుకు చేజ్ చెయ్యాలో మిగతా వాళ్లకి అర్ధం కాలేదు. అక్కడే ఆగిపోయారు. 

అలుపు లేకుండా కారు నడపడం బాడీ మీద వెయిట్ పడుతుంది గోపీకి. స్వర్ణా.. అని పిలిస్తే అప్పటి వరకు గోపీ ఏమైనా మాట్లాడతాడేమో అని చూసిన స్వర్ణ వెంటనే రెస్పాండ్ అయ్యింది. 

ఏం చేస్తున్నావ్ అక్కా..

నవ్వింది స్వర్ణ. (Pos:18)

ఓ పాట పాడు.

ఏం పాట ! 

ఒకడే ఒక్కడు మొనగాడు.. ఊరే మెచ్చిన పనివాడు 
విధికి తలొంచడు ఏనాడు.. తల ఎత్తుకు తిరిగే మొనగాడు 

గోపీ పాడుతుంటే పిచ్చిగా నవ్వుతుంది స్వర్ణ. 

పాడు.. ఇలాంటి టైంలొ రజినీకాంత్ మోటివేషనల్ సాంగ్స్ బాగా పని చేస్తాయి. Next lapకి టైర్లు మార్చాలి. స్వర్ణ టీంకి టైర్స్ అని చెప్పింది.

ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టుకు ఢీ కొట్టు.. ఇంజన్ పేలెట్టు 

Overspeed వెళ్తున్నావ్. గుర్తుచేసింది స్వర్ణ 

కాసేపు మౌనంగా ఉన్నాడు గోపీ.. ఉన్నట్టుండి స్వర్ణ చెవుల్లో   మనసు ఉన్న మనిషినయా.. నేను మీసమున్న బాలునయ. నేను మేలు చేయు వాణ్ణయా మేలుమరిచి పొనయా.. ఈ జన్మ ఎత్తింది నీకోసమే జోయా.. జిజ్జు నక్కు జిజ్జు నక్కు.. జిజ్జు నక్కు జిజ్జు నక్కు.. 

ఒరేయ్ నువ్వెంత స్పీడ్ వెళ్తున్నావో తెలుసా.. ఇలాంటి టైములొ పాటలేంటి. నువ్వే కాదు నీ వెనక వచ్చే వాళ్ళు కూడా.. అంటుంటే గోపీ మధ్యలో ఆపేశాడు.

అవన్నీ నాకు తెలుసులే.. నాకు నిద్రొస్తుంది. 

వచ్చేయి విష్ణు వెళ్తాడు. 

ఇప్పుడే కాదు. Pos:15కి వెళ్ళాక. అయినా పాపం విష్ణు ఒక్కడే చాలా మానేజ్ చేశాడు. Scrutineering మొత్తం వాడే చూసుకున్నాడు. ప్రాక్టీస్ చేశాడు. డ్రైవర్స్ పరేడ్‌కి వాడే వెళ్ళాడు. నిన్ను రేస్ ఇంజనీరింగ్‌గా పెట్టుకుంటే మా కింద మేము బాంబు పెట్టుకున్నట్టే 

నేనేం చేశాను !!

సాయంత్రం నాలుగింటికి మొదలయిన రేస్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది ?

పది అవుతుంది. 

మరి ఇప్పుడు ఎవరు రావాలి ? నైట్ డ్రైవర్ స్పెషలిస్ట్ ఎవరు?

షరీఫ్ 

అవును.. వాడిని రెడీగా ఉండమను. స్పీడ్ పెంచాడు గోపీ. రాత్రి పదకొండు అయ్యేసరికి pos:12లొ ఉన్నారు.

స్వర్ణ మాటలు వినిపించాయి. గోపీ.. విష్ణు నువ్వెందుకు స్పీడ్ వెళ్లట్లేదని అడుగుతున్నాడు. 

నేను ఇంజురీ.. రాత్రి మొత్తం షరీఫ్ నడపాలి. మన పోజిషన్ ముందు ఉంటే వాడు ఇబ్బంది పడతాడు. మబ్బులు ఏ డైరక్షన్‌లొ వెళ్తున్నాయో గమనించావా ?

స్వర్ణ కోపంగా పక్కన ఉన్న ఇంజనీర్లని చూసింది. 

మాములుగా ఫ్రాన్స్ అయితే వర్షం పడేదేమో కానీ ఇక్కడ గాలి దిశ మారుతుంది. ట్రాక్ టెంపరేచర్ కూడా మారుతుంది. బ్రేక్స్ వేసేటప్పుడు నాకు తెలుస్తుంది. అలాంటప్పుడు హై స్పీడ్‌లొ కారు మనకి అనుగుణంగా ఉండదు. ఇవన్నీ మీరు చెప్పాలి. నా ఖర్మ. ఏం చేస్తా.. మాట్లాడుతూనే నడుపుతున్నాడు. వాడికి ఇది కూడా అర్ధం కాలేదా అని గొణిగాడు గోపీ..

పదకొండుంబావుకి కారు దిగాడు గోపీ. షరీఫ్ కారు ఎక్కాడు. లోపలికి వెళ్లి పడుకుంటే జోయా వచ్చింది. బుజ్జి ఏది అని అడిగాడు. 

అది మెచ్యుర్ అయ్యింది. 

ఇప్పుడా !!

హా.. మీ అమ్మ హోటల్‌కి తీసుకెళ్ళింది. తను చూసుకుంటానంది. 

ఓహ్ !! దగ్గరికి రారా.. కాసేపు. 

నేనెళ్ళాలి అంది జోయా. గోపీ బ్లీడింగ్ చూసి డాక్టర్‌ని పిలిచింది.

డాక్టర్ వచ్చి దెబ్బ చెక్ చేశాడు. బ్లీడింగ్ అవుతుంటే మళ్ళీ కట్టు కట్టి వెళ్ళిపోయాడు. తరువాత ఏం చెయ్యాలో విష్ణుతో మాట్లాడాక తాతయ్యతో పొద్దున జరిగిన గొడవ గురించి ఏదైనా సమస్య అయ్యిందేమోనని కనుక్కున్నాడు. రేస్ గురించి ఎంత ఆలోచించినా లాభం లేదు. పరిస్థితుల బట్టీ పోవాల్సిందేనని ఆలోచించడం మానేశాడు. పెయిన్ కిల్లర్స్ వల్ల త్వరగా నిద్ర పట్టేసింది. 

★★

పొద్దున్నే ఐదింటికి మెలుకువ వచ్చింది గోపీకి. విష్ణు అప్పటికే లేచి స్ట్రెచ్ చేస్తున్నాడు. జోయా ఎడతెరపి లేకుండా పని చేస్తుంది. గోడ మీద టీవీని చూస్తూ నవ్వాడు గోపీ.

ఏమైంది అని అడిగాడు విష్ణు. వేలు పెట్టి షరీఫ్‌ని చూపించాడు(pos:12). వాడికి రాత్రి నేను కారు ఇచ్చినప్పుడు పన్నెండో పొజిషన్‌లొ ఉన్నాం. తెల్లారినా వాడు పన్నెండో పొజిషన్‌లోనే ఉన్నాడు. చప్పట్లు కొట్టాడు గోపీ. జోయా కూడా అది విన్నది. ఇద్దరు నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు గోపీ అర్ధంకాక. ఇద్దరు నవ్వడం ఆపేసారు. 

నేను వాడి మీద జోక్ చెయ్యట్లేదు. రాత్రంతా నడిపినా వాడు పొజిషన్ కాపాడాడు. వాడికున్న అనుభవానికి అక్కడున్న రేసర్లకి చాలా కష్ట పడ్డాడు. 

అవును.. ఇందాకటి నుంచి ఇప్పటి వరకు ఒకటే కంప్లైంట్స్ బ్రేక్స్ ప్రాబ్లం ఉందని.. బ్రేక్ పాడ్స్ మార్చాం అయినా కంప్లైంట్ చేస్తూనే ఉన్నాడు. నవ్వుతూ చెప్పింది జోయా.

వాట్ ! ఆశ్చర్యపోయాడు గోపీ 

కానీ మానిటర్ అంతా బానే చూపిస్తుంది. ఎక్కడా ఫాల్ట్ కనిపించలేదు. 

ఏమి జరగకపోతే వాడు అలా ఎందుకు చెప్తాడు. రమ్మను. గోపీ విష్ణు వంక చూసాడు. విష్ణు అర్ధమైనట్టు ట్యాబ్ తీసుకుని చూసాడు. ఏదో అర్ధమైనట్టు డక్ట్ పోయిందేమో కానీ అదేం కనిపించట్లేదే.. అన్నాడు.

షరీఫ్ వచ్చేలోపు ఐస్ వాటర్‌తో మొహం కడుక్కుని హెల్మెట్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు గోపీ. 

విష్ణు కాదా వెళ్ళేది? అడిగింది జోయా 

లేదు నేనే వెళ్ళాలి. బుజ్జి ఎలా ఉంది?

పడుకుందట, తాతయ్య చెప్పారు   

ఓకే అన్నాడు గోపీ. షరీఫ్ కార్ దిగుతూనే మొదటి సారి పడట్లేదు.. బ్రేక్ రెండు సార్లు నొక్కితే కానీ పడట్లేదు అన్నాడు. గోపీ వింటూనే కారు ఎక్కి పోనించాడు. ఇక్కడితో షరీఫ్ పని అయిపోయింది. రెస్ట్ కోసం లోపలికి వెళుతు విష్ణుకి ప్రాబ్లం చెప్పి వెళ్ళాడు. విష్ణు కూడా వెనకే వెళ్ళాడు.

కెర్బ్‌స్(race track మలుపులో ఉండే ఎర్రని పెయింట్ ఉంటుంది) మీదకి ఎక్కించినట్టున్నావ్. 

అది కామన్ కదా అన్నాడు షరీఫ్ 

అవును.. కానీ ఓవర్ స్పీడ్ మీద ఎక్కిస్తే కారు బౌన్స్ అవుతుంది. సస్పెన్షన్ వల్ల ఏమైనా సమస్య వస్తుందేమో.. చూద్దాం. గోపీ వెళ్లాడుగా అన్నాడు విష్ణు.


గోపీ చెక్ చేశాడు. నిజంగానే మొదటి సారి బ్రేక్ వేసినప్పుడు మిస్ అవుతుంది. రెండో సారి నొక్కినప్పుడు పడుతుంది. అంటే రోటర్‌కి బ్రేక్ పాడ్స్ దూరం జరిగాయి. బ్రేక్ ప్రెజర్ ఫీల్ అవ్వట్లేదు. అంటే కూలింగ్ డక్ట్‌లొ ఏదో ఇరుక్కుని ఉండాలి. 

స్వర్ణా.. డక్ట్ మార్చాలి. ఫ్రంట్ సస్పెన్షన్ కూడా.. ఫాస్ట్. Iam coming అని అరిచాడు. స్వర్ణ జోయాకి చెప్పింది. కారు పిట్ స్టాప్ దగ్గరికి రాగానే విష్ణు, షరీఫ్ ఇద్దరు దగ్గరికి వచ్చారు. గోపీ జరిగింది చెప్పాడు. 

ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఇక నుంచి ఎవరీ సెకండ్ మనకి చాలా ఇంపార్టెంట్. లెట్స్ గొ అని చెయ్యి పెడితే మిగతా ఇద్దరు బంప్ ఇచ్చారు. కారు రెడీ అయ్యింది. 

గోపీ మళ్ళీ పదమూడు నుంచి పన్నెండో పొజిషన్‌కి తెచ్చాడు. 

గోపీ you are late by 48 seconds అని గుర్తు చేసింది స్వర్ణ. 

Got it.. Im good. Lets do this. 

Lets do this అంది స్వర్ణ.

ఫుల్ స్పీడులొ కొడుతున్నాడు గోపీ. 312-328 టచ్ అవుతుంది స్పీడ్. స్వర్ణ గుర్తు చేస్తుంది. 

బ్రేక్ సెట్స్ రెడీ పెట్టుకోమను. They will be red hot అన్నాడు గోపీ. (స్పీడ్ 335)
ఆ మాటకి స్వర్ణకి కూడా ఊపు వచ్చింది. 

pos పదకొండు.. 
తరువాతి ఐదు లాప్స్‌లొ తొమ్మిది. 

గోపీ -33 seconds. చెప్పింది స్వర్ణ. 

Ok.. okay 

చివరి మలుపు దగ్గర కాంపిటీషన్ టైట్‌గా ఉంది. గోపీ స్పీడ్ తగ్గించలేదు. ఆఖరి క్షణంలొ వేసిన బ్రేకు. వీల్స్ దగ్గర ఉన్న బ్రేకులు ఎర్రగా మెరిసాయి. రెండు కార్లని తప్పించి స్ట్రెయిట్ రోడ్ వచ్చేసరికి మళ్ళీ వేగం పెంచాడు. (pos:07) (స్పీడ్ 342)

-18 seconds (స్వర్ణ గొంతు)

మెల్లగా సూర్య కిరణాలు రోడ్డు మీద పడుతూ కారు కూడా మెరుస్తుంది. ఒక్కో కారుని దాటుకుంటూ వెళుతుంటే చిన్నప్పటి నుంచి జరిగిన ప్రతీ సంఘటన గుర్తుకు వస్తుంది. (స్పీడ్ 355) నిద్ర లేచి చూస్తున్న ఆడియన్స్ నుంచి అందరి కళ్ళు గోపీ కారు మీదే ఉన్నాయి. గోపీ వెళుతున్న వేగానికి మిగతా అందరి కార్ల కంటే గోపీ కారు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఫోనులో ఫోటో తీయడానికి ప్రయత్నించారు కొంతమంది. గాలి తప్ప ఏమి పడలేదు ఫొటోలో (స్పీడ్ 362)

స్వర్ణ అరుస్తుంది. గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడ్డాడు గోపీ. ఒంటరిగా ఎండలో పనిష్మెంట్ తీసుకుంటున్న గోపీ నుంచి మొన్న జోయా కోప్పడి ప్రేమగా గోడ కుర్చీ వేయించిన గోపీ.. వీటన్నిటిని పక్కకి నెట్టేస్తే కానీ మళ్ళీ రోడ్డు స్పష్టంగా కనపడలేదు. స్వర్ణ గొంతు చిరాకు తెప్పించింది.

ఎందుకు అరుస్తున్నావ్. 

నువ్వు వెళ్తున్న స్పీడ్. ఓవర్ స్పీడ్. ఓవర్ స్పీడ్..

ఒకే ఒకే.. గాట్ ఇట్. 


★★

గోపీ కారు దిగి విష్ణు కారు ఎక్కేటప్పటికి వాళ్ళున్న పొజిషన్ 4 (ఐదు సెకండ్ల వెనక ఉన్నారు)
Dont lose this one అని హెచ్చరించాడు గోపీ. విష్ణు ఓకే అని కారు ఎక్కాడు. (ఎనిమిది గంటల్లో రేస్ ముగుస్తుంది)

తరువాత మూడు గంటల్లో విష్ణు pos04 నుంచి pos03కి తెచ్చాడు. అందరూ చప్పట్లు కొడుతుంటే గోపీ కూడా కొట్టాడు. అందులో ఎటకారం చూసింది జోయా. డొక్కలో పొడవబోయి ఇంజురీ ఉందని ఆగిపోయింది. 

నేను మామూలుగానే చప్పట్లు కొట్టానురా..

స్వర్ణ ఎనర్జీ డ్రింకులు తాగుతుంటే నవ్వుకున్నాడు. జోయా అది చూసి నువ్వు మారవు అని వెళ్ళిపోయింది. టీం దగ్గరికి వెళ్ళాడు గోపీ. 

నాకు పిట్ స్టాప్ చాలా ఫాస్ట్‌గా అయిపోవాలి. నట్లు స్పయిర్ క్యారీ చెయ్యండి. డోంట్ డిలే అంటే ఊ కొట్టారు అంతా.. 

గోపీ కారు తీసుకున్న తరువాత pos01 కోసం వేట మొదలయింది. ఒకటి గెలుపు అలవాటు అయిన ఫెరారి ఇంకోటి ఈ మధ్య గెలిచి సెన్సేషన్ సృష్టించిన ఫోర్డ్. ఈ ఇద్దరి వెనకాల అనుభవం లేని టీముతో గోపీ. అయినా చాలా వరకు కూల్‌గానే అందరినీ డీల్ చేశాడు. పెయిన్ కిల్లర్స్ వేసుకోమన్నారు. కానీ దాని వల్ల ఫోకస్ ఉండదు. అతి వేగం, అతి బ్రేకుల వల్ల బాడీ మూమెంట్ ఇచ్చినప్పుడల్లా సూదితో గుచ్చినట్టు అనిపిస్తుంది. 

Ferrari | Ford | Rao

6 గంటల్లో రేస్ ముగుస్తుంది. విష్ణు ముందున్న రెండు కార్లతో పోటీ పడి నడుపుతున్నాడు. స్వర్ణ మాటల సహాయం విష్ణుకి చాలా బూస్ట్ ఇస్తుంది. మధ్యలో ఒకసారి pos02కి కూడా వచ్చి మళ్ళీ మూడో స్థానానికి వచ్చాడు. మొదట నాలుగు కార్లకి మిగతా కార్లకి దూరం పెరుగుతుంది. పెద్ద రేస్‌లొ ఇక్కడ ఇంకో చిన్న రేస్ జరుగుతుంది. రెండో పొజిషన్‌లొ ఉండనివ్వడం లేదు విష్ణుని. కావాలనే కార్నర్ చెయ్యడం, సెంటర్ చెయ్యడం. రాగ్గింగ్ చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా విష్ణుకి దారి ఇవ్వడం లేదు. 

పిట్ దగ్గరున్న జోయా కూడా అదే అంది. పదే పదే గోపీకి చెపుతుంటే ఆళ్లేందుకిత్తారే అన్నాడు. ఆశ్చర్యపోయి చూసింది జోయా. ఇదే మొదటి సారి తనని ఓరేయ్, రారా అని కాకుండా రే అన్నది. మెల్లగా మారుతున్నాడని నవ్వుకుంది. 

రాయ్య రా అని దారిస్తారా.. వీడే తీసుకోవాలి. వాడిని రమ్మను. 

ఇంకా అరగంట ఉంది కదా లాస్ట్ మూడు గంటలకి ?

చాల్లే రమ్మను. వాడి వల్ల కావట్లేదు. అలా లాక్ చేసినప్పుడు మిగతా మూడు కార్లని వీడు స్లో చెయ్యగలగాలి. అప్పుడు వెనక ఉన్న వాళ్లకి వీళ్ళకి డిస్టన్స్ తగ్గుతుంది. అది వాళ్ళు గమనించగానే వీడిని వదిలేసి వాళ్ళ పొజిషన్ కాపాడుకోవడానికి చూస్తారు. ఆ గ్యాప్‌లొ విష్ణు ఓవర్‌టేక్ చెయ్యాలి. వాడు ఆల్రెడీ పానిక్ అయ్యాడు. స్వర్ణ మొత్తుకుంటుంది చూడు అంటే జోయా స్వర్ణకి డ్రైవర్ చేంజ్ సింబల్ చూపించింది. 

కారు ఎక్కడమే ఆలస్యం. టైర్లు చేంజ్ అయిన క్షణం టైర్లు జుమ్మని పరిగెత్తాయి. కారుని మొదట ఉన్న ముగ్గురి మధ్యలోకి తీసుకెళ్లాడు గోపీ. స్వర్ణ కూడా ఊపిరి పీల్చుకుంది. మొదట విష్ణు నడిపినప్పుడు అంతా కంగారు కంగారు, తరువాత గోపీ వచ్చాక తను కూల్‌గా ఉండటమే కాక స్వర్ణని కూడా కూల్ చేశాడు. రాత్రి అంతా షరీఫ్‌తో కుస్తీ చేసింది. పొద్దున గోపీ పాటలు పాడి జోకులు చేసి ఓ పక్క పొజిషన్ మార్చుతూనే వాతావరణం సరదా చేశాడు. ఇందాక విష్ణుతో మళ్ళీ యుద్ధమే జరిగింది. ఆఖరికి విష్ణుకి ఎలా నడపాలో చెపుతుంటే నోరు మూసుకోమని అరిచాడు విష్ణు. గట్టిగా హర్ట్ అయ్యి అలిగింది స్వర్ణ. ఇప్పుడు మళ్ళీ గోపీ వచ్చి రాగానే వాళ్ళతో ఫైట్ మొదలు పెట్టేసాడు.. టాప్ త్రీలో ఉన్న ముగ్గురి మధ్యలోకి వెళ్లి చెప్పు స్వర్ణా.. ఏం చేద్దాం వీళ్ళని అన్నాడు సరదాగా 

ఇలాంటి రేస్‌లో అందరూ ప్రొఫెషనల్స్ & అచీవర్స్ మాత్రమే ఎందుకు ఉంటారో బాగా అర్ధమైంది స్వర్ణకి. ఈ అనుభవం చాలా పాఠాలు నేర్పింది. ముఖ్యంగా గోపీ గురించి, తన ధైర్యం గురించి, తన స్కిల్ గురించి ఇంకా డీప్‌గా తెలుసుకుంది. ఎమోషనల్ బాలన్స్ గురించి గోపీ ఒక్క ముక్క కూడా ఎప్పుడూ మాట్లాడలేదు.. వాడి జీవితం దగ్గరగా చూస్తే చాలు. జీవితం అదే నేర్పిస్తుంది. కాకపోతే స్వర్ణ ఏం చూడకుండానే ఆ అనుభవం పొందింది గోపీ వల్ల. 

స్వర్ణ ఉన్నావా ?

ఉన్నా.. 

గెలుద్దామా వద్దా 

గెలుద్దాం.

మరి స్టాట్స్ చెప్పకుండా ఏం చేస్తున్నావ్. 

సారీ.. మైండ్ ఫ్రెష్ చేసుకుంది స్వర్ణ. పక్కన ఇంజనీర్లతో కోఆర్డినేట్ చేస్తూ అన్నీ చెపుతుంటే గోపీ మాటలు వినిపించాయి. You wanna play.. Lets play then.. ముందున్న ఎడ్జ్ దగ్గరికి వస్తుంది. ఎవ్వరు స్పీడ్ తగ్గించడం లేదు. ఎవ్వరు తగ్గించరనుకున్నారు అంతా.. కానీ గోపీ ముందే స్లో చేసి టక్కున గడ్డి మీదగా తిప్పేసాడు. (pos02) 

పక్కనే ఫెరారి. వెనక ఫోర్డ్. ఆ వెనకే GT ఉన్నాయి. ఈ ముగ్గురిలో ఎవ్వరు తక్కువ కాదు, ముఖ్యంగా ఆ డ్రైవర్లు. ఫెరారితో పాటు గొపీ నడిపే కారు ఒకటంటే ఒకటి పోటీగా ముందుకు దూకుతున్నాయి. చూసే రాజారావుకి రెండు గుర్రాలు పొటీ పడుతున్నట్టు కనిపించింది. కారుని చూసి పిట్ వాళ్ళతో మాట్లాడుతున్న జోయా వంక చూసాడు. ఈ అమ్మాయా ఆ కారు తయారు చేసింది !!

కారులో కూర్చున్న గోపీ కూడా అదే కాంఫిడెన్స్‌తో ఉన్నాడు. 348కిమీ పైన వెళుతున్నా ఎక్కడా ప్రెజర్ లేదు. ట్రాన్సమిషన్‌లో ఇబ్బందులు లేవు. జోయా తయారు చేసిన DCT ఎంత బాగా పని చేస్తుందో దానికి ప్రాణంలా సృష్టించిన స్వర్ణ TCU అంతే ఇదిగా DCTకి స్పందిస్తుంది. ఇద్దరు గోల్డ్ ఎహె అనుకున్నాడు. దానికి తోడు స్వర్ణ డిజైన్ చేసిన కారు ఫ్లాప్స్ కారుని షేక్ చెయ్యకుండా స్టేబిలిటీకి హ్యాట్సాఫ్ కొట్టేశాడు. ముఖ్యంగా జోయా బిగించిన ఇంజన్. ఎవరిని ఎక్కువగా పొగడాలో అర్ధం కాలేదు. వీళ్ళ కష్టం అంతా ఇప్పుడు నా చేతుల్లో ఉంది. మిగతా కార్లకి దీనికి తేడా ఎన్ని లాప్స్ కొట్టినా ఇంజన్ పవర్ తగ్గదు. అందరూ పది  నుంచి పదిహేను లాప్స్ వరకు పిట్ స్టాప్‌కి వెళతారు కానీ గోపీ పడ్డెనిమిది రిస్క్ చేస్తే ఇరవై వరకు ఆగగలడు. ఇది చాలా మేజర్ అడ్వాంటేజ్. 

ఇప్పటికే 362 లాప్స్ అయ్యాయి. ఇంకా గంటన్నర ఉంది. మహా అయితే ఇంకో పదిహేను నుంచి ఇరవై లాప్స్ అంతే.. నాలుగు కార్లు కొట్టుమిట్టాడుతున్నాయి. అందరూ పిట్ స్టాప్‌కి వెళుతున్నారు. గోపీ కూడా వెళ్ళాడు. టైర్లు ఫ్యూయల్ అన్నీ చేంజ్ అయ్యాయి. గోపీ కారు ఎంత వేగంగా నడిపినా గోపీకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్‌తో పాటు మేజర్ డిస్-అడ్వాంటేజ్ పిట్ కౄ.. మిగతా వారితో పోల్చితే వీళ్ళు చాలా లేటు. 

ఇక ఒకటే పిట్‌స్టాప్ ఉంది. రోడ్డుని టైర్లని ఇంజన్‌ని అన్నిటినీ ఫీల్ అయ్యాడు. కళ్ళు మూసుకుని తెరిస్తే చనిపోయిన వాళ్ళు బుజ్జిది జనని రాజారావు స్వర్ణ అందరూ కనిపించారు. ఆఖరిగా జోయా కనిపించింది. పానర్ పట్టుకుని నవ్వుతూ నన్ను నమ్ము అంది లాలనగా.. 

కళ్ళు తెరిచాడు గోపీ. స్వర్ణ మాటలు వినిపించకుండా సపోర్ట్ బటన్ ఆఫ్ చేసేసాడు. ముందు ఏమైనా ఇబ్బందేమో అనుకుంది స్వర్ణ కానీ గోపీ ఆఫ్ చేసేసాడని అర్ధమయ్యి లేచి నిలబడి పక్కకి వచ్చింది. విష్ణు అది చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్వర్ణ కంగారు చూసి జోయా రాజారావు కూడా ఏం జరిగింది అని వచ్చేసారు. పక్కన ఇంజనీర్లు కూడా అదే అయోమయంలో ఉన్నారు. 

స్వర్ణ విష్ణు దగ్గరికి వచ్చేసింది.
ఏమైంది ? అని అడిగాడు విష్ణు.

గోపీ మైక్ ఆఫ్ చేసేసాడు. ఎందుకో తెలీదు. నాకేం అర్ధం కావట్లేదు. రాజారావు, జోయా ఎందుకు ఏంటి ఏం జరిగింది అని అడుగుతుంటే విష్ణు భుజం మీద షరీఫ్ చెయ్యి పడింది. అందరూ షరీఫ్ వంక చూస్తే షరీఫ్ గోపీ కారుని వేలు పెట్టి చూపించాడు. మానిటర్‌లో ఉన్నట్టుండి గోపీ కారు భీభత్సమైన వేగం పుంజుకుంటుంది. తన పర్సనల్ మానిటర్ దగ్గరికి పరిగెత్తింది స్వర్ణ. కారు 362 దాటుతుంది. 

ఏం చేస్తున్నాడు గోపీ అని అడిగింది జోయా కంగారుగా. అందరిలో సమాధానం తెలిసిన మొహం విష్ణుదే కనపడింది. 

He is risking it.. గెలుస్తామన్న నమ్మకంతో నవ్వాడు గోపీ. అందరూ ఉత్ఖంటగా చూస్తున్నారు. లాస్ట్ నలభై నిమిషాలు. అందరూ పిట్‌స్టాప్ దగ్గర ఆగారు. జోయా కూడా సిద్ధంగా ఉంది.. కానీ గోపీ కారు రాలేదు. అందరి మొహంలో కంగారు. ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలీదు. నాకు మాత్రం తెలుసు అన్నట్టు మొహం పెట్టాడు విష్ణు. జోయా పక్కకి వచ్చేసింది. 

గోపీ ఏమాలోచిస్తున్నాడో. మిగతా వాళ్ళ పిట్‌స్టాప్ టైముని ఎలా మిగల్చాలని చూస్తున్నాడో చెప్పాడు. 

కారు తట్టుకుంటుందా.. కారు తట్టుకున్నా టైర్లు, ఫ్యూయల్ గురించి. బ్రేక్స్ ట్రాన్సమిషన్ లిక్విడ్. అన్నీ అడిగేసాడు రాజారావు. సమాధానం విష్ణు దగ్గర లేదు. గోపీ మీద నమ్మకం మాత్రమే ఉంది. విష్ణు కళ్ళార్పకుండా చూస్తుంటే చూడటం తప్ప చేసేదేమి లేదని అర్ధమైంది రాజారావుకి. 


నట్టు శబ్దం లేకుండా ఎవ్వరు మాట్లాడకుండా చూస్తుండగానే ఆ ఆవరేజ్ ఐదు సెకండ్ల టైము గోపీకి కలిసి వచ్చింది. మొత్తానికి గోపీ pos01కి వచ్చేసాడు. తన వెనకే ఫెరారి. ఇక్కడ నుంచి ఎన్ని లాప్స్ ఉంటే అన్ని లాప్స్ పర్ఫెక్ట్ లాప్ చెయ్యాలి లేదంటే కష్టం. అదే చేస్తున్నాడు గోపీ. ఎక్కడా రవ్వంత తప్పు చెయ్యకుండా నడుపుతున్నాడు. తల మీద నరం గుండె వేగంతో కొట్టుకునే స్పర్శ తెలుస్తుంది. మొహం మీద చెమటలు లేవు, వేరే ఆలోచన లేదు. చేతిలో స్టీరింగ్. స్వర్ణ బాడీ. జోయా ఇంజన్. మిగతా డ్రైవర్లందరికి తెలుసు గోపీ పిట్‌స్టాప్ చెయ్యలేదని. అందుకే ధీమాగా ఉన్నారు. ఎక్కడో అక్కడ గోపీ కారు ఇంజన్ పికప్ తగ్గుతుంది. బ్రేక్ వేసిన తరువాత కారు వేగం అందుకోవడానికి సెకండ్ డిలే అయితే చాలు.. ఆ గ్యాప్‌లో ఓవర్ టేక్ చేద్దామని ఎదురు చూస్తున్నారు. కానీ అది జరగలేదు. లాస్ట్ లాప్ వరకు ఇదే నడిచింది. ఆఖరిది కూడా గోపీ ఎవ్వరికి తావు ఇవ్వకుండా పోతున్నాడు. ఒకానొక సమయంలో కారు జెర్క్ ఇవ్వగానే చమటలు పట్టేసాయి గోపీకి. అరక్షణంలో నేనూ నీతోనేనంటూ కారు ఇంజన్ మాటిచ్చింది.. ఆలా అనిపించింది. రేసులో ఆఖరి మలుపు. వేగం 372. వెనక కార్లకి గోపీ కారుకి మెల్లగా దూరం పెరుగుతుంది. అదే స్పీడ్‌లో వెళుతుంటే కరెక్ట్‌గా ఫినిష్ లైన్ ముందు క్లచ్ కొట్టేసినట్టు త్స్‌స్ అన్న శబ్దం వచ్చింది.. కానీ రేస్ గెలిచేసాడు గోపీ. 



గోపీ కారు జెండా దాటిన క్షణం వరకు అందరూ మౌనంగా ఉన్న స్టేడియం.. మొదటగా చూస్తున్న ఒక అమెరికా పిల్లాడి చేతిలో పాప్‌కార్న్ ఎగిరిపడింది. పైన క్రాకర్స్ పేలడం. అందరూ అరవడం. కామెంటరీ అన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. రాజారావు సంతోషంగా బషీర్ దగ్గరికి పరిగెత్తాడు అప్పటికే బషీర్ కళ్ళలో నీళ్లు.. ఇద్దరు కౌగిలించుకుని ఆకాశం వైపు చూసారు. తమ స్నేహితుడు రెహ్మాన్‌ని తలుచుకున్నారు. 

అందరూ ఒక దగ్గర చేరుతూ అమృత కూడా వచ్చేసింది కానీ స్వర్ణ పిచ్చి సంతోషంతో విష్ణు నడుము ఎక్కి డాన్స్ వేస్తూ విష్ణుకి ముద్దులు పెడుతుంటే విష్ణు స్వర్ణని ఎత్తుకునే డాన్స్ వేస్తున్నాడు. అది చూసి అక్కడే ఆగిపోయింది అమృత. అందరూ ఎంజాయిమెంట్ మూడ్లో ఉంటే జోయా గోపీ కోసం వెళుతు ట్రాక్ ఎక్కింది. వేగంగా వెళుతుంటే అప్పుడే కారు దిగాడు గోపీ.. హెల్మెట్ తీశాడు. జోయా నడక వేగం తగ్గించింది. తన గెలుపుకి గోపీ ఎలా సెలెబ్రేట్ చేసుకుంటాడో చూడాలనుకుంది జోయా.. గట్టిగా అరుస్తాడో గాల్లో ఎగిరి పంచ్ ఇస్తాడో అనుకుంది. కానీ అవేమి చెయ్యలేదు గోపీ. హెల్మెట్ కారు మీద పెట్టి కారు ముందుకు వెళ్ళాడు. ఇంజన్ తెల్లని పొగలు కక్కడం కనిపిస్తుంది. గోపీ వేసుకున్న యూనిఫామ్ ఎర్రగా మారింది నడుము దగ్గర. మళ్ళీ బ్లీడింగ్ అయ్యింది. ముందు కారుకి వంగి దణ్ణం పెట్టుకున్నాడు గోపీ.. నవ్వుకుంది జోయా.. గోపీ దగ్గరికి పరిగెత్తి వాడిని అందుకుంది. గట్టిగా కౌగిలించుకున్నాడు. థాంక్స్ జోయా అన్నాడు చెవిలో.. గోపీని ప్రేమగా చూస్తూ లిప్‌లాక్ చేసేసింది. 

అప్పటికే అందరూ తమ దగ్గరికి వస్తుంటే విడిపడ్డారు. విష్ణుని, షరీఫ్‌ని కౌగిలించుకున్నాడు. ఆ వెనకే వచ్చిన స్వర్ణని అందరినీ.. అందరూ కౌగిలించుకుంటుంటే గోపీ పడుతున్న ఇబ్బందిని గమనించి గోపీని అందరి నుంచి వేరు చేసి పిట్ వరకు నడిపించింది. అందరూ గోపీ తెల్లని యూనిఫామ్  మీద ఎర్రగా మచ్చ పడటం అప్పుడు చూసారు. 
Like Reply
Super super super
[+] 1 user Likes Spider man's post
Like Reply
మామూలుగా ఐతే ఇప్పటితో అంత అయిపోయినట్టే మరి

అంటే రేస్ గెలిచాడు అలానే రావు మోటార్స్ ఇంటర్నేషనల్ అయ్యింది అలానే బుజ్జి నీ కూడా వల్లదగ్గర నుంచి విడిపించేశాడు అలానే విలన్స్ అందరూ చచ్చారు ఈ లెక్కన కథ ఐతే అయిపోయినట్టే కదా మరి తర్వాత ఏం జరుగుతుందో చూడాలి

రైటర్ గారు ఇప్పుడు కథ నీ ఇంకెలా ముందుకి తీసుకెళ్తాడో మరి
[+] 1 user Likes Mahesh12345's post
Like Reply
Adiripoyindi... prathi shot ki mathi pothundi ikkada...
[+] 1 user Likes amardazzler's post
Like Reply
superb
[+] 1 user Likes lohith22's post
Like Reply
Nice update
[+] 1 user Likes Pradeep's post
Like Reply
Iragadesesav boss
Mr. V
[+] 1 user Likes VijayPK's post
Like Reply
Very nice update....
[+] 1 user Likes gudavalli's post
Like Reply
Adaragottaru bro…
[+] 1 user Likes Vinod kumar92's post
Like Reply
(02-07-2026, 10:29 PM)Raagaa Wrote: గోపీ కారు జెండా దాటిన క్షణం వరకు అందరూ మౌనంగా ఉన్న స్టేడియం.. మొదటగా చూస్తున్న ఒక అమెరికా పిల్లాడి చేతిలో పాప్‌కార్న్ ఎగిరిపడింది. పైన క్రాకర్స్ పేలడం. అందరూ అరవడం. కామెంటరీ అన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అప్పటికే అందరూ తమ దగ్గరికి వస్తుంటే విడిపడ్డారు. విష్ణుని, షరీఫ్‌ని కౌగిలించుకున్నాడు. ఆ వెనకే వచ్చిన స్వర్ణని అందరినీ.. అందరూ కౌగిలించుకుంటుంటే గోపీ పడుతున్న ఇబ్బందిని గమనించి గోపీని అందరి నుంచి వేరు చేసి పిట్ వరకు నడిపించింది. అందరూ గోపీ తెల్లని యూనిఫామ్  మీద ఎర్రగా మచ్చ పడటం అప్పుడు చూసారు. 

Hello Raagaa! Very good update..Like watching a movie!..particularly the  chasing scene is well written...
fight fight
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
మెలుకువ వచ్చి కళ్ళు తెరిచాడు గోపీ తల తిప్పి చూస్తే పక్కనే కూర్చున్న బుజ్జి కనిపించింది. గది మొత్తం చూస్తే చాలా సేపటికి గానీ అర్ధం కాలేదు. ఉన్నది తాతయ్య ఇంట్లో అని.. మనం ఈ ఇంట్లో నుంచి వచ్చేసాం కదా.. ఇక్కడేం డూయింగు అనుకున్నాడు మనసులో 


బుజ్జి ఏదో చేస్తుంది. పిలిస్తే తల ఎత్తి చూసి నవ్వుతూ పరిగెత్తి జోయాని పిలుచుకొచ్చింది. ఏదో వింతగా అనిపించింది. అదేంటో అర్ధం కాలేదు. జోయా బుజ్జి ఇద్దరు చెరోవైపున చేరారు. బుజ్జి చెయ్యి పట్టుకుంటే వంగి బుగ్గ మీద ముద్దు పెట్టింది. గోపీ వెంటనే జోయా చెయ్యి కూడా పట్టుకుంటే నవ్వుతూ బుగ్గ మీద కొట్టింది. లేచి కూర్చున్నాడు. ఒంటి మీద షర్టు లేదు. కింద తెల్ల పంచె కట్టారు. ఇదెందుకు కట్టారు అనుకున్నా అసలు ఇంతకీ ఏమైంది అని అడిగాడు జోయాని.

ఎంతసేపు పడుకున్నా ?

రెండు రోజులు 

ఓహ్.. కప్ ఎవరు తీసుకున్నారు ?

విష్ణు, షరీఫ్.. ఇద్దరే 

హ్మ్.. నేను లేవలేదా ?

లేదు.. స్పృహలో లేవు

నన్నెలా తీసుకొచ్చారు అని అడిగితే జోయా నవ్వింది. 

శవాన్ని ఏసుకొచ్చినట్టు తీసుకొచ్చామని మాత్రం చెప్పకు. ప్లీజ్.

జోయా మూతి మీద చెయ్యి పెట్టుకుని నవ్వుతూ అలానే తీసుకొచ్చామని అని తల ఊపింది. కోపంగా చూసాడు గోపీ. ఇంకా నయ్యం సూట్‌కేసులో పెట్టినట్టు నన్ను శవపేటికలో పెట్టలేదు సంతోషం. పెట్టలేదు కదా అంటే నవ్వుతూనే పెట్టలేదు అని తల ఊపింది జోయా. కొంచెం గ్యాప్ ఇచ్చాడు. జోయా మౌనంగా నిలుచుంది.

తాతయ్య ఎలా ఉన్నాడు ?

ఫుల్ హ్యాపీ. అందరికీ నెల రోజులు సెలవలు ఇచ్చాడు. మూడు నెలల బోనస్ ఇచ్చాడు. ఎంప్లాయిస్ ట్రిప్స్ ఎటు వెళ్లినా ఖర్చు కంపెనీదే అని అనౌన్స్మెంట్ ఇచ్చాడు. 

ముసలోడికి ఏది ఆగదు. వెనక నుంచి దగ్గు వినిపిస్తే తల తిప్పి చూసాడు. రాజారావు నిలుచుని కోపంగా చూసాడు. 

ఓహ్ షిట్ట్..! బుజ్జి నవ్వుతుంది. బుజ్జిని చూసి నవ్వొద్దని సైగ చేశాడు. రాజారావుతో పాటు జనని కూడా వచ్చింది. చూసి నవ్వితే జనని కూడా నవ్వింది.

ఎలా ఉంది ? అని అడిగాడు రాజారావు 

అంతా బానే ఉంది కానీ ఎక్కడో తేడా కొడుతుంది తాతయ్యా.. ఏదో జరిగింది. సంథింగ్ ఇస్ ఫిషి!!  ఏదో.. ఏదో జరిగింది. (జోయా పక్క నుంచి ముసి ముసిగా నవ్వడం జనని చూసి నవ్వేసింది) గోపీ వెంటనే ఏమైంది అని జనని చూసి తల తిప్పి జోయాని చూసాడు. జోయా నవ్వు ఆపుకుంటుంది. 

రాజారావు మెల్లగా పక్కన కూర్చుని నీకు అని పంచె వైపు చూసాడు. గోపీ కళ్ళు పెద్దగా విచ్చుకున్నాయి. 

అమ్మనీ..! అదే..! అక్కడే..! 

గోపీ అయోమయంగా చూస్తుంటే రాజారావు దీనంగా చూస్తూ తల నిలువుగా ఊపాడు. 

పోయిందా.. తీసేశారా.. బుల్లెట్ పైన కదా తగిలింది! ఇన్ఫెక్షన్ వచ్చిందా? అయ్యో.. అయ్యయ్యోహ్.. జనని ఏం జరిగిందో చెప్పబోతు చెయ్యి ఎత్తితే.. అప్పుడే గోపీ పోనీలే.. పోతే పోయింది. మైఖేల్ జాక్సన్ డాన్స్ కోసం తీయించినట్టు నేను రేసింగ్ కోసం తీయించుకున్నానని చరిత్రలో నిలిచిపోతా. జోయా.. అని జాలిగా చూసాడు. నువ్వు నన్ను మర్చిపో.. రారా బుజ్జి. నీకు నేను. నాకు నువ్వు. నీకు పెళ్లి చేసి మిగతా జీవితాన్ని ఒంటరిగా గడిపేస్తా. 

ఒక వివేకానంద 
ఒక అబ్దుల్ కలాం 
ఒక లతా మంగేష్కర్ 
అటల్ బిహారి 
విశ్వేశ్వరయ్య 
మోడీ 
సల్మాన్ ఖాన్
కింద 
గోపీ గోవర్ధన్ 

చివర్లో ఎండిపోయిన చెట్టు పక్క నుంచి ఒక్కడినే ఎండలో నడుచుకుంటూ వెళ్ళిపోతా.. సూర్యుడు మెల్లగా కిందకి దిగుతుంటే ఎండ్ కార్డు పడాలి. 

అందరూ గోపీ చెప్పేది ఊహించుకుంటుంటే వెనక నుంచి డిప్ప మీద ఒక్కటి పీకింది జోయా.. అందరూ ఉలిక్కిపడ్డారు. జనని పిచ్చిగా నవ్వుతుంటే జోయా కోపంగా నీకేది పోలేదు. నువ్వు నీ య్యిమాజినేషన్లు. 

పోలేదా..! మరీ!!

అందరూ బైటికి వెళ్లిపోతుంటే గోపీ ఇంకా అయోమయంలో పడుతూ ఏమైందో చెప్పండి అన్నాడు. రాజారావు వెళ్తు ఏమైందో అడక్కపోతే పంచె ఎత్తి చూసుకోవచ్చుగా అనేసి వెళ్ళిపోయాడు.

కదా.. అని పంచె పట్టుకున్నాడు గోపీ. జోయా మెల్లగా గోపీ పక్కనే తన ఎదురు కూర్చుంది. బుజ్జి.. నువ్వెళ్ళి జ్యూస్ చేయించు నేనొస్తాను అంటే సరే అని వెళ్ళిపోయింది బుజ్జి. 

ఒరే.. ఏం జరిగిందిరా. వాళ్లేమో వెళ్లిపోయారు. దాన్ని నువ్వు పంపేశావ్. నాకు తడిసిపోతుంది కింద. ఛ.. తడవడానికి ఇంకేం మిగిలింది అక్కడా.. అని బాధపడుతుంటే జోయా తన నుదురుతో గోపీ నుదురుని గట్టిగా కొట్టింది. 

ఒక్క నిమిషం కూడా ఓపిక పట్టలేవా (ఇద్దరి నుదుర్లు కలిసే ఉన్నాయి)

ఆ.. చెప్పు 

మళ్లీ బ్లీడింగ్ అవుతుంటే డాక్టర్ కుట్లు వేసాడు. పనిలో పనిగా నీకు సుంతి చేయించా 

అంటే..!

నీకు సుంతి అంటే తెలీదా.. నీకు కింద అది ఉంటది కదా.. ముందు కొంచెం తోలు ఉంటది కదా అది కట్ చేయించా 

ఏంటిదీ... (ఇల్లంతా వినిపించింది గోపీ కేక)

నువ్వెవరే నాకు కట్ చేయించడానికి. అది ముస్లిమ్స్ చేసుకుంటారు. నీకు అంత ఉంటే నువ్వు చేయించుకో.. ఆహ్(చెయ్యి ఎత్తి) నాకు తెలుసు నీకు ఉండదని. అయితే నాకు చేపిస్తావా.. దేవుడు ఇచ్చింది కోసేయ్యడానికా.. ఆయనకేం పని లేదనుకుంటున్నావా. నా పర్మిషన్ లేకుండా చేయించడానికి నువ్వెవరు అసలు.

నేనెవరా ?

ఆ.. ఎవరు నువ్వు ? ఎంత ప్రేమిస్తే మాత్రం. అంత చనువు తీసుకుంటారా. నా లవడా లోది. నాకు లవ్ ఒద్దు మొడ్డ ఒద్దు. నా తోలు నాగ్గావాలి. 

సరే.. (కోపంగా లేచింది జోయా). నువ్వు గోళ్లు కత్తిరించుకోవా, జుట్టు కత్తిరించుకోవా.. అవి దేవుడు ఇచ్చినవి కాదా ? నీ తోలు నీకు అంటిస్తాను. నీకు నాకు ఇక సంబంధం లేదు. నీకు కింద తోలు మందం ఎక్కువుంది. కట్ చేయించకపోతే సెక్స్ చేసేటప్పుడు నొప్పి పుడతది. తోలు అప్పుడు కట్ అయితే నొప్పిగా ఉంటది. అదీ కాక తోలు లేకుండా ఉంటే జెమ్స్ అవి లేకుండా శుభ్రంగా ఉంటది. చాలా మంది హిందువులు కూడా ఇప్పుడు చేయించుకుంటున్నారు. మంచిగా ఉంటది. రేపు నీకోసం నేను నోట్లో పెట్టుకున్నా నాకు కూడా బాగుంటదని అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నా.. నా లవడా లోది. నాకెందుకు. దెంగెయి. పిచ్చి పూకోడా. ఇంకోసారి ఒంటి మీద చెయ్యి వెయ్యు.. ఆ మొడ్డ పీకి మున్సిపాలిటీ వ్యాన్‌లో ఎయ్యక పోతే నా పేరు జోయానే కాదు. 

మూతి ముడుచుకుని కూర్చున్నాడు గోపీ. జోయా అక్కడి నుంచి పౌరుషంగా వెళ్ళిపోయింది. కాసేపు ఆగాక మెల్లగా పంచె ఎత్తి చూసుకుంటే మొడ్డ అలానే ఉంది. పైన కొంచెం తోలు కట్ చేశారు అంతే.. అంతకముందు చాలా సార్లు కొట్టుకునేటప్పుడు నొప్పి వచ్చేది, దానికి సమస్య తెలిసేది కాదు. అదేంటో ఇప్పుడు అర్ధమైంది. అనవసరంగా వాగేసానా.. అమ్మ.. అమ్మ.. ఎన్ని బూతులు తిట్టింది. ఇవన్నీ జఫర్‌లా ఉన్నప్పుడు నేను నేర్పించినవేలే.. జోయా.. జోయా బంగారం(జోయా రాలేదు). అలిగినట్టుంది. వెనక్కి ఒరిగాడు. 

బుజ్జిది జ్యూస్ ఇస్తే తాగేసాడు. జోయా గురించి అడిగితే బైటికి వెళ్ళిందని చెప్పింది. సాయంత్రం విష్ణు కప్‌తో వచ్చాడు. షరీఫ్, బషీర్ కూడా వచ్చి చూసి వెళ్లారు. 

విష్ణు, గోపీ ఇద్దరు లాన్‌లో కూర్చున్నారు.

Im scared. I was scared.. అన్నాడు విష్ణు.

భయం. నాకూ భయమే.. కానీ ఒక్కసారి తలుచుకో. ఆ భయం. ఆ వేగం. ఇంజన్ శబ్దం. టైర్ల శబ్దం. గాలి. పొజిషన్స్. టైం. గేర్ల శబ్దం. స్పీడ్. రోడ్డు. Split secondలో మనం తీసుకునే నిర్ణయాలు. మిగతా కార్లు. మలుపులు. రోడ్డు. అన్నీ ఫీల్ అయ్యి చూడు. ఇప్పుడు కాదు. పడుకునే ముందు లేదంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు. నాకు రేసింగ్ అవసరం, ఓ భయంతో చేశాను.. కానీ నీకు అదే జీవితం. నువ్వు నాకంటే గొప్ప రేసర్‌వి. (విష్ణు కాదన్నట్టు చూసాడు) నేనేదో నిన్ను పొగడటానికి చెప్పట్లేదు. నీలో నేను అసలైన రేసర్‌ని చూశాను. నేను గెలవడానికి కారణాలు వెతుక్కుంటాను. నీకు నీ గెలుపే ఓ కారణం. అది ఎప్పటికి మర్చిపోకు అని విష్ణు గుండె మీద మెల్లగా గుద్దాడు. ఇద్దరు మాట్లాడుకుంటుంటే జోయా దూరం నుంచి చూస్తుంది. 

★★

విష్ణు వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళాడు గోపీ. జోయా ఒక్కటే లోపల గదిలో మంచం మీద కూర్చుని ఉంది. వెళ్లి పక్కనే కూర్చున్నాడు గోపీ.

బతిమిలాడుకోవడాలు, సారీ చెప్పడాలు నేను చెయ్యను. నీకు అసలు సారీ చెప్పను. నాకు నేను చెప్పుకున్నట్టే.. 

భుజంతో గుద్దింది జోయా.. మెల్లగా నవ్వి సారీ చెప్పింది. 
స్వర్ణ కనిపించలేదే అని అడిగితే.. డాక్యుమెంటేషన్ కోసం అబ్రాడ్ వెళ్లిందని చెప్పింది జోయా.

అయినా నీ గొప్పదనాన్ని వీళ్లెవ్వరు గమనించలేదే..

ఏం అని అడిగింది జోయా 


చివర్లో నేను పిట్‌స్టాప్‌కి రాలేదు. ఫ్యూయల్ ఖాళీ అవుతుంది. ఆ లెక్కన నేను వెళ్లిన వేగానికి కారు గాల్లో పల్టీలు కొట్టాలి. అలా జరగలేదు. నీ ఇంజన్ ప్లేస్మెంట్ & కార్ ఫ్యూయల్ బాలన్స్ నువ్వే డిజైన్ చేసావని స్వర్ణ నాకు చెప్పింది. వీళ్ళకి అసలు అది తెలీనే లేదు. గెలుపులో కలిసిపోయింది.

అదే రోజు రాత్రి తాతయ్యతో తెల్లారి తల్లి జననితో మాట్లాడాడు. నాలుగు రోజుల్లో పార్టీ ఇచ్చాడు రాజారావు. ప్రముఖులు అందరూ వచ్చారు. అందరి ముందు రావు మోటర్స్ పేరు మార్చుతూ ప్రెసెంటేషన్ ఇచ్చాడు రాజారావు. ముగ్గురు స్నేహితుల మొహాలతో ఏర్పడిన కొత్త లోగోతో మొదలయి, జోయా గోపీ విష్ణు స్వర్ణ తరువాత మిగతా అందరి ఫోటోలు పడి. గ్లోబల్‌గా ఎలా లాంచ్ అవుతుంది. అబ్రాడ్ పార్టనర్స్ అందరినీ చూపించి చివరికి పేరు పడింది.. RAOZ MOTORS అని. రాజారావు నవ్వాడు. మైకులో మాట్లాడుతూ రావు పక్కన z ఏంటి అనుకుంటున్నారా ? ద విజన్ బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్ జోయా గోవర్ధన్ అని పిలిచాడు రాజారావు. 

అందరూ చప్పట్లు కొడుతుంటే పుసుక్కున నవ్వాడు గోపీ. వాడికి నవ్వు ఆగక కళ్ళలో నీళ్లు తిరిగాయి. అయినా నవ్వుతూనే నవ్వనట్టు నటిస్తున్నాడు.

జోయా కోపంగా చూసింది. గోపీ.. నవ్వడం ఆపకపోతే చెంప పగలకొడతా గోపీ. 

సారీ..కిక్గ్ (మళ్ళీ నవ్వాడు) వెళ్ళు జోయా గోవర్ధన్ (కిక్కిగ్.. హ్హాహ్హాహ్హా) సారీనే.. నా వల్ల కావట్లేదు. రేపు కొడుకు పుడితే ఏమని పెట్టుకుంటావ్. సీను భాష. నాగేంద్ర ఖాన్. ప్రవీణ్ పాషా.. మళ్ళీ నవ్వాడు గోపీ. 

రాజారావుకి మ్యాటర్ అర్ధమయ్యి ఇబ్బందిగా.. వెల్కమ్ మిస్ జోయా బేగం అని పిలిచాడు. 

జోయా కోపంగా.. వచ్చాక చెప్తా నీ సంగతి అని స్టేజి పైకి వెళ్తూనే ఎందుకు తాతయ్యా అని అడిగింది. యు ఎర్నడ్ ఇట్ & యు డిజర్వ్ ఇట్ అన్నాడు రాజారావు. స్టేజి ఎక్కేలోపే గోపీ భుజం మీద చెయ్యి పడితే నవ్వుతూనే చూసాడు. స్వర్ణ వచ్చేసింది.

జాగ్రత్తరా.. ఫ్రెండ్‌తో జోకులు వేసినంత ఈజీ కాదు పెళ్ళాంతో. జాగ్రత్త అంది. జోయా మాట్లాడుతూ అందరినీ అడ్రెస్ చేసింది ఒక్క గోపీని తప్ప. దాని కళ్ళలో కోపం చూసి ఇంకా ప్రేమ పుట్టింది. ఇది ఉడుక్కుంటుంటే ఇంత సెక్సీగా ఉందేంటి. బైటికే అనేశాడు. 

నవ్వింది స్వర్ణ. దాని కళ్ళు చూసావా.. ఇవ్వాల్టికి నీకు నొ టచింగే..

జోయా కిందకి వచ్చేసి స్వర్ణ పక్కన నిలుచుంది. గోపీ వెంటనే స్వర్ణా.. ఈ తాజ్‌మహల్ కట్టించాలంటే ఎంత అవుద్ది అని అడిగాడు. వంగి చూసింది జోయా. ఎందుకు నన్ను ఇప్పుడే లేపేసి సిమెంటు, ఇసక ఆర్డర్ ఇచ్చుకో రేట్లు పెరిగేలా ఉన్నాయి అని పిడికిలి బిగించింది. 

అబ్బో.. అన్నీ బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. జారుకుంటే బెటర్. డాలింగ్స్ మీరు ఇదంతా చూసుకోండి నేను అలా పాట పాడేసి వస్తా అని వేగంగా వెళ్ళిపోయాడు గోపీ. 

స్వర్ణ అది చూసి నవ్వుతుంటే జోయా కూడా నవ్వింది. ఎందుకే వాడిని భయపెడుతున్నావ్ ?

వాడు అనుకున్నవన్నీ చేసేసాడు. గోపీ లాంటి డేంజరస్ మనిషిని కంట్రోల్ పెట్టలేకపోతే సమస్యలు వచ్చేస్తాయి. వాడు కోరుకున్న ప్రశాంతత వాడికి ఇవ్వాలంటే నేను ఇలాగే ఉండాలి. లేకపోతే ఈ మగాళ్లు మన మాట వినరు అని నవ్వింది. అవును అంది స్వర్ణ స్టేజి మీద మాట్లాడుతున్న విష్ణుని చూస్తూ..

స్పీచెస్ అయిపోయాక అందరూ బైటికి వస్తుంటే ముందు జోయా వచ్చింది. 

బుజ్జి ఏది అని అడిగితే మీ అమ్మతో ఉందంది జోయా. తిందాం పదా అంటుంటే వెనకే కలిసి వస్తున్న విష్ణుని, స్వర్ణని చూసి ఆశ్చర్యపోయాడు. 

వీళ్ళేంటి!!

వాళ్ళు లవ్‌‌లో ఉన్నారు అంది జోయా 

ఇదెప్పుడు జరిగింది! నాకది కనీసం చెప్పను కూడ చెప్పలేదు.

రేస్ అప్పుడు. దీన్ని ఇంస్ట్రక్షన్స్ ఇవ్వడానికి మాట్లాడమని పెడితే అది తప్ప అన్నీ చేసింది. ఇద్దరు పొట్లాడుకుని మాట్లాడుకుని ప్రపోజ్ కూడా చేసుకున్నారు. అంతా రికార్డు అయ్యింది. వినిపిస్తాలే నీకు అని నవ్వింది జోయా.

పాపం అమృత. ముందు నన్ను తరువాత నిన్ను ఆ తరువాత వీడిని తగులుకుంది. ఇంక మిగిలింది రఘు అన్న ఒక్కడే.. ఆడు కూడా ఎవరినైనా చూసుకుంటే దీని బతుకు బస్టాండే.. అన్నాడు గోపీ. జోయా గోపీ భుజం మీద గట్టిగా కొట్టింది. ఏమైంది? అంటే వెనక్కి చూపించింది భయంగా. వెనక అమృత. అప్పటికే అమృత కళ్ళలో నీళ్లు వచ్చేసాయి. అవమానంతో ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 

నోటి దూల నీకు.. 

సరే నువ్వు పదా నేనొస్తాను అని అమృత వెనక వెళ్ళాడు. ఒక్కటే కూర్చుని ఏడుస్తుంటే టిష్యూస్ తీసుకెళ్లి పక్కనే కూర్చున్నాడు. ఇస్తే కోపంగా చూసింది. తీసుకో అంటే తీసుకుని తుడుచుకుంది. లేచి నిలుచుంటే నిలుచున్నాడు గోపీ.

నువ్వెప్పుడూ కాల్క్యూలేట్ చేస్తావ్ అమృతా.. ప్రతీది లెక్కలు వేసుకుంటావ్. కాల్క్యూలేటర్ అనేది మనం వాడుకునే ఒక పరికరం. అంతే కానీ మనమే ఆ పరికరం అవ్వకూడదు. నువ్వు అన్ని లెక్కలు వేసినా చివరికి నీకేం దక్కింది ?

నన్ను దెప్పి పొడవడానికే వచ్చావా ?

అమృత చెయ్యి పట్టుకుని బైటికి నడిపించాడు. నీకేం తక్కువ అమృతా.. నీకు కంపెనీలో వాటా ఉంది. మంచి ప్లేస్ ఉంది. 

అవన్నీ మీరు లాగేసుకున్నారుగా.. అంది కళ్ళు తుడుచుకుంటూ 

నువ్వే మా చేతుల్లో పెట్టావ్ అన్నాడు గోపీ.

ఆశ్చర్యంగా చూసింది అమృత. 

అందరికంటే ఫస్ట్ నా డిజైన్ ఇచ్చింది ఎవరికీ ?

నాకే.. 

ఇచ్చినప్పుడు నువ్వేం చెయ్యాలి కానీ నువ్వేం చేసావ్, ఒకసారి మొత్తం రివైండ్ కొట్టు. (ఆలోచించింది అమృత). స్వార్ధం. అంతా నీకే.. అంతా నీ వల్లే జరగాలి.. నీ చేతులారా నువ్వే సైడ్ అయిపోయావ్ తప్ప నిన్నెవరు సైడ్ చెయ్యలేదు. నీ అండర్‌లో మొదలయిన ప్రాజెక్ట్ నుంచి నువ్వే తప్పుకుని వెళ్లిపోయావ్. కారణం నీకు కుళ్ళు. నీకు మన అనేది లేదు. టీం వర్క్ మీద నమ్మకం లేదు. పెద్ద కుళ్ళు బోతు దానివి నువ్వు అని పిడికిలితో అమృత నుదిటి మీద కొట్టాడు. ఒప్పుకుంటావా ?

హ్మ్ అంది నుదురు రుద్దుకుంటూ.. ఇప్పుడు అందంగా కనిపిస్తుంది అమృత. గర్వం, టెక్కు అణిగి అందం బైటికి వచ్చింది. నవ్వాడు గోపీ.

ఇప్పుడు రఘు అన్నయ్యని కూడా ఏదో ప్లాన్ వేసి ఏదేదో చేసెయ్యకు. అసలు నీ మనసుకి ఎలాంటి వాడు కావాలి అని ఆలోచించు. అది రఘు అన్నయ్యలో కనపడితే ముందు వెళ్లి చెప్పు. పెళ్లి చేసుకో. అంతే కానీ రాజకీయ నాయకులు పార్టీ మారినట్టు మారకు. 

కోపంగా చూసింది అమృత.

ఎనీవే.. మేము వెళ్తున్నాం. నువ్వు జాగ్రత్త.

ఎక్కడికి !??

నేను, జోయా, నేహా వెళ్లిపోతున్నాం రేపు. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్వర్ణ ఇంటికిరా 

ఎందుకు? అంతా సెట్ అయ్యాక..!

నీకు చెప్పినా అర్ధం కాదులే.. జాగ్రత్త. ఇలా దగ్గరికిరా ఒక హగ్ ఇవ్వు. ఎంతైనా నా ఫస్ట్ క్రష్ నువ్వు అంటే నవ్వింది అమృత. హగ్ ఇచ్చింది. Be who you are.. అని అమృత వీపు మీద తట్టాడు. పదా తిందాం అంటే వెంటే వచ్చింది.

అమృత, గోపీ కలిసి తినడం ఇంట్లో వాళ్ళు అందరూ చూసారు. జనని కూడా..

అమృత కూడా తింటూ గోపీ వైపు చూసింది. గోపీ చెప్పినవన్నీ నిజాలే. నిజంగా మొదటి నుంచి నీ పక్కనే ఉండుంటే నీ కథలో నేనే హీరోయిన్ అయ్యుండేదాన్ని అనుకుంది. తిన్నాక ఒక ఫోటో తీసుకుందాం అంటే సరే అన్నాడు గోపీ. 

అమృత బుజ్జికి ఫోన్ ఇచ్చి ఇద్దరికీ ఫోటో తీయమని గోపీని కౌగిలించుకుని ఫోటో తీయించుకుంది. ఇదంతా దూరం నుంచి చూస్తుంది జోయా. 

ఫోటో అయిపోగానే వెంటనే జోయా దగ్గరికి వచ్చాడు. ఏదో ఫోటో అంటే ఇచ్చాను అన్నాడు మెల్లగా.

చూస్తన్నా చూస్తన్నా.. అన్నీ అబ్సర్వ్ చేస్తన్నా అంది జోయా 

అంతలోపే ఎవరో పలకరిస్తే మాట్లాడడానికి వెళ్ళాడు గోపీ. జోయా నవ్వుకుంది. 

★★

రెండు రోజుల తరువాత | స్వర్ణ ఇల్లు 

బుజ్జి, జోయా అన్నీ కారులో సర్దుతుంటే స్వర్ణ గోపీతో మాట్లాడుతుంది.

తాతయ్య పెళ్లి చేయిస్తానన్నాడు అప్పటి దాకా ఆగచ్చు కదా 

మూడు ముళ్ళు వెయ్యడానికి కూడా ఆయనే కావాలా.. నేను కడతాలే.. 

గట్టిగా వాటేసుకుంది గోపీని. ఎందుకు ? అని ఏడ్చేసింది. 

నేను ఎంత చేసినా ఎంత ప్రేమ చూపించినా ఆ ఇంటికి ఆ మనుషులకి I will be always an outsider. నేనే కాదు జోయా మతం కూడా అడ్డు వస్తుంది. అన్నిటికి మించి నాన్న మొహం చూస్తూ రోజు గడవాలని అస్సలు లేదు నాకు. నా ఫ్యామిలీని నేను క్రియేట్ చేసుకుంటాను. నాకు జోయా ఉంది. చాలు.. అమ్మలా బుజ్జి ఉంది. కొత్తగా జోయాతో చేరి తిడుతుంది నన్ను. అంతకంటే సంతోషం ఇంకేం కావాలి చెప్పు 

I will miss you 

Mee too.. అని గట్టిగా బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అంతా విన్న జోయా గోడ చాటుగా వచ్చి రెడీ అంది. జోయాని వదిలి బైటికి వచ్చాడు. బైట కారు దగ్గర అందరూ ఉన్నారు. తాతయ్య కూడా వచ్చాడు. ఆయన కళ్ళలో నీళ్లు చూడగానే వేగంగా వెళ్లి తాతయ్యా.. ఏంటిది.. నువ్వెలా స్టార్ట్ చేసావో నేనూ అలానే వెళ్తున్నాను. అప్పుడు నీకెవరు లేరు. కానీ నాకు మీరున్నారు. కష్టం వస్తే నీకు గాక ఇంకెవరికి ఫోన్ చేస్తాను. భుజం మీద చెయ్యేసి పట్టుకున్నాడు గట్టిగా 

రాజారావు చేతులు వణికాయి. చిన్న పిల్లాడిలా ఏడుస్తూ కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్నాడు. నాకిచ్చిన మాట మర్చిపోకు అన్నాడు రాజారావు.

కంపెనీకి నువ్వు రిటైర్మెంట్ ఇచ్చిన న్యూస్ నా చెవిలో పడగానే కారులో వచ్చి నిన్ను లేపుకుపోతాను. నా దగ్గరే ఉంటావ్. సరేనా.. అంటే సరే అన్నాడు ఏడుపు మొహం దాచి నవ్వు మొహం పెడుతూ.. రమ్య హగ్ చేసుకుంది. అమృత కూడా వచ్చింది.. అందరికీ బై చెపుతూ చివరగా జనని దగ్గర ఆగాడు.

అప్పటికే జోయాకి బుజ్జికి చాలా బంగారం పెట్టింది జనని. ఇంకోటి తీస్తుంటే ఇచ్చినవి చాలవా అన్నాడు గోపీ. 

ఇది నా చేత్తోనే ఇవ్వాలి అంది గోపీకి బాక్స్ ఇస్తూ..
తెరిచి చూసాడు. రెండు ఉంగరాలు. తాళి బొట్టు ఉన్నాయి. 
జోయాని పిలిచి రెండు ఉంగరాలు తీసి ఒకటి జోయాకి ఇచ్చి అక్కడే అందరి ముందు ఉంగరాలు మార్చుకున్నారు. ముందు రాజారావు దగ్గర ఆశీర్వాదం తీసుకుని జనని దగ్గర కూడా తీసుకున్నారు. అందరూ షేక్ హాండ్స్ ఇచ్చాక తల్లి ముందు నిలబడ్డాడు వెళ్తానని.

గోపీ చెంప మీద చెయ్యి పెట్టి తీసేసింది జనని. జాగ్రత్త అంటే అలాగే అన్నాడు. ఆయనకి ఒక మాట చెప్పాల్సింది. నువ్వు వచ్చి మాట్లాడతావని చాలా ఎదురు చూసాడు అంది నాన్నని గుర్తు చేస్తు..

ఈ జన్మకి ఆయన్ని నేను క్షమించలేను. నా వల్ల కాదు. ఆయన మొహం చూడటం కూడా నాకిష్టం లేదు. కానీ ఒకటి నేర్చుకున్నాను అమ్మా.. మనిషి ఎలా ఉండకూడదో అతన్ని చూసి నేర్చుకున్నాను. దానికి థాంక్స్ చెప్పాలి.

జోయా స్వర్ణని హత్తుకుని కారు ఎక్కితే బుజ్జిది వెనక కూర్చుంది. గోపీ డ్రైవింగ్ సీట్లో కూర్చుని అందరికీ బై చెపుతూ మెల్లగా అక్కడి నుంచి కదిలారు. కారు దూరంగా వెళ్ళిపోతూ మాయం అయిపోయింది. 


సమాప్తం
Like Reply
రేపు ఇంకో బోనస్ అప్డేట్ ఇస్తాను
బోనస్ ఎపిసోడ్‌తో ఈ కథ సంపూర్ణ సమాప్తం అవుతుంది 
ఆదరించిన అందరికీ నందన వందనములు 
Thankyou 
[+] 16 users Like Raagaa's post
Like Reply
Wow wow wow we పదాలు కూడా తక్కువే బ్రో
[+] 1 user Likes Hrlucky's post
Like Reply
(03-07-2026, 03:04 AM)Raagaa Wrote: జోయా స్వర్ణని హత్తుకుని కారు ఎక్కితే బుజ్జిది వెనక కూర్చుంది. గోపీ డ్రైవింగ్ సీట్లో కూర్చుని అందరికీ బై చెపుతూ మెల్లగా అక్కడి నుంచి కదిలారు. కారు దూరంగా వెళ్ళిపోతూ మాయం అయిపోయింది. 


సమాప్తం

Nice ending!..curious to see what the complete ending would be!...
Actually this story can be used for a movie!!!
[+] 2 users Like TheCaptain1983's post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)